Latest

రఫేల్ నుంచి ఏఐ వరకు.. భారత్–ఫ్రాన్స్ బంధం
రఫేల్, సబ్‌మెరైన్స్‌తో మొదలైన భారత్–ఫ్రాన్స్ భాగస్వామ్యం ఇప్పుడు మరింత పెద్దదవుతోంది. రెండు దేశాలు ఏఐ, స్పేస్, న్యూక్లియర్ ఎనర్జీ, క్రిటికల్ మినరల్స్, సైబర్ టెక్నాలజీ, స్టార్టప్స్ వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని ఫోకస్ పెంచుతున్నాయి. 2026లో ఇన్నోవేషన్ రోడ్‌మ్యాప్ 2030, జాయింట్ ఏఐ వర్కింగ్ గ్రూప్ వంటి కొత్త కార్యక్రమాలు కూడా వచ్చాయి. స్పేస్‌లో ఇస్రో–సీఎన్‌ఈఎస్ సహకారం, న్యూక్లియర్ ఎనర్జీలో చిన్న మాడ్యులర్ రియాక్టర్లపై అవకాశాలు కూడా చర్చలో ఉన్నాయి.

నత్తనడకన ROB పనులు.. కాంగ్రెస్ నాయకుల ధర్నా
TG: మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ROB నిర్మాణాన్ని వెంటనే పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్‌లో కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టారు. తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద నిర్వహించిన నిరసనలో 3వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మూల కృష్ణారెడ్డి మాట్లాడారు. ROB పనులు నత్తనడకన సాగుతుండటంతో వాహనదారులు, గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఐదునిమిషాల్లో చేరాల్సిన ప్రయాణానికి గంట సమయం పడుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. MP బండి సంజయ్ ఎన్నికల సమయంలో శంకుస్థాపన చేసి వదిలేశారని విమర్శించారు.

TET పాసైన వారికి గుడ్ న్యూస్.. పరీక్ష లేకుండానే పోస్టులు!
AP: TET పాసైన వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలల్లో 6,534 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ (విద్యా వాలంటీర్) పోస్టుల భర్తీకి విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 3,597 SGT, 2,937 స్కూల్ అసిస్టెంట్ పోస్టులున్నాయి. రాత పరీక్ష లేకుండా మెరిట్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు. SGTలకు నెలకు రూ.10,000, స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500 జీతం ఇస్తారు. ఈనెల 21లోగా సంబంధిత MEO ఆఫీసుల్లో అప్లై చేసుకోవాలి. సెలెక్ట్ అయినవారు సెప్టెంబర్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

దసరాకు ట్రైన్ జర్నీ చేస్తున్నారా? ఈ Dates గుర్తుపెట్టుకోండి!
దసరా సెలవుల్లో సొంతూళ్లకు వెళ్లాలనుకునే వారికి రైల్వే టికెట్ బుకింగ్‌పై అడ్వాన్స్ ప్లానింగ్ అవసరం. ఈ ఇయర్‌లో దసరా అక్టోబర్ 20న ఉంది. <a href="https://www.irctc.co.in/nget/train-search">IRCTC</a>లో ట్రైన్ రిజర్వేషన్ టికెట్స్ 60 రోజుల ముందే అందుబాటులోకి వస్తాయి. దీంతో అక్టోబర్‌లో వచ్చే దసరా సెలవులకు ఆగస్ట్ 16 నుంచి <a href="https://www.irctc.co.in/nget/train-search">IRCTC</a> వెబ్సైట్బు/యాప్‌లో టికెట్స్ Availableగా ఉంటాయి. పండగ టైమ్‌లో ఊళ్లకు వెళ్లే రైళ్లన్నీ రష్‌గా ఉంటాయి. టికెట్స్ ఓపెన్ కాగానే బుక్ చేసుకుంటే ఫ్యామిలీతో సేఫ్‌గా, కంఫర్ట్‌గా జర్నీ చేయవచ్చు.

మీతో మీరే మాట్లాడుకుంటారా? 👀
మనతో మనమే మాట్లాడుకుంటూ ఉండటం చూసి “నేను మాత్రమే ఇలా చేస్తున్నానా?” అనిపిస్తుందా? 😄 నిజానికి Self-talk అనేది చాలా సాధారణమైన విషయమే. మనతో మనం మాట్లాడుకోవడం వల్ల ఆలోచనలను సర్దుకోవడం, పనులను ప్లాన్ చేసుకోవడం, ఫోకస్ పెంచుకోవడం, టెన్షన్ తగ్గించుకోవడం, కష్టమైన పనికి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవడం సాధ్యమవుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. ఇది మనసులోనే జరగొచ్చు.. కొన్నిసార్లు బయటకు మాట్లాడుకోవడం కూడా సహజమే. అయితే ఎప్పుడూ మనల్ని మనమే తక్కువ చేసుకునే Negative Self-talk మాత్రం మంచిది కాదు.

AI Data Centersకి ఇంత Electricity ఎందుకు కావాలి? ⚡
మనకు AIతో ఒక పని చేయడానికి కొన్ని సెకన్లే పడొచ్చు.. కానీ దాని వెనుక భారీ డేటా సెంటర్లు 24/7 పనిచేస్తుంటాయి. AI మోడళ్లను నడిపే శక్తివంతమైన GPUలు భారీగా విద్యుత్‌ను ఉపయోగిస్తాయి. ఈ కంప్యూటింగ్‌తో భారీగా వేడి ఉత్పత్తి అవుతుంది. దాన్ని తగ్గించేందుకు కూలింగ్ సిస్టమ్స్, కొన్ని చోట్ల నీటిని కూడా ఉపయోగిస్తారు. IEA ప్రకారం 2025లో ప్రపంచ డేటా సెంటర్ల విద్యుత్ వినియోగం 17% పెరిగింది. 2030 నాటికి ఇది 945 TWhకు చేరొచ్చని అంచనా. AI వినియోగం పెరిగే కొద్దీ విద్యుత్‌తో పాటు నీటి అవసరం కూడా మరింత పెరగొచ్చు.

నాగర్‌కర్నూల్ ఇన్‌చార్జిగా సాయిబాబు
TG: ఆధార్ పార్టీ నాగర్‌కర్నూల్ అసెంబ్లీ ఇన్‌చార్జిగా గోవిందు సాయిబాబును నియమించింది. తెల్కపల్లి మండలం గౌరారం గ్రామానికి చెందిన గోవిందు సాయిబాబును పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈదా శేషగిరిరావు (ESR) నియమించినట్లు హిమాయత్‌నగర్‌లోని పార్టీ కార్యాలయంలో అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ.. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.

సీఎం రేవంత్ పర్యటన.. పరకాలలో ట్రాఫిక్ ఆంక్షలు
TG: CM రేవంత్‌రెడ్డి హన్మకొండ జిల్లాలోని పరకాల పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నట్లు పరకాల CI క్రాంతికుమార్ తెలిపారు. ఇవాళ CM పర్యటన సందర్భంగా పట్టణంలో రద్దీని నియంత్రించేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలను సూచించారు. హుజూరాబాద్, భూపాలపల్లి, హనుమకొండ వైపు వెళ్లే ప్రైవేట్ వాహనదారులు పోలీసుల సూచనల మేరకు ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాలని కోరారు. మొగుళ్లపల్లి ఎక్స్ రోడ్డు, మాదారం కాలనీ, సీఐఎస్‌ఐ కాలనీ, జయ్ కాన్వెంట్ స్కూల్ మీదుగా వాహనాలను మళ్లించనున్నట్లు తెలిపారు.

చికెన్ ధరలపై శ్రావణం ఎఫెక్ట్.. నేటి రేట్లు ఇవే!
శ్రావణ మాసం ఎఫెక్ట్‌తో తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి. ఈరోజు (ఆగస్టు 16) హైదరాబాద్‌లో కిలో స్కిన్‌లెస్ చికెన్ రూ.222, డ్రెస్డ్ చికెన్ రూ.197గా ఉంది. విజయవాడలో స్కిన్‌లెస్ చికెన్ రూ.240, డ్రెస్డ్ చికెన్ రూ.212గా ఉంది. శ్రావణ మాసం సందర్భంగా కొందరు నాన్‌వెజ్‌కు దూరంగా ఉండటంతో డిమాండ్‌లో మార్పులు కనిపిస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఏరియానీ బట్టి ధరల్లో కొంచెం తేడాలు ఉంటాయని తెలిపారు.

రైల్వే స్టేషన్లో నీళ్లు తాగుతున్నారా? CAG Big Alert 🚨
రైల్వే స్టేషన్ల తాగునీటిపై CAG ఆడిట్ చేయగా షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. 512 స్టేషన్లలో చెక్ చేస్తే, 458 స్టేషన్లలో సరైన సౌకర్యాలు లేవు. తాగునీటి కూలర్లలో E-coli బాక్టీరియా పాజిటివ్ వచ్చిన లిస్టులో హైదరాబాద్ కూడా ఉంది. ఈ బ్యాక్టీరియా వల్ల కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు అవుతాయి. <br>వాష్‌రూమ్‌లు కూడా అపరిశుభ్రంగా ఉన్నాయని రిపోర్ట్ చెప్పింది. CAG ఈ రిపోర్ట్ పార్లమెంటుకు సమర్పించింది.

విద్యార్థిని అలీనా కుటుంబానికి ఎమ్మెల్యే పరామర్శ
TG: పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై చెట్టు కొమ్మ విరిగిపడిన ఘటనలో ఓ విద్యార్థిని మృతి చెందడం విషాదం నింపింది. యాదాద్రి జిల్లా భువనగిరి భగాయత్ జడ్పీ పాఠశాలలో ఈ ప్రమాదం జరిగింది. బలమైన గాలులకు భారీ వేపచెట్టు కొమ్మ ఒక్కసారిగా విరిగి విద్యార్థులపై పడటంతో ఏడుగురు గాయపడ్డారు. వారిలో అలీనా అనే విద్యార్థిని చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అలీనా కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందించారు.

వానలతో పాటు బలమైన గాలులు.. తెలుగు రాష్ట్రాలకు అలర్ట్!
తెలుగు రాష్ట్రాలకు వాతావరణశాఖ కీలక సూచనలు చేసింది. నార్త్‌వెస్ట్ బే ఆఫ్ బెంగాల్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో AP, తెలంగాణలో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని IMD తెలిపింది. APలో నార్త్ కోస్ట్, యానాం, సౌత్ కోస్ట్, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడొచ్చని హెచ్చరించింది. గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది. తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో వర్షాలు, పిడుగుల ముప్పు ఉందని సూచించింది.

రోడ్డు ప్రమాదం కాదు.. పక్కా హత్యే
AP: కడప జిల్లా టి.సుండుపల్లి మండలం చిన్నగొల్లపల్లి వద్ద జూలై 22న జరిగిన జయరాం(44), రవీంద్ర (45) మృతిపై పోలీసులు లోతుగా దర్యాప్తు చేపట్టారు. తొలుత గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో మృతి చెందినట్లు కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేయగా ఇంటి స్థల వివాదమే హత్యలకు కారణమని తేలింది. ప్లాన్ ప్రకారం ఇద్దరినీ ట్రాలీ ఆటోతో ఢీకొట్టి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిందితులు శివప్రసాద్, శరణ్ రాజ్‌లను అరెస్ట్ చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు.
బడి కోసం 8 కి.మీ. నడక.. దొనబైలు పిల్లల ఆవేదన!
AP: 'సార్.. మా గ్రామానికి రోడ్డు వేయండి.. మేము బడికి వెళ్లాలి' అంటూ అన్నమయ్య జిల్లా మదనపల్లె దగ్గర్లోని దొనబైలు గ్రామ విద్యార్థులు అధికారులను వేడుకుంటున్నారు. సరైన రోడ్డు లేకపోవడంతో స్టూడెంట్స్ ప్రతిరోజూ దాదాపు 8 కి.మీ. నడిచి స్కూల్స్, కాలేజీలకు వెళ్తున్నారు. వృద్ధులు, మహిళలు, రైతులు, కూలీలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ టైమ్‌లో హాస్పిటల్‌కు చేరుకోవడం కష్టంగా మారిందని, గ్రామానికి త్వరగా రోడ్డు వేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.

‘August Theory’ అంటే ఏంటి?
ఆగస్టు వచ్చింది.. సోషల్ మీడియాలో ఇప్పుడు ‘ఆగస్టు థియరీ’ అనే డేటింగ్ ట్రెండ్ తెగ చర్చలో ఉంది. ఈ థియరీ ప్రకారం ఆగస్టు వచ్చేసరికి కొందరు తమ పాత రిలేషన్‌షిప్స్, సిట్యుయేషన్‌షిప్స్ గురించి మళ్లీ ఆలోచించడం మొదలుపెడతారట. దూరమైన వ్యక్తి మళ్లీ మెసేజ్ చేయడం, పాత కనెక్షన్స్ తిరిగి స్టార్ట్ అవ్వడం లేదా కొన్ని రిలేషన్‌షిప్స్‌కు పూర్తిగా ఎండ్ కార్డ్ పడటం జరగొచ్చనేది ఈ వైరల్ ఐడియా. అయితే “ఆగస్టు వచ్చింది కాబట్టి Ex తిరిగొస్తాది” అని వెయిట్ చేయకండి బ్రో😂.. దీనికి సైంటిఫిక్ ప్రూఫ్ ఏమీ లేదు.

ప్రశంసాపత్రం అందుకున్న కొన్ని గంటల్లోనే విషాదం
TG: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఉత్తమ ప్రతిభా ప్రశంసాపత్రం అందుకున్న 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ (EMT) జాంగిర్ పాషా.. కొన్ని గంటల్లోనే మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జోగులాంబగద్వాల జిల్లాలో గత ఐదేళ్లుగా అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న జాంగిర్ పాషాను ఆయన సేవలను గుర్తించి జిల్లా కలెక్టర్ MD రిజ్వాన్ పాషా సత్కరించారు. అయితే ఆదివారం తెల్లవారుజామున తీవ్రమైన గుండెపోటు రావడంతో చికిత్స పొందేలోపే కన్నుమూశారు. ఆయన మృతితో 108 సిబ్బంది, సహచరులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

RTC బస్సు - Private బస్సు.. అర్ధరాత్రి యాక్సిడెంట్ కలకలం!
TG: సూర్యాపేట జిల్లా ఆకుపాముల వద్ద అర్ధరాత్రి ఘోర రోడ్డు యాక్సిడెంట్ జరిగింది. నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న శ్రీకృష్ణ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును, ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న APSRTC సూపర్ లగ్జరీ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ టైమ్‌లో రెండు బస్సుల్లో కలిపి 63 మంది ప్యాసింజర్స్ ఉన్నారు. కొందరికి గాయాలయ్యాయి. RTC బస్సు క్యాబిన్‌లో డ్రైవర్ ఇరుక్కుపోగా, పోలీసులు రెండు గంటలు కష్టపడి సేఫ్‌గా బయటకు తీశారు. డ్రైవర్ నిద్రమత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు.

APK ఫైల్‌తో సైబర్ మోసం
TG: వాట్సాప్‌లో వచ్చిన ఓ అపరిచిత APK ఫైల్‌ను క్లిక్ చేయడంతో జగిత్యాలలో ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.4.15 లక్షలు మాయం అయ్యాయి. జగిత్యాల పట్టణంలోని వాణీనగర్‌కు చెందిన ఎలిగేటి అశోక్‌కు ఇటీవల గుర్తుతెలియని APK ఫైల్ వాట్సాప్‌లో వచ్చింది. దానిని ఓపెన్ చేసిన కొద్దిసేపటికే ఆయన బ్యాంకు ఖాతా నుంచి విడతల వారీగా నగదు డ్రా అయినట్లు మెసేజ్‌లు వచ్చాయి. దీంతో సైబర్ మోసానికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

పాలిటిక్స్‌లో Gen Z Voice ఎందుకు పెరుగుతోంది?
ఒకప్పుడు పాలిటిక్స్ అంటే పెద్దవాళ్ల విషయం అనుకునేవారు.. ఇప్పుడు Gen Z కూడా బలంగా మాట్లాడుతోంది..! 🗳️ సోషల్ మీడియా, డిజిటల్ క్యాంపెయిన్స్ వల్ల యువత తమ అభిప్రాయాలను నేరుగా వ్యక్తం చేస్తోంది. ఉద్యోగాలు, విద్య, AI, ఆర్థిక అవకాశాలు వంటి తమ జీవితాలను ప్రభావితం చేసే అంశాలపై ఎక్కువగా స్పందిస్తోంది. విశ్లేషకుల అంచనాల ప్రకారం 2029 ఎన్నికల నాటికి Gen Z భారతదేశంలో అతిపెద్ద ఓటర్ల వర్గాల్లో ఒకటిగా మారే అవకాశం ఉంది. దీంతో రాజకీయ పార్టీలు కూడా యువతను ఆకట్టుకునే విధంగా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి.

సూపర్‌స్టార్‌కి 51 ఏళ్లు.. ఆగస్ట్ 15న మరో స్పెషల్ మూమెంట్!
సూపర్‌స్టార్ రజనీకాంత్ సినీ ఫీల్డ్‌లోకి అడుగుపెట్టి 51 ఏళ్లు పూర్తయ్యాయి. ఆగస్ట్ 15న ఆయన 51వ ఫిల్మ్ యానివర్సరీ సెలబ్రేషన్స్‌ను ‘ధర్మన్’ సినిమా సెట్స్‌లో గ్రాండ్‌గా జరుపుకున్నారు. డైరెక్టర్ అశ్వత్ మారిముత్తు, మూవీ టీమ్ స్పెషల్‌గా కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. 1975 ఆగస్ట్ 15న ‘అపూర్వ రాగంగళ్’ సినిమాతో రజనీకాంత్ సినీ జర్నీని స్టార్ట్ చేశారు. ఐదు దశాబ్దాలుగా ఇండియన్ సినిమాల్లో ఆయన తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

36 గంటలు కాదు, ఇక 3 గంటల్లోనే డిలీట్!
జంతర్ మంతర్ ఆందోళన, అనఫీషియల్ డిజిటల్ సెన్సార్షిప్ నేపథ్యంలో కంటెంట్ రిమూవ్ గడువును 36 గంటల నుండి 3 గంటలకు తగ్గిస్తూ IT శాఖ కొత్త సర్క్యులర్ ఇచ్చింది. దీని నేపథ్యంలోనే Scroll.in, The Hindu లాంటి పెద్ద మీడియా సంస్థల Kashmir pellet-injury స్టోరీలు కూడా ఇన్‌స్టాలో బ్లాక్ అయ్యాయి. జర్నలిస్టులు దీన్ని ప్రెస్ ఫ్రీడమ్‌పై దాడిగా అభివర్ణిస్తున్నారు. చాలా మంది కంటెంట్ క్రియేటర్స్ వీడియోలు కూడా కారణం చెప్పకుండా మెటా రిమూవ్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చ మొదలైంది.