Latest

దర్శకుడు రాజా సేన్ కన్నుమూత!
National· 16 Aug 2026

దర్శకుడు రాజా సేన్ కన్నుమూత!

నేషనల్ అవార్డ్ విన్నర్, ప్రముఖ బెంగాలీ సినిమా డైరెక్టర్ (దాము, ఆత్మీయ స్వజన్, దేశ్, దేవీపక్ష లాంటి సినిమాలు చేసిన) రాజా సేన్ (71) గారు కన్నుమూశారు. కొన్నాళ్లుగా ఆయన వెన్నునొప్పితో బాధపడుతున్నారు. అయితే గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సమస్యలు కూడా ఎక్కువ కావడంతో కోల్‌కతాలోని ఓ హాస్పిటల్‌లో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ ఉండగానే ఇవాళ మరణించారు. ఆయన మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

ప్రొటోకాల్‌ను విస్మరించిన గ్రామపంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు
Local· 16 Aug 2026

ప్రొటోకాల్‌ను విస్మరించిన గ్రామపంచాయతీ కార్యదర్శిపై ఫిర్యాదు

AP: తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం జివి పురం గ్రామపంచాయతీ పరిధిలో దళిత ఎంపీటీసీ పత్తూరు ఈశ్వరమ్మ, బీసీ సామాజికవర్గానికి చెందిన మాజీ సర్పంచి కాణిపాకం సుబ్బలక్ష్ముమ్మ ఉండగా, ప్రోటోకాల్ ప్రకారం దళిత ప్రజా ప్రతినిధులను ఆహ్వానించకుండా ప్రొటోకాల్ విస్మరించారని గ్రామస్థులు మండిపడుతున్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అవమానించిన జీవి పురం గ్రామపంచాయతీ కార్యదర్శి గిరిపై అఖిలభారత అంబేద్కర్ సేన జాతీయ ఎస్సీ కమిషన్ వారికి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

నీటి కోసం రోడ్డు దాటుతుండగా విషాదం
Local· 16 Aug 2026

నీటి కోసం రోడ్డు దాటుతుండగా విషాదం

TG: రోడ్డు దాటుతున్న వృద్ధుడిని ఆటో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన విషాద ఘటన భీమదేవరపల్లి మండలంలో చోటుచేసుకుంది. ఇందిరానగర్ బస్టాండ్ సమీపంలోని సిద్దిపేట–హనుమకొండ ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన మహ్మద్ సలీం బాషా (65) బిందెలు, బకెట్లు రిపేర్ చేస్తూ జీవనం సాగిస్తున్నారు. పని నిమిత్తం అక్కడికి వచ్చిన ఆయన నీరు తెచ్చుకునేందుకు రోడ్డు దాటుతుండగా, కూలీలతో దామెర వైపు వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు.

సెప్టెంబర్‌లో DYFI 16వ రాష్ట్ర మహాసభలు
AP· 16 Aug 2026

సెప్టెంబర్‌లో DYFI 16వ రాష్ట్ర మహాసభలు

AP: సెప్టెంబర్ 1, 2, 3వ తేదీలలో నెల్లూరులో DYFI 16వ రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. ఈ సందర్భంగా Dr.జెట్టి శేషరెడ్డి భవన్‌లో DYFI లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో CPM జిల్లా కార్యదర్శి మూలం రమేష్, DYFI జిల్లా కార్యదర్శి MV రమణ, జిల్లా అధ్యక్షుడు BP నరసింహ, ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు చొప్ప రవీంద్ర పాల్గొన్నారు.

దళితుల భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
Local· 16 Aug 2026

దళితుల భూముల ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి

AP: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పిచ్చుకలపాలెంలో 1999లో ప్రభుత్వం 73 మంది దళితులకు కేటాయించిన ఇళ్ల స్థలాలను ప్రజాసంఘాల నాయకులు ఆదివారం పరిశీలించారు. అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి మూడు సెంట్ల చొప్పున సమానంగా పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దళితుల ఇళ్ల స్థలాలు, స్మశాన వాటిక, పోరంబోకు భూముల ఆక్రమణలను తక్షణమే తొలగించాలని తహసీల్దార్‌ను కోరారు. పిడియం రాష్ట్ర కార్యదర్శి జి.రామకృష్ణ, వై.వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి షేక్ మస్తాన్ వలి, గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. కోటనాయక్, పాల్గొన్నారు.

విశాఖకు గుడ్‌బై.. రేపటి నుంచి Flights అక్కడి నుంచే!
AP· 16 Aug 2026

విశాఖకు గుడ్‌బై.. రేపటి నుంచి Flights అక్కడి నుంచే!

AP: విశాఖపట్నం విమాన ప్రయాణాలలో కీలక మార్పు జరిగింది. ఈరోజు అర్ధరాత్రి నుంచి విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్‌లో షెడ్యూల్డ్ కమర్షియల్ ఎయిర్‌లైన్ సర్వీసులు నిలిచిపోనున్నాయి. రేపటి నుంచి విశాఖకు రాకపోకలు సాగించే అన్ని షెడ్యూల్డ్ ఎయిర్‌లైన్ సర్వీసులు భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి నిర్వహించనున్నారు. ఇప్పటివరకు విశాఖపట్నం ఎయిర్ పోర్ట్‌కు ఉన్న VTZ కోడ్‌ను భోగాపురం ఎయిర్ పోర్ట్‌కు బదిలీ చేయనున్నారు. దీంతో విశాఖ ప్రాంతంలో ఏవియేషన్ ఆపరేషన్స్‌లో ఇది కీలకమైన మార్పుగా నిలవనుంది.

పథకాల అమలుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. నిరసన
Local· 16 Aug 2026

పథకాల అమలుపై బీఆర్ఎస్ ఆగ్రహం.. నిరసన

TG: కల్యాణలక్ష్మి, రైతు బీమా పథకాల అమలుపై సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ నిరసన చేపట్టింది. బెజ్జంకి మండల కేంద్రంలో బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షుడు పాకాల మహిపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. కల్యాణలక్ష్మి, రైతు బీమా పథకాల విషయంలో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాల ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

విజయవాడ నుంచి కాశీకి నేరుగా ఫ్లైట్
AP· 16 Aug 2026

విజయవాడ నుంచి కాశీకి నేరుగా ఫ్లైట్

AP: విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి వారణాసికి నేరుగా వెళ్లేందుకు విమాన సర్వీసు అందుబాటులోకి వచ్చింది. ఇండిగో సంస్థ ఈ సర్వీసును ప్రారంభించింది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు వర్చువల్‌గా సర్వీసును ప్రారంభించారు. వారణాసి–విజయవాడ మధ్య విమానాలు మంగళవారం, గురువారం, శనివారం నడవనున్నాయి. ఇప్పటివరకు ఇతర నగరాల్లో విమానాలు మారాల్సిన ప్రయాణికులకు ఇప్పుడు నేరుగా కాశీ చేరుకునే అవకాశం దక్కింది.

'డాన్ 3' కోసం రణ్‌వీర్..తండ్రి
Entertainment· 16 Aug 2026

'డాన్ 3' కోసం రణ్‌వీర్..తండ్రి

'డాన్ 3' సినిమా నుంచి హీరో రణ్‌వీర్ సింగ్ లాస్ట్ మినిట్‌లో తప్పుకోవడంతో, నిర్మాతలు ఫర్హాన్ అక్తర్, రితేష్ సిద్ధ్వానిలు ఫిలిం మేకర్స్ అసోసియేషన్‌లో (IMPPA) కంప్లైంట్ చేశారు. మొదట మా లాయర్లు చూసుకుంటారు అని చెప్పినా, రీసెంట్‌గా రణ్‌వీర్ తండ్రి నిర్మాతల మండలిని కలిసి చర్చలకి ఓకే చెప్పారు. రెండు వైపుల వాదనలు విని త్వరలోనే ఈ సమస్యపై నిర్మాతల మండలి ఓ నిర్ణయం తీసుకోనుంది.

కాలువలోకి కారు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం
AP· 16 Aug 2026

కాలువలోకి కారు.. ఇద్దరి మృతదేహాలు లభ్యం

AP: కాలువలోకి కారు దూసుకెళ్లిన <a href="https://www.theclearcutnews.com/n/SqTyj4c">ప్రమాదం</a>లో ఇద్దరు యువకులు మృతిచెందగా.. మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతోంది. పశ్చిమగోదావరి జిల్లా ఇరగవరం మండలం ఐతంపూడి లాకుల మలుపు వద్ద తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. ఓగిడి గ్రామానికి చెందిన నలుగురు బీటెక్‌ విద్యార్థులు కోనసీమ జిల్లా మోరి వైపు కారులో వెళ్తుండగా వాహనం అదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో పోతుల లక్ష్మీభాను, రాజారాం, నాగిరెడ్డి దుస్వంత, సాయిసూర్య నీటిలో గల్లంతయ్యారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది కాలువలో గాలింపు చేపట్టారు.

అక్కడ అర్ధరాత్రి అయినా.. మందుబాబులకు టెన్షనే
Local· 16 Aug 2026

అక్కడ అర్ధరాత్రి అయినా.. మందుబాబులకు టెన్షనే

TG: అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలతో ఖమ్మం జిల్లా ఏన్కూర్ SI సంధ్య తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించిన ఆమె రాత్రి వేళల్లో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. మద్యంతాగి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటూ ప్రమాదాలను అరికట్టేందుకు కృషి చేస్తున్నారు. సహజంగా పురుష SIలు రాత్రి సమయాల్లో చెకింగ్ చేయడంలో అంతగా ఆసక్తి కనబరచకపోయినా, మహిళా పోలీసు అధికారిగా అర్ధరాత్రి విధులు నిర్వర్తిస్తున్న SI సంధ్య సేవలను స్థానికులు, ఉన్నతాధికారులు ప్రశంసిస్తున్నారు.

సైకిల్ తొక్కుతూ వరదలో కొట్టుకుపోయిన యువతి
International· 16 Aug 2026

సైకిల్ తొక్కుతూ వరదలో కొట్టుకుపోయిన యువతి

అమెరికాలోని అరిజోనా రాష్ట్రం టక్సన్‌లో వరద ఓ 20 ఏళ్ల యువతిని చావు అంచుల వరకు తీసుకెళ్లింది. ఆగస్ట్ 13న ఫ్యామిలీతో కలిసి సైకిల్‌పై వరద నీటితో నిండిన బ్రిడ్జ్ దాటుతుండగా ఆమె నీటిలో చిక్కుకుంది. వేగంగా ప్రవహించిన నీరు ఆమెను డ్రైనేజీ టన్నెల్‌లోకి లాక్కెళ్లి 100 అడుగుల దూరంలో బయటకు విసిరేసింది. ఆ యువతికి కుటుంబసభ్యులు, స్థానికులు వెంటనే CPR అందించడంతో మెలకువ వచ్చింది. తరువాత హాస్పిటల్‌కు తీసుకెళ్లగా పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

రణ్‌వీర్ సింగ్ ‘ప్రళయ్’ షూటింగ్ ప్రారంభం!
Entertainment· 16 Aug 2026

రణ్‌వీర్ సింగ్ ‘ప్రళయ్’ షూటింగ్ ప్రారంభం!

బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్న భారీ యాక్షన్ థ్రిల్లర్ ‘ప్రళయ్’ షూటింగ్ ముంబైలో ప్రారంభమైంది. ఈ సినిమాకి ‘స్కామ్ 1992’ సిరీస్ ఫేమ్ జై మెహతా దర్శకత్వం వహిస్తుండగా, సౌత్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్‌గా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. అనన్య బిర్లా స్టూడియోస్ సినిమాను నిర్మిస్తోంది. హై టెక్నాలజీతో వస్తున్న ఈ యాక్షన్ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

జెండా ఎగరేసి.. సినిమా పాటలకు చిందులు
AP· 16 Aug 2026

జెండా ఎగరేసి.. సినిమా పాటలకు చిందులు

AP: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో APFDC సిబ్బంది చేసిన డ్యాన్సులు వివాదానికి దారితీశాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలోని APFDC కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించారు. జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం దేశభక్తి గీతాలకు బదులుగా సినిమా, జానపద పాటలకు సిబ్బంది డ్యాన్సులు చేసిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. జాతీయ పర్వదిన వేడుకల సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సముచితమేనా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దేశ పవిత్రతను విస్మరించారంటూ APFDC సిబ్బందిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్పేస్ టెక్నాలజీ ఇప్పుడు దేశాల మధ్య కొత్త పవర్‌గా మారుతోందా?
International· 16 Aug 2026

స్పేస్ టెక్నాలజీ ఇప్పుడు దేశాల మధ్య కొత్త పవర్‌గా మారుతోందా?

మనకు స్పేస్ అంటే రాకెట్లు, చంద్రుడు, మార్స్ గుర్తొస్తాయి. కానీ అసలు గేమ్ అంతకంటే పెద్దది. మన ఫోన్‌లో నావిగేషన్ నుంచి వాతావరణ సమాచారం, ఇంటర్నెట్, సరిహద్దుల నిఘా వరకు ఎన్నో విషయాలు ఉపగ్రహాలపైనే ఆధారపడి ఉన్నాయి. అందుకే అమెరికా, చైనా, భారత్ వంటి దేశాలు స్పేస్‌లో తమ టెక్నాలజీని వేగంగా పెంచుతున్నాయి. ముఖ్యంగా యుద్ధం లేదా సంక్షోభ సమయంలో ఉపగ్రహాల నుంచి వచ్చే సమాచారం చాలా కీలకం. అంటే స్పేస్ ఇక కేవలం సైన్స్ కాదు… దేశాల భద్రత, డబ్బు, ప్రపంచ రాజకీయాల్లో కొత్త పవర్ గేమ్‌గా మారుతోంది.

డబ్బు కంటే నిజాయితీ గొప్పదని చాటిన స్వీపర్‌
Local· 16 Aug 2026

డబ్బు కంటే నిజాయితీ గొప్పదని చాటిన స్వీపర్‌

AP: పోగొట్టుకున్న పర్సును భక్తురాలికి తిరిగి అందజేసి మఠం స్వీపర్‌ రాముడు నిజాయితీ చాటుకున్నారు. కడప జిల్లా బ్రహ్మంగారి మఠంలోని శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన సావిత్రమ్మ దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో ఆమె తన పర్సును మఠం ప్రాంగణంలో పోగొట్టుకున్నారు. అందులో రూ.2,500 నగదు ఉన్నట్లు తెలిపారు. పర్సు మఠంలో పనిచేస్తున్న స్వీపర్‌ రాముడికి దొరకడంతో వెంటనే మఠం యాజమాన్యానికి అప్పగించారు. అనంతరం యాజమాన్యం సమక్షంలో పర్సును, అందులోని నగదును సావిత్రమ్మకు రాముడు తిరిగి అందజేశారు.

అప్పులు తీర్చలేక దొంగతనాల బాట
Crime· 16 Aug 2026

అప్పులు తీర్చలేక దొంగతనాల బాట

TG: కామారెడ్డిలో భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. విద్యుత్‌నగర్‌ కాలనీలో నివాసముంటున్న మామిండ్ల లావణ్య ఇంట్లో ఈ నెల 7న దొంగతనం జరిగింది. దుండగుడు 16 తులాల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.90వేల నగదును అపహరించాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసుల తనిఖీల్లో అనుమానాస్పదంగా పారిపోతున్న వ్యక్తిని పట్టుకున్నారు. విచారణలో అతడు దేవునిపల్లికి చెందిన వడ్ల శ్రీనివాస్‌గా గుర్తించారు. అప్పులు తీర్చేందుకు దొంగతనాలకు పాల్పడినట్లు నిందితుడు అంగీకరించినట్లు తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.

శ్రావణ మాసం ఎఫెక్ట్‌.. పోటెత్తిన భక్తులు
TG· 16 Aug 2026

శ్రావణ మాసం ఎఫెక్ట్‌.. పోటెత్తిన భక్తులు

TG: శ్రావణ మాసం సందర్భంగా జగిత్యాల జిల్లా కోటిలింగాల శైవక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వెల్గటూర్ మండలంలోని పవిత్ర గోదావరి తీరంలో ఉన్న శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి గంగాదేవికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గోదావరి నది తీరం భక్తుల సందడితో కళకళలాడింది. స్వామివారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.

బాలాపూర్ గణేశుడి కోసం ఈసారి అదిరిపోయే థీమ్ రెడీ!
TG· 16 Aug 2026

బాలాపూర్ గణేశుడి కోసం ఈసారి అదిరిపోయే థీమ్ రెడీ!

TG: తెలంగాణలో వినాయక చవితి ఉత్సవాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన బాలాపూర్ గణేశుడు ఈసారి కొత్తగా దర్శనమివ్వనున్నాడు. ఏటా ప్రముఖ ఆలయాల నమూనాలో మండపాన్ని ఏర్పాటు చేసే నిర్వాహకులు.. ఈసారి ఒడిశాలోని ఫేమస్ పూరీ జగన్నాథస్వామి టెంపుల్ నమూనాలో మండపాన్ని డిజైన్ చేస్తున్నారు. గతంలో శ్రీశైలం, యాదాద్రి, కనకదుర్గ, అయోధ్య, అరుణాచలం ఆలయాల నమూనాలను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

నిద్రిస్తున్న అన్నపై తమ్ముడి దాడి
Crime· 16 Aug 2026

నిద్రిస్తున్న అన్నపై తమ్ముడి దాడి

AP: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం కొత్తూరుకు చెందిన వజ్రాల సుబ్బరాయుడుకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకటసుబ్బయ్య, చిన్న కుమారుడు సురేష్. ఇద్దరూ మద్యానికి బానిస కావడంతో ఇద్దరు భార్యలు వదిలివేశారు. వెంకటసుబ్బయ్య ఇంట్లో నిద్రిస్తుండగా, మద్యం మత్తులో ఉన్న సురేష్‌ గొడ్డలితో అతడి తలపై దాడిచేశాడు. అనంతరం బయటకు వెళ్లి కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చి మరోసారి దాడి చేయడంతో తీవ్ర గాయాలతో వెంకటసుబ్బయ్య మృతి చెందాడు. SI శివప్రసాద్‌ ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ఆటోల స్థానంలో ఈవీలు
TG· 16 Aug 2026

పెట్రోల్‌, డీజిల్‌ ఆటోల స్థానంలో ఈవీలు

పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను ఎలక్ట్రిక్‌ ఆటోలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టనుంది. హైదరాబాద్‌ను స్వచ్ఛమైన, పర్యావరణహిత నగరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్‌ మార్పిడి పథకానికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. తెలంగాణ రైజింగ్‌ విజన్‌–2047కు అనుగుణంగా CURE పరిధిలోని అర్హత కలిగిన పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను దశలవారీగా ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చడం లేదా కొత్త ఎలక్ట్రిక్‌ ఆటోలతో భర్తీ చేయడం ఈ పథకం లక్ష్యం.