Latest

ఫేక్ ఇన్‌స్టాగ్రామ్‌లో బ్యూటిషియన్‌కు వేధింపులు
AP: కృష్ణా జిల్లా ఉయ్యూరులో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా బ్యూటిషియన్‌ను వేధిస్తున్న ఫోటోగ్రాఫర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యూటిషియన్‌గా పనిచేస్తున్న బాధితురాలి పేరుతో నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి, అందులో అసభ్యకర పోస్టులు పెడుతూ వేధిస్తున్నట్లు ఫిర్యాదు అందింది. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి దాసరి రామకృష్ణ అనే ఫోటోగ్రాఫర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనలో ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు.

స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం వెనక్కి తగ్గేది లేదు.. మహతో
రిక్రూట్‌మెంట్ పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ 11 రోజులుగా హంగర్ స్ట్రైక్ చేస్తున్న జార్ఖండ్ లోక్‌తాంత్రిక్ క్రాంతికారి మోర్చా (JLKM) నేత దేవేంద్ర మహతో.. ఆందోళన శిబిరానికి తిరిగి వెళ్లేందుకు పర్మిషన్ కోరారు. ప్రెజెంట్ రాంచీ సదర్ హాస్పిటల్లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న ఆయన.. జైపాల్ సింగ్ ముండా స్టేడియంలోని నిరసన స్థలానికి వెళ్లేందుకు సివిల్ సర్జన్‌కు లెటర్ రాశారు. స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం జరుగుతున్న పోరాటం తనకు కేవలం ఆందోళన కాదని, బాధ్యతతో కూడిన పోరాటమని మహతో పేర్కొన్నారు.

10 ఏళ్ల డేటింగ్ తర్వాత పెళ్లి చేసుకున్న రొనాల్డో..
ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో, ఆయన లాంగ్‌టైమ్ పార్ట్‌నర్ జార్జినా రోడ్రిగ్జ్ దాదాపు 10 సంవత్సరాలుగా కలిసి ఉంటూ, ఇప్పుడు పోర్చుగల్‌లోని కాస్కాయిస్‌లో చాలా సింపుల్‌గా సివిల్ మ్యారేజ్ చేసుకున్నారు. తమ చేతులకు ఉన్న మ్యాచింగ్ వెడ్డింగ్ రింగ్స్ ఫోటోను ఇన్స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ 'C ❤️ G' అని రొనాల్డో క్యాప్షన్ పెట్టారు. ఈ వెడ్డింగ్ కి కేవలం వీరి ఐదుగురు పిల్లలు, అత్యంత ఆత్మీయులు మాత్రమే హాజరయ్యారు.

హైదరాబాద్‌లో Food Festival..3 రోజులే ఛాన్స్!
TG : లక్నో నవాబుల నాటి అవాధి రాయల్ వంటకాలను రుచి చూపించడానికి మాస్టర్ షెఫ్ 'షానవాజ్ ఖురేషి' హైదరాబాద్ వస్తున్నారు. బంజారాహిల్స్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రత్యేక ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది. ఇందులో లక్నో రుచికరమైన బిర్యానీలు, కిరాక్ కబాబ్‌లు, నోరూరించే కర్రీలను లంచ్, డిన్నర్‌లలో వడ్డించనున్నారు. రాయల్ రుచులను ఇష్టపడే ఫుడ్ లవర్స్ కోసం ఇదొక మంచి అవకాశం.

ఇంట్లో గంజాయి పార్టీ.. అధికారులు వచ్చేలోగా పరార్
TG: మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గంజాయి తాగుతున్న యువకులను కాలనీవాసులు పట్టుకుని దేహశుద్ధి చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు నర్సాపూర్‌లోని ఓ హోటల్‌లో పనిచేస్తూ స్థానికంగా అద్దె ఇంట్లో ఉంటున్నాడు. రాత్రి కొందరు యువకులు అతని ఇంట్లో గంజాయి సేవిస్తున్నట్లు గుర్తించిన కాలనీవాసులు వారిని పట్టుకున్నారు. ఎక్సైజ్ అధికారులు అక్కడికి చేరుకునేలోపే, వారు తప్పించుకుని పారిపోయారు. ఘటన స్థలంలో గంజాయి ప్యాకెట్, కూల్‌డ్రింక్ బాటిల్స్ లభించాయి. తప్పించుకున్న యువకులను పట్టుకుంటామని అధికారులు తెలిపారు.

కారులో గంజాయి కలకలం.. ఇద్దరు అరెస్ట్
AP: రాజానగరం పోలీస్ స్టేషన్ పరిధిలో 25.970 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సీలేరు నుంచి విజయవాడ వెళ్తున్న కారులో మూడు పాలిథిన్ సంచుల్లో గంజాయిని గుర్తించారు. దీని వాల్యూ రూ.4.29 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం సారిపల్లెకు చెందిన సుజీవ్‌కుమార్, నరేష్‌ను అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తీసుకునే వ్యక్తితో పాటు సీలేరు సమీపంలోని సప్లయర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు. కేసు బుక్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇంటి మేనేజర్‌కి లక్షల శాలరీనా?
'Times of India' రిపోర్ట్ ఆధారంగా మన దేశంలోని ధనవంతుల ఇళ్లలో ఇప్పుడు కొత్త ట్రెండ్ నడుస్తోంది. ఇంట్లో వంటమనుషులు, కార్ డ్రైవర్లను మేనేజ్ చేయడానికి, కుటుంబ సభ్యుల డైలీ షెడ్యూల్స్ చూసుకోవడానికి 'చీఫ్ ఆఫ్ స్టాఫ్' లేదా లగ్జరీ లైఫ్‌స్టైల్ మేనేజర్లను పెట్టుకుంటున్నారు. వంట ఏం చేయాలి, గ్రాసరీస్ ఎప్పుడు తెప్పించాలి, ట్రావెల్ ప్లాన్స్ ఏంటి అనేవి భార్య చూసుకునే పనిలేకుండా వీళ్లే హ్యాండిల్ చేస్తారు. ఈ ఉద్యోగానికి ఏడాదికి రూ.6 నుంచి రూ.7 లక్షలు, సీనియర్ మేనేజర్లకు రూ.50 లక్షల వరకు శాలరీ ఇస్తున్నారు.

రాష్ట్రంలో ‘వైట్ గోల్డ్’ వేట.. లిథియం నిక్షేపాలపై ఫోకస్
AP: రాష్ట్రంలో కీలక ఖనిజాల రిసెర్చ్‌పై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. కడప బేసిన్‌లోని వేంపల్లె ఏరియాల్లో లిథియం, గాలియం నిక్షేపాలపై విస్తృత స్థాయి అన్వేషణకు చర్యలు చేపడుతోంది. CSIR–NGRI, రాష్ట్ర గనులు–జియాలజీ శాఖల మధ్య CM చంద్రబాబు నాయుడు సమక్షంలో అగ్రిమెంట్ కుదిరింది. గనుల రంగంలో రీసెర్చ్, టెక్నాలజీ, స్కిల్ డెవలప్‌మెంట్ కోసం IIT(ISM) ధన్‌బాద్–టెక్స్‌మిన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మైన్స్ మధ్య మరో అగ్రిమెంట్ జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, అధికారులు పాల్గొన్నారు.

కాగితంపై రాస్తే జీవితం మారిపోతుందా?
మన జీవితం ఎలా ఉండాలో కలలు కని, వాటిని కాగితంపై రాసుకుంటే నిజమవుతాయని (Manifestation) అంటున్నది నటి సమంత. ఆమె తనకోసం పెట్టుకున్న 1000 రోజుల ఛాలెంజ్లో ప్రస్తుతం 484వ రోజుకి చేరినట్లు సోషల్ మీడియాలో పంచుకుంది. ఒకప్పుడు అసలు సాధ్యపడవు అనుకున్న ఎన్నో విషయాలు, ఈ అలవాటు వల్లే ఇప్పుడు తన జీవితంలో నిజమయ్యాయని సమంత చెప్పింది. అయితే ఊరికే రాసిపెట్టుకుంటే సరిపోదని, ప్రశాంతంగా మన పని మనం చేసుకుంటూ, ఆ కలలకి ఒక టైమ్‌లైన్ పెట్టుకుని కష్టపడాలని చెబుతుంది.

బకాయిలు కట్టాల్సిందే.. మిల్లర్లకు CM గట్టి వార్నింగ్
TG: మిల్లర్లు బకాయిపడిన ధాన్యం డబ్బు మొత్తాన్ని పూర్తిగా వసూలు చేయాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కావాలనే బకాయిల ఎగవేతకు ప్రయత్నించే మిల్లర్లపై స్ట్రిక్ట్‌గా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. బకాయిల వసూలుకు ప్రొసీజర్స్ రూపొందించి క్యాబినెట్ సబ్-కమిటీకి రిపోర్ట్ సబ్మిట్ చేయాలని సూచించారు. ధాన్యం స్టోరేజ్ సమస్యకు పూర్తి పరిష్కారంగా నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లాల్లో సైలో బ్యాగ్‌ల ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

కాళ్లు మొక్కుతా.. యూరియా ఇప్పించండి సారూ
TG: యూరియా కోసం రైతుల కష్టాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాల్సి రావడంతో స్మార్ట్‌ఫోన్ లేని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ జిల్లా చిలప్‌చెడ్ మండలం చిట్కుల్ గ్రామానికి చెందిన రైతు బోయిని రాములు రెండు ఎకరాల్లో వరిసాగు చేస్తున్నారు. పంటకు యూరియా అవసరం కావడంతో రంగంపేట సొసైటీకి చేరుకున్నారు. యూరియా ఇప్పించాలని, బస్తాకు రూ.900 చెల్లిస్తానని తనవద్ద స్మార్ట్‌ఫోన్ లేదని, బుకింగ్ చేయడం తెలియదని అటెండర్ భిక్షపతి కాళ్లమీద పడి వేడుకున్నాడు.

Left-Handers Day 🤚
ఎడమ చేతితో రాసేవాళ్లు మనలో చాలామందే ఉంటారు. కానీ ప్రపంచంలో వీరి సంఖ్య సుమారు 10 శాతమే. ముఖ్యంగా క్రికెటర్ సచిన్, బిల్ గేట్స్, రతన్ టాటా లాంటి వారు ‘లెఫ్ట్ హ్యాండర్స్' కావడం విశేషం. పిల్లలు ఎడమ చేతితో రాస్తుంటే దాన్ని మార్చే ప్రయత్నం చేయకుండా, వాళ్ల సహజ అలవాటును గౌరవించాలని నిపుణులు చెబుతున్నారు. దీని పై అవగాహన కల్పించేందుకు ‘లెఫ్ట్ హ్యాండర్స్ డే’ నిర్వహిస్తారు.

VB-GRAM-Gలో నిర్లక్ష్యం.. 36 మంది ఏపీవోలకు షాక్
AP: రాష్ట్రంలో VB-GRAM-G పథకంలో వర్కర్స్‌కు పని కల్పించడంలో నెగ్లిజెన్స్ చేసిన 36 మంది ఏపీవోలపై డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకోవాలని SRDS మెంబర్ సెక్రటరీ ఆదేశించారు. 12 జిల్లాలకు చెందిన ఏపీవోలపై యాక్షన్ తీసుకోవాలని ఆయా జిల్లాల డ్వామా పీడీలను ఆదేశించారు. జూలై 1 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చిన పనులు కల్పించడంలో నెగ్లిజెన్స్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఏపీవోల ఎక్స్‌ప్లనేషన్స్ సాటిస్‌ఫాక్షన్‌గా లేకపోవడంతో చర్యలకు ఆదేశించారు.

పులి మృతి కేసులో అటవీ అధికారి సస్పెండ్
AP: నంద్యాల జిల్లా ఆత్మకూరు అటవీ డివిజన్‌లో పెద్దపులి మృతి ఘటన కలకలం రేపింది. వేటగాళ్లు ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుని పులి మృతి చెందగా, అటవీ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా కళేబరాన్ని దహనం చేసినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఇందిరేశ్వరం బీట్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ మెహబూబ్ బాషాను సస్పెండ్ చేశారు. గతేడాది సెప్టెంబర్‌లోనే పులి మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. బాషాతో పాటు ఏడుగురు ప్రొటెక్షన్ వాచర్ల ప్రమేయంపైనా విచారణ జరుగుతోంది.

స్కూల్ ఫీజుల నియంత్రణకు బిగ్ ప్లాన్
తెలంగాణలో ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం కోసం తెలంగాణ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ నెల 14న హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సమావేశం జరగనుంది. మాజీ IAS అధికారి ఆకునూరి మురళి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణ కోసం త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్దమయ్యారు.

AI కొత్త వైరస్‌లను తయారు చేసిందా? 🧬
అమెరికాలోని రీసెర్చర్లు AIని ఉపయోగించి ప్రకృతిలో కనిపించని బాక్టీరియోఫేజ్‌లను రూపొందించారు. ఇవి మనుషులను లక్ష్యంగా చేసుకునేవి కాకుండా బ్యాక్టీరియాపైనే పనిచేసే వైరస్‌లు. 2026లో జరిగిన ఈ రీసెర్చ్‌లో AI రూపొందించిన నమూనాల్లో కొన్ని ల్యాబ్‌లో పనిచేయగా, వాటిలో 16 వైరస్‌లు ఈ.కోలి బ్యాక్టీరియాను చంపగలిగాయి. మందులకు తట్టుకునే బ్యాక్టీరియాపై భవిష్యత్తులో ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే ఈ టెక్నాలజీపై భద్రతకు సంబంధించిన చర్చ కూడా మొదలైంది. ఇవి భవిష్యత్తులో కొత్త చికిత్సలకు ఉపయోగపడతాయని అనుకుంటున్నారా?
కానిస్టేబుల్‌పై అటాక్.. ఇద్దరు యువకులు అరెస్ట్
AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో ఆగస్టు 11న రోడ్డు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ట్రాఫిక్‌ను క్లియర్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్ రమణయ్యతో ఇద్దరు యువకులు వాగ్వాదానికి దిగారు. వారిలో అచ్చి శ్రీనివాసులు<a href="https://www.theclearcutnews.com/n/bgHVjsn"> కత్తితో</a> దాడికి యత్నించగా, అప్రమత్తమైన రమణయ్య తృటిలో తప్పించుకున్నారు. కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అచ్చి శ్రీనివాసులు (22), బీటెక్ విద్యార్థి సముద్రాల జితేంద్ర కుమార్ (20)ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు శ్రీనివాసులును పట్టణ వీధుల్లో నడిపించుకుంటూ తీసుకెళ్లి కోర్టులో హాజరుపరిచారు.

హత్య చేసి మిస్సింగ్ డ్రామాతో తప్పించుకునే ప్లాన్
TG: తండ్రిని హత్యచేసి మిస్సింగ్ కేసుగా చిత్రీకరించిన ఘటనలో కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మంచిర్యాల జిల్లా భీమారం పరిధిలో జరిగిన ఈ కేసులో భీమిని ఉదయ్(23) నిందితుడిగా గుర్తించారు. ప్రేమ వివాహం చేసుకోవడం తండ్రి లక్ష్మణ్‌కు ఇష్టం లేకపోవడంతో తరచూ కుమారుడు, కోడలిని దూషిస్తూ గొడవపడేవాడని పోలీసులు తెలిపారు. ప్లాన్ ప్రకారం ఉదయ్ తండ్రిని బైక్‌పై గొల్లవాగు ప్రాజెక్టు ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు పిసికి హత్య చేసినట్లు విచారణలో లేలింది. మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టినట్లు పోలీసులు పేర్కొన్నారు.

🐕 కుక్కలు మన ముఖంలో సంతోషం, బాధను గుర్తించగలవా?
కుక్కలు మన ముఖంలో కనిపించే భావాలను కొంతవరకు గుర్తించగలవని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. ఒక పరిశోధనలో కుక్కలు సంతోషంగా, కోపంగా ఉన్న మనుషుల ముఖాలను వేరు చేయగలిగాయి. మరో రీసెర్చ్‌లో మనుషుల ముఖాల్లో కనిపించే భావోద్వేగాలకు కుక్కల మెదడులోని కొన్ని భాగాలు స్పందించినట్లు గుర్తించారు. అయితే మనం “సంతోషంగా ఉన్నావు, బాధగా ఉన్నావు“ అని అర్థం చేసుకున్నంత స్పష్టంగా కుక్కలు భావాలను గుర్తిస్తాయని మాత్రం చెప్పలేం. స్వరం, శరీర భాష, ముఖ కదలికలు కూడా వాటికి ముఖ్యమైన సంకేతాలే. మీ కుక్క మీ మూడ్‌ని గుర్తించిన సందర్భం ఉందా?

ప్రభుత్వాలు మారినా.. పథకాలు ఆపొద్దు: KTR
TG: ప్రభుత్వాలు మారినా ప్రజలకు ఉపయోగపడే సంక్షేమ పథకాలను కొనసాగించడమే మంచి పాలనకు నిదర్శనమని మాజీ మంత్రి KTR అన్నారు. సిరిసిల్లలో ఇటీవల మృతిచెందిన నేత కార్మికుడు వెంకటేశం కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుమార్తె పేరిట రూ.3 లక్షల ఫిక్స్‌డ్ డిపాజిట్ బాండ్‌ను అందించారు. గత ప్రభుత్వాలు ప్రారంభించిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలను బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించిందన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం KCR పేరుతో ఉన్న కంటి వెలుగు, KCR కిట్ వంటి పథకాలను పక్కన పెట్టడం బాధాకరమని విమర్శించారు.

పరిశ్రమలకు బిగ్ బూస్ట్
ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమలకు మరింత ఊతమిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది డిసెంబరు నుంచి పరిశ్రమలకు అందించే ప్రోత్సాహకాలను ఎస్క్రో ఖాతా ద్వారా చెల్లించాలని CM చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో జరిగిన 20వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో ఇంధనం, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు చెందిన 25 ప్రాజెక్టులకు రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలను SIPB ఆమోదించింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 21,667 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.