సాగునీటిపై CM బిగ్ యాక్షన్

TG: గోదావరి నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని CM రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లోని బోధి పెవిలియన్‌లో నీటిపారుదల శాఖపై ఆయన సమీక్షా నిర్వహించారు. ఎల్లంపల్లి, దేవాదుల, సీతారామ ప్రాజెక్టుల ద్వారా సాధ్యమైనంత ఎక్కువ నీటిని ఎత్తిపోసేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల విషయంలో NDSA సూచనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టంచేశారు. ప్రాజెక్టుల కింద పెండింగ్‌లో ఉన్న పరిహారం, పునరావాస చెల్లింపులను వేగంగా పూర్తి చేయాలన్నారు.



