Latest
మెగా ఫ్యామిలీ లక్కీ చార్మ్!
మెగాస్టార్ చిరంజీవి ‘కొరియన్ కనకరాజు’ మూవీ సక్సెస్ మీట్‌లో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. దాదాపు 7 ఇయర్స్ తర్వాత వరుణ్ తేజ్‌కి ఈ సినిమాతో హిట్ వచ్చి, ఆడియన్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. అయితే ఈ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకోవద్దని, రీసెంట్‌గా పుట్టిన కొడుకు 'వాయువ్ తేజ్' అకౌంట్‌లో వేయాలని వరుణ్‌కి చిరు ఫన్నీగా చెప్పారు. వాయువ్ తమ ఫ్యామిలీకి లక్కీ చార్మ్ అని, వాడు వచ్చిన టైమ్‌కే ఈ హిట్ రావడం చాలా హ్యాపీగా ఉందన్నారు.
సత్య మిమిక్రీ టాలెంట్‌పై చిరు కామెంట్స్?
కామెడీ నటుడు సత్యపై మెగాస్టార్ చిరంజీవి ‘కొరియన్ కనకరాజు’ మూవీ ఈవెంట్‌లో ప్రశంసలు కురిపించారు. సత్య సినిమాలు తాను వరుసగా చూస్తుంటానని, అతని కామెడీని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుందని చెప్పారు. "సత్య నువ్వు ఈ ఈవెంట్ లైవ్ చూస్తున్నావని తెలుసు, ముందు షూటింగ్‌కి వెళ్లు" అంటూ ఫన్నీగా అన్నారు. ఎలాంటి లిమిట్స్ లేకుండా యాక్ట్ చేసే సత్య టాలెంట్, మిమిక్రీ స్కిల్స్ అతని మెయిన్ పవర్ అని.. తన ఫ్యాన్ ఇంత గొప్ప స్థాయికి రావడం చాలా గర్వంగా ఉందంటూ చిరు మాట్లాడారు.
MLA పోచారం శ్రీనివాస్ బయటపెట్టిన కాంగ్రెస్ సీక్రెట్!
కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో BRS మాజీ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నిధుల కోసం తన కొడుకుని రేవంత్ రెడ్డి తమ్ముడి వద్దకు పంపగా, "BRS ఎమ్మెల్యేలకు ఒక్క రూపాయి కూడా ఫండ్స్ ఇవ్వం.. కాంగ్రెస్‌లో చేరితేనే పనులు జరుగుతాయి" అని చెప్పినట్లు వెల్లడించారు. అభివృద్ధి పనుల బిల్లుల కోసం కేడర్, ప్రజల నుంచి ప్రెజర్ పెరగడంతోనే నియోజకవర్గ సంక్షేమం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో పార్టీ మారానని చెప్పారు.

లెన్స్ మారింది కానీ టాలెంట్ మారలేదు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌ను అభినందిస్తూ మెగాస్టార్ చిరంజీవి చేసిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.మెగాస్టార్ చిరంజీవి, వరుణ్ తేజ్ ఉన్న ఫోటో చూసి 'లెన్స్ మారింది కానీ టాలెంట్ మారలేదు' అంటూ వరుణ్ నటనను, ఆయన ఎంచుకునే పాత్రలను చిరంజీవి ప్రత్యేకంగా పొగిడారు. ఇక మెగాస్టార్ అంతటి వ్యక్తి నుంచి ఇలాంటి ప్రత్యేకమైన కాంప్లిమెంట్ రావడంతో వరుణ్ తేజ్ అభిమానులు చాలా ఆనందంగా , ఈ పోస్ట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.
నన్ను నేను ఆపుకోలేకపోతున్నా- చిరంజీవి
'కొరియన్ కనకరాజు' మూవీ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి తన 'చిరు లీక్స్'తో సందడి చేశారు. తమన్ వర్క్ గురించి చెబుతూ, తన Mega158 సినిమా టైటిల్‌ను లీక్ చేయబోయారు. పక్కనే ఉన్న తమన్ లీక్ చేయవద్దని చెప్పడంతో ఆగిన చిరంజీవి, "నన్ను నేను ఆపుకోలేకపోతున్నాను" అంటూ, "22న వచ్చే టీజర్‌లో టైటిల్ వేస్తున్నారా?" అని తమన్‌ను అడిగారు. ఇలా టైటిల్ లీక్ ఆపినా, తన నెక్స్ట్ మూవీ టీజర్ డేట్‌ను మాత్రం చిరు రివీల్ చేసేశారు.

Gen Z రోజుకు ఎన్ని గంటలు Phone చూస్తోంది?
Gen Z రోజుకు ఎంతసేపు ఫోన్ చూస్తుందో తెలుసా?📱ఒకే నంబర్ అందరికీ వర్తించదు.. దేశం, వయసు, చదువు, పని, యాప్స్ వాడకం బట్టి మారుతుంది. 2026లో భారతదేశంలోని 18–24 ఏళ్ల 400 మంది యువతపై జరిగిన ఓ స్టడీలో సగటు రోజువారీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ టైమ్ 5.63 గంటలుగా నమోదైంది. మరో 2025 UK సర్వేలో 16–24 ఏళ్ల Gen Z రోజుకు సగటున 4.84 గంటలు ఫోన్ వాడుతున్నట్లు తేలింది. అయితే ఈ టైమ్ అంతా సోషల్ మీడియా కోసం మాత్రమే కాదు.. చదువు, మెసేజింగ్, వీడియోలు, పని, సెర్చ్ వంటి పనులు కూడా ఇందులో ఉంటాయి. మరి మీ Screen Time ఎంత? 🙂

కోతితో సరదా.. విక్రమ్‌కు లీగల్ ముప్పు!
తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ ఓ అరుదైన విదేశీ జాతి కోతి (లార్ గిబ్బన్)తో కలిసి సరదాగా రీల్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వన్యప్రాణుల సంరక్షణ నిబంధనలకు విరుద్ధంగా ఇలాంటి అరుదైన జీవులను ఇంట్లో ఉంచుకోవడంపై వైల్డ్‌లైఫ్ అధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో విక్రమ్ ఆ వీడియోను వెంటనే డిలీట్ చేశారు. అయినప్పటికీ అటవీ శాఖ అధికారులు వీడియో ఆధారంగా పూర్తి విచారణ ప్రారంభించారు.

కోలీవుడ్‌లో వెంకీ మామ!
విక్టరీ వెంకటేష్ టాలీవుడ్‌లో పవన్, మహేష్, వరుణ్ తేజ్‌లతో కలిసి మల్టీస్టారర్లు చేసిన ఆయన, హిందీలో సల్మాన్ ఖాన్‌తోనూ మెప్పించారు. తాజాగా తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ నటిస్తున్న ‘డేర్ డెవిల్’ సినిమాలో వెంకటేష్ ఒక కీలక పాత్రలో నటించనున్నట్లు సినీ వర్గాల్లో చర్చ నడుస్తుంది. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో సెప్టెంబర్ నుంచి షూటింగ్ మొదలౌతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో వెంకీ మామ చేరుతున్నారనే వార్తతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

గాయాన్ని కూడా లెక్కచేయని రష్మిక.. విజయ్ హిట్ కోసమేనా?
రష్మిక మందన్న ‘రణబాలి’ సినిమా కోసం రిస్క్ చేస్తున్నారని సోషల్ మీడియాలో టాక్ వస్తుంది. ఇటీవల డ్యాన్స్ షూటింగ్‌లో గాయపడిన ఆమెకు డాక్టర్లు 6 వారాలు విశ్రాంతి చెప్పినా, సినిమా ఆలస్యం కాకూడదని షూటింగ్‌లో పాల్గొనాలని చూస్తున్నారు. విజయ్ దేవరకొండ వద్దన్నా వినకుండా, ఆయనకు హిట్ ముఖ్యం అని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అక్టోబర్ 30న విడుదల కానున్న ఈ సినిమాకి ఇతర పెద్ద సినిమాల పోటీ లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.
ఫ్రెండ్స్ డ్రగ్స్ వాడితే పోలీసులకి చెప్పండి-CM విజయ్
'నో డ్రగ్స్' ప్రోగ్రామ్‌లో CM విజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్ తో కలిసి డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఎవరూ డ్రగ్స్ తీసుకోకూడదని, ఒకవేళ ఫ్రెండ్స్ ఎవరైనా వాడుతుంటే సైలెంట్‌గా ఉండకుండా వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని చెప్పారు. సొసైటీ నుంచి డ్రగ్స్‌ను పూర్తిగా తీసేయడానికి ప్రతీ ఒక్కరూ బాధ్యతగా ఉండాలని, తమిళనాడును డ్రగ్ ఫ్రీగా మార్చేందుకు హెల్ప్ చేయాలని CM విజయ్ కోరారు.

జార్ఖండ్‌లో 10వ రోజుకు చేరుకున్న దీక్ష అప్డేట్!
సదర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న <a href="https://x.com/DevendraNathMa9/status/2087161637962957169?s=20">దేవేంద్రనాథ్ మహతో</a> న్యాయం కోసం ఒక ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు. ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష నేటితో 10వ రోజుకు చేరుకుంది. అసెంబ్లీ ముట్టడి ప్రొగ్రామ్‌ను సక్సెస్ చేసిన సపోర్టర్స్ అందరికీ ఆయన థ్యాంక్స్ చెప్పారు. శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న వారిపై లాఠీఛార్జ్ చేసిన ఆఫీసర్స్‌పై వెంటనే యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమకు కంప్లీట్‌గా న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదని, నిరసన కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.

నర్సుల కోసం కవిత గళం..
TG : ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేసే నర్సులకు కనీసం హెల్త్ ఇన్సూరెన్స్ కూడా లేకపోవడంపై BRS నాయకురాలు కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. రోగుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసే హాస్పిటల్ యాజమాన్యాలు, తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేసే నర్సుల సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం సరికాదని అన్నారు . రాత్రింబవళ్లు శ్రమించే సిబ్బందికి ఆరోగ్య భద్రత కల్పించకపోవడం విచారకరమని, వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు.
బలగం నటుడి ఫన్నీ స్పీచ్!
'బలగం' ఫేమ్ సుధాకర్ రెడ్డి 'పళ్లబురుసు' మూవీ ఈవెంట్‌లో ఫన్నీ కామెంట్స్ చేశారు. "బలగంలో నేను చిన్న క్యారెక్టర్ చేసి చనిపోయాను.. ఇంకొంతకాలం బ్రతికి ఉంటే బాగుండేది అని చాలామంది అన్నారు. కానీ ఈ 'పళ్లబురుసు' సినిమాలో ఫుల్ లెంత్ క్యారెక్టర్‌లో చివరి వరకు బ్రతికే ఉంటాను చూడండి" అంటూ సరదాగా నవ్వించారు. అలాగే బలగంలో తనకు ఒక్క డైలాగ్‌కే మంచి రెస్పాన్స్ వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
అన్నపూర్ణ స్టూడియోస్ బిగ్ ఆఫర్.. ఛాన్స్ మిస్ అవ్వకండి!
అక్కినేని నాగార్జున కొత్త టాలెంట్‌ని ఎంకరేజ్ చేయడానికి బిగ్ ఆఫర్ ఇచ్చారు. ఎవరి దగ్గరైనా కొత్త కాన్సెప్ట్, మంచి స్టోరీస్ ఉంటే తమ అన్నపూర్ణ స్టూడియోస్ సిద్ధంగా ఉందంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. "మీరు తెచ్చే కథను మా టీమ్ విని, బాగుంది అనిపిస్తే నేను కూడా వింటాను.. ఇది నా ప్రామిస్" అంటూ యంగ్ డైరెక్టర్లకు కాన్ఫిడెన్స్ ఇచ్చారు.

‘రంభ ఊర్వశి మేనక'
హీరో అల్లరి నరేష్, చంద్రమోహన్ చింతడ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘రంభ ఊర్వశి మేనక' టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. వంశపారంపర్యంగా వచ్చిన ఒక కోరికల పుస్తకంతో రంభ, ఊర్వశి, మేనకలను భూమిపైకి పిలిచిన తర్వాత జరిగే కామెడీ చుట్టూ ఈ కథ ఉంటుంది. ఇందులో రాశి సింగ్, విష్ణు ప్రియ, సురభి, ప్రిషా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 4న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధమవుతుంది.

మీతో మీరే మాట్లాడుకుంటారా? 👀
మనమే మనతో మాట్లాడుకుంటూ ఉండటం చూసి “నేను మాత్రమే ఇలా చేస్తున్నానా?” అనిపిస్తుందా? 😄 నిజానికి Self-talk అనేది చాలా సాధారణమైన విషయమే. మనతో మనం మాట్లాడుకోవడం వల్ల ఆలోచనలను సర్దుకోవడం, పనులను ప్లాన్ చేసుకోవడం, ఫోకస్ పెంచుకోవడం, టెన్షన్ తగ్గించుకోవడం, కష్టమైన పనికి మనల్ని మనమే మోటివేట్ చేసుకోవడం సాధ్యమవుతుందని రీసెర్చర్లు చెబుతున్నారు. ఇది మనసులోనే జరగొచ్చు.. కొన్నిసార్లు బయటకు మాట్లాడుకోవడం కూడా సహజమే. అయితే ఎప్పుడూ మనల్ని మనమే తక్కువ చేసుకునే Negative Self-talk మాత్రం మంచిది కాదు.

‘హనుమాన్’ సీక్వెల్‌లో ట్రెండింగ్ హీరోయిన్
ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా ‘జై హనుమాన్’ నుంచి ఓ క్రేజీ అప్‌డేట్ వైరల్ అవుతుంది. ‘హనుమాన్’ సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో కీలక పాత్రలో తేజ సజ్జ, కన్నడ స్టార్ రిషభ్ శెట్టి నటిస్తుండగా, ఈ మధ్యకాలంలో ట్రెండింగ్ అవుతున్న హీరోయిన్ 'వామికా గబ్బి' ఇందులో ఓ కీలక పాత్రలో నటించనుందని టాక్ వస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ పౌరాణిక సూపర్‌హీరో మూవీకి కీరవాణి మ్యూజిక్ అందించనున్నారు. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

శేరిలింగంపల్లిలో ‘హర్ ఘర్ తిరంగా’ వేడుకలు
TG: వందేమాతరం గీతం 150 ఏళ్లు, 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు మేరకు శేరిలింగంపల్లి మసీద్ బండ క్యాంపు కార్యాలయంలో బీజేపీ ఇంచార్జి రవికుమార్ యాదవ్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ప్రతి ఒక్కరూ ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, ఆ సెల్ఫీని harghartiranga.comలో అప్‌లోడ్ చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

నల్లగండ్ల రేణుకా ఎల్లమ్మ ఆలయంలో బోనాల వేడుకలు
TG: శేరిలింగంపల్లిలోని నల్లగండ్ల నేతాజీనగర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.జగదీశ్వర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. నియోజకవర్గ ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు రఘునందన్‌రెడ్డి, మల్లికార్జున్ యాదవ్ పాల్గొన్నారు.
రాజమౌళి అంటే ఎవరండి- GenZ ప్రాంక్
నారా లోకేష్ కొంతమంది GenZ గర్ల్స్‌తో చిట్‌చాట్ చేస్తుండగా ఒక ఫన్నీ సీన్ జరిగింది. ఆయన సరదాగా తన ఫోన్‌ని అన్‌లాక్ చేసి చేతికి ఇవ్వగా, ఒక అమ్మాయి కాల్ లిస్ట్‌లో ఉన్న స్టార్ డైరెక్టర్ రాజమౌళికి కాల్ చేసింది. అంతేకాకుండా "రాజమౌళి అంటే ఎవరండి?" అంటూ ఆయనతోనే ప్రాంక్ చేసింది. అది చూసి లోకేష్ కూడా నవ్వు ఆపుకోలేక సైలెంట్‌గా ఉండిపోయారు. అస్సలు ఏం చేసినా GenZ స్టైలే వేరు అంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో కింద కామెంట్స్ వస్తున్నాయి.

ఇంటర్నెట్‌లో “404” అనే Error ఎందుకు వస్తుంది?
వెబ్‌సైట్ ఓపెన్ చేస్తుంటే ఒక్కసారిగా “404 Not Found” అని కనిపించిందా? 👀 ఇది మీ ఇంటర్నెట్ పనిచేయడం లేదని అర్థం కాదు. మీరు ఓపెన్ చేయాలనుకున్న వెబ్‌పేజ్‌ను సర్వర్‌లో కనుగొనలేకపోయినప్పుడు ఈ Error వస్తుంది. ఉదాహరణకు, ఒక వెబ్‌పేజ్ డిలీట్ అయి ఉండొచ్చు, దాని లింక్ మారి ఉండొచ్చు లేదా URL తప్పుగా టైప్ చేసి ఉండొచ్చు. అందుకే 404 అంటే సింపుల్‌గా చెప్పాలంటే.. “మీరు అడిగిన పేజ్ ఇక్కడ కనిపించలేదు” అన్నమాట. 💻