Latest

అర్ధరాత్రి చంటిపాపకు ఫిట్స్
News· 6 Aug 2026

అర్ధరాత్రి చంటిపాపకు ఫిట్స్

నాలుగు నెలల చంటిబిడ్డకు ఫిట్స్ వచ్చి చలనం లేకపోవడంతో, రాత్రి ఒంటి గంటకు ప్రవళిక అనే మహిళ ఆటోలో సంగారెడ్డిలోని హాస్పిటల్ కి వెళ్ళింది. అదే సమయంలో హాస్పిటల్ తనిఖీకి వచ్చిన కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి వార్డు వద్ద పాపను ఎత్తుకొని ఏడుస్తున్న ఆమెను పలకరించి విషయం తెలుసుకున్నారు. తల్లీబిడ్డలను తన కారులోనే MCH (Maternity and Child Health)కి తీసుకెళ్లారు. డాక్టర్లతో మాట్లాడి, పాపకు త్వరగా వైద్యం అందేలా చేశారు.

అత్యవసర సేవలకు ఇక ఒకే నంబర్
TG· 6 Aug 2026

అత్యవసర సేవలకు ఇక ఒకే నంబర్

TG: దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ (AI) ఆధారిత నెక్స్ట్ జనరేషన్ డయల్-112 అత్యవసర సేవలను తెలంగాణ పోలీసులు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో DGP CV ఆనంద్ ఈ సేవలను ప్రారంభించారు. పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, బాలల రక్షణ, ప్రకృతి విపత్తుల వంటి సేవలను ఒకే నంబర్ కింద అందుబాటులోకి తీసుకొచ్చారు. AI సాయంతో అత్యవసర పరిస్థితులకు మరింత వేగంగా స్పందించేలా వ్యవస్థను రూపొందించారు. ప్రమాద ప్రాంతాలను ముందుగానే అంచనా వేసేందుకు డ్రోన్లను కూడా వినియోగించనున్నారు.

డయల్-100 కాల్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు
News· 6 Aug 2026

డయల్-100 కాల్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు

TG: హనుమకొండ జిల్లా మడికొండ పోలీస్ స్టేషన్‌కు ఎమర్జెన్సీ కాల్‌(డయల్-100కు) రావడంతో కానిస్టేబుళ్లు సంతోష్, గోవర్ధన్ వెంటనే రెస్పాండ్ అయ్యి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. తనకు తాను నిప్పంటించుకున్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో స్పాట్‌కు చేరుకొని పోలీసులు బాధితుడి మంటలు ఆర్పీ రక్షించారు. బెటర్ ట్రీట్‌మెంట్ కోసం వరంగల్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానిస్టేబుళ్ల ధైర్యసాహసం, సమయస్ఫూర్తిని స్థానికులు, అధికారులు ప్రశంసిస్తున్నారు. ఆ వ్యక్తి నిప్పంటించుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం
TG· 6 Aug 2026

చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం

TG: కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్‌కు చెందిన రఘు (33) నెలరోజుల క్రితం వడదెబ్బకు గురై మృతి చెందాడు. ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయన మూడునెలల క్రితం RTC డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసి పరీక్షలు పూర్తి చేశాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో రఘు ఎంపికైనట్లు అధికారులు సమాచారం అందించారు. అయితే ఆ ఉద్యోగాన్ని అందుకునేలోపే అతడు మృతి చెందడంతో భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. రఘు కుటుంబానికి ఆర్థికసాయం, అతని భార్యకు RTCలో ఉద్యోగం కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు.

కేంద్రానికి CM రేవంత్ రిక్వెస్ట్
Sports· 6 Aug 2026

కేంద్రానికి CM రేవంత్ రిక్వెస్ట్

తెలంగాణలోని పాలమూరు–రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మసాగర్‌, డిండి ప్రాజెక్టులకు వెంటనే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని CM రేవంత్‌రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్‌ యాదవ్‌ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రిని కలిసి ప్రాజెక్టుల పురోగతిపై వివరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, పర్యావరణ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయని తెలిపారు. దీంతో వ్యయం మరింత పెరుగుతోందని పేర్కొన్నారు.

తెలంగాణ సిద్ధాంతకర్త 92వ జయంతి
News· 6 Aug 2026

తెలంగాణ సిద్ధాంతకర్త 92వ జయంతి

తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి (ఆగస్టు 6) నేడు. 1934లో జన్మించిన జయశంకర్, తన జీవితాన్నంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే అంకితం చేశారు. 1952 నాన్-ముల్కీ ఉద్యమం నుంచి ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు ఆయన చేసిన మేధోపరమైన పోరాటం ఎప్పటికీ మరచిపోలేనిది. తెలంగాణ భావజాలాన్ని ప్రతి ఒక్కరిలో రగిలించిన ఈ అమర మేధావి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.

విశాఖ డెవలప్‌మెంట్‌కు CM గ్రీన్ సిగ్నల్
AP· 6 Aug 2026

విశాఖ డెవలప్‌మెంట్‌కు CM గ్రీన్ సిగ్నల్

విశాఖపట్నం ఎకనమిక్ రీజియన్(VER) సమగ్ర అభివృద్ధికి CM చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. అన్ని ప్రాంతాలు, అన్ని రంగాలను కలుపుకొని సూక్ష్మ ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఉండవల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలను కూడా అభివృద్ధి ప్రణాళికల్లో భాగం చేయాలని సూచించారు. VER పరిధిలో రూ.9.50 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్, ఆర్సెలార్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ప్లాంట్ వంటి ప్రాజెక్టులతో విశాఖ పారిశ్రామికంగా ఎదుగుతోందన్నారు.

ఈనెల 23 నుంచి ఆటోలు బంద్
TG· 5 Aug 2026

ఈనెల 23 నుంచి ఆటోలు బంద్

TG: తెలంగాణలో ఆగస్టు 23వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్‌ కానున్నాయి. తెలంగాణ ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ఇందుకు పిలుపునిచ్చింది. యాప్ ఆధారిత రవాణా సేవలకు కనీస బేస్ రేట్ నిర్ణయించడం, ప్లాట్‌ఫాం కంపెనీలు వసూలు చేస్తున్న అధిక కమిషన్లను తగ్గించడం, గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం లాంటి డిమాండ్స్‌‌తో ఈ సమ్మె చేపడుతున్నారు. డిమాండ్లు పరిష్కరించేదాకా సమ్మె చేస్తామని జేఏసీ నాయకులు అంటున్నారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైన్ ఫోర్జరీ!
News· 5 Aug 2026

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైన్ ఫోర్జరీ!

హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంతకాన్ని ఫోర్జరీ చేసిన వ్యవహారంలో 8 ప్రైవేట్ జూనియర్ కాలేజీల గుట్టు రట్టయింది. ఫైర్ NOC కోసం కమిషనర్ ఫేక్ సైన్‌తో పేపర్స్ క్రియేట్ చేసి ఇంటర్ బోర్డుకు సబ్మిట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. దీనిపై లేక్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, ఆ 8 కాలేజీల పర్మిషన్స్ రద్దు చేయాలని ఇంటర్ బోర్డుకు కంప్లైంట్ చేశారు. అలాగే మరో 60 కాలేజీల ఎన్‌వోసీ పేపర్లను కూడా అధికారులు రీ-చెకింగ్ చేస్తున్నారు.

AP ప్రభుత్వం బిగ్ ప్లాన్!?
News· 5 Aug 2026

AP ప్రభుత్వం బిగ్ ప్లాన్!?

ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా మెగాస్టార్ చిరంజీవిని నియమించేందుకు ఏపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. గతంలో గుజరాత్ టూరిజం కోసం అమితాబ్ బచ్చన్ ప్రచారం చేసినట్లే, ఏపీ ఇమేజ్, పర్యాటకాన్ని పెంచేందుకు చిరంజీవితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ఇన్వెస్ట్‌మెంట్స్, టూరిస్ట్స్‌ని ఆకర్షించడమే మెయిన్ టార్గెట్. దీనికి సంబంధించి త్వరలోనే ఏపీ ప్రభుత్వం నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉంది.

మాకు కావలసింది CM రాజీనామా కాదు?
Education· 5 Aug 2026

మాకు కావలసింది CM రాజీనామా కాదు?

జార్ఖండ్‌లో JPSC, JSSC ఎగ్జామ్స్‌లో అక్రమాలు జరిగాయంటూ రాంచీలో స్టూడెంట్స్ పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు. ఎడ్యుకేషన్ సిస్టమ్‌లో మార్పులు తేవాలని, ఎగ్జామ్స్ ట్రాన్స్‌పారెంట్‌గా నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. "మాకు CM రాజీనామా వద్దు.. ఎడ్యుకేషన్ సిస్టమ్ బాగుపడితే చాలు" అంటూ ఓ స్టూడెంట్ మాట్లారు. ఈ నిరసనలకు పలు యువజన సంఘాలు, CJP లాంటి స్టూడెంట్స్ పార్టీస్ కూడా సపోర్ట్ ఇస్తున్నాయి.

జార్ఖండ్ స్టూడెంట్స్ కి మద్దతుగా అభిజీత్ దిప్కే!
Politics· 5 Aug 2026

జార్ఖండ్ స్టూడెంట్స్ కి మద్దతుగా అభిజీత్ దిప్కే!

CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే జార్ఖండ్ విద్యార్థుల పోరాటానికి సపోర్ట్ చేశారు. జార్ఖండ్‌లో JPSC, రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్స్ అక్రమాలపై స్టూడెంట్స్ చేస్తున్న నిరసనలకు మద్దతుగా తాము అక్కడికి వెళ్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన CJP కోర్ టీమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పాలిటిక్స్‌లోకి రాకుండా, యువత సమస్యలపై పోరాడే ప్రెజర్ గ్రూప్‌గానే CJP పనిచేస్తుందని క్లారిటీ ఇచ్చారు.

2027 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ డేట్స్ వచ్చేసాయి!
Sports· 5 Aug 2026

2027 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ డేట్స్ వచ్చేసాయి!

2027 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌ల డేట్స్‌ని ICC అనౌన్స్ చేసింది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 టీమ్స్ కాంపిటీషన్‌లో ఉంటాయి. అందులో టాప్ ప్లేస్‌లో విన్ అయిన ఒక టీమ్ డైరెక్ట్‌గా వరల్డ్ కప్‌కి క్వాలిఫై అవుతుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా 14 టీమ్స్‌తో జరగబోయే ఈ బిగ్ టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ వెయిటింగ్.

వర్షంలో మొబైల్ తడిసిందా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
News· 5 Aug 2026

వర్షంలో మొబైల్ తడిసిందా? ఈ తప్పులు అస్సలు చేయకండి!

వర్షాకాలంలో మొబైల్ ఫోన్ నీళ్లలో పడినా, తడిసినా వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. ఆన్ లో ఉంటే షార్ట్ సర్క్యూట్ అయి మదర్‌బోర్డ్ దెబ్బతింటుంది. సిమ్ ట్రే బయటకు తీసి కాటన్ క్లాత్‌తో ఫోన్ బయట తేమను నీట్‌గా తుడవాలి. అయితే హీట్ వల్ల లోపలి పార్ట్స్ పాడవుతాయి కాబట్టి హెయిర్ డ్రైయర్ వాడకూడదు. అలాగే వెంటనే ఛార్జింగ్ పెట్టడం లేదా పదేపదే ఆన్ చేయడం చేయొద్దు. రెండు రోజుల తర్వాత కూడా ఫోన్ ఆన్ కాకపోతే సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లాలి.

తను చదివిన స్కూల్‌కే గ్రాండ్ గిఫ్ట్- ధనుష్
Education· 5 Aug 2026

తను చదివిన స్కూల్‌కే గ్రాండ్ గిఫ్ట్- ధనుష్

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తను LKG నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న చెన్నై స్కూల్‌కి తన సొంత ఖర్చులతో 3 అంతస్తుల కొత్త బిల్డింగ్‌ని కట్టించారు. పాత భవనం ప్లేస్‌లో నిర్మించిన ఈ భవనానికి 'ధనుష్ బ్లాక్' అని పేరు పెట్టారు. రీసెంట్‌గా జరిగిన ఈ ఓపెనింగ్ ఈవెంట్‌లో తన పాత టీచర్స్ కాళ్లకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్న ధనుష్, పాత క్లాస్‌మేట్స్‌తో కలిసి స్పెషల్ ఫొటోస్ దిగారు.

'కొరియన్ కనకరాజు' వైరల్ ఇంటర్వ్యూ!
Cinema· 5 Aug 2026

'కొరియన్ కనకరాజు' వైరల్ ఇంటర్వ్యూ!

వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు' ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఫన్నీ వైరల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. నిహారిక యాంకర్‌గా వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీలను ఫన్నీ క్వశ్చన్స్ అడిగి రాగింగ్ చేసింది. యూట్యూబ్ ట్రోల్స్, మీమ్స్‌తో ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఆగస్టు 7న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఈ వీడియోతో మంచి హైప్ వచ్చింది.

ఫీమేల్స్‌ కోసం రంగు మార్చిన మగ కప్పలు!
News· 5 Aug 2026

ఫీమేల్స్‌ కోసం రంగు మార్చిన మగ కప్పలు!

నిన్న APలోని NTR జిల్లా నందిగామలో పసుపు రంగు కప్పలు ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇవి వర్షంతో పాటు ఆకాశం నుంచి పడ్డాయని అనుకుంటే పొరపాటే! వీటిని 'ఇండియన్ బుల్‌ఫ్రాగ్' అంటారు. మామూలుగా ఖాకీ రంగులో ఉండే ఈ మగ కప్పలు, వర్షాకాలంలో మేటింగ్ సీజన్ రాగానే ఫీమేల్ కప్పలను అట్రాక్ట్ చేయడానికే ఇలా బ్రైట్ ఎల్లో కలర్‌లోకి మారతాయి. గొంతు కింద బ్లూ కలర్ వోకల్ సాక్స్‌తో సౌండ్ చేసి పిలుస్తాయి. ప్రాసెస్ కాగానే మళ్లీ నార్మల్ కలర్‌లోకి వచ్చేస్తాయి.

అమిత్ షాకి ఆ ధైర్యం లేదు- రాహుల్ గాంధీ
Politics· 5 Aug 2026

అమిత్ షాకి ఆ ధైర్యం లేదు- రాహుల్ గాంధీ

స్టూడెంట్స్ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన బాధితులతో ఢిల్లీలో మీట్ అయిన రాహుల్ గాంధీ, ప్రెస్ ముందు కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ యువత చూపించిన ధైర్యాన్ని అభినందిస్తూ, మోదీ, అమిత్‌షాలకు ప్రెస్‌ను ఫేస్ చేసే ధైర్యం లేదని విమర్శించారు. నిరసనకారులపై జరిగిన హింస, పెల్లెట్ గన్ కాల్పులకు హోంమంత్రి అమిత్‌షానే కారణమని, పబ్లిక్‌గా మాట్లాడే డీసెన్సీ కూడా ఆయనకు లేదని, ఈ ఫెయిల్యూర్ కి హోంశాఖే పూర్తి బాధ్యత వహించాలని రాహుల్ డిమాండ్ చేశారు.

రెండు నెలల తర్వాత..అయోధ్యలో చంపత్ రాయ్
India· 5 Aug 2026

రెండు నెలల తర్వాత..అయోధ్యలో చంపత్ రాయ్

అయెధ్య రామమందిరం విరాళాల చోరీపై రిపోర్ట్ వచ్చిన రెండు నెలల తర్వాత మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అయోధ్యలో కనిపించారు. రిపోర్టర్లు ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించినా, కెమరాకు చెయ్యి అడ్డం పెట్టి బయటకు వెళ్లమని ఆయన సైగలు చేశారు. విరాళాల లెక్కింపు, భద్రత, SOPల అమలు విషయాల్లో లోపాలకు బాధ్యత తీసుకుని జూన్ 26న ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

వీకెండ్ 2 గంటల్లా.. మండే 2 రోజుల్లా ఎందుకు?
Education· 5 Aug 2026

వీకెండ్ 2 గంటల్లా.. మండే 2 రోజుల్లా ఎందుకు?

శనివారం మార్నింగ్ వచ్చినట్టు ఉంటుంది.. చూస్తుండగానే సండే నైట్! కానీ మండే మాత్రం గడియారం కూడా స్లోగా తిరుగుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది?😭⏰ దీనికి మన మెదడులోని టైమ్ పర్సెప్షన్ ఒక కారణం. వీకెండ్‌లో ఫ్రెండ్స్, మూవీస్, ఔటింగ్స్, రీల్స్ లాంటి నచ్చిన పనుల్లో బిజీగా ఉన్నప్పుడు టైమ్‌ను ఎక్కువగా పట్టించుకోం. అదే మండే రోజు పని లేదా క్లాసెస్ బోరింగ్‌గా, స్ట్రెస్‌గా అనిపిస్తే గడియారాన్ని ఎక్కువగా గమనిస్తాం. దీంతో టైమ్ నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపించొచ్చు. గడియారం సేమే బ్రో.. మండేనే మనకు పర్సనల్ ఎనిమీ!😭

బస్సులో మహిళకు హార్ట్ ఎటాక్!
News· 5 Aug 2026

బస్సులో మహిళకు హార్ట్ ఎటాక్!

కర్ణాటకలో తుమకూరు నుండి మధుగిరి వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు సడన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చింది. విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ కొంచెం కూడా టైమ్ వేస్ట్ చేయకుండా వెంటనే బస్సును దగ్గర్లోని హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. డ్రైవర్ సమయస్ఫూర్తితో టైమ్‌కి ట్రీట్‌మెంట్ అందడంతో ఆ మహిళ ప్రాణాపాయం నుంచి సేఫ్‌గా బయటపడింది.