Latest

జార్ఖండ్ స్టూడెంట్స్ కి మద్దతుగా అభిజీత్ దిప్కే!
CJP ఫౌండర్ అభిజీత్ దిప్కే జార్ఖండ్ విద్యార్థుల పోరాటానికి సపోర్ట్ చేశారు. జార్ఖండ్‌లో JPSC, రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్స్ అక్రమాలపై స్టూడెంట్స్ చేస్తున్న నిరసనలకు మద్దతుగా తాము అక్కడికి వెళ్తున్నట్లు తెలిపారు. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో జరిగిన CJP కోర్ టీమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, ప్రస్తుతం పాలిటిక్స్‌లోకి రాకుండా, యువత సమస్యలపై పోరాడే ప్రెజర్ గ్రూప్‌గానే CJP పనిచేస్తుందని క్లారిటీ ఇచ్చారు.

2027 వరల్డ్ కప్ క్వాలిఫైయర్ డేట్స్ వచ్చేసాయి!
2027 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్‌ల డేట్స్‌ని ICC అనౌన్స్ చేసింది. నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరి 22 నుంచి మార్చి 23 వరకు ఈ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో మొత్తం 10 టీమ్స్ కాంపిటీషన్‌లో ఉంటాయి. అందులో టాప్ ప్లేస్‌లో విన్ అయిన ఒక టీమ్ డైరెక్ట్‌గా వరల్డ్ కప్‌కి క్వాలిఫై అవుతుంది. సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా వేదికగా 14 టీమ్స్‌తో జరగబోయే ఈ బిగ్ టోర్నీ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ వెయిటింగ్.

వర్షంలో మొబైల్ తడిసిందా? ఈ తప్పులు అస్సలు చేయకండి!
వర్షాకాలంలో మొబైల్ ఫోన్ నీళ్లలో పడినా, తడిసినా వెంటనే స్విచ్ ఆఫ్ చేయాలి. ఆన్ లో ఉంటే షార్ట్ సర్క్యూట్ అయి మదర్‌బోర్డ్ దెబ్బతింటుంది. సిమ్ ట్రే బయటకు తీసి కాటన్ క్లాత్‌తో ఫోన్ బయట తేమను నీట్‌గా తుడవాలి. అయితే హీట్ వల్ల లోపలి పార్ట్స్ పాడవుతాయి కాబట్టి హెయిర్ డ్రైయర్ వాడకూడదు. అలాగే వెంటనే ఛార్జింగ్ పెట్టడం లేదా పదేపదే ఆన్ చేయడం చేయొద్దు. రెండు రోజుల తర్వాత కూడా ఫోన్ ఆన్ కాకపోతే సర్వీస్ సెంటర్‌కి తీసుకెళ్లాలి.

తను చదివిన స్కూల్‌కే గ్రాండ్ గిఫ్ట్- ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తను LKG నుంచి 10th క్లాస్ వరకు చదువుకున్న చెన్నై స్కూల్‌కి తన సొంత ఖర్చులతో 3 అంతస్తుల కొత్త బిల్డింగ్‌ని కట్టించారు. పాత భవనం ప్లేస్‌లో నిర్మించిన ఈ భవనానికి 'ధనుష్ బ్లాక్' అని పేరు పెట్టారు. రీసెంట్‌గా జరిగిన ఈ ఓపెనింగ్ ఈవెంట్‌లో తన పాత టీచర్స్ కాళ్లకు మొక్కి బ్లెస్సింగ్స్ తీసుకున్న ధనుష్, పాత క్లాస్‌మేట్స్‌తో కలిసి స్పెషల్ ఫొటోస్ దిగారు.
'కొరియన్ కనకరాజు' వైరల్ ఇంటర్వ్యూ!
వరుణ్ తేజ్ నెక్స్ట్ మూవీ 'కొరియన్ కనకరాజు' ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఫన్నీ వైరల్ ఇంటర్వ్యూ రిలీజ్ చేశారు. నిహారిక యాంకర్‌గా వచ్చి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, హీరో వరుణ్ తేజ్, డైరెక్టర్ మేర్లపాక గాంధీలను ఫన్నీ క్వశ్చన్స్ అడిగి రాగింగ్ చేసింది. యూట్యూబ్ ట్రోల్స్, మీమ్స్‌తో ఈ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు. ఆగస్టు 7న థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఈ వీడియోతో మంచి హైప్ వచ్చింది.

ఫీమేల్స్ కోసం రంగు మార్చిన మగ కప్పలు!
నిన్న APలోని NTR జిల్లా నందిగామలో పసుపు రంగు కప్పలు ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఇవి వర్షంతో పాటు ఆకాశం నుంచి పడ్డాయని అనుకుంటే పొరపాటే! వీటిని 'ఇండియన్ బుల్‌ఫ్రాగ్' అంటారు. మామూలుగా ఖాకీ రంగులో ఉండే ఈ మగ కప్పలు, వర్షాకాలంలో మేటింగ్ సీజన్ రాగానే ఫీమేల్ కప్పలను అట్రాక్ట్ చేయడానికే ఇలా బ్రైట్ ఎల్లో కలర్‌లోకి మారతాయి. గొంతు కింద బ్లూ కలర్ వోకల్ సాక్స్‌తో సౌండ్ చేసి పిలుస్తాయి. ప్రాసెస్ కాగానే మళ్లీ నార్మల్ కలర్‌లోకి వచ్చేస్తాయి.
అమిత్ షాకి ఆ ధైర్యం లేదు- రాహుల్ గాంధీ
స్టూడెంట్స్ ప్రొటెస్ట్ లో పార్టిసిపేట్ చేసిన బాధితులతో ఢిల్లీలో మీట్ అయిన రాహుల్ గాంధీ, ప్రెస్ ముందు కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ఈ యువత చూపించిన ధైర్యాన్ని అభినందిస్తూ, మోదీ, అమిత్‌షాలకు ప్రెస్‌ను ఫేస్ చేసే ధైర్యం లేదని విమర్శించారు. నిరసనకారులపై జరిగిన హింస, పెల్లెట్ గన్ కాల్పులకు హోంమంత్రి అమిత్‌షానే కారణమని, పబ్లిక్‌గా మాట్లాడే డీసెన్సీ కూడా ఆయనకు లేదని, ఈ ఫెయిల్యూర్ కి హోంశాఖే పూర్తి బాధ్యత వహించాలని రాహుల్ డిమాండ్ చేశారు.
రెండు నెలల తర్వాత..అయోధ్యలో చంపత్ రాయ్
అయెధ్య రామమందిరం విరాళాల చోరీపై రిపోర్ట్ వచ్చిన రెండు నెలల తర్వాత మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ అయోధ్యలో కనిపించారు. రిపోర్టర్లు ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించినా, కెమరాకు చెయ్యి అడ్డం పెట్టి బయటకు వెళ్లమని ఆయన సైగలు చేశారు. విరాళాల లెక్కింపు, భద్రత, SOPల అమలు విషయాల్లో లోపాలకు బాధ్యత తీసుకుని జూన్ 26న ఆయన తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

వీకెండ్ 2 గంటల్లా.. మండే 2 రోజుల్లా ఎందుకు?
శనివారం మార్నింగ్ వచ్చినట్టు ఉంటుంది.. చూస్తుండగానే సండే నైట్! కానీ మండే మాత్రం గడియారం కూడా స్లోగా తిరుగుతున్నట్టు ఎందుకు అనిపిస్తుంది?😭⏰ దీనికి మన మెదడులోని టైమ్ పర్సెప్షన్ ఒక కారణం. వీకెండ్‌లో ఫ్రెండ్స్, మూవీస్, ఔటింగ్స్, రీల్స్ లాంటి నచ్చిన పనుల్లో బిజీగా ఉన్నప్పుడు టైమ్‌ను ఎక్కువగా పట్టించుకోం. అదే మండే రోజు పని లేదా క్లాసెస్ బోరింగ్‌గా, స్ట్రెస్‌గా అనిపిస్తే గడియారాన్ని ఎక్కువగా గమనిస్తాం. దీంతో టైమ్ నెమ్మదిగా వెళ్తున్నట్టు అనిపించొచ్చు. గడియారం సేమే బ్రో.. మండేనే మనకు పర్సనల్ ఎనిమీ!😭
బస్సులో మహిళకు హార్ట్ ఎటాక్!
కర్ణాటకలో తుమకూరు నుండి మధుగిరి వెళ్తున్న బస్సులో ప్రయాణిస్తున్న ఒక మహిళకు సడన్‌గా హార్ట్ ఎటాక్ వచ్చింది. విషయాన్ని గమనించిన బస్సు డ్రైవర్ కొంచెం కూడా టైమ్ వేస్ట్ చేయకుండా వెంటనే బస్సును దగ్గర్లోని హాస్పిటల్‌కి తీసుకెళ్లాడు. డ్రైవర్ సమయస్ఫూర్తితో టైమ్‌కి ట్రీట్‌మెంట్ అందడంతో ఆ మహిళ ప్రాణాపాయం నుంచి సేఫ్‌గా బయటపడింది.

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఫ్రీగా పైలట్ ట్రైనింగ్!
తెలంగాణలో EWS కేటగిరీకి చెందిన యువతులకు గుడ్ న్యూస్. ఉచితంగా కమర్షియల్ పైలట్ లైసెన్స్ (CPL) ట్రైనింగ్ ఇచ్చేందుకు అప్లికేషన్లు స్టార్ట్ అయ్యాయి. 18 నుంచి 35 ఏళ్ల వయసు ఉండి, ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులు చదివిన అమ్మాయిలు దీనికి అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి ఫ్రీగా పైలట్ శిక్షణతో పాటు మిగతా సౌకర్యాలు కూడా ఇస్తారు. టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి DGCA రూల్స్ ప్రకారం ట్రైనింగ్ ఇస్తారు.

యువ నిరసనకారులకు ఇంకా బెదిరింపులు: రాహుల్ గాంధీ
యువ నిరసనకారులతో మాట్లాడామని, వాళ్లింకా బెదిరింపులు ఎదుర్కొంటున్నారని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ చెప్పారు. లోక్‌సభ ప్రాంగణంలో ఆయన మాట్లాడుతూ విద్యావ్యవస్థపై ఫిర్యాదు చేయడం నేరం కాదని, వారు రాజ్యాంగాన్ని, భారత భవిష్యత్తును రక్షించారని అన్నారు. 15 ఏళ్ల అమ్మాయి నుంచి బలవంతంగా క్షమాపణ చెప్పించుకోవడం దారుణమన్నారు. పరీక్ష పత్రాల లీకులు ఆగాలని, విద్యా వ్యవస్థ మారాలని డిమాండ్ చేశారు.

“Delulu is the Solulu”.. అసలు దీని అర్థం ఏంటి?🤔
“Delulu is the Solulu”.. సోషల్ మీడియాలో ఈ మాట ఎప్పుడైనా చూశారా..? అసలు డెలులు అంటే డెల్యూషనల్ నుంచి వచ్చిన జెన్ జీ స్లాంగ్. నిజంగా జరిగిందా లేదా అనేది పక్కనపెట్టి.. మనకు నచ్చినట్టు ఊహించుకుని, అదే జరుగుతుందని నమ్మేయడాన్ని సరదాగా డెలులు అంటారు. ఇక సొలులు అంటే సొల్యూషన్కి ఫన్నీ వెర్షన్. “Delusional is the solution” అంటే “ఎలాంటి కష్టపరిస్థితుల్లోనైనా మనకు నచ్చిన భ్రమలో లేదా పాజిటివ్ ఆలోచనల్లో బతకడమే సమస్యకు పరిష్కారం” అని భావించడం. కలలు కనడానికి ట్యాక్స్ ఏం లేదుగా బ్రో.. సో నచ్చినట్టు కనేద్దాం! 😂

మెటా సంస్థకు No Protection: ప్రభుత్వం
భారత్‌లో CSAM కంటెంట్, డీప్‌ఫేక్ కంటెంట్, ప్లాట్‌ఫామ్ నిర్వహణలో జరిగిన తప్పులపై ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పారు. ఈ విషయాన్ని కేంద్రం ప్రకటించింది. ఎవరికి కంటెంట్ చూపించాలో వాళ్లే ఎంపిక చేస్తున్నారు కాబట్టి, IT చట్టం కింద వాళ్లకు ప్రొటెక్షన్ రాదని వివరించింది. కొన్ని రకాల కంటెంట్‌ను ప్రమోట్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించినట్లు మెటా అంగీకరించిందని, ఈ తప్పుకు క్షమాపణలు చెప్పినట్టు వివరించింది.

సోనమ్ వాంగ్‌చుక్ మాటతో నీళ్లు తాగిన దేవేంద్ర నాథ్!
రాంచీలో అనిశ్చితకాల నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు <a href="https://x.com/DevendraNathMa9/status/2084885137406492917?s=20">దేవేంద్ర నాథ్</a> మహతోతో సోనమ్ వాంగ్‌చుక్ వీడియో కాల్‌లో మాట్లాడారు. ఈ ఉద్యమానికి తన మద్దతు తెలుపుతూ విద్యార్థులకు అవసరమైన సలహాలు, ప్రోత్సాహాన్ని అందించారు. ఆయన మాట మేరకు దేవేంద్ర మంచి నీళ్లు తాగినప్పటికీ, తమ సత్యాగ్రహం మరియు నిరాహార దీక్ష ఆగదని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాంచీకి స్వయంగా వచ్చి ప్రొటెస్ట్ చేస్తున్న స్టూడెంట్స్‌కి ధైర్యం చెప్పాలని వాంగ్‌చుక్‌ని కోరినట్లు దేవేంద్ర సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అస్సాంలో ఫ్లడ్ అలర్ట్! 89 మంది మృతి!!
అస్సాంలో వర్షాలు తగ్గకపోవడంతో వరద పరిస్థితి ఇంకా తీవ్రంగానే ఉంది. ఆగస్టు 5 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 5 జిల్లాల్లో దాదాపు 1.22 లక్షల మంది ప్రజలు వరదల వల్ల ఇబ్బందులు పడుతుండగా, ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 89కి చేరింది. గోలాఘాట్ జిల్లాలోని నుమలీగఢ్ వద్ద ధన్‌సిరి నది అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని ASDMA వెల్లడించింది. మరోవైపు పరిస్థితిని సమీక్షించి, సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా నేడు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు.

సింగరేణి ఉద్యోగులను వేధించడం అమానుషం: కల్వకుంట్ల కవిత
TG: సింగరేణి సింగరేణి ఉద్యోగులను వేధించడం అమానుషం అని మాజీ ఎంపీ కవిత అన్నారు. 2016, 2017 JMET ద్వారా ఉద్యోగంలో చేరిన 800 మంది ఉద్యోగులకు 2023 వరకు ఓవర్ మెన్‌గా ప్రమోషన్లు ఇవ్వాల్సి ఉందన్నారు. కానీ 200 మందికే ప్రమోషన్స్ ఇచ్చి 600 మందిని పక్కనపెట్టడం అన్యాయమని అన్నారు. యాజమాన్యాన్ని ప్రశ్నిస్తే బదిలీల పేరుతో వేధిస్తున్నారని ఆరోపించారు. డిమాండ్ల పరిష్కారం కోసం కొత్తగూడెంలో చేపట్టిన 72 గంటల నిరాహార దీక్షకు తెలంగాణ రక్షణ సేన, హెచ్ఎంఎస్ సంపూర్ణ మద్దతు తెలుపుతుందని ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.

GenZ మాట వినండి- సుప్రీంకోర్టు ఆర్డర్
NEET-UG పేపర్ లీక్ ప్రొటెస్ట్స్ చేస్తున్న స్టూడెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆగస్టు 5న జరిగిన విచారణలో చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ మాట్లాడుతూ.. యూత్‌ను అణచివేయడం కంటే వారితో మాట్లాడి కామ్ చేయడమే మంచి మార్గమని అన్నారు. యువత ఆందోళనలను ఓపికగా వినాలని, వారికి రీజనింగ్‌తో నచ్చజెప్పడమే పవర్‌ఫుల్ సొల్యూషన్ అని ప్రభుత్వానికి సూచించారు. ఈ సిట్యుయేషన్‌ను ఎలా హ్యాండిల్ చేయాలో గవర్నమెంట్‌కి బాగా తెలుసని కోర్టు స్పష్టం చేసింది.

ఆగస్టు 9న తెలంగాణ అస్తిత్వ నిర్మాతలపై తొలి ప్రసంగ సమావేశం
TG: తెలంగాణ పరిరక్షణ సమితి(TPC) ఆధ్వర్యంలో ఆగస్టు 9వ తేదీ ఆదివారం సాయంత్రం 5:30కు తెలంగాణ అస్తిత్వ నిర్మాతలపై తొలి ప్రసంగ సమావేశం నిర్వహిస్తున్నారు. సుందరయ్య భవన్‌లో జరిగే ఈ సమావేశంలో వక్తలుగా సుంకిరెడ్డి నారాయణరెడ్డి, శ్రీరామోజు హరగోపాల్, కాసుల ప్రతాపరెడ్డి, గోగు శ్యామల, సంగిశెట్టి శ్రీనివాస్, కందుకూరి రమేశ్‌బాబు పాల్గొంటారు. తెలంగాణ అస్తిత్వ గురించి ప్రసంగిస్తారు. వారి జీవన విశేషాలు వివరిస్తారు.

తమిళనాడు బడ్జెట్ నిరాశపరిచింది: తమిళిసై సౌందరరాజన్
తమిళనాడు 2026-27 బడ్జెట్‌పై బీజేపీ సీనియర్ నేత తమిళిసై సౌందరరాజన్ విమర్శలు చేశారు. ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం.. బడ్జెట్‌లో వాటి అమలుకు తగిన ప్రయారిటీ ఇవ్వలేదన్నారు. గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్‌మెంట్‌కు ఫండ్స్ సరిపోవని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న PM SHRI పథకాన్ని రాష్ట్రం స్వీకరించాలని సూచించారు. మహిళలకు ఇచ్చే ఇన్సెంటివ్స్ పెంచలేదని, క్యాన్సర్ సేవల అభివృద్ధికి ఇచ్చిన రూ.10 కోట్లు కూడా సరిపోవని పేర్కొన్నారు. ఈ బడ్జెట్ ప్రజలను డిసప్పాయింట్ చేసిందని ఆమె అన్నారు.

జమ్మూ కశ్మీర్‌లో మళ్లీ పొలిటికల్ హీట్!
ఆర్టికల్ 370 రద్దై ఏడేళ్లు.. కానీ పొలిటికల్ డిబేట్ మాత్రం ఇంకా కొనసాగుతోంది! 2019 ఆగస్టు 5న జమ్మూ కశ్మీర్ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఆర్టికల్ 370 మార్పులు జరిగాయి. ఏడో వార్షికోత్సవం సందర్భంగా నేషనల్ కాన్ఫరెన్స్, PDP నిరసన కార్యక్రమాలు ప్రకటించగా, BJP మాత్రం ఈ రోజును సెలబ్రేట్ చేసేందుకు కార్యక్రమాలు ప్లాన్ చేసింది. దీంతో జమ్మూ కశ్మీర్‌లో మరోసారి రెండు భిన్న రాజకీయ అభిప్రాయాలు ఎదురెదురుగా కనిపిస్తున్నాయి.