ఈనెల 23 నుంచి ఆటోలు బంద్

TG: తెలంగాణలో ఆగస్టు 23వ తేదీ అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్‌లు బంద్ కానున్నాయి. తెలంగాణ ఆటో, యాప్ ఆధారిత సంఘాల జేఏసీ ఇందుకు పిలుపునిచ్చింది. యాప్ ఆధారిత రవాణా సేవలకు కనీస బేస్ రేట్ నిర్ణయించడం, ప్లాట్‌ఫాం కంపెనీలు వసూలు చేస్తున్న అధిక కమిషన్లను తగ్గించడం, గిగ్, ప్లాట్‌ఫాం వర్కర్ల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయడం లాంటి డిమాండ్స్‌తో ఈ సమ్మె చేపడుతున్నారు. డిమాండ్లు పరిష్కరించేదాకా సమ్మె చేస్తామని జేఏసీ నాయకులు అంటున్నారు.



