Latest

ఎయిర్ ఇండియా ఫ్లైట్ కుదుపులు.. మినిస్టర్ రామ్మోహన్ వివరణ
ఫుకెట్ నుంచి దిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ మంగళవారం పెద్ద గాలుల కారణంగా కుదుపుల (టర్బులెన్స్)కు గురైంది. ఈ ఘటన ఐదు నిమిషాల పాటు కొనసాగినట్లు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ ఘటనలో క్యాబిన్ స్టాఫ్‌కు వెన్నెముక, మెడ భాగాల్లో ఇంజరీ అయ్యిందని వెల్లడించారు. ప్రయాణ మధ్యలో ఫ్లైట్ సుమారు 300 అడుగుల ఎత్తు ఒక్కసారిగా కోల్పోయినప్పటికీ, 137 మంది ప్రయాణికులు, 8 మంది స్టాఫ్‌తో ఎయిర్ ఇండియా AI2379 ఫ్లైట్ ఉదయం 11.07 గంటలకు దిల్లీ ఎయిర్ పోర్టులో సేఫ్‌గా ల్యాండ్ అయ్యిందన్నారు.

ఓవర్‌టేక్ చేయబోయి ప్రమాదం.. స్టూడెంట్ మృతి
TG: సికింద్రాబాద్ తిరుమలగిరి PS పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కాలేజ్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా, మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. లాల్‌బజార్ నుంచి డెయిరీ ఫామ్ వైపు బైక్‌పై వెళ్తున్న ఇద్దరు విద్యార్థులు మరో ద్విచక్ర వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో అదుపుతప్పి ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొట్టారు. ప్రమాద తీవ్రతకు ఒకరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోగా, మరొకరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు.

జీతం తగ్గితే ఎలా బతకాలి?.. కార్మికుల ఆవేదన
TG: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికులు GO నెం.1181ను వ్యతిరేకిస్తూ గురువారం నిరసన చేపట్టారు. ఈ జీవో అమలుతో తమ నెలవారీ వేతనాల్లో సుమారు రూ.4 వేల కోత పడిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే తక్కువ జీతాలతో కుటుంబాలను పోషించడం కష్టంగా మారిందని, వేతనాల తగ్గింపు మరింత భారంగా మారిందన్నారు. జీవోను వెంటనే రద్దు చేసి, మున్సిపల్ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి స్థిరమైన వేతనాలు, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.

రంగు రంగుల అప్పడాలు?
భారతీయ ఇళ్లలో భోజనంతో పాటు అప్పడాలు, వడియాలు తినడం చాలా కామన్. అయితే మార్కెట్‌లో ఎట్రాక్టివ్‌గా ఉండే ఎరుపు, ఆకుపచ్చ వంటి అప్పడాలు, వడియాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. పిల్లలు ఎంతగానో ఇష్టపడే వీటిలో అనుమతి లేని ‘నాన్-పెర్మిటెడ్’ ఫుడ్ కలర్స్, సింథటిక్ రసాయనాలు వాడుతున్నారు. ఈ కెమికల్స్ వల్ల కాలేయం, మూత్రపిండాలు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు.

అద్దెకు వచ్చి.. లక్షలతో ఉడాయించిన దంపతులు
AP: కడప జిల్లా జమ్మలమడుగు పరిధిలోని మోరగుడిలో నకిలీ బంగారం పేరుతో రూ.4 లక్షలు మోసం చేసిన ఘటన వెలుగుచూసింది. కూలీ పనుల కోసం వచ్చామని చెప్పి గ్రామంలో అద్దెకు దిగిన దంపతులు స్థానికుడు సుబ్బరాయుడితో పరిచయం పెంచుకున్నారు. తమకు 44 తులాల బంగారు బిస్కెట్ దొరికిందని, తక్కువ ధరకే విక్రయిస్తామని నమ్మించారు. అనుమానం రాకుండా 2 గ్రాముల అసలు బంగారం ఇచ్చి పరీక్ష చేయించగా అది నిజమని తేలింది. దీంతో రూ.12 లక్షలకు ఒప్పందం కుదుర్చుకుని ముందస్తుగా రూ.4 లక్షలు తీసుకుని నకిలీ బంగారు బిస్కెట్ ఇచ్చి పరారయ్యారు.
నిమ్స్ కొత్త రికార్డు.. మూడేళ్లలో 1,000 సర్జరీలు
TG: హైదరాబాద్ NIMS హాస్పిటల్ వైద్యరంగంలో మరో అరుదైన మైలురాయిని చేరుకుంది. గత మూడేళ్లలో వెయ్యి రోబోటిక్ సర్జరీలను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. 2023 ఆగస్టులో ఫస్ట్ రోబోటిక్ సర్జరీలను చేసిన నిమ్స్‌లో ఇప్పటివరకు యూరాలజీలో 590, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీలో 248, సర్జికల్ ఆంకాలజీలో 162 రోబోటిక్ సర్జరీలు సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయ్యాయని నిమ్స్ డైరెక్టర్ రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఈ ఘనత సాధించిన మెడికల్ టీమ్‌ను మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు.
లోక్‌సభలో రాహుల్ ‘మూడు కేటగిరీల’ కామెంట్స్
సభలో మాట్లాడిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రజలను విద్యార్థులు, ఇడియట్లు, అంధభక్తులు అంటూ మూడు కేటగిరీలుగా విడదీస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జ్ఞానాన్ని స్వీకరించేవాడే విద్యార్థి అని, తమకే అంతా తెలుసనుకునే వాళ్లు ఇడియట్లని, వారిని గుడ్డిగా నమ్మేవాళ్లు అంధభక్తులని నిర్వచనం చెప్పారు. ఈ కామెంట్స్‌పై అధికార పక్ష ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాహుల్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. 'ఇడియట్' అనే పదం పార్లమెంటరీ నిబంధనలకు విరుద్ధమని, రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

చెత్తకుప్పలో కాలిన డెడ్‌బాడీ.. హత్యా? ప్రమాదమా?
TG: హైదరాబాద్‌లోని దోమలగూడ గోశాల దగ్గర ఈరోజు ఉదయం చెత్తకుప్పలో గుర్తుతెలియని వ్యక్తి శవం మంటల్లో కాలిపోతున్న ఘటన కలకలం రేపింది. స్థానికుల సమాచారంతో ఫైర్ డిపార్ట్‌మెంట్ స్టాఫ్, పోలీసులు అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. డెడ్‌బాడీని పోస్టుమార్టం కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఘటనపై కేస్ ఫైల్ చేసి, పోలీసులు ఆ ఏరియాలోని CC టీవీ ఫుటేజ్‌ను చెక్ చేస్తున్నారు. ఆ వ్యక్తిని హత్య చేసి చెత్తకుప్పలో పడేసి తగలబెట్టారా? లేక మరేదైనా కారణమా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

బాలీవుడ్‌లో ధనుష్
కోలీవుడ్ స్టార్ హీరో 'ధనుష్' బాలీవుడ్‌లో సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణంలో తెరకెక్కనున్న ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటించనున్నారు. 'ఇరుంబు తిరై', 'సర్దార్' వంటి విజయవంతమైన సినిమాలు తీసిన తమిళ దర్శకుడు పి.ఎస్. మిత్రన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. మైథలాజికల్, జంగిల్ అడ్వెంచర్‌తో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

అధికారం పోయాకే హక్కులు గుర్తొచ్చాయా: ఉత్తమ్
TG: తొమ్మిదిన్నరేళ్లు తెలంగాణ సంపదను దోచుకున్న BRS నాయకులు ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. తెలంగాణ నీటి హక్కుల పరిరక్షణలో కాంగ్రెస్ ప్రభుత్వం రాజీ పడదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో ముడుపుల ఆరోపణలపై హరీశ్ రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. AP ప్రభుత్వం ప్రాజెక్టులను వ్యతిరేకించిన ప్రతిసారి తమ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలను కాపాడిందన్నారు.

పల్లీలు ఎలా తింటే మంచిది?
పల్లీలలో 25-30శాతం ప్రోటీన్, విటమిన్ ఇ, బి6, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు ఉండి ఇమ్యూనిటీని పెంచుతాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. స్కిన్‌కి మంచి చేసే రెస్వెరాట్రాల్ అనే యాంటీఆక్సిడెంట్ వీటిలో లభిస్తుంది. ఉప్పు, డీప్ ఫ్రై చేసిన పల్లీలు కాకుండా రోజూ 30-50 గ్రాముల ఉడకబెట్టిన లేదా వేయించిన పల్లీలు తినడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

తుమ్మిడిహట్టి ఎత్తు పెంపే లక్ష్యంగా.. కేంద్రంతో సీఎం భేటీ
TG: ప్రాణహిత నదిపై తుమ్మిడిహట్టి బ్యారేజ్ ఎత్తు పెంపునకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేలా కేంద్ర సహకారంపై నిన్న సీఎం రేవంత్‌రెడ్డి దిల్లీకి వెళ్లారు. బ్యారేజ్ ఎత్తు పెంచినా మహారాష్ట్రలో ముంపు సమస్యలు ఉండవని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్. పాటిల్‌ను ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కలిసిన సీఎం తుమ్మిడిహట్టి ప్రాజెక్టు తెలంగాణాకు ప్రయారిటీను వివరించారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ప్రభుత్వం పంపిన లేఖ గురించి కూడా వివరించినట్లు తెలుస్తోంది.

ఈరోజు ఆ ఏరియాల్లో పవర్ కట్!
TG: ఆజామాబాద్, హైదరాబాద్ సిటీ-1 డివిజన్ల పరిధిలో ఎలక్ట్రిక్ ఫీడర్ల రిపేర్ పనుల కారణంగా ఈరోజు కొన్ని ఏరియాల్లో పవర్ సప్లై నిలిపివేస్తున్నట్లు CBDADEలు నాగేశ్వరరావు, వినోద్‌కుమార్ తెలిపారు. ప్లేగ్రౌండ్, బాపూనగర్, లిటిల్ ఫ్లవర్, పోస్టాఫీస్, ఎల్‌బీ స్టేడియం, ఫీవర్ హాస్పిటల్, A.V కాలేజ్, బర్కత్‌పుర బస్‌డిపో ఏరియాల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పవర్ సప్లై నిలిపివేస్తామని పేర్కొన్నారు. పవర్ కన్జ్యూమర్స్ సహకరించాలని కోరారు.

అర్హులకు అన్యాయం జరగదు: పొంగులేటి
TG: రాష్ట్రంలో 22ఏ నిషేధిత భూముల విషయంలో ఏ అర్హుడికీ అన్యాయం జరగదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క సెంటు భూమినీ 22ఏ నిషేధిత జాబితాలో చేర్చలేదని వెల్లడించారు. ప్రతి దరఖాస్తు, ఫిర్యాదును చట్టబద్ధంగా పరిశీలించి అర్హులకు న్యాయం చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. హైకోర్టు నిర్దేశించిన 45 రోజుల గడువులోగా పెండింగ్ కేసులను పరిష్కరించాలని మంత్రి సూచించారు.

హిరోషిమా గాయం.. 81 ఏళ్లైనా మానని జ్ఞాపకం
ప్రపంచవ్యాప్తంగా ఈరోజు (ఆగస్టు 6) హిరోషిమా డేను నిర్వహిస్తున్నారు. 1945లో సెకండ్ వరల్డ్ వార్ సమయంలో జపాన్‌లోని హిరోషిమాపై అమెరికా జరిపిన అటామిక్ బాంబ్ అటాక్‌కు 81 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈ రోజుని జరుపుకుంటారు. ఈ సందర్భంగా దాడిలో ప్రాణాలు పోగొట్టుకున్నవారికి నివాళులర్పిస్తూ, న్యూక్లియర్ వెపన్స్ వల్ల కలిగే భారీ విధ్వంసాన్ని గుర్తుచేసుకుంటారు. వరల్డ్ పీస్, న్యూక్లియర్ డిసార్మమెంట్, హింసారహిత సమాజ నిర్మాణం కోసం దేశాలు, అంతర్జాతీయ సంస్థలు, శాంతి ఉద్యమకారులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
అర్ధరాత్రి చంటిపాపకు ఫిట్స్
నాలుగు నెలల చంటిబిడ్డకు ఫిట్స్ వచ్చి చలనం లేకపోవడంతో, రాత్రి ఒంటి గంటకు ప్రవళిక అనే మహిళ ఆటోలో సంగారెడ్డిలోని హాస్పిటల్ కి వెళ్ళింది. అదే సమయంలో హాస్పిటల్ తనిఖీకి వచ్చిన కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి వార్డు వద్ద పాపను ఎత్తుకొని ఏడుస్తున్న ఆమెను పలకరించి విషయం తెలుసుకున్నారు. తల్లీబిడ్డలను తన కారులోనే MCH (Maternity and Child Health)కి తీసుకెళ్లారు. డాక్టర్లతో మాట్లాడి, పాపకు త్వరగా వైద్యం అందేలా చేశారు.

అత్యవసర సేవలకు ఇక ఒకే నంబర్
TG: దేశంలోనే తొలిసారిగా కృత్రిమ మేధ (AI) ఆధారిత నెక్స్ట్ జనరేషన్ డయల్-112 అత్యవసర సేవలను తెలంగాణ పోలీసులు ప్రారంభించారు. హైదరాబాద్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో DGP CV ఆనంద్ ఈ సేవలను ప్రారంభించారు. పోలీస్, అగ్నిమాపక, అంబులెన్స్, మహిళా భద్రత, బాలల రక్షణ, ప్రకృతి విపత్తుల వంటి సేవలను ఒకే నంబర్ కింద అందుబాటులోకి తీసుకొచ్చారు. AI సాయంతో అత్యవసర పరిస్థితులకు మరింత వేగంగా స్పందించేలా వ్యవస్థను రూపొందించారు. ప్రమాద ప్రాంతాలను ముందుగానే అంచనా వేసేందుకు డ్రోన్లను కూడా వినియోగించనున్నారు.
డయల్-100 కాల్‌తో వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు
TG: హనుమకొండ జిల్లా మడికొండ పోలీస్ స్టేషన్‌కు ఎమర్జెన్సీ కాల్(డయల్-100కు) రావడంతో కానిస్టేబుళ్లు సంతోష్, గోవర్ధన్ వెంటనే రెస్పాండ్ అయ్యి ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడారు. తనకు తాను నిప్పంటించుకున్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో స్పాట్‌కు చేరుకొని పోలీసులు బాధితుడి మంటలు ఆర్పీ రక్షించారు. బెటర్ ట్రీట్‌మెంట్ కోసం వరంగల్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానిస్టేబుళ్ల ధైర్యసాహసం, సమయస్ఫూర్తిని స్థానికులు, అధికారులు ప్రశంసిస్తున్నారు. ఆ వ్యక్తి నిప్పంటించుకోవడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చనిపోయిన తర్వాత వచ్చిన ప్రభుత్వ ఉద్యోగం
TG: కరీంనగర్ రూరల్ మండలం దుర్షేడ్‌కు చెందిన రఘు (33) నెలరోజుల క్రితం వడదెబ్బకు గురై మృతి చెందాడు. ప్రైవేట్ స్కూల్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఆయన మూడునెలల క్రితం RTC డ్రైవర్ పోస్టుకు దరఖాస్తు చేసి పరీక్షలు పూర్తి చేశాడు. తాజాగా విడుదలైన ఫలితాల్లో రఘు ఎంపికైనట్లు అధికారులు సమాచారం అందించారు. అయితే ఆ ఉద్యోగాన్ని అందుకునేలోపే అతడు మృతి చెందడంతో భార్య రజిత, ఇద్దరు కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. రఘు కుటుంబానికి ఆర్థికసాయం, అతని భార్యకు RTCలో ఉద్యోగం కల్పించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కోరారు.

కేంద్రానికి CM రేవంత్ రిక్వెస్ట్
తెలంగాణలోని పాలమూరు–రంగారెడ్డి, గౌరవెల్లి, సీతమ్మసాగర్, డిండి ప్రాజెక్టులకు వెంటనే పర్యావరణ అనుమతులు మంజూరు చేయాలని CM రేవంత్‌రెడ్డి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కోరారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో కలిసి కేంద్రమంత్రిని కలిసి ప్రాజెక్టుల పురోగతిపై వివరించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టులపై వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ, పర్యావరణ అనుమతులు లేక పనులు నిలిచిపోయాయని తెలిపారు. దీంతో వ్యయం మరింత పెరుగుతోందని పేర్కొన్నారు.

తెలంగాణ సిద్ధాంతకర్త 92వ జయంతి
తెలంగాణ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతి (ఆగస్టు 6) నేడు. 1934లో జన్మించిన జయశంకర్, తన జీవితాన్నంతా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే అంకితం చేశారు. 1952 నాన్-ముల్కీ ఉద్యమం నుంచి ప్రత్యేక రాష్ట్రం వచ్చే వరకు ఆయన చేసిన మేధోపరమైన పోరాటం ఎప్పటికీ మరచిపోలేనిది. తెలంగాణ భావజాలాన్ని ప్రతి ఒక్కరిలో రగిలించిన ఈ అమర మేధావి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళి.