Latest

కలలు ఎందుకు వస్తాయో తెలుసా?
General· 31 Jul 2026

కలలు ఎందుకు వస్తాయో తెలుసా?

రోజూ నిద్రపోయాక కలలు వస్తుంటాయి. కానీ అవి ఎందుకు వస్తాయో తెలుసా? నిజం చెప్పాలంటే.. దీనికి ఇప్పటికీ ఒక్క సమాధానం లేదు. మనం ఎక్కువగా REM Sleep అనే స్టేజ్‌లోనే కలలు కంటాం. ఆ టైమ్‌లో మన మెదడు చాలా యాక్టివ్‌గా ఉంటుంది. రోజంతా చూసిన విషయాలు, గుర్తుండిపోయిన సంఘటనలు, మనలో ఉన్న ఫీలింగ్స్‌ని మెదడు సెట్ చేసే సమయంలో కలలు రావొచ్చని రీసెర్చ్‌లు చెబుతున్నాయి. కానీ కలలు అసలు ఎందుకు వస్తాయి? వాటి అసలు పని ఏంటి? అనే ప్రశ్నకు మాత్రం ఇప్పటికీ క్లియర్ ఆన్సర్ లేదు.

Gen Z ఆలోచించాలి!
Politics· 31 Jul 2026

Gen Z ఆలోచించాలి!

21 ఏళ్ల యూత్ కూడా ఎలక్షన్స్‌లో పోటీ చేయొచ్చన్న CM రేవంత్ రెడ్డి పిలుపును స్వాగతిస్తున్నామని తెలంగాణ CJP ప్రొటెస్టర్ <a href="https://x.com/VijayMallangi/status/2082812145805488481?s=20">విజయ్ మల్లాంగి</a> ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. పొలిటికల్ పార్టీలు యూత్‌కి అవకాశాలు ఇవ్వాలని, కేవలం లీడర్ల పిల్లలు, బంధువులకే టికెట్లు ఇస్తే యూత్‌ని మోసం చేయడమే అవుతుందీ అన్నారు. గవర్నమెంట్ స్కూళ్లు, ఎంప్లాయ్‌మెంట్ ప్రాబ్లమ్స్ ఎప్పుడు సాల్వ్ అవుతాయని తెలంగాణ యూత్ వెయిట్ చేస్తోందన్నారు. యూత్ పాలిటిక్స్ లోకి వచ్చి ప్రశ్నించాలని, చాన్స్ ఇస్తే పోటీకి రెడీ అని చెప్పారు.

MPలు ఏం మాట్లాడినా పర్లేదా- అభిజీత్ దీప్కే
Politics· 31 Jul 2026

MPలు ఏం మాట్లాడినా పర్లేదా- అభిజీత్ దీప్కే

సోషల్ మీడియాలో మహిళలను దారుణంగా బూతులు తిడుతున్న IT cell సభ్యులపై కూడా FIRలు నమోదు చేస్తారా అని <a href="https://x.com/abhijeet_dipke/status/2083183749668196558?s=20">అభిజీత్</a> దీప్కే ప్రశ్నించారు. ఆన్‌లైన్‌లో తిట్టినందుకు ఒక అమ్మాయిపై కేసు పెట్టడంపై స్పందిస్తూ, తిట్టడం తప్పే కావచ్చు కానీ కేసు బుక్ చేయడం ఏంటని ఆయన అన్నారు. ఒకవేళ తిట్టినందుకు కేసులు పెడితే, ఏళ్ల తరబడి ఆన్‌లైన్‌లో మహిళలను బూతులు తిడుతున్న BJP IT cell మెంబర్స్, అలాగే పార్లమెంట్‌లోనూ అసభ్యంగా మాట్లాడిన నాయకులపై కూడా కేసులు పెట్టాలని అభిజీత్ డిమాండ్ చేశారు.

షర్టు జేబు ఎడమవైపే ఎందుకు ఉంటుందో తెలుసా?
General· 31 Jul 2026

షర్టు జేబు ఎడమవైపే ఎందుకు ఉంటుందో తెలుసా?

మనం రోజూ వేసుకునే షర్టుల్లో ఓ కామన్ విషయం ఎప్పుడైనా గమనించారా? దాదాపు అన్ని షర్టుల్లో జేబు ఎడమవైపే ఉంటుంది. ఇది కేవలం డిజైన్ కోసం కాదు. దీని వెనక ఓ ఇంట్రెస్టింగ్ రీజన్ ఉంది. ప్రపంచంలో 85-90% మంది కుడిచేతితోనే పనులు చేస్తారు. అందుకే షర్టు జేబును ఎడమవైపు పెడితే, కుడిచేతితో అందులో ఉన్న పెన్, డబ్బులు, ఐడీ కార్డ్ లాంటి వాటిని ఈజీగా తీసుకోవచ్చు. ఇదే డిజైన్ తర్వాత స్టాండర్డ్‌గా మారిపోయి, ఇప్పటికీ చాలా షర్టుల్లో అలాగే కొనసాగుతోంది.

సాయం చేయబోయి.. పెద్ద తప్పు చేశారు!
Viral· 31 Jul 2026

సాయం చేయబోయి.. పెద్ద తప్పు చేశారు!

మధ్యప్రదేశ్‌లో ఓ టీచర్ ఎండ ఎక్కువగా ఉండటంతో స్కూటీపై వెళ్తుండగా ఒక్కసారిగా తల తిరిగి కిందపడిపోయింది. అది చూసిన ఇద్దరు యువకులు గుండెపోటు వచ్చిందనుకుని వెంటనే CPR ఇవ్వడం మొదలుపెట్టారు. కానీ డాక్టర్లు చెక్ చేసిన తర్వాత అసలు విషయం బయటపడింది. ఆమెకు గుండెపోటు రాలేదని, ఎండ వల్లే స్పృహ తప్పిందని చెప్పారు. పైగా అవసరం లేకుండా చేసిన CPR వల్ల రెండు పక్కటెముకలు విరిగినట్లు తెలిపారు. అందుకే ఎవరైనా పడిపోతే వెంటనే CPR చేయడం కాదు.. ముందు అసలు పరిస్థితి ఏంటో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.

కేసులు పెట్టి లైఫ్ పాడుచేయకండి!
Politics· 31 Jul 2026

కేసులు పెట్టి లైఫ్ పాడుచేయకండి!

పిల్లల విషయంలో ప్రభుత్వం, పోలీసులు దయతో నడుచుకోవాలని నటుడు ప్రకాష్ రాజ్ కోరారు. పిల్లలు పెద్దలను తప్పుగా మాట్లాడినా హెచ్చరించి వదిలేయాలి తప్ప, క్రిమినల్ కేసులు పెట్టి వేధించకూడదని సూచించారు. కేసులు పెట్టడం వల్ల వారి లైఫ్, కెరీర్ పాడవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులు చేస్తే సరిదిద్దాలని, పవర్ ఉందనే ఉద్దేశంతో వారి భవిష్యత్తును నాశనం చేయకూడదని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేశారు.

మైండ్ బ్లాకింగ్ డ్యాన్స్!
Entertainment· 31 Jul 2026

మైండ్ బ్లాకింగ్ డ్యాన్స్!

విజయనగరం జిల్లా భోగాపురంలో గిరిజన కళాకారులు చరిత్ర సృష్టించారు. దాదాపు 13 వేల మంది గిరిజన బాలికలు ఒక్కసారిగా థింసా నృత్యం చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. గిన్నిస్ ప్రతినిధులు ఈ డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌ను స్వయంగా పరిశీలించి రికార్డ్ కన్ఫర్మ్ చేయగా, మంత్రి సంధ్యారాణి ఆ అవార్డును అందుకున్నారు. ఆమె కూడా గిరిజన బాలికలతో కలిసి డ్యాన్స్ చేయడం విశేషం. అంతేకాదు, రేపు ఏపీకి రానున్న ప్రధాని మోదీకి ఇదే థింసా నృత్యంతో గ్రాండ్ వెల్‌కమ్ చెప్పడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం
Politics· 31 Jul 2026

తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ ఆవిర్భావం

తెలంగాణ రక్షణ సేన (TRS) ఆధ్వర్యంలో తెలంగాణ రక్షణ ట్రేడ్ యూనియన్ (TRTU) ఆవిర్భవించింది. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో TRTU లోగోను పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని కోటిన్నర మంది కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం TRTU ఉద్యమిస్తుందని ఆమె స్పష్టం చేశారు. కార్మికుల సమస్యలపై పోరాటం చేయడమే ట్రేడ్ యూనియన్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

వరుసగా గాయపడుతున్న టాలీవుడ్ స్టార్స్!
Cinema· 31 Jul 2026

వరుసగా గాయపడుతున్న టాలీవుడ్ స్టార్స్!

టాలీవుడ్ స్టార్స్ వరుసగా గాయపడటం ఇప్పుడు హాట్ టాపిక్. రీసెంట్ గా హీరోయిన్ రష్మిక సాంగ్ షూట్ డాన్స్ లో గాయపడటంతో డాక్టర్లు 6 వీక్స్ రెస్ట్ తీసుకోమని చెప్పారు. దీంతో ఆమె నటిస్తున్న రణబాలి, మైసా సినిమాల షూటింగ్స్ డిలే అయ్యే ఛాన్స్ ఉంది. మరోవైపు బాలకృష్ణ, NTR, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కూడా రీసెంట్ గా గాయపడి ట్రీట్మెంట్ తీసుకున్నారు. హీరోల ఇంజ్యురీస్ వల్ల ఈ బిగ్ మూవీస్ రిలీజ్ మరింత లేట్ అయ్యేలా ఉంది.

₹900 కోట్ల సినిమా కాపీ మిస్సింగ్?
World· 31 Jul 2026

₹900 కోట్ల సినిమా కాపీ మిస్సింగ్?

రిలీజ్ కాకముందే సినిమా కాపీ మాయమైతే..? అదే ఇప్పుడు Netflixను కోర్టు వరకు తీసుకెళ్లింది. Nicolas Cage నటించిన 'Fortitude' సినిమా అన్‌ఎన్‌క్రిప్టెడ్ డిజిటల్ కాపీ Netflix వద్ద నుంచి కనిపించకుండా పోయిందని నిర్మాతలు ఆరోపిస్తున్నారు. దీంతో సినిమా మార్కెట్ విలువ దెబ్బతిన్నట్లు చెబుతూ $105 మిలియన్ (సుమారు ₹900 కోట్లు) పరిహారం కోరుతూ కేసు వేశారు. అయితే ఈ ఆరోపణలను Netflix ఖండించింది. సినిమా కాపీని అవసరమైన సెక్యూరిటీ లేకుండానే నిర్మాతలే అందించారని, తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సంస్థ తెలిపింది.

గోదావరి పుష్కరాలకు ముహూర్తం కన్‌ఫర్మ్
Infotainment· 31 Jul 2026

గోదావరి పుష్కరాలకు ముహూర్తం కన్‌ఫర్మ్

AP: పవిత్ర గోదావరి నదీ పుష్కరాల నిర్వహణకు ముహూర్తం కన్‌ఫర్మ్ అయ్యింది. 2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు మొత్తం 12 రోజుల పాటు గోదావరి పుష్కరాలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ముహూర్తానికి సంబంధించి టీటీడీ ఆస్థాన పండితులు ఏపీ దేవాదాయశాఖ కమిషనర్‌కు వివరాలు అందజేశారు. వాటిని పరిశీలించిన ప్రభుత్వం పుష్కరాల తేదీలను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది. గోదావరి పుష్కరాల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

తొలిసారి ఐటమ్ సాంగ్‌లో కీర్తి సురేష్!
Cinema· 31 Jul 2026

తొలిసారి ఐటమ్ సాంగ్‌లో కీర్తి సురేష్!

నాని హీరోగా నటిస్తున్న 'ది పారడైస్' సినిమాలో కీర్తి సురేష్ స్పెషల్ సాంగ్‌లో కనిపించనున్నట్లు టాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి.నానితో ఉన్న మంచి స్నేహం, 'నేను లోకల్', 'దసరా' వంటి హిట్ చిత్రాల అనుబంధం వల్లే కీర్తి ఈ ఆఫర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. సుమారు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో ఈ పాటను గ్రాండ్‌గా చిత్రీకరిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది.

AP, కర్ణాటకలో రేపే మోడీ టూర్?
Politics· 31 Jul 2026

AP, కర్ణాటకలో రేపే మోడీ టూర్?

రేపు ఆగస్ట్ 1న ప్రధాని నరేంద్ర మోడీ AP, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్, రీసెర్చ్, కల్చర్ రంగాలకు చెందిన ఇంపార్టెంట్ ప్రోగ్రామ్స్‌లో ఆయన జాయిన్ కాబోతున్నారు. ట్రెడిషన్స్‌ని కాపాడుకుంటూనే, యూత్‌కి మంచి ఆపర్చ్యునిటీస్ క్రియేట్ చేయడానికి ఇవి హెల్ప్ అవుతాయని, 'వికసిత్ భారత్' వైపు ఇదొక బిగ్ స్టెప్ అని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

కమిషనర్‌ను వీలైనంత త్వరగా ట్రాస్ఫర్ చేయండి: హైకోర్టు
Legal· 31 Jul 2026

కమిషనర్‌ను వీలైనంత త్వరగా ట్రాస్ఫర్ చేయండి: హైకోర్టు

TG: హైడ్రాకు సంబంధించిన శాంతా శ్రీరామ్ కంపెనీ కేసులో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన జరిగిందని, వివాదాస్పద భూమిలో హైడ్రా చేపట్టిన చర్యలు చట్టవిరుద్ధమని కోర్టు స్పష్టం చేసింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను వీలైనంత త్వరగా బదిలీ చేసి, ఆయన స్థానంలో మరో అధికారిని నియమించాలని సీఎస్‌ను హైకోర్టు ఆదేశించింది. చట్టబద్ధమైన పాలనే కొనసాగాలని, వ్యక్తుల పాలన కాదని గుర్తు చేసింది. వ్యక్తుల ఆధిపత్యం కొనసాగితే అది ప్రజాస్వామ్యానికి మరణశాసనంగా మారుతుందని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

F-47 ఫైటర్ జెట్‌కి గ్రీన్ సిగ్నల్
World· 31 Jul 2026

F-47 ఫైటర్ జెట్‌కి గ్రీన్ సిగ్నల్

అమెరికా ఎయిర్ ఫోర్స్ అభివృద్ధి చేస్తున్న 6వ తరం F-47 ఫైటర్ జెట్ ప్రోగ్రామ్ కీలక దశలోకి అడుగుపెట్టింది. ప్రస్తుతం Engineering &amp; Manufacturing Development (EMD) దశ ప్రారంభమైందని అధికారులు తెలిపారు. ఈ దశలో కొన్ని టెస్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లు తయారు చేసి పరీక్షలు నిర్వహించనున్నారు. తొలి F-47 2028లో ఆకాశంలోకి ఎగరనుందని ఎయిర్ ఫోర్స్ వెల్లడించింది. ప్రస్తుతం ఉన్న F-22 Raptor స్థానంలో కనీసం 185 F-47 జెట్లు కొనుగోలు చేయాలని అమెరికా ప్లాన్ వేసింది.

తల్లిపాలు: అమృతంతో సమానం..
Health· 31 Jul 2026

తల్లిపాలు: అమృతంతో సమానం..

తల్లిపాలు పట్టడం బిడ్డలకు, తల్లులకు ఎంతో ఆరోగ్యదాయకం, అలాగే ప్రాణ రక్షణ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ (WHO)తెలిపింది. బిడ్డ పుట్టిన మొదటి 6 నెలల పాటు శరీరానికి అవసరమైన అన్ని పోషకాలను తల్లిపాలు అందిస్తాయి. విరోచనాలు, న్యూమోనియా వంటి తీవ్రమైన వ్యాధుల నుండి కాపాడే శక్తివంతమైన ప్రోటీన్లు వీటిలో ఉంటాయి. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఊబకాయం, దీర్ఘకాలిక రోగాలు వచ్చే ప్రమాదం తగ్గడమే కాకుండా వారు ఐక్యూ పరీక్షల్లోనూ, తెలివితేటల్లోనూ మెరుగ్గా ఉంటారు.

మొరాకో నుంచి వేలాది మంది జనం..ఎందుకంటే!
World· 31 Jul 2026

మొరాకో నుంచి వేలాది మంది జనం..ఎందుకంటే!

ఒకేసారి మన ఊరికి వందలమంది వలసదారులు వస్తే ఎలా ఉంటుంది? ప్రస్తుతం అలాంటి పరిస్థితిలోనే ఉంది ఉత్తర ఆఫ్రికా ఎన్‌క్లేవ్ అయిన సియుటా. మొరాకో నుంచి వేలాది మంది ఇక్కడికి వస్తున్నారు. ఆర్థిక, రాజకీయ సంక్షోభాల కారణంగా మొరాకోను విడిచి, సముద్రంలో ఈదుతూ సరిహద్దు దాటి వస్తున్నారు. ఒక్క రోజులో పెద్ద సంఖ్యలో జనం రావడంతో రిసెప్షన్ సెంటర్లు నిండిపోయాయి. వందలాది మంది వీధుల్లో, పార్కుల్లో నిద్రపోయారు. స్పెయిన్ మొరాకో మధ్య సియుటా-మెలిల్లా ఎన్‌క్లేవ్‌లు, పశ్చిమ సహారా లాంటి అంశాలు ఉద్రిక్తతలకు కారణమవుతున్నాయి.

కన్న కూతురిపై తండ్రి దారుణం
Crime· 31 Jul 2026

కన్న కూతురిపై తండ్రి దారుణం

TG: వికారాబాద్ జిల్లాలో కన్న తండ్రే దారుణానికి ఒడిగట్టాడు. 9వ తరగతి చదువుతున్న తన కూతురిపై అత్యాచారం చేశాడు. ఫోన్‌లో అసభ్యకరమైన వీడియోలు చూపిస్తూ కొంతకాలంగా ఈ అరాచకానికి పాల్పడుతున్నాడు. అమ్మాయి స్కూల్‌లో ఇబ్బంది పడుతుండటంతో టీచర్లు అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడటంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు నిందితుడిని పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు.

CM విజయ్‌తో మీటింగ్ క్యాన్సిల్- కర్ణాటక CM
Politics· 31 Jul 2026

CM విజయ్‌తో మీటింగ్ క్యాన్సిల్- కర్ణాటక CM

తమిళనాడుకు కావేరి నీటిని విడుదల చేయాలన్న CWMI ఆదేశాలపై కర్ణాటకలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో ఆగస్టు 3న జరగాల్సిన మీటింగ్ ని వాయిదా వేసుకోవాలని తమిళనాడు CM విజయ్‌ని DK శివకుమార్ కోరారు. ఇరు రాష్ట్రాల మధ్య శాంతియుత వాతావరణం ఏర్పడ్డాకే సమన్వయంతో చర్చలు జరుపుతామని తెలిపారు. చట్టాన్ని గౌరవిస్తూ రాష్ట్రంలో ఎలాంటి బంద్‌లు నిర్వహించవద్దని, శాంతిభద్రతలను కాపాడాలని ఈ సందర్భంగా DK శివకుమార్ విజ్ఞప్తి చేశారు.

'సర్దార్ 2' రిలీజ్ డేట్‌పై సందేహాలకు చెక్..
Cinema· 31 Jul 2026

'సర్దార్ 2' రిలీజ్ డేట్‌పై సందేహాలకు చెక్..

కోలీవుడ్ స్టార్ కార్తీ హీరోగా పి.ఎస్. మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న క్రేజీ స్పై థ్రిల్లర్ 'సర్దార్ 2'. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 10న విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఇటీవల విడుదల చేసిన కొత్త పోస్టర్‌లో తేదీ ప్రస్తావించకపోవడంతో సినిమా వాయిదా పడుతోందనే ప్రచారం జరిగింది. ఎలాంటి మార్పూ లేదని స్పష్టం చేస్తూ, త్వరలోనే అప్‌డేట్‌తో రాబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో రిలీజ్ డేట్‌పై ఉన్న సందేహాలన్నింటికీ పుల్‌స్టాప్ పడింది.

తెలంగాణ SIRలో 40 లక్షల ఓట్లు మిస్?
Politics· 31 Jul 2026

తెలంగాణ SIRలో 40 లక్షల ఓట్లు మిస్?

TG: తెలంగాణలో జరుగుతున్న SIR ప్రక్రియలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 40 లక్షల ఓట్లను అన్‌కలెక్టబుల్ ఓట్లుగా గుర్తించామని అధికారులు తెలిపారు. వాటిని ఓటర్ల లిస్ట్ నుంచి తొలగించే ప్రక్రియపై ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 76.72 శాతం మంది ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తైనట్లు అధికారులు తెలిపారు. దీంతో ఈ అంశంపై రాజకీయ పార్టీలు సందేహాలు వ్యక్తం చేస్తున్నాయి.