Latest
రోడ్లపై మోటర్లతో నీళ్లు తోడాల్సిన పరిస్థితి
TG: హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్ పరిసరాల్లో భారీగా వరద నీరు నిలిచిపోవడంతో రోడ్లు చెరువులను తలపించాయి. నీటిని మోటర్ల సహాయంతో బయటకు పంపాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకుని తీవ్ర ఇబ్బందులు పడ్డారు. 2018లో ప్రారంభమైన ఉప్పల్–నారపల్లి ఫ్లైఓవర్ పనులు ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో ప్రతి వర్షానికి ఇదే పరిస్థితి రిపీట్ అవుతుందని స్థానికులు, వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బస్టాండ్ పక్కనే వైన్ షాపులు.. ఐద్వా ఆగ్రహం
AP: తిరుపతి జిల్లా రేణిగుంటలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు మద్యం దుకాణాలను వెంటనే తొలగించాలని ఐద్వా మండల కమిటీ డిమాండ్ చేసింది. RTC బస్టాండ్, రైల్వేస్టేషన్, పాఠశాలలు, దేవాలయాలు, జనావాసాలకు సమీపంలో ఈ వైన్ షాపులు ఉండటం ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంది. గతంలో ప్రజల అభ్యంతరాలతో తొలగించిన ప్రాంతాల్లోనే మళ్లీ దుకాణాలు ఏర్పాటు చేయడం సరి కాదన్నారు. మహిళల భద్రత, చిన్నారుల రక్షణ దృష్ట్యా వెంటనే చర్యలు తీసుకోవాలని CIకి వినతిపత్రం అందజేశారు. సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

ప్రతి భారతీయుడూ గర్వపడాలి: రాహుల్ గాంధీ
దిల్లీలో జరిగిన CJP ఉద్యమం గురించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. ఈ దేశ విద్యార్థులు వీధుల్లో చేసిన పని చూసి చాలా ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో ఉన్నానని అన్నారు. పబ్లిక్ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది ఈ దేశ యువత ఎక్స్‌ప్రెషన్ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు దీన్ని గౌరవించాలన్నారు. ఈ దేశ యువత చేసిన పనికి ప్రతి భారతీయుడూ గర్వపడాలన్నారు.

హిందూ మహాసముద్రంలో SPACE X స్టార్‌షిప్
SPACE X పంపిన స్టార్‌షిప్ స్పేస్ క్రాఫ్ట్ ఇప్పుడు హిందూ మహాసముద్రంలో తేలుతోంది. అదుపుతప్పి సముద్రంలో పడినా సురక్షితంగానే ఉంది. దీన్ని వెనక్కి తెచ్చేందుకు ఒక నౌక పంపుతున్నామని ఎలాన్ మస్క్ చెప్పారు. అంతరిక్షం నుంచి భూమికి వచ్చేటప్పుడు ఎదురయ్యే వేడిని, ఒత్తిడిని ఈ నౌక ఎలా తట్టుకుందో సైన్టిస్టులు పరిశీలించేందుకు రికవరీ టీమ్ అక్కడికి వెళ్ళింది. ఈ స్పెస్ షిప్ మళ్లీ వాడేందుకు ఉపయోగ పడొచ్చు అని మస్క్ తెలిపారు.

అస్సాంలో వరదలు.. 75కు చేరిన మృతుల సంఖ్య
అస్సాంలో వరదల కారణంగా గత 24 గంటల్లో మరో ఏడుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 75కు చేరింది. ప్రస్తుతం ఏడు జిల్లాల్లో 3.32 లక్షల మంది వరదల ప్రభావానికి గురైనట్లు అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) వెల్లడించింది. మృతుల కుటుంబాలకు ఇచ్చే ఎక్స్‌గ్రేషియా సాయాన్ని రూ.9 లక్షలకు పెంచినట్లు తెలిపారు. రాష్ట్రంలో 81 సహాయక శిబిరాల్లో 32,477 మంది నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించారు. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, NDRF, SDRFతో పాటు ఇతర బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
మహిళ కోసం.. డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?
బస్సులో ఓ మహిళ "సేవ్ చేయండి" అని అరిచిన వెంటనే.. డ్రైవర్ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. బెంగళూరులోని BMTC బస్సులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడని ఓ వ్యక్తిపై ఆరోపణలు వచ్చాయి. వెంటనే డ్రైవర్ ప్రవీణ్ బస్సు ఆపి తలుపులు మూసి.. నిందితుడిని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. ట్రాఫిక్ కారణంగా తలుపులు తెరవాల్సి రావడంతో.. నిందితుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సమయానికి స్పందిస్తే.. ఒకరి ధైర్యం చాలామందికి అండగా నిలుస్తుంది.

ఎక్కువమంది పిల్లల్ని కనాలా..వద్దా?: అరవింద్ కేజ్రీవాల్
బీజేపీ విధానాలపై దిల్లీ మాజీ మంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెటైర్ వేశారు. RSS అధ్యక్షుడు మోహన్ భాగవత్ ఎక్కువ మంది పిల్లల్ని కనమంటున్నారని.. దిల్లీ సీఎం రేఖా గుప్తా మాత్రం ప్రభుత్వం ప్రారంభించిన దిల్లీ లక్ష్మీ యోజనలో ముగ్గురు కంటే ఎక్కువమంది పిల్లలుంటే అనర్హులుగా ప్రకటిస్తున్నారని అన్నారు. ఈ విధానాలతో దిల్లీ ప్రజలు అయోమయంలో పడ్డారని కేజ్రీవాల్ తన ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. మోహన్ భాగవత్, రేఖా గుప్తా కలిసి ఒక నిర్ణయానికి వచ్చి ఏం చేయాలో చెప్పాలన్నారు.

యువత ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు: రాహుల్ గాంధీ
పబ్లిక్ పరీక్షల(అక్రమ పద్ధతుల నివారణ) సవరణ బిల్లుపై పార్లమెంట్‌లో జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. యువత సెంటిమెంట్స్‌ను అన్ని పార్టీలూ గౌరవించాలని అన్నారు. విద్యార్థుల ఆశల్ని, ఆశయాలను అందరం అర్థం చేసుకోవాలన్నారు. వారి ఆందోళనను దేశ ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టే వారికి భారీ స్థాయిలో మద్దతు పలికారని వివరించారు. యువతను తక్కువ అంచనా వేసిన వారికి విద్యార్థులు వారి పోరాటంతో సరైన పాఠం చెప్పారని అన్నారు.

మధ్యాహ్న భోజన పథకంలో చికెన్ బిర్యానీ
మధ్యాహ్న భోజన పథకంలో వారానికోసారి చికెన్ బిర్యానీ పెట్టాలని తమిళనాడు ప్రభుత్వం ఆలోచిస్తోంది. టీచర్స్ యూనియన్స్ చేసిన ఈ సూచనను CM విజయ్ పరిశీలిస్తున్నారు. చికెన్ బిర్యానీ యాడ్ చెయ్యడంతో పిల్లలకు పౌష్టికాహారం అందడంతో పాటు స్కూల్ డ్రాపౌట్స్ తగ్గుతారని భావిస్తున్నారు. 1956లో తమిళనాడు సీఎం కామరాజ్ నాడార్ మొదలు పెట్టిన ఈ పథకం వల్ల డ్రాపౌట్స్ తగ్గడంతో మే 2001 నుంచి దేశమంతా అమల్లోకి తెచ్చారు. 2021 ‘PM పోషణ్’అని పేరు మార్చారు. తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ పిల్లలకు చికెన్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుంది?

తమిళనాడులో ‘విక్రమార్కుడు’ గుండు సీన్
రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమాలోని గుండు సీన్ తమిళనాడులో జరిగింది. సేలం జిల్లా పుదుకొత్తంబాడికి చెందిన ఓ మహిళకు ఫోన్ వచ్చింది. ఎమ్మార్వో ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి, కరోనా లాంటి కొత్త వ్యాధి సోకుతోందని అవతలి వ్యక్తి చెప్పాడు. ఈ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, ఇలా గుండు గీయించుకున్న మహిళలకు ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుందన్నాడు. మహిళ ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో ముగ్గురు మహిళలు గుండు చేయించుకొని అతని ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ అని రావడంతో మోసపోయామని గ్రహించారు.

బ్యాంక్‌లోనే మోసం
TG: కామారెడ్డి జిల్లాలోని SBI బ్యాంక్‌లో మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు చాకచక్యంగా రూ.15వేల నగదును కాజేశారు. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన పూజ బ్యాంకులో నగదు లెక్కపెడుతుండగా ఇద్దరు వ్యక్తులు డబ్బులు సరిగ్గా లెక్కపెడతామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన ఆమె నగదు ఇవ్వగా, నోట్ల కట్టలో నుంచి రూ.15వేలు చాకచక్యంగా తీసేసి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత డబ్బు తక్కువగా ఉండటాన్ని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. CC ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి 'కామన్ సెన్స్' లేదు: ప్రియాంక్ ఖర్గే
కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రహ్లాద్ జోషి నుంచి పెద్ద సంస్కరణలు ఆశించడం పొరపాటేనని అన్నారు. 'ఆయన చాలాకాలంగా ఎంపీగా ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ విధానాలు, సంస్కరణను తీసుకురాలేదని' ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఆయన అండగా నిలుస్తారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించడం ఆశ్చర్యకరమని, ప్రభుత్వంలో 'కామన్ సెన్స్' లోపించిందని ప్రియాంక్ ఖర్గే అన్నారు.

అగ్గిపెట్టెతో అటెండెన్స్.. ఎలా?
ఖరీదైన స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు లేకపోయినా.. మంచి ఐడియా ఉంటే చాలు అని ఓ టీచర్ నిరూపించారు. ఢిల్లీకి చెందిన టీచర్ సుమీ సియాగ్ అగ్గిపెట్టెలతో ఓ యూనిక్ Attendance Board తయారు చేశారు. ప్రతి స్టూడెంట్ ఫొటోతో ఒక అగ్గిపెట్టె ఉంటుంది. స్కూల్‌కు రాగానే వాళ్లు తమ అగ్గిపెట్టెను స్లైడ్ చేస్తే.. 'A' (Absent) నుంచి 'P' (Present)కి మారిపోతుంది. ఇలా పిల్లలే తమ అటెండెన్స్‌ను వాళ్లే మార్క్ చేసుకుంటున్నారు. ఈ చిన్న ఐడియా వల్ల బాధ్యత, సెల్ఫ్ డిసిప్లిన్ కూడా అలవాటవుతుందని చెబుతున్నారు.

CWGలో గుల్వీర్ సింగ్‌కు వెండి పతకం
CWGలో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్ 10,000 మీటర్ల లాంగ్ డిస్టెన్స్ రేస్‌లో వెండి పతకం సాధించారు. చివరి 2 ల్యాప్స్‌లో టఫ్ ఫైట్ ఇచ్చి పతకం సొంతం చేసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈ ఈవెంట్‌లో ఇండియాకు మెడల్ రావడం విశేషం. "గోల్డ్ మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం కచ్చితంగా సాధిస్తాను" అని గుల్వీర్ వివరించారు. ఆయన పెర్ఫార్మెన్స్ యువ రన్నర్స్‌కు స్ఫూర్తిగా నిలుస్తోంది.

హీరో రిషబ్ శెట్టికి అరుదైన అవార్డు
'కాంతార' సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్న కన్నడ 'హీరో రిషబ్ శెట్టి'కి ఒక అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సాంస్కృతిక కథలను ప్రపంచానికి తెలిసేలా చేసినందుకు 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్' వాళ్లు ఆయనకు 'లీడర్షిప్ ఇన్ సినిమా' అనే అవార్డును ప్రకటించారు. వచ్చే ఆగస్టు 13వ తేదీన ఈ అవార్డును తీసుకోనున్నారు.

చివరి ప్రయాణానికీ దారి లేదు
AP: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు తూర్పుపేటలో స్మశానానికి వెళ్లేందుకు సరైన రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మృతదేహాలను పొలాల గట్లు, బురద మార్గాల మీదుగా మోసుకెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి అంత్యక్రియలు నిర్వహించడం కష్టంగా మారిందన్నారు. నిన్న ఓ వ్యక్తి చనిపోవడంతో పొలాల్లోకి దిగి తీసుకెళ్లారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు.

స్పెషల్ ఒలింపిక్స్ భారత్‌కు వరుసగా మూడో పతకం
స్వీడన్‌లో జరిగిన గోథియా కప్‌లో స్పెషల్ ఒలింపిక్స్ భారత ఫుట్‌బాల్ టీం బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఇది వరుసగా 3వ ఇంటర్నేషనల్ ట్రోఫీ. టోర్నీ టీం చూపించిన డిసిప్లిన్, టీం వర్క్, నమ్మకం కారణంగా ఈ విజయం సాధ్యమైందని హెడ్ కోచ్ ప్లేయర్ల కష్టాన్ని ప్రశంసించారు. ప్రతి మెడల్ వెనుక కన్నీళ్లు, కష్టం ఉంటాయని ఆయన చెప్పారు. SKF ఇండియా సపోర్ట్‌తో ఈ విజయం సాధ్యమైంది. ఈ పతకం ఇంక్లూజన్ స్పోర్ట్స్‌కు పెద్ద ప్రేరణ.

పోలీసుల విచారణలో తమ్మినేని
AP: శ్రీకాకుళంలో రూ 4 కోట్ల విలువైన భూమి కేసులో మాజీ స్పీకర్ 'తమ్మినేని సీతారాం' పోలీసుల విచారణకు వచ్చారు. బతికున్న భూమి ఓనర్ చనిపోయినట్లు దొంగ పత్రాలు సృష్టించి ఓ మహిళను వారసురాలిగా తీసుకొచ్చి కబ్జాకు ప్లాన్ చేశారు అని పోలీసుల ఆరోపించారు. ఈ కేసులో ఆయన భార్య వాణి, కొడుకు నాగ్ కూడా నిందితులుగా ఉన్నారు. ఈ విషయం బయటపడగానే ఇల్లు వదిలేసి కారులో పారిపోయారు. చివరకు బుధవారం ఉదయం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ముందుకు వచ్చారు

తిరుపతి ఫ్లైట్ టికెట్ల ధరలకు రెక్కలు
AP: హైదరాబాద్–తిరుపతి విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. గంట ప్రయాణానికి రూ.5,700 నుంచి చివరి నిమిషంలో రూ.24 వేల వరకు వసూలు చేస్తున్నారు. దింతో భక్తులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో లభించే శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లకు ఉన్న అధిక డిమాండ్ వల్లే ఈ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఉదయం పూట విమానాల్లో వచ్చేవారికి ఈ టికెట్లు సులభంగా లభిస్తుండటంతో ఎయిర్‌లైన్స్ అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

వర్షాల వేళ జలమండలి యాక్షన్
TG: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి MD అశోక్ రెడ్డి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాలు, హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వరద నీటి తొలగింపు, సీవరేజీ ఓవర్‌ఫ్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తాగునీటి నాణ్యతను నిరంతరం పరీక్షిస్తూ కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల భద్రతను కాపాడాలని సూచించారు. <br>వరద ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా, GHMC, పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

తన ప్రాణం వదిలి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
AP: తన ప్రాణం వదిలి ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. మార్కాపురం జిల్లా కాకర్లకు చెందిన లీలమ్మ(40) చాలా ఏళ్లకు గర్భవతి అయింది. మూడో నెలలో ఆమెకు గుండె సమస్య ఉందని తెలిసింది. తల్లీబిడ్డల్లో ఒకరినే కాపాడగలమని డాక్టర్లు చెప్పగా, తన ప్రాణం పోయినా సరే బిడ్డను బతికించాలని లీలమ్మ భర్తతో సంతకం చేయించింది. ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. పుట్టిన బాబుని కళ్లారా చూడకుండానే తల్లి కన్నుమూసింది.