Latest

చివరి ప్రయాణానికీ దారి లేదు
AP: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు తూర్పుపేటలో స్మశానానికి వెళ్లేందుకు సరైన రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మృతదేహాలను పొలాల గట్లు, బురద మార్గాల మీదుగా మోసుకెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి అంత్యక్రియలు నిర్వహించడం కష్టంగా మారిందన్నారు. నిన్న ఓ వ్యక్తి చనిపోవడంతో పొలాల్లోకి దిగి తీసుకెళ్లారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు.

స్పెషల్ ఒలింపిక్స్ భారత్‌కు వరుసగా మూడో పతకం
స్వీడన్‌లో జరిగిన గోథియా కప్‌లో స్పెషల్ ఒలింపిక్స్ భారత ఫుట్‌బాల్ టీం బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఇది వరుసగా 3వ ఇంటర్నేషనల్ ట్రోఫీ. టోర్నీ టీం చూపించిన డిసిప్లిన్, టీం వర్క్, నమ్మకం కారణంగా ఈ విజయం సాధ్యమైందని హెడ్ కోచ్ ప్లేయర్ల కష్టాన్ని ప్రశంసించారు. ప్రతి మెడల్ వెనుక కన్నీళ్లు, కష్టం ఉంటాయని ఆయన చెప్పారు. SKF ఇండియా సపోర్ట్‌తో ఈ విజయం సాధ్యమైంది. ఈ పతకం ఇంక్లూజన్ స్పోర్ట్స్‌కు పెద్ద ప్రేరణ.

పోలీసుల విచారణలో తమ్మినేని
AP: శ్రీకాకుళంలో రూ 4 కోట్ల విలువైన భూమి కేసులో మాజీ స్పీకర్ 'తమ్మినేని సీతారాం' పోలీసుల విచారణకు వచ్చారు. బతికున్న భూమి ఓనర్ చనిపోయినట్లు దొంగ పత్రాలు సృష్టించి ఓ మహిళను వారసురాలిగా తీసుకొచ్చి కబ్జాకు ప్లాన్ చేశారు అని పోలీసుల ఆరోపించారు. ఈ కేసులో ఆయన భార్య వాణి, కొడుకు నాగ్ కూడా నిందితులుగా ఉన్నారు. ఈ విషయం బయటపడగానే ఇల్లు వదిలేసి కారులో పారిపోయారు. చివరకు బుధవారం ఉదయం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ముందుకు వచ్చారు

తిరుపతి ఫ్లైట్ టికెట్ల ధరలకు రెక్కలు
AP: హైదరాబాద్–తిరుపతి విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. గంట ప్రయాణానికి రూ.5,700 నుంచి చివరి నిమిషంలో రూ.24 వేల వరకు వసూలు చేస్తున్నారు. దింతో భక్తులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో లభించే శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లకు ఉన్న అధిక డిమాండ్ వల్లే ఈ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఉదయం పూట విమానాల్లో వచ్చేవారికి ఈ టికెట్లు సులభంగా లభిస్తుండటంతో ఎయిర్‌లైన్స్ అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

వర్షాల వేళ జలమండలి యాక్షన్
TG: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి MD అశోక్ రెడ్డి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాలు, హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వరద నీటి తొలగింపు, సీవరేజీ ఓవర్‌ఫ్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తాగునీటి నాణ్యతను నిరంతరం పరీక్షిస్తూ కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల భద్రతను కాపాడాలని సూచించారు. <br>వరద ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా, GHMC, పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

తన ప్రాణం వదిలి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
AP: తన ప్రాణం వదిలి ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. మార్కాపురం జిల్లా కాకర్లకు చెందిన లీలమ్మ(40) చాలా ఏళ్లకు గర్భవతి అయింది. మూడో నెలలో ఆమెకు గుండె సమస్య ఉందని తెలిసింది. తల్లీబిడ్డల్లో ఒకరినే కాపాడగలమని డాక్టర్లు చెప్పగా, తన ప్రాణం పోయినా సరే బిడ్డను బతికించాలని లీలమ్మ భర్తతో సంతకం చేయించింది. ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. పుట్టిన బాబుని కళ్లారా చూడకుండానే తల్లి కన్నుమూసింది.

మెరిటోక్రసీ (Meritocracy) అంటే ఏంటో తెలుసా?
దేశంలో ‘రిజర్వేషన్స్ హటావో’ అనే ఆన్‌లైన్ మూమెంట్ కొనసాగుతోంది. దేశంలో రిజర్వేషన్లు ఉండొద్దని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఈ మూమెంట్ కోరుతోంది. ఈ సమయంలో ‘మెరిటోక్రసీ(Meritocracy)’ అనే పదం వైరల్ అవుతోంది. వ్యక్తులు వారి సామర్థ్యం, నైపుణ్యం, కృషి, విద్య, పనితీరు ఆధారంగా గుర్తింపు, పదవులు పొందడాన్ని ‘మెరిటోక్రసీ’ అంటారు. డబ్బు, కులం, వంశం, సామాజిక స్థాయి, రాజకీయ సంబంధాలతో సంబంధం లేనిదే ఈ మెరిటోక్రసీ.

పుస్తకాలు కూడా మాట్లాడతాయా..?
ఒక పుస్తకం చదువుతుంటే.. "ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు చేశాడు?" అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఇక నుంచి గూగుల్‌లో వెతకాల్సిన అవసరం లేకపోవచ్చు. కొత్తగా వస్తున్న AI Book Companion టూల్స్‌తో పుస్తకాన్నే నేరుగా ప్రశ్నించొచ్చు. క్యారెక్టర్ల గురించి, కథలోని సంఘటనలు, హిస్టరీ లేదా కష్టమైన కాన్సెప్ట్స్ గురించి అడిగితే.. అదే పుస్తకంలోని సమాచారంతో AI సమాధానం చెబుతుంది. ఇప్పటికే Amazon Kindle, Audible, ElevenLabs లాంటి కంపెనీలు ఇలాంటి ఫీచర్లను తీసుకొచ్చాయి. ఇక డౌట్ వస్తే.. పుస్తకమే మీతో మాట్లాడుతుంది.

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
TG: భారీ వర్షాలు కురుస్తుండడంతో మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులు నీటమునిగిపోయాయి. బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత, రవాణా పూర్తిగా నిలిచిపోయింది. శ్రీరాంపూర్ OCP–1, OCP–2, రామకృష్ణాపూర్ OCP, కైరిగూడ ఓసీపీ గనుల్లో వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి, వెలికితీత, బొగ్గు రవాణా పనులు నిలిచిపోయాయి. గనుల్లోని భారీ డంపర్లు, ఎక్స్‌కవేటర్లు, వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్షాలు తగ్గిన తర్వాత నీటిని తొలగించి భద్రతా తనిఖీల అనంతరం కార్యకలాపాలను పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

అనహత్ సింగ్ క్రియేట్ చేసిన స్క్వాష్ హిస్టరీ
ఇండియన్ స్క్వాష్‌లో కొత్త చరిత్ర రాసింది అనహత్ సింగ్. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ గెలిచిన మొదటి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థిని స్ట్రెయిట్ సెట్స్‌లో చిత్తు చేసింది. 18 ఏళ్ల వయసులోనే ఇంత పెద్ద టైటిల్ గెలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఆటలో స్పీడ్, ఫోకస్, స్టామినా అద్భుతం అంటూ అందరూ పొగుడుతున్నారు. "ఇది స్టార్టింగ్ మాత్రమే.. నా కల ఒలింపిక్ గోల్డ్ మెడల్" అంటోంది అనహత్.

సింహాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
AP: సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో వార్షిక గిరి ప్రదక్షిణ ఈరోజు ప్రారంభమైంది. 32 కిలోమీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ గిరి ప్రదక్షిణకు దాదాపు 8 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. కొండపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి నిరాకరించారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈరోజు, రేపు ఆర్జిత సేవలను రద్దు చేసి, జిల్లాలోని 221 విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

భారత్‌పై అమెరికా 100% టారిఫ్..?
అమెరికా ఇప్పుడు భారత్‌పై 100% టారిఫ్ వేయబోతోందా? ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తోంది. అమెరికా సెనేట్ తాజాగా ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం.. రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు టారిఫ్ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇవ్వొచ్చు. ఆ జాబితాలో భారత్, చైనా కూడా ఉన్నాయి. అయితే ఇది వెంటనే అమల్లోకి వచ్చే నిర్ణయం కాదు. ఈ బిల్లు ఇంకా US House ఆమోదం పొందాలి. ఆ తర్వాతే ట్రంప్ సంతకం చేస్తే ఇది చట్టంగా మారే అవకాశం ఉంది.

మీరాబాయి చాను గోల్డ్ హ్యాట్రిక్
CWG 2026లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్ వచ్చింది. స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 48 కేజీల కేటగిరీలో టాప్ ప్లేస్ సాధించారు. ఇది ఆమె కామన్వెల్త్‌లో సాధించిన మూడో గోల్డ్ మెడల్. పోటీలో మీరాబాయి చేసిన ప్రతి లిఫ్ట్‌కు స్టేడియం చప్పట్లతో దద్దరిల్లింది. "దేశం కోసం ఆడటమే నా లక్ష్యం" అని మెడల్ తీసుకున్నాక ఆమె వివరించారు. మీరాబాయి ఒలింపిక్స్‌లోనూ రాణించాలని అందరూ కోరుకుంటున్నారు.

తోటి విద్యార్థినితో పోల్చినందుకు ఆత్మహత్య
TG: గద్వాల దగ్గర కొత్తపల్లిలో ఇంటర్ చదువుతున్న తరుణ్ (18) అనే స్టూడెంట్ ఉరేసుకుని చనిపోయాడు. ఫస్టియర్‌లో అతనికి 434 మార్కులు రాగా, క్లాసులో మరో అమ్మాయికి 435 మార్కులు వచ్చాయి. దీంతో ఓ టీచర్ రోజూ ఆ అమ్మాయిని మెచ్చుకుంటూ, తనను అందరి ముందు తక్కువ చేసి మాట్లాడిందని తరుణ్ బాధపడ్డాడు. రెండు రోజుల క్రితం టీచర్‌తో గొడవపడి, కాలేజీకి వెళ్లడం మానేసి, మంగళవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

కోర్టుకు వెళ్లకుండానే కేసు డిస్పోజ్
TG: "డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పడిందా? డబ్బులిస్తే అంతా మేం చూసుకుంటాం" కొందరు కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల స్కెచ్ ఇది. రూ.15 వేల లంచం తీసుకుని, ముద్దాయి కోర్టు ముఖం కూడా చూడకుండానే కేసు డిస్పోజ్ చేసేశారు. 2025 జనవరి నుంచి 2026 జూన్ వరకు 14 కేసుల్ని లంచాలతో క్లోజ్ చేసినట్లు తేలింది. ఇందు కోసం రూ.34,700 పైన లంచాలు తీసుకున్నారని బయటపడింది. RSI శ్రీకాంత్, కానిస్టేబుల్స్ సాయికృష్ణ, కిరణ్‌లను CP గౌస్ ఆలం సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు.

సిటీలో రోడ్లన్నీ జలమయం.. భారీగా ట్రాఫిక్ జామ్
TG: హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. ఐటీ ఉద్యోగుల లాగౌట్ సమయానికి వర్షం పడటంతో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామయ్యింది. రోడ్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది మోటార్ల సహాయంతో రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు. ఈరోజు కూడా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

గిల్ కెప్టెన్సీలో కొత్త టీం ఇండియా రెడీ
శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం BCCI కొత్త లీడర్‌షిప్‌ను ప్రకటించింది. యంగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌కు టీం కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా K.L.రాహుల్‌ని ఎంపిక చేశారు. గిల్ గత కొన్ని సిరీస్‌లలో చూపించిన ఫామ్, కూల్‌నెస్ చూసి సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘గిల్ లీడర్‌షిప్‌లో ఇండియా వేరే లెవెల్‌లో ఆడుతుంది’ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తమ ఉత్సాహాన్ని చాటుకుంటున్నారు. కొత్త కాంబినేషన్‌తో సిరీస్ కచ్చితంగా గెలుస్తామని టీం నమ్మకంగా ఉంది.

వీరికి డౌన్ సిండ్రోమ్ ఎలా వస్తుందో తెలుసా?
డౌన్ సిండ్రోమ్ అనేది బేబీలో 23 జత గల క్రామోసోమ్స్ లో 21వ క్రోమోజోమ్ <a href="https://en.wikipedia.org/wiki/Down_syndrome">(Trisomy 21)</a> ఒకటి అదనంగా ఉండటం వల్ల వచ్చే జెనెటికల్ ప్రాబ్లెమ్. సాధారణంగా ఎగ్ లేదా స్పెర్మ్ ఏర్పడే సమయంలో క్రోమోజోములు సరిగా విడిపోకపోవడం వల్ల ఈ అదనపు క్రోమోజోమ్ వస్తుంది. తర్వాత ఎగ్, స్పెర్మ్ కలిసినప్పుడు బిడ్డలో మొత్తం 47 క్రోమోజోములు ఉంటాయి. ఈ కారణంగా శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. దీనినే డౌన్ సిండ్రోమ్ అంటారు.

వీరు అసలు విద్యార్థులు ఎలా అవుతారు?: కంగనా రనౌత్
బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విద్యార్థుల నిరసనల్లో అసభ్యకరమైన భాష వాడటాన్ని ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై చేసిన వ్యాఖ్యలు మంచిది కాదన్నారు. 'తాము కూడా విద్యార్థి దశలో నిరసనల్లో పాల్గొన్నామని, ఇలాంటి భాష ఉపయోగించలేదన్నారు. ఇలాంటి అసభ్యకరమైన భాషను ఎలా ఉపయోగిస్తున్నారు? వీరు ఏ విధంగా విద్యార్థులౌతారు?' అని ప్రశ్నించారు.16 ఏళ్ల వయసు నుంచే తమ కెరీర్‌ను తామే నిర్మించుకున్నామని, సమాజంలో ఇలాంటి ప్రవర్తనను అంగీకరించబోమని కంగనా రనౌత్ పేర్కొన్నారు.

తల్లికి వందనం నిధులు కాజేసిన సైబర్ కేటుగాళ్లు అరెస్ట్
AP ప్రభుత్వం ఇటీవల 'తల్లికి వందనం' పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన నిధులను లక్ష్యంగా చేసుకుని కర్నూలులో సైబర్ మోసం వెలుగుచూసింది. ఎయిర్‌టెల్ సిమ్ సేల్స్‌పర్సన్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర, సిమ్ విక్రయాల సమయంలో బాధితుల ఆధార్, వేలిముద్రలు, బ్యాంకు వివరాలను సేకరించి వాటిని దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 28మంది ఖాతాల నుంచి డబ్బులు అక్రమంగా డ్రా చేసినట్లు విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదుతో నిందితులు ఉపేంద్ర, వీరారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బొగత జలపాతం వద్ద హైఅలర్ట్
TG: ములుగు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాజేడు మండలంలోని ప్రసిద్ధ బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలపాతం ప్రమాదకరంగా మారింది. దీంతో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఎవరూ అక్కడికి రావద్దని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జలపాతం పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.