Latest

సింహాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
Infotainment· 29 Jul 2026

సింహాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

AP: సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో వార్షిక గిరి ప్రదక్షిణ ఈరోజు ప్రారంభమైంది. 32 కిలోమీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ గిరి ప్రదక్షిణకు దాదాపు 8 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. కొండపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి నిరాకరించారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈరోజు, రేపు ఆర్జిత సేవలను రద్దు చేసి, జిల్లాలోని 221 విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

భారత్‌పై అమెరికా 100% టారిఫ్..?
World· 29 Jul 2026

భారత్‌పై అమెరికా 100% టారిఫ్..?

అమెరికా ఇప్పుడు భారత్‌పై 100% టారిఫ్ వేయబోతోందా? ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తోంది. అమెరికా సెనేట్ తాజాగా ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం.. రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు టారిఫ్ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇవ్వొచ్చు. ఆ జాబితాలో భారత్, చైనా కూడా ఉన్నాయి. అయితే ఇది వెంటనే అమల్లోకి వచ్చే నిర్ణయం కాదు. ఈ బిల్లు ఇంకా US House ఆమోదం పొందాలి. ఆ తర్వాతే ట్రంప్ సంతకం చేస్తే ఇది చట్టంగా మారే అవకాశం ఉంది.

మీరాబాయి చాను గోల్డ్ హ్యాట్రిక్
Sports· 29 Jul 2026

మీరాబాయి చాను గోల్డ్ హ్యాట్రిక్

CWG 2026లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్ వచ్చింది. స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 48 కేజీల కేటగిరీలో టాప్ ప్లేస్ సాధించారు. ఇది ఆమె కామన్వెల్త్‌లో సాధించిన మూడో గోల్డ్ మెడల్. పోటీలో మీరాబాయి చేసిన ప్రతి లిఫ్ట్‌కు స్టేడియం చప్పట్లతో దద్దరిల్లింది. "దేశం కోసం ఆడటమే నా లక్ష్యం" అని మెడల్ తీసుకున్నాక ఆమె వివరించారు. మీరాబాయి ఒలింపిక్స్‌లోనూ రాణించాలని అందరూ కోరుకుంటున్నారు.

తోటి విద్యార్థినితో పోల్చినందుకు ఆత్మహత్య
News· 29 Jul 2026

తోటి విద్యార్థినితో పోల్చినందుకు ఆత్మహత్య

TG: గద్వాల దగ్గర కొత్తపల్లిలో ఇంటర్ చదువుతున్న తరుణ్ (18) అనే స్టూడెంట్ ఉరేసుకుని చనిపోయాడు. ఫస్టియర్‌లో అతనికి 434 మార్కులు రాగా, క్లాసులో మరో అమ్మాయికి 435 మార్కులు వచ్చాయి. దీంతో ఓ టీచర్ రోజూ ఆ అమ్మాయిని మెచ్చుకుంటూ, తనను అందరి ముందు తక్కువ చేసి మాట్లాడిందని తరుణ్ బాధపడ్డాడు. రెండు రోజుల క్రితం టీచర్‌తో గొడవపడి, కాలేజీకి వెళ్లడం మానేసి, మంగళవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.

కోర్టుకు వెళ్లకుండానే కేసు డిస్పోజ్
Crime· 29 Jul 2026

కోర్టుకు వెళ్లకుండానే కేసు డిస్పోజ్

TG: "డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు పడిందా? డబ్బులిస్తే అంతా మేం చూసుకుంటాం" కొందరు కరీంనగర్ ట్రాఫిక్ పోలీసుల స్కెచ్ ఇది. రూ.15 వేల లంచం తీసుకుని, ముద్దాయి కోర్టు ముఖం కూడా చూడకుండానే కేసు డిస్పోజ్ చేసేశారు. 2025 జనవరి నుంచి 2026 జూన్ వరకు 14 కేసుల్ని లంచాలతో క్లోజ్ చేసినట్లు తేలింది. ఇందు కోసం రూ.34,700 పైన లంచాలు తీసుకున్నారని బయటపడింది. RSI శ్రీకాంత్, కానిస్టేబుల్స్ సాయికృష్ణ, కిరణ్‌లను CP గౌస్ ఆలం సస్పెండ్ చేసినట్లు చెప్పారు. ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు.

సిటీలో రోడ్లన్నీ జలమయం.. భారీగా ట్రాఫిక్ జామ్
News· 29 Jul 2026

సిటీలో రోడ్లన్నీ జలమయం.. భారీగా ట్రాఫిక్ జామ్

TG: హైదరాబాద్ నగరంలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి ప్రాంతాల్లో రాత్రి భారీ వర్షం కురిసింది. ఐటీ ఉద్యోగుల లాగౌట్ సమయానికి వర్షం పడటంతో ప్రధాన రహదారులపై భారీగా ట్రాఫిక్ జామయ్యింది. రోడ్లు, కాలనీల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది మోటార్ల సహాయంతో రోడ్లపై నిలిచిన నీటిని తొలగించారు. ఈరోజు కూడా హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

గిల్ కెప్టెన్సీలో కొత్త టీం ఇండియా రెడీ
Sports· 29 Jul 2026

గిల్ కెప్టెన్సీలో కొత్త టీం ఇండియా రెడీ

శ్రీలంకతో జరగబోయే టెస్ట్ సిరీస్ కోసం BCCI కొత్త లీడర్‌షిప్‌ను ప్రకటించింది. యంగ్ బ్యాట్స్‌మెన్ శుభ్‌మన్ గిల్‌కు టీం కెప్టెన్ బాధ్యతలు అప్పగించారు. వైస్ కెప్టెన్‌గా K.L.రాహుల్‌ని ఎంపిక చేశారు. గిల్ గత కొన్ని సిరీస్‌లలో చూపించిన ఫామ్, కూల్‌నెస్ చూసి సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘గిల్ లీడర్‌షిప్‌లో ఇండియా వేరే లెవెల్‌లో ఆడుతుంది’ అని సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌ తమ ఉత్సాహాన్ని చాటుకుంటున్నారు. కొత్త కాంబినేషన్‌తో సిరీస్ కచ్చితంగా గెలుస్తామని టీం నమ్మకంగా ఉంది.

వీరికి డౌన్ సిండ్రోమ్ ఎలా వస్తుందో తెలుసా?
Education· 29 Jul 2026

వీరికి డౌన్ సిండ్రోమ్ ఎలా వస్తుందో తెలుసా?

డౌన్ సిండ్రోమ్ అనేది బేబీలో 23 జత గల క్రామోసోమ్స్ లో 21వ క్రోమోజోమ్ <a href="https://en.wikipedia.org/wiki/Down_syndrome">(Trisomy 21)</a> ఒకటి అదనంగా ఉండటం వల్ల వచ్చే జెనెటికల్ ప్రాబ్లెమ్. సాధారణంగా ఎగ్ లేదా స్పెర్మ్ ఏర్పడే సమయంలో క్రోమోజోములు సరిగా విడిపోకపోవడం వల్ల ఈ అదనపు క్రోమోజోమ్ వస్తుంది. తర్వాత ఎగ్, స్పెర్మ్ కలిసినప్పుడు బిడ్డలో మొత్తం 47 క్రోమోజోములు ఉంటాయి. ఈ కారణంగా శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం పడుతుంది. దీనినే డౌన్ సిండ్రోమ్ అంటారు.

వీరు అసలు విద్యార్థులు ఎలా అవుతారు?: కంగనా రనౌత్
Politics· 29 Jul 2026

వీరు అసలు విద్యార్థులు ఎలా అవుతారు?: కంగనా రనౌత్

బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ విద్యార్థుల నిరసనల్లో అసభ్యకరమైన భాష వాడటాన్ని ఖండించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లిపై చేసిన వ్యాఖ్యలు మంచిది కాదన్నారు. 'తాము కూడా విద్యార్థి దశలో నిరసనల్లో పాల్గొన్నామని, ఇలాంటి భాష ఉపయోగించలేదన్నారు. ఇలాంటి అసభ్యకరమైన భాషను ఎలా ఉపయోగిస్తున్నారు? వీరు ఏ విధంగా విద్యార్థులౌతారు?' అని ప్రశ్నించారు.16 ఏళ్ల వయసు నుంచే తమ కెరీర్‌ను తామే నిర్మించుకున్నామని, సమాజంలో ఇలాంటి ప్రవర్తనను అంగీకరించబోమని కంగనా రనౌత్ పేర్కొన్నారు.

తల్లికి వందనం నిధులు కాజేసిన సైబర్ కేటుగాళ్లు అరెస్ట్
Crime· 29 Jul 2026

తల్లికి వందనం నిధులు కాజేసిన సైబర్ కేటుగాళ్లు అరెస్ట్

AP ప్రభుత్వం ఇటీవల 'తల్లికి వందనం' పథకం కింద లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన నిధులను లక్ష్యంగా చేసుకుని కర్నూలులో సైబర్ మోసం వెలుగుచూసింది. ఎయిర్‌టెల్ సిమ్ సేల్స్‌పర్సన్‌గా పనిచేస్తున్న ఉపేంద్ర, సిమ్ విక్రయాల సమయంలో బాధితుల ఆధార్, వేలిముద్రలు, బ్యాంకు వివరాలను సేకరించి వాటిని దుర్వినియోగం చేసినట్లు పోలీసులు గుర్తించారు. మొత్తం 28మంది ఖాతాల నుంచి డబ్బులు అక్రమంగా డ్రా చేసినట్లు విచారణలో తేలింది. బాధితుల ఫిర్యాదుతో నిందితులు ఉపేంద్ర, వీరారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

బొగత జలపాతం వద్ద హైఅలర్ట్
TG· 29 Jul 2026

బొగత జలపాతం వద్ద హైఅలర్ట్

TG: ములుగు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాజేడు మండలంలోని ప్రసిద్ధ బొగత జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరడంతో జలపాతం ప్రమాదకరంగా మారింది. దీంతో పర్యాటకుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అటవీ శాఖ అధికారులు జలపాతం సందర్శనను తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు ఎవరూ అక్కడికి రావద్దని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా జలపాతం పరిసరాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

వేగంగా దూసుకొచ్చిన కారు
Crime· 29 Jul 2026

వేగంగా దూసుకొచ్చిన కారు

TG: మేడ్చల్ జిల్లా మూడుచింతలపల్లి మున్సిపాలిటీలోని అనంతారం గ్రామంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతారానికి చెందిన జమాలుద్దీన్‌ బైక్‌పై వెళ్తుండగా, లక్ష్మాపూర్‌కు చెందిన వ్యక్తి నడుపుతున్న కారు మంగళవారం రాత్రి అతివేగంగా వచ్చి బైక్‌ను ఢీకొట్టింది. జమాలుద్దీన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం సమీపంలోని CCTV కెమెరాల్లో రికార్డవడంతో ఘటన తీవ్రత వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

నాలా వరదలో కొట్టుకుపోయిన వృద్ధుడు
TG· 29 Jul 2026

నాలా వరదలో కొట్టుకుపోయిన వృద్ధుడు

TG: హైదరాబాద్ మియాపూర్ వైశాలినగర్ రైల్వే అండర్‌పాస్ సమీపంలో వరద నీటిలో పడి వృద్ధుడు బాలయ్య గల్లంతయ్యారు. హఫీజ్‌పేట్ ప్రేమ్‌నగర్‌కు చెందిన ఆయన ప్రమాదవశాత్తు నాలా వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు పోలీసులు గుర్తించారు. భారీ వర్షాల నేపథ్యంలో అండర్‌పాస్ వద్ద నాలా మరమ్మత్తు పనులు జరుగుతుండటంతో ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా మూసివేశారు. సమాచారం అందుకున్న మియాపూర్ పోలీసులు, హైడ్రా, NDRF బృందాలు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని గల్లంతైన వృద్ధుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి.

ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం
TG· 29 Jul 2026

ప్రాణాలతో బయటపడ్డ కుటుంబం

TG: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఆలుగామ గ్రామంలో భారీ వర్షానికి ఇంటి పైకప్పు కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు గాయపడ్డారు. ఆత్రం మాంతయ్య, భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున రేకుల పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. ఘటనలో లక్ష్మికి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

AIతో కెరీర్‌లో అద్భుత అవకాశాలు
Education· 29 Jul 2026

AIతో కెరీర్‌లో అద్భుత అవకాశాలు

AP: కృత్రిమ మేధస్సు (AI) భవిష్యత్తును శాసించే సాంకేతికతగా మారుతోందని, దానిపై పట్టు సాధించిన విద్యార్థులకే ప్రపంచవ్యాప్తంగా అపార అవకాశాలు లభిస్తాయని అమెరికాకు చెందిన సాంకేతిక నిపుణుడు డాక్టర్ కడిలి శ్యామ్ బెనగల్ అన్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో "కృత్రిమ మేధస్సు – నేటి యుగం" అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన మాట్లాడారు. AI సాంకేతికతను సమర్థంగా వినియోగిస్తే విద్య, పరిశోధన, ఉద్యోగ రంగాల్లో అద్భుత విజయాలు సాధించవచ్చని తెలిపారు.

మహిళ ఫిర్యాదుతో CIపై వేటు
Crime· 29 Jul 2026

మహిళ ఫిర్యాదుతో CIపై వేటు

HYD జూబ్లీహిల్స్ PS ఇన్‌స్పెక్టర్ U.శ్రీనివాసులురెడ్డిని విధి నిర్వహణలో నిర్లక్ష్యం, తీవ్ర ఆరోపణల నేపథ్యంలో నగర పోలీస్ కమిషనర్ సస్పెండ్ చేశారు. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన ఓ మహిళను మాయమాటలతో నమ్మించి సన్నిహితంగా మెలిగారని, ఫొటోలు, వీడియోలు తీసి డబ్బుల కోసం బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. తనపై పలుమార్లు లైంగికదాడి చేసి అబార్షన్ చేయించారని ఫిర్యాదులో పేర్కొంది. మహిళే తనను బెదిరించి డబ్బులు వసూలు చేసిందని ఇన్‌స్పెక్టర్ వాదించినప్పటికీ, ఉన్నతాధికారులు అంతర్గత విచారణకు ఆదేశించి, సస్పెన్షన్ చేశారు.

పూజలు చేస్తామని నమ్మించి వెండి కడియాలతో పరార్
TG· 29 Jul 2026

పూజలు చేస్తామని నమ్మించి వెండి కడియాలతో పరార్

పూజల పేరుతో ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు వెండి కడియాలు చోరీచేసిన ఘటన నిర్మల్ జిల్లా భైంసా మండలంలో జరిగింది. కోతుల్గావ్ గ్రామానికి చెందిన రైతు దత్తాత్రి ఇంట్లో ఆయన లేని సమయంలో అతని భార్య కవిత వద్దకు శాంతాబాయి, సాయవ్వ అనే మహిళలు ఆరోగ్య సమస్యలు తొలగించే పూజ చేస్తామని నమ్మించి లోపలికి వెళ్లారు. పూజ చేస్తున్న సమయంలో రైతు ఇంటికి రావడంతో వారిని బయటకు పంపించాడు. దేవుడి గదిలో పరిశీలించగా 5 తులాల రెండు వెండి కడియాలు కనిపించపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు.

32 మంది విద్యార్థులు అస్వస్థత
AP· 29 Jul 2026

32 మంది విద్యార్థులు అస్వస్థత

AP: తిరుపతిలోని SV ఆయుర్వేద వైద్య కళాశాలలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. హాస్టల్‌లో రాత్రి భోజనం చేసిన అనంతరం 32మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 25 మంది యూజీ, ఏడుగురు పీజీ విద్యార్థులు ఉండగా, వాంతులు, వికారం, కడుపునొప్పితో బాధపడిన వారిని స్విమ్స్, TTD సెంట్రల్ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కలుషిత ఆహారమే ఘటనకు కారణమై ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

ఉప్పొంగిన వాగు.. విద్యార్థుల ప్రాణాలు అరచేతిలో
TG· 29 Jul 2026

ఉప్పొంగిన వాగు.. విద్యార్థుల ప్రాణాలు అరచేతిలో

TG: ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ (జే) గిరిజన గ్రామంలో భారీ వర్షాల కారణంగా వాగు ఉప్పొంగడంతో విద్యార్థులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాఠశాల ముగించుకుని ఇంటికి వెళ్తున్న చిన్నారులు వాగు దాటలేక ఒడ్డునే చిక్కుకుపోయారు. కొంతసేపటి తర్వాత నీటి ప్రవాహం తగ్గడంతో గ్రామస్తులు ఒక్కొక్కరిని సురక్షితంగా వాగు దాటించారు. ప్రతి వర్షాకాలంలో ఇదే పరిస్థితి నెలకొంటున్నా అధికారులు, ప్రజాప్రతినిధులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

నకిలీ DSP డ్రామా బట్టబయలు
Crime· 29 Jul 2026

నకిలీ DSP డ్రామా బట్టబయలు

AP: పల్నాడు జిల్లా యడవల్లి గ్రామానికి చెందిన కొత్తపల్లి ప్రదీప్ నకిలీ పోలీస్ అధికారిగా చలామణి అవుతూ భారీ మోసాలకు పాల్పడ్డాడు. తాను సైబర్ వింగ్ DSP అని బాధితులను నమ్మించి, సైబర్ మోసాల్లో పోయిన డబ్బు తిరిగి ఇప్పిస్తానని చెప్పి లక్షలు వసూలు చేశాడు. విద్యాసంస్థల్లో సైబర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ విద్యార్థులతో పరిచయాలు పెంచుకుని ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి డబ్బులు తీసుకున్నాడు. ఓ బాధితుడి ఫిర్యాదుతో అసలు నిజం బయటపడగా, అతడిపై ఒంగోలు PSలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

రీ సర్వేతో భూవివాదాలకు చెక్
TG· 29 Jul 2026

రీ సర్వేతో భూవివాదాలకు చెక్

తెలంగాణలో భూవివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే రీ సర్వే ప్రధాన లక్ష్యమని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. తొలి దశలో 2,240 గ్రామాల్లో రీ సర్వే కొనసాగుతోందని, ప్రజల్లో అవగాహన పెంచేందుకు గ్రామసభలు నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ప్రతి గ్రామంలో అధికారులు అందుబాటులో ఉండి సందేహాలు నివృత్తి చేయాలని, కలెక్టర్లు వారానికోసారి పురోగతిని సమీక్షించాలని సూచించారు. అత్యాధునిక సాంకేతికతతో ప్రతి భూమికి కచ్చితమైన హద్దులు గుర్తించి ప్రత్యేక భూదార్ నంబర్ కేటాయిస్తామని చెప్పారు.