Latest

లంక భూములకు పట్టాలు..! పాస్ పుస్తకాలు ఇవ్వాలి
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం రామచంద్రాపుర, నూతక్కి వ్యవసాయ సొసైటీల రైతులు నిరసనకు దిగారు. పట్టాలు, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆన్‌లైన్ నమోదు తహసీల్దార్ కార్యాలయం దగ్గర తక్షణమే చేయాలని డిమాండ్ చేశారు. నూతక్కి సొసైటీలో 62 మంది రైతులకు రైతు భరోసా, ఎరువులు, విత్తనాలు ఇవ్వాలని కోరుతున్నారు. రామచంద్రాపురంలో వరదల్లో పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలని, వేంద్రపాడు లంక భూముల ఆక్రమణలు, దౌర్జన్యాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
భూములు లేకుంటే రైతులు ఎలా బతుకుతారు?

బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్నారా? RRBsలో భారీ నోటిఫికేషన్!
బ్యాంక్ జాబ్ కోసం చూస్తున్న వారికి IBPS RRB CRP-XV నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 13వేలకు పైగా జాబ్స్ ఫిల్ చేయనున్నారు. ఇందులో Office Assistant (Multipurpose), Officer Scale-I, II, III పోస్టులు ఉన్నాయి. ఈనెల 1 నుంచి 21, 2026 వరకు ఆన్‌లైన్‌లో Apply చేసుకోవచ్చు. ఫీజు General/OBC/EWS క్యాండిడేట్స్‌కు రూ. 850, SC/ST/PwBD వారికి రూ. 175. ఏదైనా డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, లోకల్ లాంగ్వేజ్‌పై పట్టు ఉండాలి. ఏజ్ పోస్టును బట్టి 18 - 40 ఏళ్లలోపు ఉండాలి. పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఇక్కడ Click చేయండి.

సీపీఎస్ విధానం రద్దు కోసం జనగామలో నిరసన
సీపీఎస్ (కొత్త పెన్షన్ విధానం)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ జనగామ జిల్లా లింగంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సిబ్బంది మంగళవారం లంచ్ అవర్‌లో నిరసన చేపట్టారు. సీపీఎస్ విద్రోహ దినం సందర్భంగా కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. ‘సీపీఎస్ అంతం.. మన పంతం’ అంటూ నినదించారు. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.

సీపీఎస్ విధానం రద్దు చేయాలని నిరసన
వర్ధన్నపేట: సీపీఎస్ (కొత్త పెన్షన్ విధానం)ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ సబ్ ట్రెజరీ కార్యాలయ సిబ్బంది మంగళవారం లంచ్ అవర్‌లో నిరసన చేపట్టారు. సీపీఎస్ విద్రోహ దినం సందర్భంగా కార్యాలయం ఎదుట నినాదాలు చేశారు. ‘సీపీఎస్ అంతం.. మన పంతం’ అంటూ నినదించారు. ఉద్యోగుల భవిష్యత్తుకు భరోసా కల్పించే పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని కోరారు.

నల్లబజారుకు యూరియా తరలింపు ఆపాలంటూ ధర్నా
ఖమ్మంజిల్లా వేంసూరు మండలం భరణిపాడు గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఎదుట రైతులు మంగళవారం ధర్నా చేశారు.యూరియా రైతులకు అందకుండా నల్లబజారుకు తరలిస్తున్నారని ఆరోపించారు.యాప్ లో ఇతర మండలాలకు,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యాపారులు బుక్ చేయగా వారికి pacs అధికారులు ఇస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.తమకు యూరియా ఇచ్చి,యాప్ పద్ధతి ఎత్తి వేయాలని రైతులు డిమాండ్ చేశారు.

గద్వాలలో 24 గంటలు కరెంటు కావాలని ధర్నా
జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు మండల కేంద్రంలో రైతులు ఆందోళనకు దిగారు. సబ్ స్టేషన్ ఆఫీస్ దగ్గర వ్యవసాయానికి 24 గంటలు కరెంటు కావాలంటూ ధర్నా చేశారు. వారికి సంఘీభావంగా BRS పార్టీ ఇంచార్జ్ బాసు, హనుమంతు నాయుడు పాల్గొన్నారు. AE చెన్నయ్యకు వినతిపత్రం ఇచ్చి, "కొంతకాలంగా 3 ఫేజ్ కరెంటుకు కోతలు పెడుతున్నారు" అని ఫిర్యాదు చేశారు. 24 గంటలు రావాల్సిన కరెంటు 12 గంటలు మాత్రమే వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి మోసపూరిత కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని, దీని పాలనలో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చిందని అన్నారు.

మిడిల్ ఈస్ట్ టెన్షన్.. మన జేబుపై ప్రభావం పడుతుందా?
మిడిల్ ఈస్ట్‌లో అమెరికా–ఇరాన్ మధ్య టెన్షన్ మళ్లీ పెరగడంతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన మొదలైంది. ముఖ్యంగా ఆయిల్ సరఫరాకు కీలమైన హోర్ముజ్ మార్గంలో ఇబ్బందులు పెరగడంతో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 90 డాలర్లను దాటింది. భారత్ క్రూడ్ ఆయిల్ అవసరాల్లో 90%కి పైగా దిగుమతులపై ఆధారపడుతున్నందున, క్రూడ్ ధరలు ఎక్కువకాలం అధికంగా ఉంటే రవాణా ఖర్చులు, వస్తువుల ధరలు, ద్రవ్యోల్బణంపై ప్రభావం పడొచ్చు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు లేకపోయినా.. టెన్షన్ కొనసాగితే భారం మన జేబుపై పడే అవకాశం ఉంది.

భూ సమస్యల పరిష్కారానికి పకడ్బందీగా రీ సర్వే
సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా రీ సర్వేను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం మొలచింతలపల్లి గ్రామ శివారులో రీ సర్వే పనులను పరిశీలించిన ఆయన, రైతుల సమక్షంలోనే భూముల కొలతలు చేపట్టాలని సూచించారు. ప్రతి సర్వే నంబర్ వివరాలను పక్కాగా నమోదు చేసి డిజిటలైజ్ చేయడంతో పాటు డిజిటల్ మ్యాపులు సిద్ధం చేయాలని ఆదేశించారు.
పల్నాడులో YCP కి షాక్! చైర్మన్ సహా 7 కౌన్సిలర్లు TDP లో
పల్నాడు జిల్లా గురజాల మున్సిపాలిటీలో రాజకీయ మార్పులు జరిగాయి. పిడుగురాళ్ల టీడీపీ కార్యాలయంలో మున్సిపల్ చైర్మన్ బడే జానీతో పాటు ఏడుగురు కౌన్సిలర్లు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. వారికి టీడీపీ కండువాలు కప్పి ఎమ్మెల్యే యరపతినేని, శ్రీనివాసరావు స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి బాగుందని, అదే కారణంతో వైసీపీని వీడుతున్నామని చైర్మన్ స్పష్టం చేశారు. గురజాల మండలంలో పలు కుటుంబాలు కూడా టీడీపీలో చేరినట్లు సమాచారం.దీనిపై వైసీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.

చేయూత పెన్షన్‌కు గడువు పొడిగింపు..! సెప్టెంబర్ 15 వరకే
అయిజ మున్సిపాలిటీలో చేయూత పెన్షన్ దరఖాస్తుదారులకు శుభవార్త. Aug 31తో ముగియాల్సిన గడువును ప్రభుత్వం Sept 15 వరకు పొడిగించింది. ఈ పెన్షన్ కింద వితంతువు, వికలాంగత, ఒంటరి మహిళ, కల్లుగీత కార్మికులు, చేనేత కార్మికులు, డయాలసిస్ రోగులు అర్హులే. ఇప్పటివరకు మున్సిపాలిటీ పరిధిలో 494 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. ఇంకా అర్హత ఉన్నవాళ్లు ఎవరైనా అప్లై చేయకుంటే, ఇదే వారి చివరి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్ పి. చంద్రశేఖర్ రావుస్పష్టంగా కోరారు. ఇక డేట్ మిస్ అయితే.. మీరే బాధ్యులు!

కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై సర్కార్‌కు బిగ్ రిలీఫ్!
TG: కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో బిగ్ రిలీఫ్. ఈ రెండు స్కీమ్స్ అమలుపై సింగిల్ బెంచ్ విధించిన స్టేను CJ బెంచ్ రద్దు చేసింది. స్టే వల్ల పేద కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని గవర్నమెంట్ తరపు అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. పథకాలతో ఎంతోమంది పేదలకు బెనిఫిట్ అవుతోందని వివరించారు. వాదనలు విన్న CJ బెంచ్.. సర్కార్ వాదనను అంగీకరించి స్టేను ఎత్తివేస్తూ ఆదేశాలు ఇచ్చింది.

‘కొండమల్లు’ - నవల
తెలుగులో చారిత్రక నవలలు చాలా వరకూ పాఠకుల ఆదరణ పొందాయి. చక్కటి కథనంతో అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. వర్ధెల్లి వెంకటేశ్వర్లు రాసిన ‘కొండమల్లు’ నవల అలాంటిదే. పల్నాటి రాజ్యం ఏర్పడినప్పటి నుంచి, పల్నాటి యుద్ధానికి ముందు బ్రహ్మనాయుడు వనవాసానికి వెళ్లే వరకు ఈ కథ సాగుతుంది. పల్నాటి చరిత్రను ఆధారంగా చేసుకున్న నవల అయినా, ఇందులో చెంచుల జీవన విధానాన్ని రచయిత అద్భుతంగా చూపించారు. చెంచుల భాషలోనే ఆ సంభాషణలు ఉండటం మరో ప్రత్యేకత. చారిత్రక నవలలు ఇష్టపడేవాళ్లు తప్పకుండా చదవాల్సిన పుస్తకం ఇది. ధర ₹300. కొనే లింక్.

గంజాయి కబురు చెబితే.. రూ.1500 రివార్డు!
NTR జిల్లా పోలీసులు డ్రగ్స్‌పై వార్ ప్రకటించారు. 'ఈగల్ ఛాలెంజ్' పేరుతో కొత్త కార్యక్రమం మొదలుపెట్టారు.
గంజాయి తాగేవాళ్ల గురించి Info ఇస్తే రూ.1,500 రివార్డు ఇస్తామని సీపీ రాజశేఖర్ బాబు ప్రకటించారు.
అంతేకాదు, డ్రగ్స్ అమ్మకాలు, అక్రమ రవాణాపై క్లూ ఇస్తే రూ.5,000 వరకు ఇస్తామని చెప్పారు. ఇప్పటికే 1,287 మందిని పోలీసులు గుర్తించారు. ఇక ముందు విద్యాసంస్థల్లో స్పెషల్ టీములు పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.
డ్రగ్స్ నుంచి యువతను కాపాడాలని, మత్తురహిత సమాజం కోసం ప్రజలు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.

తెలుగు చారిత్రక నవలలపై గుంటూరులో ప్రత్యేక సదస్సు
AP: సాహిత్య అకాడమీ, బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ కలిసి తెలుగు చారిత్రక నవలలపై గుంటూరులో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నాయి. సెప్టెంబర్ 6 ఆదివారం ఉదయం 10 గంటలకు నగరంపాలెంలోని బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి బాలుర హాస్టల్‌లో ఈ కార్యక్రమం జరుగుతుంది. రచయితలు వల్లూరు శివప్రసాద్, మోదుగుల రవికృష్ణ, కోనేరు రవికుమార్, సి.హెచ్.సుశీలమ్మ తదితరులు పాల్గొంటారు.

కర్నూలులో టెర్రర్ అలర్ట్.. అనుమానితుడు అరెస్ట్!
AP: కర్నూలు జిల్లాలో టెర్రర్ సస్పెక్ట్ అరెస్ట్ కలకలం రేపింది. సికింద్రాబాద్‌కు చెందిన నూర్ మహమ్మద్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో (IB) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు దగ్గరలోని గొందిపర్లలో ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న అతడిపై కొన్నాళ్లుగా నిఘా పెట్టినట్లు తెలిస్తోంది. అరెస్ట్ తర్వాత స్పెషల్ సెక్యూరిటీతో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. అతడికి ఎవరెవరితో కాంటాక్ట్స్ ఉన్నాయి, ఏదైనా టెర్రర్ గ్రూప్‌తో లింక్స్ ఉన్నాయా అనే యాంగిల్‌లో అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

యూరియా యాప్ పై అవగాహన లేక రైతుల అవస్థలు
నిర్మల్ జిల్లా ముధోల్ మండలంలో గ్రామాల్లో యూరియా ఎరువు కోసం రైతుల ఇబ్బందులు కొనసాగుతున్నాయి. వ్యవసాయ అధికారులు వ్యవసాయ గ్రూపుల్లో యూరియా యాప్‌పై సమాచారం, సూచనలు పంపుతున్నప్పటికీ, రైతులకు యాప్‌పై పూర్తి అవగాహన లేకపోవడంతో యూరియా పొందడంలో అయోమయం నెలకొంది. పంట సీజన్ మధ్య దశకు చేరుకున్నా సమస్యలు తప్పడం లేదని రైతులు వాపోతున్నారు. యూరియా వినియోగం, యాప్ నమోదు, సరఫరా విధానంపై గ్రామస్థాయిలో రైతులకు ప్రత్యక్షంగా వివరించడానికి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని రైతులు వ్యవసాయ అధికారులను కోరుతున్నారు.

సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిరసనలు లేవు: సౌరవ్ దాస్
సెప్టెంబర్ 5న ఢిల్లీలో చేయాలనుకున్న నిరసన కార్యక్రమాన్ని విత్‌డ్రా చేసుకుంటున్నట్టు సుప్రీంకోర్టులో CJPనేత సౌరవ్ దాస్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నిరసనకారులపై పెట్టిన కేసులను విత్‌డ్రా చర్యలు తీసుకుంటున్నందువల్ల ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించారు. ఢిల్లీ పోలీసులు, బీహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర రాష్ట్రాలు విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని దరఖాస్తులు పెట్టాయని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. దీంతో సెప్టెంబర్ 5 నిరసనను CJP రద్దు చేసింది.

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టులో రిలీఫ్!
TG: శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్ కేసులో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు తెలంగాణ హైకోర్టులో రిలీఫ్ లభించింది. ఆయనను పదవి నుంచి మార్చాలని సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆర్డర్‌ను డివిజన్ బెంచ్ టెంపరరీగా సస్పెండ్ చేసింది. కేసుపై తదుపరి విచారణను నవంబర్ 3కి పోస్ట్‌పోన్ చేసింది. అప్పటి వరకు రంగనాథ్‌ను మార్చాల్సిన అవసరం లేదని కోర్టు క్లారిటీ ఇచ్చింది. అయితే నెక్స్ట్ హియరింగ్‌లో ఆదేశాలు వచ్చే వరకు లోతుకుంటా భూముల జోలికి వెళ్లొద్దని హైకోర్టు ఆదేశించింది.

ఆ ఒక్క మీటింగ్… టిమ్ కుక్ లైఫ్‌నే మార్చేసింది! 🔥
యాపిల్ కంపెనీ అంటే ముందు గుర్తొచ్చే పేరు స్టీవ్ జాబ్స్. ఆ తర్వాత గుర్తొచ్చే పేరు టిమ్ కుక్. అయితే ఆయన ఆ కంపెనీలో చేరడానికి ముందు ‘నో’ చెప్పారన్న విషయం తెలుసా? 1998లో కాంపాక్‌లో మంచి జాబ్‌లో ఉన్న టిమ్ కుక్‌కి, దివాలా తీసే స్టేజ్‌లో ఉన్న యాపిల్ నుండి ఆఫర్ వచ్చింది. ముందు "నో" చెప్పినా, స్టీవ్ జాబ్స్‌ని మీట్ అయ్యాక ఆయన విజన్ నచ్చింది. రిస్క్ తీసుకుని యాపిల్‌లో జాయిన్ అయ్యారు. కట్ చేస్తే, అదే యాపిల్‌ని వరల్డ్ నంబర్ 1 కంపెనీగా మార్చి, రీసెంట్‌గా సీఈఓగా రిటైర్ అయ్యారు! గట్ ఫీలింగ్ అంటే ఇదే కదా!

టీటీడీ బోర్డు సభ్యుడి కుమారుడి అరెస్టు
TG: హైదరాబాద్ రాయదుర్గంలో జరిగిన హిట్-అండ్-రన్ ప్రమాదంలో బీహార్‌కు చెందిన నందులాల్ మరణించాడు. అతనికి సాయం చేయడానికి వచ్చిన స్టూడెంట్ జైద్ షా కాద్రి కూడా తీవ్రంగా గాయపడ్డాడు. ORR రోటరీ నుంచి ఖాజాగూడ వైపు వెళ్లే రోడ్డుపై నడుస్తున్న నందులాల్‌ను ఇన్నోవా కారు ఢీకొట్టింది. అతనికి సాయం చేస్తున్న స్టూడెంట్‌ను కూడా అదే కారు ఢీకొట్టి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. CCTV ఆధారంగా వాహనాన్ని గుర్తించి, ఈ ఘటనకు కారణమైన ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు ఆనంద్ సాయి కుమారుడు సందీప్‌ను అరెస్ట్ చేశారు.

డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే భవిష్యత్తు
డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని ప్రొఫెసర్ సామ రవీందర్ రెడ్డి అన్నారు. షాద్‌నగర్ పట్టణంలోని విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు డ్రగ్స్ నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మత్తుపదార్థాల కారణంగా యువత భవిష్యత్తు ఎలా నాశనం అవుతుందో ఆయన తెలిపారు. ప్రిన్సిపల్ విశ్వనాథ్, లెక్చరర్ శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొన్నారు.