Latest

మధ్యాహ్న భోజన పథకంలో చికెన్ బిర్యానీ
India· 29 Jul 2026

మధ్యాహ్న భోజన పథకంలో చికెన్ బిర్యానీ

మధ్యాహ్న భోజన పథకంలో వారానికోసారి చికెన్ బిర్యానీ పెట్టాలని తమిళనాడు ప్రభుత్వం ఆలోచిస్తోంది. టీచర్స్ యూనియన్స్ చేసిన ఈ సూచనను CM విజయ్ పరిశీలిస్తున్నారు. చికెన్ బిర్యానీ యాడ్ చెయ్యడంతో పిల్లలకు పౌష్టికాహారం అందడంతో పాటు స్కూల్ డ్రాపౌట్స్ తగ్గుతారని భావిస్తున్నారు. 1956లో తమిళనాడు సీఎం కామరాజ్ నాడార్ మొదలు పెట్టిన ఈ పథకం వల్ల డ్రాపౌట్స్ తగ్గడంతో మే 2001 నుంచి దేశమంతా అమల్లోకి తెచ్చారు. 2021 ‘PM పోషణ్’అని పేరు మార్చారు. తెలుగు రాష్ట్రాల్లో స్కూల్ పిల్లలకు చికెన్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుంది?

తమిళనాడులో ‘విక్రమార్కుడు’ గుండు సీన్
India· 29 Jul 2026

తమిళనాడులో ‘విక్రమార్కుడు’ గుండు సీన్

రవితేజ ‘విక్రమార్కుడు’ సినిమాలోని గుండు సీన్ తమిళనాడులో జరిగింది. సేలం జిల్లా పుదుకొత్తంబాడికి చెందిన ఓ మహిళకు ఫోన్ వచ్చింది. ఎమ్మార్వో ఆఫీసు నుంచి ఫోన్ చేస్తున్నామని చెప్పి, కరోనా లాంటి కొత్త వ్యాధి సోకుతోందని అవతలి వ్యక్తి చెప్పాడు. ఈ వ్యాధి సోకిన వారంతా గుండు గీయించుకున్నారని, ఇలా గుండు గీయించుకున్న మహిళలకు ప్రభుత్వం రూ.15 వేలు ఇస్తుందన్నాడు. మహిళ ఈ విషయాన్ని స్థానికులకు చెప్పడంతో ముగ్గురు మహిళలు గుండు చేయించుకొని అతని ఫోన్ చేశారు. స్విచ్ ఆఫ్ అని రావడంతో మోసపోయామని గ్రహించారు.

బ్యాంక్‌లోనే మోసం
Crime· 29 Jul 2026

బ్యాంక్‌లోనే మోసం

TG: కామారెడ్డి జిల్లాలోని SBI బ్యాంక్‌లో మహిళను లక్ష్యంగా చేసుకున్న దుండగులు చాకచక్యంగా రూ.15వేల నగదును కాజేశారు. పాల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన పూజ బ్యాంకులో నగదు లెక్కపెడుతుండగా ఇద్దరు వ్యక్తులు డబ్బులు సరిగ్గా లెక్కపెడతామని నమ్మించారు. వారి మాటలు నమ్మిన ఆమె నగదు ఇవ్వగా, నోట్ల కట్టలో నుంచి రూ.15వేలు చాకచక్యంగా తీసేసి అక్కడి నుంచి పరారయ్యారు. కొద్దిసేపటి తర్వాత డబ్బు తక్కువగా ఉండటాన్ని గుర్తించిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. CC ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

కేంద్ర ప్రభుత్వానికి 'కామన్ సెన్స్' లేదు: ప్రియాంక్ ఖర్గే
Politics· 29 Jul 2026

కేంద్ర ప్రభుత్వానికి 'కామన్ సెన్స్' లేదు: ప్రియాంక్ ఖర్గే

కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిపై కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రహ్లాద్ జోషి నుంచి పెద్ద సంస్కరణలు ఆశించడం పొరపాటేనని అన్నారు. 'ఆయన చాలాకాలంగా ఎంపీగా ఉన్నప్పటికీ చెప్పుకోదగ్గ విధానాలు, సంస్కరణను తీసుకురాలేదని' ఆరోపించారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి ఆయన అండగా నిలుస్తారని విమర్శించారు. అలాంటి వ్యక్తిని విద్యాశాఖ మంత్రిగా నియమించడం ఆశ్చర్యకరమని, ప్రభుత్వంలో 'కామన్ సెన్స్' లోపించిందని ప్రియాంక్ ఖర్గే అన్నారు.

అగ్గిపెట్టెతో అటెండెన్స్.. ఎలా?
Motivational· 29 Jul 2026

అగ్గిపెట్టెతో అటెండెన్స్.. ఎలా?

ఖరీదైన స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు లేకపోయినా.. మంచి ఐడియా ఉంటే చాలు అని ఓ టీచర్ నిరూపించారు. ఢిల్లీకి చెందిన టీచర్ సుమీ సియాగ్ అగ్గిపెట్టెలతో ఓ యూనిక్ Attendance Board తయారు చేశారు. ప్రతి స్టూడెంట్ ఫొటోతో ఒక అగ్గిపెట్టె ఉంటుంది. స్కూల్‌కు రాగానే వాళ్లు తమ అగ్గిపెట్టెను స్లైడ్ చేస్తే.. 'A' (Absent) నుంచి 'P' (Present)కి మారిపోతుంది. ఇలా పిల్లలే తమ అటెండెన్స్‌ను వాళ్లే మార్క్ చేసుకుంటున్నారు. ఈ చిన్న ఐడియా వల్ల బాధ్యత, సెల్ఫ్ డిసిప్లిన్ కూడా అలవాటవుతుందని చెబుతున్నారు.

CWGలో గుల్వీర్ సింగ్‌కు వెండి పతకం
Sports· 29 Jul 2026

CWGలో గుల్వీర్ సింగ్‌కు వెండి పతకం

CWGలో భారత అథ్లెట్ గుల్వీర్ సింగ్‌ 10,000 మీటర్ల లాంగ్ డిస్టెన్స్ రేస్‌లో వెండి పతకం సాధించారు. చివరి 2 ల్యాప్స్‌లో టఫ్ ఫైట్ ఇచ్చి పతకం సొంతం చేసుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత ఈ ఈవెంట్‌లో ఇండియాకు మెడల్ రావడం విశేషం. "గోల్డ్ మిస్ అయ్యాను. నెక్స్ట్ టైం కచ్చితంగా సాధిస్తాను" అని గుల్వీర్ వివరించారు. ఆయన పెర్ఫార్మెన్స్ యువ రన్నర్స్‌కు స్ఫూర్తిగా నిలుస్తోంది.

హీరో రిషబ్ శెట్టికి అరుదైన అవార్డు
Cinema· 29 Jul 2026

హీరో రిషబ్ శెట్టికి అరుదైన అవార్డు

'కాంతార' సినిమాతో ఎంతో పేరు తెచ్చుకున్న కన్నడ 'హీరో రిషబ్ శెట్టి'కి ఒక అరుదైన గౌరవం దక్కింది. భారతీయ సాంస్కృతిక కథలను ప్రపంచానికి తెలిసేలా చేసినందుకు 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్' వాళ్లు ఆయనకు 'లీడర్షిప్ ఇన్ సినిమా' అనే అవార్డును ప్రకటించారు. వచ్చే ఆగస్టు 13వ తేదీన ఈ అవార్డును తీసుకోనున్నారు.

చివరి ప్రయాణానికీ దారి లేదు
AP· 29 Jul 2026

చివరి ప్రయాణానికీ దారి లేదు

AP: కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పోలేకుర్రు తూర్పుపేటలో స్మశానానికి వెళ్లేందుకు సరైన రహదారి లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మృతదేహాలను పొలాల గట్లు, బురద మార్గాల మీదుగా మోసుకెళ్లాల్సి వస్తోందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దారుణంగా మారి అంత్యక్రియలు నిర్వహించడం కష్టంగా మారిందన్నారు. నిన్న ఓ వ్యక్తి చనిపోవడంతో పొలాల్లోకి దిగి తీసుకెళ్లారు. ఎన్నిసార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు ఇచ్చినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు.

స్పెషల్ ఒలింపిక్స్ భారత్‌కు వరుసగా మూడో పతకం
Sports· 29 Jul 2026

స్పెషల్ ఒలింపిక్స్ భారత్‌కు వరుసగా మూడో పతకం

స్వీడన్‌లో జరిగిన గోథియా కప్‌లో స్పెషల్ ఒలింపిక్స్ భారత ఫుట్‌బాల్ టీం బ్రాంజ్ మెడల్ గెలిచింది. ఇది వరుసగా 3వ ఇంటర్నేషనల్ ట్రోఫీ. టోర్నీ టీం చూపించిన డిసిప్లిన్, టీం వర్క్, నమ్మకం కారణంగా ఈ విజయం సాధ్యమైందని హెడ్ కోచ్ ప్లేయర్ల కష్టాన్ని ప్రశంసించారు. ప్రతి మెడల్ వెనుక కన్నీళ్లు, కష్టం ఉంటాయని ఆయన చెప్పారు. SKF ఇండియా సపోర్ట్‌తో ఈ విజయం సాధ్యమైంది. ఈ పతకం ఇంక్లూజన్ స్పోర్ట్స్‌కు పెద్ద ప్రేరణ.

పోలీసుల విచారణలో తమ్మినేని
AP· 29 Jul 2026

పోలీసుల విచారణలో తమ్మినేని

AP: శ్రీకాకుళంలో రూ 4 కోట్ల విలువైన భూమి కేసులో మాజీ స్పీకర్ 'తమ్మినేని సీతారాం' పోలీసుల విచారణకు వచ్చారు. బతికున్న భూమి ఓనర్‌ చనిపోయినట్లు దొంగ పత్రాలు సృష్టించి ఓ మహిళను వారసురాలిగా తీసుకొచ్చి కబ్జాకు ప్లాన్ చేశారు అని పోలీసుల ఆరోపించారు. ఈ కేసులో ఆయన భార్య వాణి, కొడుకు నాగ్ కూడా నిందితులుగా ఉన్నారు. ఈ విషయం బయటపడగానే ఇల్లు వదిలేసి కారులో పారిపోయారు. చివరకు బుధవారం ఉదయం శ్రీకాకుళం రూరల్ పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ముందుకు వచ్చారు

తిరుపతి ఫ్లైట్ టికెట్ల ధరలకు రెక్కలు
News· 29 Jul 2026

తిరుపతి ఫ్లైట్ టికెట్ల ధరలకు రెక్కలు

AP: హైదరాబాద్‌–తిరుపతి విమాన ఛార్జీలు భారీగా పెరిగాయి. గంట ప్రయాణానికి రూ.5,700 నుంచి చివరి నిమిషంలో రూ.24 వేల వరకు వసూలు చేస్తున్నారు. దింతో భక్తులు, ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఎయిర్‌పోర్ట్‌లో లభించే శ్రీవాణి వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లకు ఉన్న అధిక డిమాండ్‌ వల్లే ఈ ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. ఉదయం పూట విమానాల్లో వచ్చేవారికి ఈ టికెట్లు సులభంగా లభిస్తుండటంతో ఎయిర్‌లైన్స్ అడ్డగోలుగా ఛార్జీలు పెంచుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.

వర్షాల వేళ జలమండలి యాక్షన్
TG· 29 Jul 2026

వర్షాల వేళ జలమండలి యాక్షన్

TG: హైదరాబాద్‌లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జలమండలి MD అశోక్ రెడ్డి అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించారు. ముంపు ప్రాంతాలు, హాట్‌స్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వరద నీటి తొలగింపు, సీవరేజీ ఓవర్‌ఫ్లో సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. తాగునీటి నాణ్యతను నిరంతరం పరీక్షిస్తూ కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనులు జరిగే ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజల భద్రతను కాపాడాలని సూచించారు. <br>వరద ప్రభావిత ప్రాంతాల్లో హైడ్రా, GHMC, పోలీసులతో సమన్వయంతో పనిచేయాలని చెప్పారు.

తన ప్రాణం వదిలి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి
News· 29 Jul 2026

తన ప్రాణం వదిలి బిడ్డకు జన్మనిచ్చిన తల్లి

AP: తన ప్రాణం వదిలి ఓ తల్లి బిడ్డకు జన్మనిచ్చింది. మార్కాపురం జిల్లా కాకర్లకు చెందిన లీలమ్మ(40) చాలా ఏళ్లకు గర్భవతి అయింది. మూడో నెలలో ఆమెకు గుండె సమస్య ఉందని తెలిసింది. తల్లీబిడ్డల్లో ఒకరినే కాపాడగలమని డాక్టర్లు చెప్పగా, తన ప్రాణం పోయినా సరే బిడ్డను బతికించాలని లీలమ్మ భర్తతో సంతకం చేయించింది. ఆపరేషన్ చేసి మగబిడ్డను బయటకు తీశారు. పుట్టిన బాబుని కళ్లారా చూడకుండానే తల్లి కన్నుమూసింది.

మెరిటోక్రసీ (Meritocracy) అంటే ఏంటో తెలుసా?
Infotainment· 29 Jul 2026

మెరిటోక్రసీ (Meritocracy) అంటే ఏంటో తెలుసా?

దేశంలో ‘రిజర్వేషన్స్ హటావో’ అనే ఆన్‌లైన్ మూమెంట్ కొనసాగుతోంది. దేశంలో రిజర్వేషన్లు ఉండొద్దని, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని ఈ మూమెంట్ కోరుతోంది. ఈ సమయంలో ‘మెరిటోక్రసీ(Meritocracy)’ అనే పదం వైరల్ అవుతోంది. వ్యక్తులు వారి సామర్థ్యం, నైపుణ్యం, కృషి, విద్య, పనితీరు ఆధారంగా గుర్తింపు, పదవులు పొందడాన్ని ‘మెరిటోక్రసీ’ అంటారు. డబ్బు, కులం, వంశం, సామాజిక స్థాయి, రాజకీయ సంబంధాలతో సంబంధం లేనిదే ఈ మెరిటోక్రసీ.

పుస్తకాలు కూడా మాట్లాడతాయా..?
Technology· 29 Jul 2026

పుస్తకాలు కూడా మాట్లాడతాయా..?

ఒక పుస్తకం చదువుతుంటే.. "ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు చేశాడు?" అనే డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? ఇక నుంచి గూగుల్‌లో వెతకాల్సిన అవసరం లేకపోవచ్చు. కొత్తగా వస్తున్న AI Book Companion టూల్స్‌తో పుస్తకాన్నే నేరుగా ప్రశ్నించొచ్చు. క్యారెక్టర్ల గురించి, కథలోని సంఘటనలు, హిస్టరీ లేదా కష్టమైన కాన్సెప్ట్స్ గురించి అడిగితే.. అదే పుస్తకంలోని సమాచారంతో AI సమాధానం చెబుతుంది. ఇప్పటికే Amazon Kindle, Audible, ElevenLabs లాంటి కంపెనీలు ఇలాంటి ఫీచర్లను తీసుకొచ్చాయి. ఇక డౌట్ వస్తే.. పుస్తకమే మీతో మాట్లాడుతుంది.

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి
TG· 29 Jul 2026

నిలిచిపోయిన బొగ్గు ఉత్పత్తి

TG: భారీ వర్షాలు కురుస్తుండడంతో మంచిర్యాల జిల్లాలోని సింగరేణి ఓపెన్‌కాస్ట్ గనులు నీటమునిగిపోయాయి. బొగ్గు ఉత్పత్తి, ఓబీ వెలికితీత, రవాణా పూర్తిగా నిలిచిపోయింది. శ్రీరాంపూర్ OCP–1, OCP–2, రామకృష్ణాపూర్ OCP, కైరిగూడ ఓసీపీ గనుల్లో వర్షపు నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి, వెలికితీత, బొగ్గు రవాణా పనులు నిలిచిపోయాయి. గనుల్లోని భారీ డంపర్లు, ఎక్స్‌కవేటర్లు, వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. వర్షాలు తగ్గిన తర్వాత నీటిని తొలగించి భద్రతా తనిఖీల అనంతరం కార్యకలాపాలను పునఃప్రారంభిస్తామని అధికారులు తెలిపారు.

అనహత్ సింగ్ క్రియేట్ చేసిన స్క్వాష్ హిస్టరీ
Sports· 29 Jul 2026

అనహత్ సింగ్ క్రియేట్ చేసిన స్క్వాష్ హిస్టరీ

ఇండియన్ స్క్వాష్‌లో కొత్త చరిత్ర రాసింది అనహత్ సింగ్. వరల్డ్ జూనియర్ స్క్వాష్ ఛాంపియన్‌షిప్ గెలిచిన మొదటి ఇండియన్ ప్లేయర్‌గా నిలిచింది. ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థిని స్ట్రెయిట్ సెట్స్‌లో చిత్తు చేసింది. 18 ఏళ్ల వయసులోనే ఇంత పెద్ద టైటిల్ గెలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తన ఆటలో స్పీడ్, ఫోకస్, స్టామినా అద్భుతం అంటూ అందరూ పొగుడుతున్నారు. "ఇది స్టార్టింగ్ మాత్రమే.. నా కల ఒలింపిక్ గోల్డ్ మెడల్" అంటోంది అనహత్.

సింహాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు
Infotainment· 29 Jul 2026

సింహాచలానికి ప్రత్యేక ఆర్టీసీ బస్సులు

AP: సింహాచలం వరాహలక్ష్మీనృసింహస్వామి దేవస్థానంలో వార్షిక గిరి ప్రదక్షిణ ఈరోజు ప్రారంభమైంది. 32 కిలోమీటర్ల మేర జరిగే ఈ ప్రదక్షిణలో పాల్గొనేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు వచ్చారు. ఈ గిరి ప్రదక్షిణకు దాదాపు 8 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల కోసం ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. కొండపైకి ప్రైవేటు వాహనాలకు అనుమతి నిరాకరించారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా ఈరోజు, రేపు ఆర్జిత సేవలను రద్దు చేసి, జిల్లాలోని 221 విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు.

భారత్‌పై అమెరికా 100% టారిఫ్..?
World· 29 Jul 2026

భారత్‌పై అమెరికా 100% టారిఫ్..?

అమెరికా ఇప్పుడు భారత్‌పై 100% టారిఫ్ వేయబోతోందా? ఇదే ప్రశ్న ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు వస్తోంది. అమెరికా సెనేట్ తాజాగా ఓ బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ప్రకారం.. రష్యా నుంచి ఎక్కువగా ఆయిల్, గ్యాస్ కొనుగోలు చేసే దేశాలపై 100% వరకు టారిఫ్ విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇవ్వొచ్చు. ఆ జాబితాలో భారత్, చైనా కూడా ఉన్నాయి. అయితే ఇది వెంటనే అమల్లోకి వచ్చే నిర్ణయం కాదు. ఈ బిల్లు ఇంకా US House ఆమోదం పొందాలి. ఆ తర్వాతే ట్రంప్ సంతకం చేస్తే ఇది చట్టంగా మారే అవకాశం ఉంది.

మీరాబాయి చాను గోల్డ్ హ్యాట్రిక్
Sports· 29 Jul 2026

మీరాబాయి చాను గోల్డ్ హ్యాట్రిక్

CWG 2026లో భారత్‌కు మరో గోల్డ్ మెడల్ వచ్చింది. స్టార్ వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చాను 48 కేజీల కేటగిరీలో టాప్ ప్లేస్ సాధించారు. ఇది ఆమె కామన్వెల్త్‌లో సాధించిన మూడో గోల్డ్ మెడల్. పోటీలో మీరాబాయి చేసిన ప్రతి లిఫ్ట్‌కు స్టేడియం చప్పట్లతో దద్దరిల్లింది. "దేశం కోసం ఆడటమే నా లక్ష్యం" అని మెడల్ తీసుకున్నాక ఆమె వివరించారు. మీరాబాయి ఒలింపిక్స్‌లోనూ రాణించాలని అందరూ కోరుకుంటున్నారు.

తోటి విద్యార్థినితో పోల్చినందుకు ఆత్మహత్య
News· 29 Jul 2026

తోటి విద్యార్థినితో పోల్చినందుకు ఆత్మహత్య

TG: గద్వాల దగ్గర కొత్తపల్లిలో ఇంటర్ చదువుతున్న తరుణ్ (18) అనే స్టూడెంట్ ఉరేసుకుని చనిపోయాడు. ఫస్టియర్‌లో అతనికి 434 మార్కులు రాగా, క్లాసులో మరో అమ్మాయికి 435 మార్కులు వచ్చాయి. దీంతో ఓ టీచర్ రోజూ ఆ అమ్మాయిని మెచ్చుకుంటూ, తనను అందరి ముందు తక్కువ చేసి మాట్లాడిందని తరుణ్ బాధపడ్డాడు. రెండు రోజుల క్రితం టీచర్‌తో గొడవపడి, కాలేజీకి వెళ్లడం మానేసి, మంగళవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో లెటర్ రాసి సూసైడ్ చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు గ్రామానికి చేరుకుని విచారణ చేస్తున్నారు.