Latest

పెల్లెట్ గన్స్ వాడకంపై  సుప్రీం విచారణ షురూ !
News· 27 Jul 2026

పెల్లెట్ గన్స్ వాడకంపై సుప్రీం విచారణ షురూ !

జూలై 20న ఢిల్లీ పార్లమెంట్ మార్చ్‌ సమయంలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) నిరసనకారులపై పెల్లెట్ గన్స్ వాడటం వివాదాస్పదమైంది. నడుము కంటే కిందకే కాల్పులు జరపాలనే నిబంధనలు ఉన్నప్పటికీ, బాధితులందరికీ కళ్ళు, ముఖం, మెడ, ఛాతీ భాగాల్లోనే తీవ్ర గాయాలయ్యాయి. ఈ కాల్పుల్లో ఓ విద్యార్థి చూపు కోల్పోయే ప్రమాదంలో పడగా, విలేకరి సహా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ క్రమశిక్షణా రాహిత్యం ,బలగాల నియమావళి ఉల్లంఘనపై సుప్రీంకోర్టు విచారణతో పాటు అంతర్గత విచారణ కూడా మొదలైంది.

సత్యజిత్ రే అపు ట్రయాలజీపై నోలన్ ఆసక్తి !
Cinema· 27 Jul 2026

సత్యజిత్ రే అపు ట్రయాలజీపై నోలన్ ఆసక్తి !

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్, ఇండియన్ మూవీస్ లో చెరగని ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే సృష్టించిన 'అపు ట్రయాలజీ (Apu Trilogy) పై తనకున్న అభిమా నాన్ని వ్యక్తపరిచారు. ఈ క్లాసిక్ సినిమాల్లోని అద్భుతమైన కథా కథనం, భావోద్వేగాలు సినిమా నిర్మాణ తీరు తనను బాగా ప్రభావితం చేశాయని ఆయనన్నారు. సినిమా ప్రేమికులు ఖచ్చితంగా చూడాల్సిన అరుదైన మాస్టర్‌పీస్‌గా దీనిని ఆయన అభివర్ణించారు.

రాం చరణ్ కు మణికట్టు సర్జరీ (రిస్ట్) సక్సెస్ ఫుల్ !
Cinema· 27 Jul 2026

రాం చరణ్ కు మణికట్టు సర్జరీ (రిస్ట్) సక్సెస్ ఫుల్ !

నటుడు రాం చరణ్ కు కోయంబత్తూరు గంగా ఆస్పత్రిలో మణికట్టు సర్జరీ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయింది. సర్జరీల్లో ప్రపంచంలో నెంబర్ వన్ ఎక్స్ పర్ట్ అయిన ఆర్ధో పెడిక్ సర్జన్ డాక్టర్. ఎస్. రాజశేఖరన్ టీమ్ ని లీడ్ చేశారు. గతంలో మెగాస్టార్ చిరంజీవికి వెన్నెముక సర్జరీ కూడా ఆయనే చేశారు.స్పోర్ట్స్ ఇంజురీస్ ను ట్రీట్ చేసే అమెరికాలోని మయామీ రిస్ట్ సర్జరీ డాక్టర్ బాడియాను కూడా రప్పించారు.చిరంజీవి, సురేఖ దంపతులు, ఉపాసన కూడా అక్కడే ఉన్నారు.

చికెన్ 65 అనే ఎందుకు పిలుస్తాం
Education· 27 Jul 2026

చికెన్ 65 అనే ఎందుకు పిలుస్తాం

చికెన్ 65 ఫుడ్ ఐటమ్ కి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా! దానిపై చాలా కథలున్నాయి. 1965లో చెన్నైలోని బుహారీ హోటల్‌లో దీన్ని తొలిసారి తయారు చేశారు. ఆ సంవత్సరం గుర్తుగా దీనికి 'చికెన్ 65' అని పేరు పెట్టారు. 65రోజుల కోడితో చేస్తారని, 1965 ఇండో-పాక్ యుద్ధంలో సైనికులకు వడ్డించడం వల్ల ఆ పేరు వచ్చిందని వేరే కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. అయితే 1965లో బుహారీ హోటల్‌లోనే ఇది మొదలైందనేదే నిజమని ఫుడ్ ఎక్సపర్ట్స్ చెబుతున్నారు.

"యువతను భయపెట్టలేరు".. మోదీ సర్కార్‌పై ఖర్గే ఫైర్
Politics· 27 Jul 2026

"యువతను భయపెట్టలేరు".. మోదీ సర్కార్‌పై ఖర్గే ఫైర్

NEET-UG ఉద్యమంలో పాల్గొన్న యువతను బెదిరిస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. తన X పోస్టులో, "లాఠీచార్జ్, పెల్లెట్ గన్స్ తర్వాత ఇప్పుడు సోషల్ మీడియా అకౌంట్లను కూడా చెక్ చేస్తున్నారు. ఇవన్నీ భయపడుతున్న ప్రభుత్వ లక్షణాలు" అని అన్నారు. అలాగే పేపర్ లీక్‌లను అరికట్టే చట్టం ఏమైంది? NTAకి ఇన్ని రోజులు పూర్తి స్థాయి డైరెక్టర్ ఎందుకు లేరు? అంటూ ప్రశ్నలు సంధించారు. చివరగా అమిత్ షా దీనిపై సమాధానం చెప్పాలని, ప్రధాని మోదీ యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

సీజేపీకి ఫండ్స్ ఎక్కడినుంచి వస్తున్నాయి: మహేష్ జెఠ్మలానీ
News· 27 Jul 2026

సీజేపీకి ఫండ్స్ ఎక్కడినుంచి వస్తున్నాయి: మహేష్ జెఠ్మలానీ

కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తరువాత సీజేపీ నాయకులు సంబరాలు చేసుకుంటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీనిపై సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ మహేష్ జెఠ్మలానీ స్పందించారు. సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, అశుతోష్ రాంకాలు బాలీవుడ్ పాటలకు డాన్స్ చేస్తున్నారని, ఆ పార్టీకి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటూ ఆయన ప్రశ్నించారు.

ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
AP· 27 Jul 2026

ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

AP: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆలయ నిర్మాణాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది. ఈ వివాదానికి సంబంధించి గతంలో జిల్లా కలెక్టర్ జారీ చేసిన NOC(No Objection Certificate) చట్టబద్ధమైనదేనని చెప్పింది. ప్రభుత్వ స్థలంలో రూల్స్ కి తగ్గట్టుగా ఆలయ నిర్మాణం చేపట్టడంలో తప్పులేదని స్పష్టం చేసింది.

పిల్లల పెంపకంపై ప్రియాంక టిబ్రెవాల్ కామెంట్లు
Politics· 27 Jul 2026

పిల్లల పెంపకంపై ప్రియాంక టిబ్రెవాల్ కామెంట్లు

కోల్‌కతాలో నీట్ పరీక్షల రద్దు కోసం జరిగిన ఆందోళనలకు వ్యతిరేకంగా బీజేపీ నాయకులు నగరంలో భారీ త్రివర్ణ యాత్ర చేపట్టారు. ఈ ర్యాలీలో పాల్గొన్న బీజేపీ నేత ప్రియాంక టిబ్రెవాల్ మాట్లాడుతూ కొందరు కావాలనే అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. "తల్లిదండ్రులు పిల్లల్ని సరిగ్గా పెంచకపోతే వాళ్ళు మాట్లాడే భాషను బట్టే ఆ పెంపకం ఎలాంటిదో ఇట్టే తెలిసిపోతుంది" అని ఆమె అన్నారు.

సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ!
Politics· 27 Jul 2026

సీఎం విజయ్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ!

తమిళనాడు సీఎం విజయ్ తీసుకున్న నిర్ణయానికి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కరూర్ తొక్కిసలాట బాధితులకు తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఉత్తర్వులను హైకోర్టు రద్దు చేసింది. అర్హత ఆధారంగానే ప్రభుత్వ ఉద్యోగాలివ్వాలని స్పష్టం చేసింది. బాధితులకు ఉద్యోగాల కల్పనను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఈ తీర్పును ఇచ్చింది.

'కాల్చేసేవాడిని'.. CJP నిరసనకారులపై BJP మాజీ నేత
Politics· 27 Jul 2026

'కాల్చేసేవాడిని'.. CJP నిరసనకారులపై BJP మాజీ నేత

"నేను అక్కడ ఉంటే మూడుసార్లు వెళ్లిపోమని చెబుతా.. వినకపోతే కాల్పులు జరిపేస్తా" అంటూ BJP మాజీ నేత, రాజకీయ వ్యాఖ్యాత TG మోహన్‌దాస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నాయి. అంతేకాదు, జంతర్ మంతర్‌లో నిరసన చేస్తున్న మహిళలపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినట్లు వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఆయనపై వెంటనే చర్యలు తీసుకోవాలని, అరెస్ట్ చేయాలని సోషల్ మీడియాలో చాలా మంది డిమాండ్ చేస్తున్నారు.

బీజేపీ రాష్ట్రాల్లోనే పేపర్ లీక్‌లు: అరవింద్ కేజ్రీవాల్
Politics· 27 Jul 2026

బీజేపీ రాష్ట్రాల్లోనే పేపర్ లీక్‌లు: అరవింద్ కేజ్రీవాల్

పంజాబ్ ఎడ్యుకేషన్ సిస్టంను 27వ స్థానం నుంచి నెంబర్ 1కి తీసుకొచ్చాం. ఈ సక్సెస్ చూసి ఓర్వలేక బీజేపీ మా మీద పరీక్షా పేపర్స్ లీక్ అంటూ బురదజల్లుతోంది అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీలో 10 ఏళ్లుగా, పంజాబ్ లో మా ప్రభుత్వమే ఉన్నా ఒక్క పేపర్ లీక్ అవ్వలేదు. కానీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం వరుసగా పేపర్లు లీక్ అవుతున్నాయి. వాళ్ళ ఫెయిల్యూర్ చూసి వాళ్లే ఫ్రస్ట్రేట్ అవుతున్నారని ఆయన అన్నారు.

మతం మారితే ఎస్సీ హోదా లేనట్టే: సుప్రీంకోర్టు
India· 27 Jul 2026

మతం మారితే ఎస్సీ హోదా లేనట్టే: సుప్రీంకోర్టు

మత మార్పిడితో ఎస్సీ హోదా కోల్పోతారని సుప్రీంకోర్టు తేల్చింది. మార్చిలో ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్‌ను తిరస్కరించింది. హిందూ, సిక్కు, బౌద్ధం తప్ప ఇతర మతాల్లోని వారికి ఎస్సీ స్టేటస్ వచ్చే అవకాశం లేదని చెప్పింది. క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని, తిరిగి హిందూ, సిక్కు, బౌద్ధంలోకి వస్తేనే హోదా పునరుద్ధరణ జరుగతుందని చెప్పింది.

ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్
News· 27 Jul 2026

ఆకివీడు రామాలయానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్

AP: ఆకివీడు రామాలయం నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంపై ఎమ్మెల్యే రఘురామ కృష్ణ రాజు ఆనందం వ్యక్తం చేశారు. రామాలయం తరఫున సమర్థవంతంగా వాదించిన సీనియర్ లాయర్ సుయోధన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది ప్రేరణ సింగ్‌ను అభినందించారు. ఈ పోరాటంలో తనకు అండగా నిలిచిన లక్షలాది మంది భక్తులకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.

బాలుడు యూరిన్ చేశాడని టీచర్ కత్తితో దాడి
Crime· 27 Jul 2026

బాలుడు యూరిన్ చేశాడని టీచర్ కత్తితో దాడి

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం వారణాసిలో ఓ ప్రైవేట్ స్కూల్లో దారుణ ఘటన జరిగింది. వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు టీచర్ పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఆ విద్యార్ధి ప్యాంట్‌లోనే యురీన్ పోసుకున్నాడు. ఐదేళ్ల బాలుడిని టీచర్ మరో గదికి తీసుకెళ్లి వేడి కత్తితో అతని ప్రైవేట్ భాగాన్ని కాల్చి, ఎవరికీ చెప్పొదంటూ బెదిరించింది. ఇంటికి వెళ్లిన బాలుడు జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వారు స్కూల్ ప్రిన్సిపాల్‌ను కలిశారు. ఎలాంటి స్పందన లేకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లైంట్ చేశారు.

ONGC నుంచి RSS అనుబంధ సంస్థలకు ₹670.97 కోట్లు
Politics· 27 Jul 2026

ONGC నుంచి RSS అనుబంధ సంస్థలకు ₹670.97 కోట్లు

ప్రభుత్వ రంగ సంస్థ ONGC నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ (RSS) అనుబంధ సంస్థలకు భారీగా నిధులు వెళ్లాయని "The News Minute" ప్రచురించిన న్వెస్టిగేటివ్ స్టోరీ సంచలనం సృష్టిస్తోంది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ (CSR) కింద ONGC 2013 నుంచి 20 RSS అనుబంధ సంస్థలకు ₹670.97 కోట్లు విరాళాలు ఇచ్చిందని ఈ రిపోర్ట్ చెప్తోంది. 2015 నుంచి 2025 వరకు ONGC 2,000కు పైగా సంస్థలు, ప్రాజెక్టులకు ₹4,531 కోట్ల రూపాయల్ని CSR కింద ఇస్తే.. అందులో ₹668.01 కోట్లు సంఘ్-అనుబంధ సంస్థలకే వెళ్లాయి. <a href="https://www.thenewsminute.com/news/state-owned-ongc-donated-over-rs-668-crore-to-20-sangh-linked-organisations-across-10-years">Read The News Minute Report </a>

NEET పై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్
News· 27 Jul 2026

NEET పై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్

బట్టీ పట్టే చదువులు ఇక ఏమాత్రం పనికిరావని రామ్ గోపాల్ వర్మ అన్నారు. డాక్టర్లు పదేళ్లు కష్టపడి చదివే విషయాలు, 'AI'కి ముందే తెలుసు. మనుషుల కంటే 'AI' చాలా ఫాస్ట్‌గా, కరెక్ట్‌గా రోగాలను గుర్తిస్తుంది. త్వరలో సర్జరీలు కూడా రోబోలే చేస్తాయి. సిలబస్ అంటూ టీచర్లు, పేరెంట్స్ పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు. ఫోన్‌కు ముందే తెలిసినవి మేమెందుకు బట్టీ పట్టాలని అడిగే యువకులను తప్పుబట్టకండి. పనికిరాని ఈ పాత విద్యా విధానాన్ని పూర్తిగా వదిలేసి, త్వరగా 'AI' వైపు మారండి అని వర్మ తన 'X' అకౌంట్ లో పోస్ట్ చేశారు.

వాళ్లు ఉగ్రవాదులు కాదు: ప్రియాంకా గాంధీ
Politics· 27 Jul 2026

వాళ్లు ఉగ్రవాదులు కాదు: ప్రియాంకా గాంధీ

బీహార్, వెస్ట్ బెంగాల్‌లో సీజేపీ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై FIRలు నమోదు చేస్తున్నారని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ మండిపడ్డారు. నిరసనకు వెళ్లిన అమ్మాయిల ఇళ్లకు ఫోన్ చేసి వాళ్ల కుటుంబాలను బెదిరిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయన్నారు. వాళ్లు ఉగ్రవాదులు కాదని.. విద్యార్థులని ఆమె అన్నారు.

18 ఏళ్లుగా రూపాయి కూడా వాడకుండా బతుకుతున్నాడు.. ఎలా?
General· 27 Jul 2026

18 ఏళ్లుగా రూపాయి కూడా వాడకుండా బతుకుతున్నాడు.. ఎలా?

"డబ్బు లేకుండా బతకడం అసాధ్యం" అనుకుంటాం. కానీ కెనడాకు చెందిన డేవిడ్ ఆర్థర్ జాన్స్టన్ మాత్రం 18 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా వాడకుండా జీవిస్తున్నానని చెబుతున్నాడు. భోజనం, బట్టలు, అవసరమైన వస్తువులు అన్నీ దానం లేదా కమ్యూనిటీ సపోర్ట్‌తోనే పొందుతూ జీవిస్తున్నాడు. 'అవసరాలు తగ్గించుకుంటే డబ్బు మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు' అనేది ఆయన నమ్మకం. ఈ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'ఇలా కూడా బ్రతుకుతారా?' అని కొందరు ఆశ్చర్యపడుతుంటే.. 'డబ్బు లేకుండా ఈ రోజుల్లో ఎలా సాధ్యం?' అంటూ మరికొందరు చర్చిస్తున్నారు.

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశం
News· 27 Jul 2026

హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశం

TG: హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను పదవి నుంచి తొలగించాలని, ఆయన స్థానంలో ఐజీ స్థాయి అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. హైదరాబాద్ లోతుకుంట భూముల వ్యవహారంపై విచారణ సందర్భంగా, 63 కోర్టు ధిక్కరణ కేసులను పరిగణనలోకి తీసుకుని ఉత్తర్వులు జారీ చేసింది. రంగనాథ్ కొనసాగితే 'రూల్ ఆఫ్ లా' దెబ్బతింటుందని, ఆయన పదవిలో కొనసాగడం సమంజసం కాదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఆన్‌లైన్ వేధింపులపై మోడల్ రియా ఫిర్యాదు
Viral· 27 Jul 2026

ఆన్‌లైన్ వేధింపులపై మోడల్ రియా ఫిర్యాదు

ముంబైలో నీట్ పేపర్ లీక్ నిరసనల్లో పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని మోడల్ రియా యాదవ్ ఆన్‌లైన్‌లో వైరల్ అయింది. ఆ సంఘటన తర్వాత తనను కొందరు తీవ్రంగా వేధిస్తున్నారని ఆమె మహారాష్ట్ర సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. విమర్శించే స్వేచ్ఛ అందరికీ ఉన్నా, ఇతరులను కించపరిచేలా కామెంట్స్ చేసే హక్కు ఎవరికీ లేదని, తప్పుగా ఉన్న ప్రతిదానికీ వ్యతిరేకంగా నేను పోరాడతానంటూ రియా చెప్పింది.

ఇరాన్ ఒక్కసారిగా సైలెంట్..!
World· 27 Jul 2026

ఇరాన్ ఒక్కసారిగా సైలెంట్..!

ఇన్ని రోజులుగా మిస్సైళ్లతో ఒకరిపై ఒకరు విరుచుకుపడిన అమెరికా-ఇరాన్.. ఇప్పుడు కాస్త కూల్ అయినట్టు కనిపిస్తోంది. "ప్రస్తుతానికి ప్రతీకార దాడులు ఆపేస్తున్నాం" అని ఇరాన్ ప్రకటించింది. అటు ట్రంప్ కూడా "చర్చలకు కొంచెం టైమ్ ఇస్తున్నాం" అని చెప్పడంతో గత రెండు రోజులుగా అమెరికా నుంచి కూడా కొత్త దాడులు జరగలేదు. దీంతో వెస్ట్ ఆసియాలో టెన్షన్ కాస్త తగ్గినట్టే కనిపిస్తోంది. అయితే ఈ నిశ్శబ్దం శాశ్వతమా.. లేక మరోసారి యుద్ధం మొదలవుతుందా అనేదే ఇప్పుడు ప్రపంచం మొత్తం చూస్తోంది.