Latest

ఆసుపత్రికి మెగా ఫ్యామిలీ!
Cinema· 27 Jul 2026

ఆసుపత్రికి మెగా ఫ్యామిలీ!

రామ్ చరణ్ రీసెంట్‌గా కొయంబత్తూర్ ఆసుపత్రికి వెళ్లారు. 'పెద్ది' మూవీ షూటింగ్‌లో రెజ్లర్లతో ఫైట్ సీన్ చేస్తుండగా హ్యాండ్ మణికట్టు (wrist)కి గట్టిగా దెబ్బ తగిలింది. షూటింగ్ డిస్టర్బ్ అవ్వకూడదని పెయిన్ ఉన్నా అలాగే కంటిన్యూ చేయడంతో ప్రాబ్లం సీరియస్ అయింది. ఈ హ్యాండ్ సర్జరీ కోసం ఆదివారం ఫ్యామిలీ మెంబర్స్ చిరంజీవి, సురేఖ, ఉపాసనలతో కలిసి చరణ్ కొయంబత్తూర్ బయలుదేరి వెళ్లారు. చరణ్ త్వరగా రికవర్ అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

'రాయన్' నేషనల్ అవార్డు వివాదం: ధనుష్ షాకింగ్ రియాక్షన్!
Cinema· 27 Jul 2026

'రాయన్' నేషనల్ అవార్డు వివాదం: ధనుష్ షాకింగ్ రియాక్షన్!

నేషనల్ అవార్డ్స్ వివాదంపై తమిళ స్టార్ హీరో ధనుష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తన 'రాయన్' కంటే బెటర్ సినిమాలు ఉన్నాయని ఆయన ఒప్పుకున్నారు. అయితే గతంలో తన 'పుదుపేట్టై, వడ చెన్నై, కర్ణన్' లాంటి క్లాసిక్ సినిమాలకు అవార్డులు రానప్పుడు ఎవరూ మాట్లాడలేదని, ఇప్పుడు తనకు అవార్డు వస్తే 90% మంది విమర్శిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చిన అవార్డును గుర్తించి ప్రోత్సహించాలని ధనుష్ ఫ్యాన్స్ మీట్‌లో కామెంట్స్ చేశారు.

బాలయ్యను పరామర్శించిన CM చంద్రబాబు!
Politics· 27 Jul 2026

బాలయ్యను పరామర్శించిన CM చంద్రబాబు!

సినిమా షూటింగ్‌లో గాయపడిన బాలకృష్ణకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని AIG ఆసుపత్రిలో మోకాలికి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హాస్పిటల్‌లో కోలుకుంటున్న ఆయనను AP CM చంద్రబాబు నాయుడు ఆదివారం పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి బాలయ్య హెల్త్ కండిషన్‌పై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా AIG హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కూడా వారి వెంటే ఉన్నారు. బాలకృష్ణ త్వరలోనే డిశ్చార్జ్ అయ్యే ఛాన్స్ ఉంది.

అయ్యో పాపం.. 11 ఏళ్ల కవలలను బావిలో తోసేసి..!
Crime· 27 Jul 2026

అయ్యో పాపం.. 11 ఏళ్ల కవలలను బావిలో తోసేసి..!

తమిళనాడులోని తేని జిల్లా రంగానాథపురానికి చెందిన శ్రీహరీష్ (11), శబరీష్ (11) అనే కవల అన్నదమ్ములను కేశవ్ బాలాజీ (19) అనే యువకుడు బావిలోకి తోసి దారుణంగా హత్య చేశాడు. శుక్రవారం సాయంత్రం ఆడుకోవడానికి వెళ్లిన పిల్లలు మిస్సింగ్ అవ్వడంతో పేరెంట్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేపట్టిన పోలీసులకు కరడుపట్టిలోని వ్యవసాయ బావిలో పిల్లల డెడ్‌బాడీస్ కనిపించాయి. ఊరి బయట మంచి పావురాళ్లు ఉన్నాయని నమ్మించి, బావి దగ్గరకు తీసుకెళ్లి తోసేసినట్లు నిందితుడు విచారణలో ఒప్పుకున్నాడు.

టైట్ డ్రెస్సింగ్, హై హీల్స్ తో హెల్త్ రిస్కులు !
Health· 26 Jul 2026

టైట్ డ్రెస్సింగ్, హై హీల్స్ తో హెల్త్ రిస్కులు !

ఫిట్ గా కనిపించే పేరుతో టైట్ డ్రెస్, హైట్ కోసం మరీ హై హీల్స్ వేసుకోవడం వల్ల హెల్త్ రిస్క్ లు ఎక్కువని ఫ్యాషన్ ఎక్స్ పర్టులు వార్న్ చేస్తున్నారు. కేవలం స్టైల్ కోసమే కాకుండా, శరీరానికి హాని కలిగించని విధంగా డ్రెస్ చేసుకోవాల్సిన అవసరం పెరిగింది. టైట్ డ్రెస్సింగ్ వల్ల బ్లడ్ ఫ్లో ఆగిపోవడం, బ్యాక్ పెయిన్, లాంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఫ్యాషన్ ప్రపంచంలో కంఫర్ట్ కి పెద్ద పీట వేస్తూ ట్రెండీగా ఉంటూనే హెల్తీ డ్రెస్సింగ్ అలవాటు చేసుకోవాలని నిపుణుల సలహా.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని ఎంతవరకు పసిగడుతోంది?
Technology· 26 Jul 2026

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనల్ని ఎంతవరకు పసిగడుతోంది?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అసిస్టెంట్లు మన వ్యక్తిగత వివరాలు, ఇష్టాయిష్టాలను ఎంతవరకు గుర్తు పెట్టుకుంటున్నాయో తెలుసుకునేందుకు నాలుగు ప్రత్యేక చాట్‌బాట్ ప్రాంప్ట్‌లు ఎంతగానో ఉపయోగపడతాయి. మన డైలీ చాటింగ్ ఆధారంగా ఏఐ తయారు చేసుకునే డిజిటల్ ప్రొఫైల్ లోతు పాతులను ఇవి బయటపెడతాయి. ఏఐ పరిజ్ఞానం మన అలవాట్లను, థింకింగ్ స్టైల్ ని అతి దగ్గరగా గమనిస్తోందనే విషయాన్ని ఈ ప్రాంప్ట్‌ల ద్వారా పసిగట్టవచ్చని టెక్నికల్ ఎక్స్ పర్టులు అంటున్నారు.

ఫుడ్ లవర్స్ నోరూరించే తైవాన్ రుచులపై కథనాలు !
Health· 26 Jul 2026

ఫుడ్ లవర్స్ నోరూరించే తైవాన్ రుచులపై కథనాలు !

తైవాన్ ఫుడ్ కల్చర్, అక్కడి ట్రెడిషనల్ డిషెస్ ప్రయారిటీని వివరిస్తూ సైరీనా లీ రాసిన స్పెషల్ స్టోరీ రీడర్స్ ని బాగా ఆకట్టుకుం టోంది. ఉదయాన్నే లభించే ఫ్లాట్‌ బ్రెడ్, పాలు, టర్నిప్ కేక్‌ల నుంచి రాత్రి వేళల్లో దొరికే ఐస్టర్ ఆమ్లెట్లు, షేవ్డ్ ఐస్ వంటి వెరైటీ టేస్టులను ఇందులో వివరించారు. తైపీ నగరాన్ని ఆసియా ఖండంలోనే ది బెస్ట్ పుడ్ స్టేజ్ గా వర్ణిస్తూ, అక్కడి నైట్ మార్కెట్లు, ట్రెడిషనల్ ఫుడ్ కేఫ్‌ల విశేషాలను అందిస్తూ ఫుడ్ లవర్స్ నోరూరేలా రాస్తున్నారు.

పాపులర్ అవుతున్న మిల్స్ ప్రోడక్ట్స్ కల్చర్ !
Health· 26 Jul 2026

పాపులర్ అవుతున్న మిల్స్ ప్రోడక్ట్స్ కల్చర్ !

పాల ఉత్పత్తులకు రకరకాల రుచులు, పోషకాలను జోడిస్తూ డెయిరీ రంగంలో నయా ట్రెండ్ మొదలవుతోంది. పాల పదార్థాల స్థానంలో చీజ్, ప్రొబయోటిక్ పెరుగు, ఫర్మెంటెడ్ పాల ఉత్పత్తుల తయారీకి కల్చర్ ఉపయోగించడం పెరిగింది. కన్సూమర్స్ లో హెల్త్ కాన్షస్ పెరగడంతో క్వాలిటీ, ఇమ్యూనిటీని పెంచే ఈ టైప్ ప్రోడక్ట్స్ కు మార్కెట్‌లో డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది. దీంతో అనేక డెయిరీ బ్రాండ్లు మోడ్రన్ టెక్నాలజీలో, ట్రెండీగా మిల్క్ ప్రోడక్ట్స్ ని అందిస్తూ విస్తరిస్తున్నాయి.

మానసిక ప్రశాంతతనిచ్చే 'ఆప్-లిట్' బుక్స్ ట్రెండ్!
Entertainment· 26 Jul 2026

మానసిక ప్రశాంతతనిచ్చే 'ఆప్-లిట్' బుక్స్ ట్రెండ్!

బుక్ రీడింగ్ ఇన్ఫర్మేషన్ కోసమే కాకుండా మానసిక ప్రశాంతతను, రిలీఫ్ ను ఇచ్చే ట్రీట్మెంట్ గా మారుతోంది. ఈ క్రమంలో 'ఆప్-లిట్' లేదా ఉపశమనాన్నిచ్చే సాహిత్యం పేరిట సరికొత్త బుక్స్ ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతోంది. థిక్ స్టోరీస్, ఫిక్షన్ స్టోరీస్, ఇన్సిడెంట్స్ కంటే లవ్, ఎఫెక్షన్, సెకండ్ ఛాన్స్ ఇన్ లైఫ్ లాంటి ఎమోషన్స్ కి ప్రయార్టీ ఇచ్చే బుక్స్ చదివేందుకు రీడర్స్ ఆసక్తి చూపుతున్నారు. టెన్షన్ లైఫ్ లో మెంటల్ పీస్ నిచ్చేఈ టైప్ బుక్స్ కి మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది.

ఫేస్ యోగా, ఫేస్ జిమ్ లేటెస్ట్ ట్రెండ్స్ !
Health· 26 Jul 2026

ఫేస్ యోగా, ఫేస్ జిమ్ లేటెస్ట్ ట్రెండ్స్ !

ముఖ సౌందర్యం కోసం ఫేస్ యోగా, ఫేస్ జిమ్ వంటి నయా ట్రెండ్స్‌కు లేటెస్ట్ గా క్రేజ్ బాగా పెరుగుతోంది. ఫేస్‌జిమ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో దేశంలో సర్వీసెస్ స్టార్ట్ చేసి, మరింత పెరుగుతున్నాయి. కేవలం కాస్మోటిక్స్ మాత్రమే కాకుండా, ఫేస్ యోగా ద్వారా ముఖ కండరాలకు వ్యాయామం అందిస్తూ సహజ సిద్ధంగా చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి మహిళలతో పాటు జెంట్స్ కూడా వీటిపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

షుగర్ పేషెంట్స్ కి బెస్ట్ మాంక్ ఫ్రూట్ !
Health· 26 Jul 2026

షుగర్ పేషెంట్స్ కి బెస్ట్ మాంక్ ఫ్రూట్ !

జీరో కేలరీ తీపి అందించే 'మాంక్ ఫ్రూట్' (Monk Fruit) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కృత్రిమ తీపి పదార్థాలకు భిన్నంగా సహజ సిద్ధంగా లభించే ఈ పండులోని మోగ్రోసైడ్లు చక్కెర కంటే వందల రెట్లు ఎక్కువ తీపిని అందిస్తాయి. కేలరీలు లేకపోవడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచకపోవడంతో షుగర్ పేషెంట్స్, ఫిట్‌నెస్ ప్రేమికులు దీనిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. హెల్త్ కాన్షస్ బాగా పెరిగినందున చక్కెరకు బదులు మార్కెట్లో ఈ ఫ్రూట్ కు డిమాండ్ పెరిగింది.

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ తో లెఫ్ట్ పార్టీలకు ఊపు !
Politics· 26 Jul 2026

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ తో లెఫ్ట్ పార్టీలకు ఊపు !

జంతర్ మంతర్ నిరసనలలో విజయం సాధించడంతో లెఫ్ట్ పార్టీలు గొప్ప సక్సెస్ అందుకున్నాయి. పార్లమెంటులో పెద్ద బలం లేకపోయినా,AISI, SFI వంటి విద్యార్థి సంఘాల ద్వారా క్షేత్రస్థాయిలో సుదీర్ఘ పోరాటం చేసి ప్రభుత్వం దిగివచ్చేలా చేశాయి. విద్యా రంగంలో సమస్యలపై విద్యార్థులకు మద్దతు ఇవ్వడం ద్వారా లెఫ్ట్ పార్టీలు రాజకీయంగా తమ ఉనికిని, ప్రాబల్యాన్ని చాటుకోవడంలో విజయవంతమయ్యాయి.

పరీక్షల వ్యవస్థలో మార్పుకు నీలేకని సారధ్యంలో టీమ్
News· 26 Jul 2026

పరీక్షల వ్యవస్థలో మార్పుకు నీలేకని సారధ్యంలో టీమ్

పరీక్షల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు చెక్ పెడుతూ, ట్రాన్స్ పరెన్సీ పెంచేందుకు నందన్ నీలేకని అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరును మెరుగు పరచడం, అక్రమాలకు తావులేకుండా పక్కా భద్రతా చర్యలను సిఫార్సు చేయడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.

జల దోపిడీ ఆపకపోతే పోరాటమే
TG· 26 Jul 2026

జల దోపిడీ ఆపకపోతే పోరాటమే

తెలంగాణకు రావాల్సిన కృష్ణా, తుంగభద్ర నది జలాలను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని మాజీ మంత్రులు వీ.శ్రీనివాస్ గౌడ్, సీ.లక్ష్మారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. MLC నవీన్ రెడ్డి, మాజీ MLAలతో కలిసి కర్ణాటకలోని భీమా ప్రాజెక్టు, గూడూరు బ్యారేజీని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఎక్కడికక్కడ బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మించి తెలంగాణ వాటా నీటిని నిలిపేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆపదలో అండగా నిలిచిన మెగాస్టార్
Cinema· 26 Jul 2026

ఆపదలో అండగా నిలిచిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు రమేశ్‌కు ఆర్థికంగా అండగా నిలిచారు. డాక్టర్లతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న చిరంజీవి, చికిత్సకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. రమేశ్ కుటుంబసభ్యులను పరామర్శించి, వైద్యఖర్చుల కోసం రూ.3లక్షల చెక్కును అందజేశారు. ప్రభుత్వ ఆరోగ్యబీమా పథకం ద్వారా కూడా సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రమేశ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ అవినీతిపై పూర్తి చిట్టా ఉంది
Politics· 26 Jul 2026

కాంగ్రెస్ అవినీతిపై పూర్తి చిట్టా ఉంది

TG: బీజేపీ MP డీకే అరుణ CM రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రప్రభుత్వం తలచుకుంటే ఆయన ఒక్కరోజు కూడా సీఎం పదవిలో ఉండలేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ ఘటన వెనుక అసలు నిజాలు దేశానికి తెలుసని, రాహుల్ గాంధీ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొట్టారని ఆరోపించారు. రాహుల్ గాంధీ మెప్పు కోసం కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.

కాక్రోచ్ పార్టీ సంచలన ప్లాన్
Jobs· 26 Jul 2026

కాక్రోచ్ పార్టీ సంచలన ప్లాన్

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం, CJP తదుపరి లక్ష్యం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలేనన్న చర్చ మొదలైంది. జంతర్‌మంతర్ ఆందోళనల్లో నీట్ అభ్యర్థులతో పాటు UPSC, SSC, రైల్వే తదితర పోటీ పరీక్షల అభ్యర్థులు, నిరుద్యోగ యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పరీక్షల్లో పారదర్శకత, పేపర్ లీక్‌ల నియంత్రణ వంటి అంశాలను ప్రధాన డిమాండ్లుగా ముందుకు తీసుకురావాలని సీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.

మా బాధ ఇంకెవరికీ రాకూడదు
TG· 26 Jul 2026

మా బాధ ఇంకెవరికీ రాకూడదు

TG: నీట్ పేపర్ లీక్ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని షేక్ సనా తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా స్వాగతించదగ్గదే అయినా, తమ కుమార్తెను తిరిగి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు కఠిన సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ కష్టం మరే కుటుంబానికీ రాకూడదనే ఉద్దేశంతోనే విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ఢిల్లీలో నిరసనల్లో పాల్గొన్నామని చెప్పారు.

విద్యార్థుల విజయాన్ని CM ఖాతాలో వేసుకోవడం సరికాదు
Politics· 26 Jul 2026

విద్యార్థుల విజయాన్ని CM ఖాతాలో వేసుకోవడం సరికాదు

TG: నీట్ పరీక్షల వ్యవహారంలో విద్యార్థుల విజయాన్ని CM రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని TRS చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత చేసిన పోరాటం ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని అన్నారు. ఇది పూర్తిగా స్టూడెంట్ విజయమని స్పష్టం చేశారు. యువత ప్రశ్నిస్తారనే భయంతోనే కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిందని ఆరోపించారు. హామీలు అమలు చేయకుండా CM కొత్త ప్రకటనలు చేస్తే ప్రజలు నమ్మరని ఆమె ఫైరయ్యారు.

KGBVలో ఫుడ్ పాయిజనింగ్
Health· 26 Jul 2026

KGBVలో ఫుడ్ పాయిజనింగ్

AP: అనకాపల్లి జిల్లా కోటవురట్ల KGBVలో 30మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడిన ఐదుగురిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా, మిగిలిన వారికి పాఠశాలలోనే వైద్యులు ఓఆర్ఎస్ అందించి పరిశీలనలో ఉంచారు. మిగిలిన ఆహారాన్ని రాత్రి భోజనంగా ఇవ్వడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆహారం, తాగునీటి నమూనాలను పరీక్షలకు పంపించారు. RDO, DMHO సంఘటన స్థలాన్ని సందర్శించి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

పెద్ది ఆరోగ్యం నిలకడగా ఉంది.. వదంతులు నమ్మొద్దు
Health· 26 Jul 2026

పెద్ది ఆరోగ్యం నిలకడగా ఉంది.. వదంతులు నమ్మొద్దు

TG: నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు అత్యవసరంగా CPRతోపాటు ప్రత్యేక చికిత్స అందించగా, గుండె స్పందన తిరిగి సాధారణ స్థితికి వచ్చిందని వెల్లడించారు. న్యూమోనియా తీవ్రత కారణంగా శరీరం పూర్తిగా సహకరించడం లేదని, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందన్నారు. మెరుగైనవైద్యం కోసం ఆయనను HYDకు తరలిస్తున్నట్లు తెలిపారు.