Latest

మానసిక ప్రశాంతతనిచ్చే 'ఆప్-లిట్' బుక్స్ ట్రెండ్!
బుక్ రీడింగ్ ఇన్ఫర్మేషన్ కోసమే కాకుండా మానసిక ప్రశాంతతను, రిలీఫ్ ను ఇచ్చే ట్రీట్మెంట్ గా మారుతోంది. ఈ క్రమంలో 'ఆప్-లిట్' లేదా ఉపశమనాన్నిచ్చే సాహిత్యం పేరిట సరికొత్త బుక్స్ ట్రెండ్ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అవుతోంది. థిక్ స్టోరీస్, ఫిక్షన్ స్టోరీస్, ఇన్సిడెంట్స్ కంటే లవ్, ఎఫెక్షన్, సెకండ్ ఛాన్స్ ఇన్ లైఫ్ లాంటి ఎమోషన్స్ కి ప్రయార్టీ ఇచ్చే బుక్స్ చదివేందుకు రీడర్స్ ఆసక్తి చూపుతున్నారు. టెన్షన్ లైఫ్ లో మెంటల్ పీస్ నిచ్చేఈ టైప్ బుక్స్ కి మార్కెట్ లో డిమాండ్ పెరుగుతోంది.

ఫేస్ యోగా, ఫేస్ జిమ్ లేటెస్ట్ ట్రెండ్స్ !
ముఖ సౌందర్యం కోసం ఫేస్ యోగా, ఫేస్ జిమ్ వంటి నయా ట్రెండ్స్‌కు లేటెస్ట్ గా క్రేజ్ బాగా పెరుగుతోంది. ఫేస్‌జిమ్ వంటి అంతర్జాతీయ బ్రాండ్లు రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంతో దేశంలో సర్వీసెస్ స్టార్ట్ చేసి, మరింత పెరుగుతున్నాయి. కేవలం కాస్మోటిక్స్ మాత్రమే కాకుండా, ఫేస్ యోగా ద్వారా ముఖ కండరాలకు వ్యాయామం అందిస్తూ సహజ సిద్ధంగా చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యకరంగా ఉంచుకోవడానికి మహిళలతో పాటు జెంట్స్ కూడా వీటిపై ఇంట్రెస్ట్ చూపుతున్నారు.

షుగర్ పేషెంట్స్ కి బెస్ట్ మాంక్ ఫ్రూట్ !
జీరో కేలరీ తీపి అందించే 'మాంక్ ఫ్రూట్' (Monk Fruit) ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కృత్రిమ తీపి పదార్థాలకు భిన్నంగా సహజ సిద్ధంగా లభించే ఈ పండులోని మోగ్రోసైడ్లు చక్కెర కంటే వందల రెట్లు ఎక్కువ తీపిని అందిస్తాయి. కేలరీలు లేకపోవడం, రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచకపోవడంతో షుగర్ పేషెంట్స్, ఫిట్‌నెస్ ప్రేమికులు దీనిపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. హెల్త్ కాన్షస్ బాగా పెరిగినందున చక్కెరకు బదులు మార్కెట్లో ఈ ఫ్రూట్ కు డిమాండ్ పెరిగింది.

జంతర్ మంతర్ ప్రొటెస్ట్ తో లెఫ్ట్ పార్టీలకు ఊపు !
జంతర్ మంతర్ నిరసనలలో విజయం సాధించడంతో లెఫ్ట్ పార్టీలు గొప్ప సక్సెస్ అందుకున్నాయి. పార్లమెంటులో పెద్ద బలం లేకపోయినా,AISI, SFI వంటి విద్యార్థి సంఘాల ద్వారా క్షేత్రస్థాయిలో సుదీర్ఘ పోరాటం చేసి ప్రభుత్వం దిగివచ్చేలా చేశాయి. విద్యా రంగంలో సమస్యలపై విద్యార్థులకు మద్దతు ఇవ్వడం ద్వారా లెఫ్ట్ పార్టీలు రాజకీయంగా తమ ఉనికిని, ప్రాబల్యాన్ని చాటుకోవడంలో విజయవంతమయ్యాయి.

పరీక్షల వ్యవస్థలో మార్పుకు నీలేకని సారధ్యంలో టీమ్
పరీక్షల వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజీలకు చెక్ పెడుతూ, ట్రాన్స్ పరెన్సీ పెంచేందుకు నందన్ నీలేకని అధ్యక్షతన ఆరుగురు సభ్యులతో కూడిన ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూనేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పనితీరును మెరుగు పరచడం, అక్రమాలకు తావులేకుండా పక్కా భద్రతా చర్యలను సిఫార్సు చేయడమే ఈ కమిటీ ప్రధాన లక్ష్యం.

జల దోపిడీ ఆపకపోతే పోరాటమే
తెలంగాణకు రావాల్సిన కృష్ణా, తుంగభద్ర నది జలాలను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయని మాజీ మంత్రులు వీ.శ్రీనివాస్ గౌడ్, సీ.లక్ష్మారెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. MLC నవీన్ రెడ్డి, మాజీ MLAలతో కలిసి కర్ణాటకలోని భీమా ప్రాజెక్టు, గూడూరు బ్యారేజీని పరిశీలించిన అనంతరం మాట్లాడారు. ఎక్కడికక్కడ బ్యారేజీలు, రిజర్వాయర్లు నిర్మించి తెలంగాణ వాటా నీటిని నిలిపేస్తున్నారని విమర్శించారు. దీనివల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ఎడారిగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆపదలో అండగా నిలిచిన మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి మరోసారి తన పెద్ద మనసును చాటుకున్నారు. బ్రెయిన్ స్ట్రోక్‌తో అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సినీ నటుడు రమేశ్‌కు ఆర్థికంగా అండగా నిలిచారు. డాక్టర్లతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న చిరంజీవి, చికిత్సకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. రమేశ్ కుటుంబసభ్యులను పరామర్శించి, వైద్యఖర్చుల కోసం రూ.3లక్షల చెక్కును అందజేశారు. ప్రభుత్వ ఆరోగ్యబీమా పథకం ద్వారా కూడా సహాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. రమేశ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

కాంగ్రెస్ అవినీతిపై పూర్తి చిట్టా ఉంది
TG: బీజేపీ MP డీకే అరుణ CM రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రప్రభుత్వం తలచుకుంటే ఆయన ఒక్కరోజు కూడా సీఎం పదవిలో ఉండలేరని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండున్నరేళ్ల అవినీతికి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ ఘటన వెనుక అసలు నిజాలు దేశానికి తెలుసని, రాహుల్ గాంధీ రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థులను రెచ్చగొట్టారని ఆరోపించారు. రాహుల్ గాంధీ మెప్పు కోసం కాకుండా ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టాలని సూచించారు.

కాక్రోచ్ పార్టీ సంచలన ప్లాన్
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం, CJP తదుపరి లక్ష్యం ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలేనన్న చర్చ మొదలైంది. జంతర్‌మంతర్ ఆందోళనల్లో నీట్ అభ్యర్థులతో పాటు UPSC, SSC, రైల్వే తదితర పోటీ పరీక్షల అభ్యర్థులు, నిరుద్యోగ యువత పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ, పరీక్షల్లో పారదర్శకత, పేపర్ లీక్‌ల నియంత్రణ వంటి అంశాలను ప్రధాన డిమాండ్లుగా ముందుకు తీసుకురావాలని సీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.

మా బాధ ఇంకెవరికీ రాకూడదు
TG: నీట్ పేపర్ లీక్ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్‌కు చెందిన విద్యార్థిని షేక్ సనా తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా స్వాగతించదగ్గదే అయినా, తమ కుమార్తెను తిరిగి తీసుకురాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా ప్రభుత్వాలు కఠిన సంస్కరణలు తీసుకురావాలని డిమాండ్ చేశారు. తమ కష్టం మరే కుటుంబానికీ రాకూడదనే ఉద్దేశంతోనే విద్యార్థుల ఉద్యమానికి మద్దతుగా ఢిల్లీలో నిరసనల్లో పాల్గొన్నామని చెప్పారు.

విద్యార్థుల విజయాన్ని CM ఖాతాలో వేసుకోవడం సరికాదు
TG: నీట్ పరీక్షల వ్యవహారంలో విద్యార్థుల విజయాన్ని CM రేవంత్ రెడ్డి తన ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటని TRS చీఫ్ కల్వకుంట్ల కవిత విమర్శించారు. విద్యార్థులు, నిరుద్యోగ యువత చేసిన పోరాటం ఫలితంగానే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారని అన్నారు. ఇది పూర్తిగా స్టూడెంట్ విజయమని స్పష్టం చేశారు. యువత ప్రశ్నిస్తారనే భయంతోనే కాంగ్రెస్ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిందని ఆరోపించారు. హామీలు అమలు చేయకుండా CM కొత్త ప్రకటనలు చేస్తే ప్రజలు నమ్మరని ఆమె ఫైరయ్యారు.
KGBVలో ఫుడ్ పాయిజనింగ్
AP: అనకాపల్లి జిల్లా కోటవురట్ల KGBVలో 30మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడిన ఐదుగురిని కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించి చికిత్స అందిస్తుండగా, మిగిలిన వారికి పాఠశాలలోనే వైద్యులు ఓఆర్ఎస్ అందించి పరిశీలనలో ఉంచారు. మిగిలిన ఆహారాన్ని రాత్రి భోజనంగా ఇవ్వడంతో ఫుడ్ పాయిజనింగ్ జరిగి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ఆహారం, తాగునీటి నమూనాలను పరీక్షలకు పంపించారు. RDO, DMHO సంఘటన స్థలాన్ని సందర్శించి విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు.

పెద్ది ఆరోగ్యం నిలకడగా ఉంది.. వదంతులు నమ్మొద్దు
TG: నర్సంపేట మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన ఆయనకు అత్యవసరంగా CPRతోపాటు ప్రత్యేక చికిత్స అందించగా, గుండె స్పందన తిరిగి సాధారణ స్థితికి వచ్చిందని వెల్లడించారు. న్యూమోనియా తీవ్రత కారణంగా శరీరం పూర్తిగా సహకరించడం లేదని, నిపుణుల పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోందన్నారు. మెరుగైనవైద్యం కోసం ఆయనను HYDకు తరలిస్తున్నట్లు తెలిపారు.

స్మశానం పక్కన చదువు వద్దని పేరెంట్స్ ఆగ్రహం
AP: పార్వతీపురం మన్యం జిల్లా పాచిపెంట గిరిజన ఆశ్రమ పాఠశాల శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులను సాలూరు యూత్ ట్రైనింగ్ సెంటర్‌కి తరలించాలని అధికారులు నిర్ణయించారు. అయితే YTC పక్కనే స్మశానవాటిక ఉండటంతో తమ పిల్లలను అక్కడికి పంపబోమంటూ తల్లిదండ్రులు బస్సులను అడ్డుకుని ఆందోళన చేపట్టారు. అవసరమైతే TCలు ఇచ్చి ఇతర పాఠశాలల్లో చేర్పిస్తామని స్పష్టం చేశారు. 20KM దూరంలోని కేంద్రానికి పంపడం వల్ల పిల్లల చదువు, మానసిక స్థితిపై ప్రభావం పడుతుందన్నారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.

ఆస్పత్రిలో చేరిన YS షర్మిల
AP కాంగ్రెస్ అధ్యక్షురాలు YS షర్మిల ఆస్పత్రిలో చేరిన విషయం వెలుగులోకి వచ్చింది. ఇటీవల తనకు కడుపుకు సంబంధించిన శస్త్రచికిత్స జరిగినట్లు ఆమె సోషల్ మీడియాలో ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోను పంచుకుంటూ వెల్లడించారు. ప్రస్తుతం కోలుకుంటున్నానని, తన ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఏ కారణంతో, ఎలాంటి సర్జరీ జరిగిందనే వివరాలను వెల్లడించలేదు. ఇటీవల పార్టీ కార్యక్రమాలు, సోషల్ మీడియాకు దూరంగా ఉన్న షర్మిల.. నీట్ పేపర్ లీక్ అంశంపై జరిగిన ఆందోళనల్లో కూడా కనిపించలేదు.
రాపిడో రైడర్‌గా MLC తీన్మార్ మల్లన్న
TG: హైదరాబాద్‌లో MLC, తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న వినూత్నంగా రాపిడో రైడర్‌గా మారారు. నగరంలో ఓ ప్రయాణికుడు రాపిడో బుక్ చేసుకోగా, స్వయంగా బైక్‌పై వెళ్లి అతడిని పికప్ చేసి ఇంటి వద్ద దింపారు. ప్రయాణం ముగిసిన తర్వాత హెల్మెట్, మాస్క్ తొలగించడంతో కస్టమర్ ఆశ్చర్యపోయి మల్లన్నను గుర్తించాడు. రాపిడో రైడర్ల కష్టాలు, సమస్యలు ప్రత్యక్షంగా తెలుసుకోవడం, వారి జీవన పరిస్థితులను అర్థం చేసుకోవడానికే ఈ ప్రయోగం చేసినట్లు ఆయన తెలిపారు.

గుహలో చిక్కుకుని ఆంధ్రా భక్తుడి మృతి
AP: తమిళనాడులోని అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన మణికుమార్ (36) కుటుంబంతో కలిసి స్వామివారి దర్శనం అనంతరం గిరిప్రదక్షిణ చేశారు. ఈ సందర్భంగా ఇడుక్కి పిళ్లైయార్ గుహలోకి ప్రవేశించారు. ఆ గుహలోకి వెళ్లి బయటకు వస్తే కుటుంబ కష్టాలు తొలగుతాయని భక్తుల విశ్వాసం. అయితే మణికుమార్ గుహలో చిక్కుకుని ఊపిరాడక స్పృహ కోల్పోయారు. స్థానికులు బయటకు తీసి ఆస్పత్రికి తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దైవ దర్శనానికి వెళ్తుండగా విషాదం
AP: పార్వతీపురం మన్యం జిల్లాలోని సీతానగరం మండలం జోగంపేట వద్ద ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాయగడ మజ్జిగౌరమ్మ తల్లి దర్శనానికి వెళ్తున్న భక్తుల ఆటోను ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయనగరం జిల్లా చీపురుపల్లి మండలం అలజంగి గ్రామానికి చెందిన చింతల గురునాయుడు (60) అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే పార్వతీపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మాజీ MLA పెద్ది సుదర్శన్‌రెడ్డికి గుండెపోటు
TG: వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ MLA, BRS సీనియర్ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆకస్మికంగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు వెంటనే హన్మకొండలోని రోహిణి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ICUలో వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండడంతో BRS శ్రేణులు, అభిమానులు పెద్దసంఖ్యలో ఆస్పత్రికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, KTR హుటాహుటిన హన్మకొండకు బయలుదేరారు.

RSS బ్యాక్‌గ్రౌండ్‌తో విద్యాశాఖ పగ్గాలు
నీట్ పేపర్ లీక్ ఆందోళనలతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం విద్యాశాఖ అదనపు బాధ్యతలను సీనియర్ బీజేపీ నేత ప్రహ్లాద్ జోషికి అప్పగించారు. విద్యార్థి దశ నుంచే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ భావజాలంతో ప్రజాజీవితాన్ని ప్రారంభించిన జోషి, కార్యకర్త స్థాయి నుంచి కేంద్రమంత్రిగా ఎదిగారు. ప్రస్తుతం వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, తదితర శాఖలను నిర్వహిస్తున్న ఆయనకు విద్యాశాఖ బాధ్యతలు కూడా దక్కాయి. దేశవ్యాప్తంగా విద్యార్థుల ఆందోళనల మధ్య RSS నేపథ్యం ఉన్న నాయకుడికి విద్యాశాఖ బాధ్యతలు అప్పగించడంపై చర్చనీయాంశమైంది.

స్కూటీపై సరదా ప్రయాణం.. క్షణాల్లో విషాదం
TG: హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రికెట్ ఆడేందుకు ముగ్గురు యువకులు ఒకే స్కూటీపై వెళ్తుండగా, వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్ (17), లక్ష్మీతేజ (17) అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడు గాయపడ్డాడు. ప్రమాదం అనంతరం టిప్పర్ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని టిప్పర్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.