Latest

హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు బుల్లెట్ ట్రైన్
News· 18 Jul 2026

హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు బుల్లెట్ ట్రైన్

TG: హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లే బుల్లెట్ ట్రైన్ మార్గానికి తెలంగాణ ప్రభుత్వం అలైన్‌మెంట్‌లో మార్పులు చేసి కేంద్ర ప్రభుత్వానికిచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లాలంటే గంటల కొద్దీ సమయం పడుతుంది. హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు వేలాదిమంది భక్తులు తరచూ వెళ్తుంటారు. ఈ ఉద్దేశంతో అలైన్‌మెంట్ మార్చాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. శంషాబాద్‌, భారత్‌ ఫ్యూచర్‌సిటీ, ఆమనగల్లు, మన్ననూరు, శ్రీశైలం, సోమశిల మీదుగా బెంగళూరుకు దారిని ప్రతిపాదించారు.

ఆస్పత్రిలో MLA సర్‌ప్రైజ్ విజిట్
Health· 18 Jul 2026

ఆస్పత్రిలో MLA సర్‌ప్రైజ్ విజిట్

AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె MLA షాజహాన్ బాషా శుక్రవారం రాత్రి బైక్‌పై ఒంటరిగా వచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎమర్జెన్సీ వార్డును సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. విషం సేవించి చికిత్స పొందుతున్న ఓ మహిళను పరామర్శించి, ఆమెను వేధించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని డాకర్లకు సూచించారు.

క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్ పేరుతో భారీ మోసం
Crime· 18 Jul 2026

క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్ పేరుతో భారీ మోసం

TG: హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ఎం. మధుకర్ గౌడ్ క్రెడిట్ కార్డు అప్‌గ్రేడ్ పేరుతో సైబర్ మోసగాళ్ల వలలో చిక్కి రూ.8.52 లక్షలు కోల్పోయారు. RBL బ్యాంక్ అధికారినని పరిచయం చేసుకున్న ఓ వ్యక్తి వాట్సాప్ కాల్ చేసి, కొత్త క్రెడిట్ కార్డు ఇస్తామని నమ్మించి కార్డు నంబర్, CVV వివరాలు తీసుకున్నాడు. అనంతరం వరుసగా OTPలు రావడంతో మూడు క్రెడిట్ కార్డుల నుంచి మొత్తం రూ.8,52,644 డెబిట్ అయ్యింది. మోసపోయినట్లు గుర్తించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విజయవాడలో డయేరియా కలకలం
Health· 18 Jul 2026

విజయవాడలో డయేరియా కలకలం

AP: విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని గిరిపురంలో డయేరియా కలకలం రేపుతోంది. రెండు వీధులకు చెందిన సుమారు 20 మంది డయేరియా బారిన పడగా, పలువురు చికిత్స పొందుతున్నారు. కుళాయిల ద్వారా కలుషిత నీరు సరఫరా అవుతుండటమే దీనికి కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. గురువారం రాత్రి ఒకేసారి ఐదుగురు డయేరియా బాధితులను గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం రెండేళ్ల చిన్నారికి తీవ్ర విరోచనాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని, హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేసి బాధితులకు చికిత్స అందించాలని కోరారు.

ఒక్క ఫిర్యాదుతో హాస్టల్‌కు వెళ్లిన CM విజయ్
Education· 18 Jul 2026

ఒక్క ఫిర్యాదుతో హాస్టల్‌కు వెళ్లిన CM విజయ్

తమిళనాడు CM విజయ్ తనదైన స్టైల్‌లో పాలనను చూపిస్తున్నారు. హాస్టల్‌లో భోజనం నాణ్యత సరిగ్గా లేదంటూ ఓ విద్యార్థి సీఎంకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన విజయ్ వెంటనే హాస్టల్ విద్యార్థులతో సమావేశమయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హాస్టల్ వార్డెన్, వాచ్‌మెన్ల ప్రవర్తన బాగాలేదని, CCTV కెమెరాలు పనిచేయడం లేదని, నీటి సమస్యలు ఉన్నాయని వారు తెలిపారు. విద్యార్థులు చెప్పిన ప్రతి సమస్యను విన్న ఆయన, సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

జంతర్ మంతర్ వద్ద అభిజీత్ దీప్కే నిరసన
Education· 18 Jul 2026

జంతర్ మంతర్ వద్ద అభిజీత్ దీప్కే నిరసన

ఢిల్లీలోని జంతర్ మంతర్ నుంచి సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్‌ను ఢిల్లీ పోలీసులు బలవంతంగా తీసుకువెళ్లారని CJP వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఆరోపించారు. ఈ సందర్భంగా వందలాది మంది యువతతో ఆయన శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నీట్, తదితర ఉద్యోగ, ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకుంటున్న అక్రమాలు, పేపర్ లీకేజీలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 20న పార్లమెంట్‌ను ముట్టడించనున్నట్లు తెలిపారు. పేపర్ లీక్‌లపై తమ పోరాటం ఆగదన్నారు.

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ బస్సు డ్రైవర్లు
TG· 18 Jul 2026

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ బస్సు డ్రైవర్లు

TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ KLR కాలేజ్ బస్సు డ్రైవర్ భాస్కర్, కొత్తగూడెం SRDG జూనియర్ కాలేజ్ బస్ డ్రైవర్ అజయ్ కుమార్ మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. కొత్తగూడెం ట్రాఫిక్ పోలీసులు స్కూల్ బస్సులు, భారీ వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. తాగి వాహనాలు నడుపుతున్న డ్రైవర్లపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి డ్రైవర్ల డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఫిట్‌నెస్, పర్మిట్, ఇన్సూరెన్స్, ఇతర సంబంధిత పత్రాలను పరిశీలించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ట్రాఫిక్ SI ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

వాంగ్‌చుక్ దీక్ష భగ్నం..  ఆస్పత్రికి తరలింపు
Education· 18 Jul 2026

వాంగ్‌చుక్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలింపు

నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో కేందమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేస్తున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఢిల్లీ హైకోర్టు ఆందోళన వ్యక్తం చేయడంలో ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు. వైద్య పరీక్షల కోసం ఆయనను ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. నీట్, ఇతర పరీక్షల ప్రశ్నపత్రాల లీక్, అవకతవకలపై సమగ్ర విచారణ జరపాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని వాంగ్‌చుగ్ జూన్ 28న నిరవధిక దీక్ష ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఎండిపోతున్న పంటలు
AP· 18 Jul 2026

ఎల్‌నినో ఎఫెక్ట్.. ఎండిపోతున్న పంటలు

AP: ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్ సాగు తీవ్ర సంక్షోభంలో పడింది. వర్షాభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వేడిగాలులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంటలు ఎండిపోతున్నాయి. రాష్ట్రంలోని 591 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో రైతులు బోర్లు, బావులు తవ్విస్తున్నారు. గోదావరి డెల్టాలో సాగు కొనసాగుతున్నా, మిగిలిన ప్రాంతాల్లో వరి నాట్లు ప్రశ్నార్థకంగా మారాయి. ఖరీఫ్‌లో వరి సాగు 10–15 శాతం తగ్గి, ధాన్యం ఉత్పత్తి కూడా 15 శాతం వరకు పడిపోవచ్చని ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పేర్కొంది.

యువ సంగ్రామ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Politics· 18 Jul 2026

యువ సంగ్రామ సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

TG: BRS పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ స్టేడియంలో తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. సదస్సు కోసం ఇప్పటికే BRS యువజన, విద్యార్థి విభాగాలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాయి. ఈ సభకు అనుమతి ఇవ్వాలని పార్టీ నాయకులు గత రెండు వారాల క్రితమే పోలీసులను కోరగా వారి నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో సభకు అనుమతి ఇవ్వాలని కోర్ట్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్
TG· 18 Jul 2026

మామునూరు ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్

TG: వరంగల్‌ జిల్లా మామునూరు ఎయిర్‌పోర్ట్‌ను శంషాబాద్‌ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ తరహాలో అభివృద్ధి చేయనున్నారు. ఈ విమానాశ్రయం నిర్మాణానికి కేంద్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రన్‌వే పునర్నిర్మాణం, కొత్త ఏప్రాన్‌, లింక్‌ టాక్సీవే, ఐసోలేషన్‌ బే, పెరిమీటర్‌ రోడ్డు, ఎమర్జెన్సీ యాక్సెస్‌ రోడ్డు తదితరాల నిర్మాణం కోసం రూ. 2,034 కోట్ల అంచనా వయ్యంతో.. ఎయిర్‌ పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI) టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులను 15 నెలల్లోగా పూర్తిచేయాలని పేర్కొంది. విమానాశ్రయ నిర్మాణం కాకతీయ వైభవాన్ని ప్రతిబింబించేలా ఉండాలని CM రేవంత్‌ విజ్ఞప్తి చేయగా.. అందుకు కేంద్రం ఒకే చెప్పింది.

ధరణి అక్రమాలపై బిగ్ యాక్షన్
TG· 18 Jul 2026

ధరణి అక్రమాలపై బిగ్ యాక్షన్

TG: గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. CM రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2020 అక్టోబరు 29న ధరణి పోర్టల్‌ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, అసైన్డ్‌, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా అనుమానాస్పద లావాదేవీలన్నింటినీ లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే చేపట్టిన ఫోరెన్సిక్‌ ఆడిట్‌లో 10వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలున్నట్లు గుర్తించామన్నారు.

పల్నాడును ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం
AP· 18 Jul 2026

పల్నాడును ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తాం

AP: పల్నాడులో ఇకపై రక్తపాతం కాదు, పారిశ్రామిక విప్లవం జరగాలని CM చంద్రబాబు ఆకాంక్షించారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో జరిగిన రుణ వితరణ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. 1,03,246 మంది లబ్ధిదారులకు రూ.3,216 కోట్ల రుణాలను వారు పంపిణీ చేశారు. బహిరంగ సభలో CM మాట్లాడుతూ... రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకువస్తామని స్పష్టం చేశారు. ఒకప్పుడు బ్యాంకు లోన్ పొందడం కష్టంగా ఉండేదని, ఇప్పుడు ప్రజల వద్దకే బ్యాంకులు వెళ్లి లోన్స్ అందించడం, ఇటువంటి రుణ మేళాలు నిర్వహించడం గర్వకారణమన్నారు.

హుబ్బళ్లిలో రేప్ బాధితురాలి బిడ్డ అమ్మకం- ఆ మైనర్ మళ్లీ ప్రిగ్నెంట్
Crime· 17 Jul 2026

హుబ్బళ్లిలో రేప్ బాధితురాలి బిడ్డ అమ్మకం- ఆ మైనర్ మళ్లీ ప్రిగ్నెంట్

కర్ణాటకలోని హుబ్బళ్ళిలో అత్యంత ఘోరమైన ఘటన వెలుగుచూసింది. 2025లో పలుమార్లు లైంగిక దాడికి గురై ప్రిగ్నెంట్ అయిన ఒక మైనర్ బాలికకు పుట్టిన శిశువును, ఆమె తల్లిదండ్రులు వేరే కుటుంబానికి అమ్మేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఆ బాలిక మళ్లీ గర్భం దాల్చడం కలకలం రేపింది. ఈ ఘటనపై నిందితుడితో పాటు, గర్భాన్ని దాచిపెట్టిన తల్లిదండ్రులు, లీగల్ ప్రొసీజర్స్ పాటించకుండా ట్రీట్మెంట్ ఇచ్చిన ఇద్దరు ప్రైవేట్ వైద్యులపై పోక్సో (POCSO) , భారతీయ న్యాయ సంహిత (BNS) కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీ స్టేట్ గా గుజరాత్- నీతీ ఆయోగ్ రిపోర్ట్
News· 17 Jul 2026

ఇన్వెస్ట్ మెంట్ ఫ్రెండ్లీ స్టేట్ గా గుజరాత్- నీతీ ఆయోగ్ రిపోర్ట్

నీతి ఆయోగ్ తాజాగా విడుదల చేసిన 'ఇన్వెస్ట్‌మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్'లో గుజరాత్ దేశంలోనే అత్యంత పెట్టుబడి అనుకూల రాష్ట్రంగా మొదటి స్థానంలో నిలిచింది. దీని తర్వాతి స్థానాల్లో మహారాష్ట్ర, తమిళనాడు నిలిచాయి. రాష్ట్రాల్లోని మౌలిక సదుపాయాలు, వ్యాపార వాతావరణం, ఆర్థిక స్థితిగతులు, పారదర్శక విధానాల ఆధారంగా ఈ ర్యాంకులను కేటాయించారు. భారీ రాష్ట్రాల విభాగంలో ఒడిశా 5వ స్థానంలో నిలవగా, హిమాలయ రాష్ట్రాల్లో ఉత్తరాఖండ్, యూటీల జాబితాలో గోవా అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాయి.

వార్ ఎఫెక్ట్ తో వలస కార్మికుల విల విల
World· 17 Jul 2026

వార్ ఎఫెక్ట్ తో వలస కార్మికుల విల విల

గల్ఫ్ రీజియన్‌లో నెలకొన్న అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధ ప్రభావం దుబాయ్‌లోని వలస కార్మికులపై తీవ్రంగా పడింది. పర్యాటకం, ఏవియేషన్ రంగాలు దెబ్బతినడంతో భారీగా ఉద్యోగాల కోత, జీతాల తగ్గింపులు జరుగుతున్నాయి. ఉపాధి కోల్పోయిన వేలాది మంది భారతీయులు, ఇతర దేశాల వలసదారులు కొత్త కొలువుల కోసం రోడ్లపైకి వస్తున్నారు. మూడో త్రైమాసికంలో మరిన్ని ఉద్యోగాలు తగ్గొచ్చని సర్వేలు చెబుతుండగా, ఇక్కడి సంక్షోభం స్వదేశాల్లోని వారి కుటుంబాలను తీవ్ర ఆందోళనలోకి నెట్టేసింది.

రోజుకు 17 గంటలు కష్టపడ్డా- నీట్ ర్యాంకర్ ఆర్యన్ గుప్తా
News· 17 Jul 2026

రోజుకు 17 గంటలు కష్టపడ్డా- నీట్ ర్యాంకర్ ఆర్యన్ గుప్తా

నీట్ యూజీ పరీక్షల్లో పంజాబ్‌కు చెందిన ఆర్యన్ గుప్తా 715/720 మార్కులతో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. క్యాన్సర్ రోగులకు సేవ చేయాలనే బలమైన సంకల్పంతోనే ఈ ఘనత సాధించినట్లు ఆయన తెలిపారు. రోజుకు 16 నుండి 17 గంటలు కష్టపడి చదివేవాడినని, విజయం సాధించాలంటే ఉపాధ్యాయుల గైడెన్స్న్ ని పూర్తిగా నమ్మాలని ఆర్యన్ గుప్తా విద్యార్థులకు సూచించారు.

ఇకపై రైలు ప్రయాణికులను అలా పిలవొద్దు- సుప్రీం !
News· 17 Jul 2026

ఇకపై రైలు ప్రయాణికులను అలా పిలవొద్దు- సుప్రీం !

ఇకపై రైల్వే ప్రయాణికులను సెకండ్ క్లాస్ ప్రయాణికులు అని సంబోధించవద్దని రైల్వే శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది..అలా పిలవడం రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నమని కామెంట్ చేసింది.'క్లాస్'అనే డివిజన్ కేవలం రైలు కోచ్‌లకు మాత్రమే లిమిట్ చేయాలని ద్విసభ్య బెంచ్ స్పష్టం చేసింది. యాక్సిడెంట్లు జరిగినప్పుడు టికెట్ పోయినా పరిహారాన్ని నిరాకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. బాధిత కుటుంబాలు అఫిడవిట్ ఇస్తే సరిపోతుందని స్పష్టం చేసింది. రైల్వేయాక్సిడెంట్ బీమా చట్టాలను మానవతా దృక్పథంతో అమలు చేయాలని బెంచ్ కోరింది.

ఇండియన్ ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ ఎసరు !
World· 17 Jul 2026

ఇండియన్ ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ ఎసరు !

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస వచ్చిన ట్రక్ డ్రైవర్ల స్థానంలో ఆ దేశ మిలిటరీ వెటరన్స్‌ను (మాజీ సైనికులను) నియమించాలని ప్రతిపాదిం చారు. విదేశీ డ్రైవర్లలో చాలామంది మద్యం మత్తులో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమ వుతున్నారని ఆయన ఆరోపించారు. ట్రంప్ చేసిన ఈ ప్రతిపాదన గనుక అమలులోకి వస్తే, అమెరికాలో ట్రకింగ్ రంగంలో ఉన్న దాదాపు 1.5 లక్షల మంది భారతీయులపై, ముఖ్యంగా పంజాబీ, సిక్కు సామాజిక వర్గాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం వలసదారులను తీవ్రంగా టెన్షన్ పెడుతోంది.

క్రికెట్ దిగ్గజం సర్ గారీఫీల్డ్ సోబర్స్ కన్నుమూత !
Sports· 17 Jul 2026

క్రికెట్ దిగ్గజం సర్ గారీఫీల్డ్ సోబర్స్ కన్నుమూత !

క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ లెజెండ్ సర్ గార్ఫీల్డ్ సోబర్స్ (89) శుక్రవారం కన్నుమూశారు. ఈ విషయాన్ని క్రికెట్ వెస్టిండీస్ (CWI) అధికారికంగా ధృవీకరించింది. 1936లో బార్బడోస్‌లో జన్మించిన ఆయన.. తన అద్భుతమైన బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ నైపుణ్యాలతో క్రికెట్ రంగాన్ని శాసించారు. ఒకే ఓవర్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి బ్యాటర్‌గా ఆయన చరిత్ర సృష్టించారు. ఆయన మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా క్రీడా ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

బుల్లెట్ ట్రైన్ పై జపాన్ మాజీ మంత్రి కామెంట్స్ ను ఖండించిన కేంద్రం !
News· 17 Jul 2026

బుల్లెట్ ట్రైన్ పై జపాన్ మాజీ మంత్రి కామెంట్స్ ను ఖండించిన కేంద్రం !

ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ఆలస్యానికి భారత అధికారుల వైఖరే కారణ మంటూ జపాన్ మాజీ మంత్రి హిడెకి మాకిహారా చేసిన ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. చర్చల సమయంలో భారత అధికారులు రూల్స్ పాటించకుండా స్వార్థపూ రితంగా వ్యవహరించారని ఆయన విమర్శించారు. అయితే, ఈ వాదనలను తోసిపుచ్చిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ.. న్యూఢిల్లీ-టోక్యో మధ్య చర్చలు బానే సాగుతున్నాయని, ప్రాజెక్ట్ పనులు వేగంగా జరుగుతున్నాయని క్లారిటీ ఇచ్చింది.