ధరణి అక్రమాలపై బిగ్ యాక్షన్

TG: గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరిపిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. CM రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 2020 అక్టోబరు 29న ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో జరిగిన భూముల రిజిస్ట్రేషన్లు, రికార్డుల మార్పులు, అసైన్డ్, ప్రభుత్వ భూముల బదలాయింపులు సహా అనుమానాస్పద లావాదేవీలన్నింటినీ లోతుగా పరిశీలించాలని మంత్రివర్గం నిర్ణయించిందన్నారు. ఇప్పటికే చేపట్టిన ఫోరెన్సిక్ ఆడిట్‌లో 10వేలకు పైగా అనుమానాస్పద లావాదేవీలున్నట్లు గుర్తించామన్నారు.



