Latest

షెన్‌జెన్‌లో రోబోల బాక్సింగ్ ఫైట్ నైట్
Technology· 17 Jul 2026

షెన్‌జెన్‌లో రోబోల బాక్సింగ్ ఫైట్ నైట్

చైనాలోని షెన్‌జెన్ నగరం సరికొత్త రికార్డుకు వేదికైంది. 'ఇంజన్ ఏఐ' (EngineAI) సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచంలోనే మొట్టమొదటి హ్యూమనాయిడ్ రోబోల బాక్సింగ్ టోర్నమెంట్ (URKL) ఘనంగా ప్రారంభమైంది. మొత్తం 32 అంతర్జాతీయ జట్లు తమ T800 రోబోలతో రింగులో తలపడ్డాయి. ఈ పోటీల్లో రోబోలు బ్రూస్ లీ శైలిలో పర్ఫెక్ట్ లో-కిక్స్, పంచ్‌లతో అలరించాయి. కేవలం వినోదం కోసమే కాకుండా, విపత్కర పరిస్థితుల్లో రోబోల సమతుల్యత, కదలిక,నియంత్రణ సామర్ధ్యాలను టెస్ట్ చేసి , వాటి టెక్నాలజీని మరింత మెరుగుపరచడానికి ఈ రౌండ్-ది-క్లాక్ ఫైట్ నైట్‌ను పరిశోధకులు నిర్వహిస్తున్నారు.

స్సైస్ జెట్ కు రూ. లక్ష జరిమానా !
News· 17 Jul 2026

స్సైస్ జెట్ కు రూ. లక్ష జరిమానా !

విమానయాన సంస్థ స్పైస్ జెట్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) గట్టి షాక్ ఇచ్చింది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లో 'డార్క్ ప్యాటర్న్స్' (వినియోగదారులను తప్పుదోవ పట్టించేలా అదనపు ఛార్జీలు వసూలు చేయడం) ఉపయోగిస్తున్నందుకు గాను ₹1 లక్ష జరిమానా విధించింది. టికెట్లు బుక్ చేసుకునేటప్పుడు వినియోగదారులకు తెలియకుండానే సీట్ సెలెక్షన్, ఇన్సూరెన్స్ వంటి సేవలను ఆటోమేటిక్‌గా యాడ్ చేస్తూ మోసగిస్తున్నట్లు గుర్తించారు. ఇలాంటి ఇల్లీగల్ పద్ధతు లను వెంటనే నిలిపివేయాలని, పారదర్శకంగా వ్యవహరించాలని స్పేస్‌జెట్‌ను CCPA ఆదేశించింది.

నేషనల్ లెవెల్  షూటర్ దమయంతి సేన్ అదృశ్యం !
India· 17 Jul 2026

నేషనల్ లెవెల్ షూటర్ దమయంతి సేన్ అదృశ్యం !

పశ్చిమ బెంగాల్‌కు చెందిన 15 ఏళ్ల జాతీయ స్థాయి షూటర్ దమయంతి సేన్ గురువారం మధ్యాహ్నం నుండి కనిపించకుండా పోయింది. హౌరాలోని తన నివాసం నుండి కిరాణా సామాను కొనేందుకు బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. వెతకగా ఎలాంటి ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హౌరా స్టేషన్‌లోని ప్లాట్‌ఫారమ్ 4, 5 ల మధ్య ఆమె నడుస్తున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో చివరిసారిగా రికార్డైంది. పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసి గాలిస్తున్నారు.

ఆశ్రమంలో గంజాయి సాగు: దొంగ స్వామీజీ గుట్టురట్టు!
News· 17 Jul 2026

ఆశ్రమంలో గంజాయి సాగు: దొంగ స్వామీజీ గుట్టురట్టు!

వికారాబాద్ జిల్లా యాలాల పరిధిలో దొంగ స్వామీజీ గుట్టురట్టయింది. గోవిందరావుపేట శివారులోని ఒక ఆశ్రమంపై పోలీసులు సడన్‌గా రైడ్స్ చేశారు. స్పిరిచువల్ సెంటర్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా సాగు చేస్తున్న 25 గంజాయి మొక్కలను, భారీగా ఎండు గంజాయిని అధికారులు సీజ్ చేశారు. ఎక్సైజ్, రెవెన్యూ అధికారులతో కలిసి పోలీసులు సాక్ష్యాలను రికార్డు చేసి కేసు నమోదు చేశారు. భక్తి పేరుతో మోసం చేసిన ఈ స్వామీజీ అసలు రంగు బయటపడటంతో స్థానికులు షాక్‌కు గురయ్యారు. అతని వెనుక ఎవరెవరు ఉన్నారనే కోణంలో పోలీసులు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు.

ల్యాండ్ కొన్నంత మాత్రాన సిటిజన్ అయిపోరు: హైకోర్టు
Legal· 17 Jul 2026

ల్యాండ్ కొన్నంత మాత్రాన సిటిజన్ అయిపోరు: హైకోర్టు

ఇండియాలో భూమి కొన్నంత మాత్రాన ఇక్కడి పౌరుడిగా ఒప్పుకోలేమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. చొరబాటు ఆరోపణలతో వెస్ట్ బెంగాల్ పోలీసులు నసీర్ మొల్లా అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. తాను బెంగాల్‌లో ల్యాండ్ కొన్నానని, కాబట్టి ఇండియన్ సిటిజన్నే అని అతను కోర్టులో వాదించాడు. కానీ ల్యాండ్ డాక్యుమెంట్లు పౌరసత్వాన్ని రుజువు చేయలేవని జడ్జిమెంట్ ఇచ్చింది. ఇండియన్ అని నిరూపించుకునే మిగతా డాక్యుమెంట్స్ ఇవ్వడానికి జూలై 20 వరకు లాస్ట్ ఛాన్స్ ఇచ్చింది.

సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్ సీరియస్!
Education· 17 Jul 2026

సోనమ్ వాంగ్‌చుక్ హెల్త్ కండిషన్ సీరియస్!

సోనమ్ వాంగ్‌చుక్ గత 20 రోజులుగా నిరాహార దీక్ష (Hunger Strike) చేస్తున్నారు. ఇన్ని రోజులుగా ఫుడ్ తీసుకోకపోవడంతో ఆయన హెల్త్ చాలా పాడైంది. ప్రస్తుతం బెడ్‌పై ఉన్న ఆయనకు డాక్టర్లు ECG లాంటి మెడికల్ టెస్టులు చేస్తూ హెల్త్‌ను చెక్ చేస్తున్నారు. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. తన ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ దేశాన్ని మేల్కొల్పుతున్నాడంటూ నెటిజన్లు ఎమోషనల్ అవుతున్నారు.

చదువు కోసం ప్రాణాలు రిస్క్ లో పెడుతున్న స్కూల్ స్టూడెంట్స్!
Education· 17 Jul 2026

చదువు కోసం ప్రాణాలు రిస్క్ లో పెడుతున్న స్కూల్ స్టూడెంట్స్!

ఎడ్యుకేషన్ కోసం పిల్లలు ప్రాణాలను రిస్క్‌లో పెడుతున్న హార్ట్ బ్రేకింగ్ వీడియో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ హర్దా జిల్లా రామ్‌పుర గ్రామంలో బ్రిడ్జ్ లేకపోవడంతో, స్టూడెంట్స్ ప్రతిరోజూ టైర్ ట్యూబ్‌ల సహాయంతో నది దాటాల్సి వస్తోంది. తాడు పట్టుకుని, ట్యూబ్‌లపై కూర్చుని చాలా డేంజరస్‌గా నది క్రాస్ చేస్తున్నారు. దేశంలో డెవలప్‌మెంట్ గురించి ఎంత గొప్పగా చెప్పుకున్నా, రియాలిటీలో ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఉండటం బాధాకరం. పిల్లల సేఫ్టీ, చదువు గవర్నమెంట్స్ కనీస బాధ్యత అని, ఈ వీడియో చూసైనా అధికారులు మారాలని నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు.

జీరో సివిక్ సెన్స్ అంకుల్!
Viral· 17 Jul 2026

జీరో సివిక్ సెన్స్ అంకుల్!

సోషల్ మీడియాలో ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతోంది. ఒక రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్‌పై నిల్చున్న వ్యక్తి అరటిపండు తింటూ, దాని తొక్కను రైలు ట్రాక్‌పై పడేశాడు. వీడియో తీస్తున్న ఒక యువకుడు అది చూసి, పక్కనే డస్ట్‌బిన్ ఉందని, అక్కడ చెత్త వేయొద్దని పదే పదే రిక్వెస్ట్ చేశాడు. కానీ ఆ అంకుల్ ఏమాత్రం వినకుండా, చాలా నిర్లక్ష్యంగా స్పందించాడు. ఆ యువకుడు గట్టిగా నిలదీసి ప్రశ్నించడంతో, సమాధానం చెప్పలేక అక్కడి నుండి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు సదరు అంకుల్‌కి ‘జీరో సివిక్ సెన్స్’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఢిల్లీలో దారుణం: సైకిల్ ట్రాక్‌పై స్కూటర్లు!
Viral· 17 Jul 2026

ఢిల్లీలో దారుణం: సైకిల్ ట్రాక్‌పై స్కూటర్లు!

సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఢిల్లీలో పిల్లలు, సైక్లిస్టుల కోసం కేటాయించిన స్పెషల్ గ్రీన్ సైకిల్ ట్రాక్‌పై కొందరు స్కూటర్లతో రైడింగ్ చేస్తూ కనిపించారు. అక్కడ చిన్న పిల్లలు సైకిల్ తొక్కుతున్నా పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్యంగా డ్రైవ్ చేశారు. వీడియో తీస్తున్న వ్యక్తి ప్రశ్నించినా.. ఏమాత్రం గిల్ట్ లేకుండా కేజువల్‌గా వెళ్ళిపోయారు. ఈ ట్రాఫిక్ రూల్స్ బ్రేకింగ్‌పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

CM విజయ్ ని కలిసిన యాక్టర్ వరలక్ష్మి!
News· 17 Jul 2026

CM విజయ్ ని కలిసిన యాక్టర్ వరలక్ష్మి!

తమిళనాడు CM విజయ్‌ను యాక్టర్ వరలక్ష్మి శరత్‌కుమార్, ఆమె భర్త రీసెంట్‌గా కలిశారు. ఈ సందర్భంగా ఆమె ట్విట్టర్‌లో ఒక పోస్ట్ షేర్ చేశారు. ఫస్ట్ అటెంప్ట్‌లోనే CM అవ్వడం విజయ్ ధైర్యానికి, ఆయనపై ప్రజలకున్న ప్రేమకు నిదర్శనమని అన్నారు. విమర్శలు చేసేవారికి కాలమే ఆన్సర్ ఇస్తుందని చెప్తూ, తాను ఎప్పటికీ "విజయ్ వెరియన్" (విజయ్ వెర్రిదాన్నే) అని రాసుకొచ్చారు. ఈ మీటింగ్‌లో మహిళల వెల్ఫేర్ గురించిన కొన్ని ఇష్యూస్ కూడా డిస్కస్ చేసినట్లు వరలక్ష్మి తెలిపారు.

తెలుగు ఇండస్ట్రీ సపోర్ట్‌గా ఉంది: రకుల్ ప్రీత్‌సింగ్
Cinema· 17 Jul 2026

తెలుగు ఇండస్ట్రీ సపోర్ట్‌గా ఉంది: రకుల్ ప్రీత్‌సింగ్

టాలీవుడ్ ఇండస్ట్రీ తనకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉందని హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ అన్నారు. తన కెరీర్‌లో మంచి అవకాశాలు రావడానికి తెలుగు సినిమాలే ముఖ్యపాత్ర పోషించాయని ఓ ఇంటర్వ్యూ లో అన్నారు. ఇక్కడి దర్శకులు, నిర్మాతలు, ప్రేక్షకులు ఎప్పుడూ తనను ప్రోత్సహించారన్నారు. తెలుగు ప్రేక్షకుల ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేనని, టాలీవుడ్‌తో తనకు ప్రత్యేక అనుబంధం ఉందని తెలిపారు.

జిమ్‌లో కనిపించిన 'సిల్క్ స్మిత'
Viral· 17 Jul 2026

జిమ్‌లో కనిపించిన 'సిల్క్ స్మిత'

జిమ్‌లో వర్కౌట్ చేస్తున్న ఓ యువతి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె రూపం, హావభావాలు నటి సిల్క్ స్మితను గుర్తుచేస్తున్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆమె చూపు, ముఖ కవళికలు సిల్క్ స్మితను పోలి ఉన్నాయని అంటున్నారు.

అమరావతిలో నిర్మాణంలో మినీ అమెజాన్
General· 17 Jul 2026

అమరావతిలో నిర్మాణంలో మినీ అమెజాన్

అమరావతిలోని 300 ఎకరాల శాఖమూరు పార్కులో 5 ఎకరాల విస్తీర్ణంలో రూ.17.58 కోట్లతో సరికొత్త కృత్రిమ రెయిన్ ఫారెస్ట్ (మినీ అమెజాన్) ఏర్పాటు కానుంది. ఇందుకోసం అమరావతి డెవలప్‌మెంట్ కార్పొరేషన్ టెండర్లు ఆహ్వానించింది. ఇక్కడ మియావాకి పద్ధతిలో 20 వేల మొక్కలను పెంచుతారు. పర్యాటకులకు నిజమైన అడవి అనుభూతిని ఇవ్వడానికి రైన్ గన్స్, మిస్ట్ గార్డెన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి లోపలి ఉష్ణోగ్రతను 4 డిగ్రీలు తగ్గిస్తాయి. విద్యార్థుల కోసం నాలెడ్జ్ సెంటర్, కేఫ్ కూడా అందుబాటులోకి రానున్నాయి.

ESI హాస్పిటల్ పోస్టుల భర్తీ
Infotainment· 17 Jul 2026

ESI హాస్పిటల్ పోస్టుల భర్తీ

TG: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్(ఈఎస్ఐ) హాస్పిటల్లో వివిధ పోస్టులను భర్తీ చేస్తామని 'డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్ లెటర్స్ టు నర్సింగ్ ఆఫీసర్స్' ప్రోగ్రాంలో కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్ చెప్పారు. 599 పోస్టులకు నియామకాలు చేపడతామని, ఆ తర్వాత 313 పారామెడికల్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. రామగుండం, శంషాబాద్, కొత్తగూడెంలో కొత్త హాస్పిటళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. 15 సంవత్సరాల తరువాత తొలిసారిగా ESI స్టాఫ్ నర్సులుగా రిక్రూటైన 247 మందికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి మంత్రి నియామక పత్రాలు అందించారు.

నీటిలో శిశువు మృతదేహం..జనాలు షాక్
Politics· 17 Jul 2026

నీటిలో శిశువు మృతదేహం..జనాలు షాక్

AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ కాసింతల బ్రిడ్జి దగ్గర అప్పుడే పుట్టిన శిశువు మృతదేహం నీటిలో తేలుతూ కనిపించింది. గుర్తుతెలియని వ్యక్తులు పాపను నీటిలో పడేసి వెళ్లిపోయారు. పసికందు శవం చుట్టూ కుక్కలు గుమికూడటం చూసి స్థానికులు ఒక్కసారిగా షాకయ్యారు. పోలీసులకి సమాచారం అందించడంతో వారు స్పాట్‌కి చేరుకున్నారు.

రోడ్డుపై మర్డర్ సీన్.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్!
Viral· 17 Jul 2026

రోడ్డుపై మర్డర్ సీన్.. కట్ చేస్తే షాకింగ్ ట్విస్ట్!

సోషల్ మీడియాలో ఒక మైండ్ బ్లోయింగ్ వీడియో వైరల్ అవుతోంది. రాత్రి వేళ ఒక నిర్మానుష్యమైన రోడ్డుపై ఒక వ్యక్తి శవంలా పడి ఉంటే, మరొకడు కర్రతో అతడిని ఈడ్చుకెళ్తూ మర్డర్ సీన్ క్రియేట్ చేశాడు. అది చూసి బైక్‌పై వెళ్తున్న ఒక వ్యక్తి అక్కడ ఆగాడు. కానీ, ఆగడమే ఆలస్యం ఒకతను అతనిపై అటాక్ చేసి చితకబాదాడు. దాంతో అతను భయంతో బైక్ వదిలేసి పారిపోయాడు. వెంటనే కింద పడుకున్న వ్యక్తి లేచి, ఇద్దరూ కలిసి ఆ బైక్‌ను ఎత్తుకెళ్లారు. జూలై 2026 లో వెలుగులోకి వచ్చిన ఈ షాకింగ్ వీడియో.. వ్యూస్ కోసం చేసిన డేంజరస్ ప్రాంక్ లేదా బైక్ కొట్టేయడానికి వేసిన ప్లాన్ అని తెలుస్తోంది. దీనిపై నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు.

అందుబాటులోకి కొత్త పాలిమర్ నోట్లు!
Infotainment· 17 Jul 2026

అందుబాటులోకి కొత్త పాలిమర్ నోట్లు!

భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి కొత్త కరెన్సీ నోట్లను విడుదల చేయబోతోంది. ఈసారి కొత్త నోట్లు పాలిమర్ మెటీరియల్‌తో తయారు చేయాలని చూస్తోంది. ప్రస్తుతం వాడుతున్న కాగితపు నోట్లతో పోలిస్తే పాలిమర్ నోట్లు ఎక్కువ కాలం ఉంటాయని, నీటిలో తడిసినా త్వరగా చిరిగిపోవు. నకిలీ నోట్లు తయారు చేయడం కూడా కష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. ఈ నోట్లు ఎప్పుడు విడుదలవుతాయనే విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.

ఏడు నెలల గర్బంతో దీపికా యాక్షన్ సీన్స్
Cinema· 17 Jul 2026

ఏడు నెలల గర్బంతో దీపికా యాక్షన్ సీన్స్

ఏడు నెలల గర్బంతో దీపికా యాక్షన్ సీన్స్ భారీ బడ్జెట్‌తో అట్లీ తెరకెక్కిస్తున్న సినిమా ‘రాకా’. ఈ సినిమాలో అల్లు అర్జున్ పక్కన హీరోయిన్‌గా దీపికా పదుకోణె నటిస్తున్నారు. ఏడు నెలల గర్బంతో యాక్షన్ సీన్స్ చేస్తూ ఆమె అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. మెటర్నిటీ హాలిడేస్‌కి వెళ్ళేలోగా తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేస్తూ వృత్తిపై తన నిబద్ధతను చాటుకుంటున్నారు. ఈ మూవీ 2027 లో రిలీజ్ కానుంది.

ఆగస్టు 15 నుండి హాకీ వరల్డ్ కప్!
Sports· 17 Jul 2026

ఆగస్టు 15 నుండి హాకీ వరల్డ్ కప్!

మహిళల హాకీ వరల్డ్ కప్ 2026 కోసం 20 మందితో కూడిన ఇండియన్ టీమ్‌ను హాకీ ఇండియా అనౌన్స్ చేసింది. ఈ మెగా టోర్నీకి సలీమా టెటే కెప్టెన్‌గా సెలెక్ట్ అయింది. నెదర్లాండ్స్, బెల్జియం దేశాలు కలిసి హోస్ట్ చేస్తున్న ఈ టోర్నమెంట్ ఆగస్టు 15 నుండి 30 వరకు జరగనుంది. పూల్-డి గ్రూప్‌లో ఉన్న ఇండియా.. చైనా, ఇంగ్లాండ్, సౌతాఫ్రికాలతో మ్యాచ్‌లు ఆడనుంది. రీసెంట్‌గా నేషన్స్ కప్ గెలిచిన ప్లేయర్స్‌కే ఈ టీమ్‌లో ఎక్కువ ఛాన్స్ ఇచ్చారు. ప్రస్తుతం బెంగళూరు క్యాంప్‌లో ఇండియా టీమ్ ఫుల్ ప్రాక్టీస్ చేస్తోంది.

వైసీపీ నేత నాగార్జున యాదవ్‌కు బెయిల్
Politics· 17 Jul 2026

వైసీపీ నేత నాగార్జున యాదవ్‌కు బెయిల్

TG: వైసీపీ నేత నాగార్జున యాదవ్‌కు హైదరాబాదులోని నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఓ లైవ్ డిబేట్‌లో జొమాటో డెలివరీ బాయ్‌తో పోల్చడమే కాకుండా, జీవోలు చదవడం రాదంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై కామెంట్స్ చేసినందుకు తెలంగాణ పోలీసులు ఆదివారం ఆయనను అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నాగార్జున యాదవ్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే అదుపులోకి తీసుకున్నారు.

గర్భవతి అయిన స్కూల్ చిన్నారి.. ఇద్దరిపై పోక్సో కేసు!
Crime· 17 Jul 2026

గర్భవతి అయిన స్కూల్ చిన్నారి.. ఇద్దరిపై పోక్సో కేసు!

నల్లగొండ జిల్లా అనుముల మండలంలో ఘోరం జరిగింది. ఒక స్కూల్ గర్ల్‌ను ఇద్దరు యువకులు బెదిరించి, పలుమార్లు రేప్ చేశారు. మొదట ఒక యువకుడు మాయమాటలతో లొంగదీసుకోగా, ఆ విషయం తెలిసిన మరో యువకుడు బ్లాక్‌మెయిల్ చేస్తూ అత్యాచారానికి పాల్పడ్డాడు. రీసెంట్‌గా ఆ బాలిక ప్రెగ్నెంట్ అవ్వడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. పేరెంట్స్ కంప్లైంట్‌తో అలర్ట్ అయిన పోలీసులు నిందితులపై POCSO యాక్ట్ కింద కేసు బుక్ చేశారు. ప్రస్తుతం నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు. ఈ ఇన్సిడెంట్‌పై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.