Latest

చిన్నారి ముక్కులో చాక్‌పీస్
Education· 18 Jul 2026

చిన్నారి ముక్కులో చాక్‌పీస్

TG: మేడ్చల్ జిల్లా నూతన్‌కల్ ప్రాథమిక పాఠశాలలో ఓ చిన్నారి చాక్‌పీస్‌ను ముక్కులో పెట్టుకుని ఇబ్బందికి గురైంది. 1వ తరగతి చదువుతున్న విద్యార్థిని పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న 108 EMT యాదమ్మ, పైలట్ తిరుపతి చాకచక్యంగా చిన్నారి ముక్కులో ఇరుక్కున్న చాక్‌పీస్‌ను సురక్షితంగా తొలగించారు. దీంతో ప్రమాదం తప్పి చిన్నారి క్షేమంగా బయటపడింది. సమయానికి స్పందించి ప్రాణాపాయం తప్పించిన వైద్య సిబ్బందికి చిన్నారి తల్లిదండ్రులు, పాఠశాల ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.

నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి
Politics· 18 Jul 2026

నిర్మలా సీతారామన్‌కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి

AP: అమరావతిలోని క్యాంపు ఆఫీస్‌లో సీఎం చంద్రబాబును కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలను స్థిరీకరించేందుకు కేంద్రం త్వరగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు నిర్మలా సీతారామన్‌ను కోరారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ పెండింగ్ అంశాలను కేంద్రమంత్రి దృష్టికి సీఎం తీసుకొచ్చారు. ఈ అంశాలపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.

70 వేల ఉద్యోగాలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం: కేటీఆర్
Politics· 18 Jul 2026

70 వేల ఉద్యోగాలు నిరూపిస్తే రాజకీయ సన్యాసం: కేటీఆర్

TG: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు 70 వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు నోటిఫికేషన్లతో సహా నిరూపిస్తే తను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. హైదరాబాద్ సరూర్‌నగర్‌లో జరిగిన బీఆర్ఎస్ యువసంగ్రామ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే రాహుల్ గాంధీకి జైకొడతానన్నారు. ఉద్యోగాలు భర్తీ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అంటూ కేటీఆర్ తీవ్రస్థాయిలో గొంతెత్తారు. నిరుద్యోగుల హక్కుల కోసమే ఈ సదస్సు పెట్టినట్లు తెలిపారు.

యువత పిడికిలి బిగిస్తే పాలకుల పీఠాలు కదులుతాయి
Jobs· 18 Jul 2026

యువత పిడికిలి బిగిస్తే పాలకుల పీఠాలు కదులుతాయి

TG: హైదరాబాద్ సరూర్‌నగర్‌లో నిర్వహించిన యువ సంగ్రామ సదస్సులో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. యువత కోసం BRS పోరాటం చేస్తుందన్నారు. యువశక్తి కదిలితే పాలకుల పీఠాలు కదిలిపోతాయని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో యువత కీలక పాత్ర పోషించిందని గుర్తుచేసిన ఆయన, రేపటి తెలంగాణ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందన్నారు. నిరుద్యోగులను మోసం చేసిన వారిని నిలదీయడానికే ఈ సదస్సు నిర్వహించామన్నారు. హామీలు అమలుచేయకపోతే పోరాటం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

రైల్లో ఇవి కూడా దొంగతనం చేస్తున్నారా?
News· 18 Jul 2026

రైల్లో ఇవి కూడా దొంగతనం చేస్తున్నారా?

భారతీయ రైల్వే AC కోచ్‌లలో బెడ్‌షీట్లు, టవల్స్, దుప్పట్లు మాయమవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. 2022 నుంచి 2026 మే వరకు మొత్తం 1.27 కోట్లకు పైగా లెనిన్ వస్తువులు మిస్సయ్యాయని RTI ద్వారా తెలిసింది. ఈ చోరీల వల్ల రూ.104 కోట్లకు పైగా నష్టం జరిగినట్లు సమాచారం. ఎక్కువగా ఫేస్ టవల్స్, బెడ్‌షీట్లు, పిల్లో కవర్లు ప్రయాణికులు తీసుకెళ్తున్నారని అధికారులు చెబుతున్నారు. ప్రయాణికులు రైల్వే వస్తువులను ఇంటికి తీసుకెళ్లొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

హాస్పిటల్లో సోనమ్ వాంగ్చుక్- ఫోన్ బ్యాన్.. లాయర్లకు నో ఎంట్రీ!
Politics· 18 Jul 2026

హాస్పిటల్లో సోనమ్ వాంగ్చుక్- ఫోన్ బ్యాన్.. లాయర్లకు నో ఎంట్రీ!

ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ హాస్పిటల్‌లో గవర్నమెంట్ చాలా రూల్స్ పెట్టింది. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్న సోనమ్ వాంగ్‌చుక్, హాస్పిటల్ రూమ్‌లోకి ఫోన్ తీసుకెళ్లనివ్వడం లేదని అతని భార్య ఆరోపించింది. అంతేకాకుండా, ఆయన మెడికల్ రిపోర్ట్స్‌ను కూడా ఫ్యామిలీకి చూపించడం లేదని, కనీసం వారి పర్సనల్ డాక్టర్లను, లాయర్లను కూడా కలవనివ్వడం లేదని వారు బాధపడుతున్నారు. గవర్నమెంట్ కావాలనే ఇలా 'డిక్టేటర్‌షిప్' చేస్తోందంటూ సోషల్ మీడియాలో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న అభిజిత్ దీప్కే!
Politics· 18 Jul 2026

ఆమరణ నిరాహార దీక్షకు కూర్చున్న అభిజిత్ దీప్కే!

సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌కు నిరసనగా 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజిత్ దీప్కే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆయన జంతర్ మంతర్ వద్ద ఆమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేశారు. సోనమ్ వాంగ్‌చుక్ ఫోటోను చేతబట్టుకుని ఆయన దీక్షకు కూర్చున్న పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సందర్భంగా జులై 20న జరగబోయే 'చలో సంసద్' మార్చ్ ఎలాంటి మార్పులు లేకుండా ప్లాన్ ప్రకారం జరిగి తీరుతుందని స్పష్టం చేశారు. దీంతో ఢిల్లీలో పొలిటికల్ హీట్ మరింత పెరిగింది.

తీవ్ర భావోద్వేగానికి గురైన అభిజిత్ దీప్కే!
Politics· 18 Jul 2026

తీవ్ర భావోద్వేగానికి గురైన అభిజిత్ దీప్కే!

సోనమ్ వాంగ్చుక్ అరెస్ట్ తర్వాత 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఫౌండర్ అభిజిత్ దీప్కే తీవ్ర భావోద్వేగానికి గురై, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. "దీప్కే కార్చిన ప్రతి కన్నీటి చుక్క, చిందించిన ప్రతి చెమట చుక్క ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాయి. ఈ దేశ యువత ఎవరికీ తలవంచదు" అంటూ నెటిజన్లు, నిరసనకారులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.

సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌పై అభిజిత్ దీప్కే ఎమోషనల్!
Politics· 18 Jul 2026

సోనమ్ వాంగ్‌చుక్ అరెస్ట్‌పై అభిజిత్ దీప్కే ఎమోషనల్!

ఢిల్లీ: సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు బెడ్‌షీట్స్ కప్పి బలవంతంగా తీసుకెళ్లడంపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై అభిజిత్ దీప్కే ప్రెస్‌మీట్‌లో మాట్లాడుతూ.. "ఆయన ఏమైనా క్రిమినలా? అంత హెల్త్ కేర్ ఉంటే గౌరవంగా తీసుకెళ్లాలి కానీ, ఇలా బెడ్‌షీట్లలో దాచి తరలించడం ఏంటి?" అని ఎమోషనల్ అయ్యారు. జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న ఈ నిరసనలను పోలీసులు ఆపాలని చూస్తే, దేశంలోని ప్రతి స్టేట్, ప్రతి డిస్ట్రిక్ట్‌లో ప్రజలు ఒక జంతర్ మంతర్‌ను క్రియేట్ చేసి ప్రొటెస్ట్ చేయాలని పిలుపునిచ్చారు.

మాజీ భార్య ఇంటి వద్ద కానిస్టేబుల్ హల్‌చల్
TG· 18 Jul 2026

మాజీ భార్య ఇంటి వద్ద కానిస్టేబుల్ హల్‌చల్

TG: మంచిర్యాల జిల్లాలో హాజీపూర్ PSకు చెందిన కానిస్టేబుల్ కార్తీక్‌పై మాజీ భార్య ప్రవీణ తీవ్ర ఆరోపణలు చేశారు. విడాకుల అనంతరం ఆస్తి పత్రాల కోసం తనను వేధిస్తున్నాడని, ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరిస్తూ మద్యం మత్తులో కత్తులతో ఇంటికి వచ్చాడని ఆరోపించారు. అతడితో పాటు వచ్చిన ఇద్దరు మహిళలు కూడా తనపై దాడి చేశారని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా తనపై నిఘా పెట్టిస్తున్నాడని, పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసినా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానిస్టేబుల్‌ను వెంటనే అరెస్ట్ చేసి తమకు రక్షణ కల్పించాలని బాధితురాలు అధికారులను కోరారు.

స్టీలు ప్లేటులో పర్యావరణ పాఠం
Education· 18 Jul 2026

స్టీలు ప్లేటులో పర్యావరణ పాఠం

TG: పాఠాలు చెప్పడమే కాదు..ఆచరించి చూపించి విద్యార్థులకు నేర్పుతాం అంటున్నారు సంగారెడ్డి జిల్లా ఉపాధ్యాయులు. జిల్లా స్థాయి శిక్షణలో టీచర్లు తమ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన అందించేందుకు లంచ్ టైంలో ఇంటి నుండి తెచ్చుకున్న స్టీల్ ప్లేట్లలో తిన్నారు. ఇళ్ల నుంచే స్టీల్ ప్లేట్స్, గ్లాసులు, బాటిళ్లు తెచ్చుకోవాలని పిల్లలకు చెప్పారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విడిచిపెట్టి, పర్యావరణరహితమైన వస్తువులనే వాడాలని తెలిపారు.

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన రఘురామకృష్ణ రాజు
Politics· 18 Jul 2026

పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన రఘురామకృష్ణ రాజు

AP: కుడిభుజానికి ఆపరేషన్ చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ రాజు పరామర్శించారు. వారితోపాటు శాసనసభ విప్ బొమ్మిడి నాయకర్, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు నిమ్మక జయకృష్ణ కూడా పవన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇతర ఎమ్మెల్యేలు, నాయకులు, నిర్మాతలు, న్యాయవాదులు, మీడియా సంస్థల నిర్వాహకులు పవన్‌ కల్యాణ్‌ను పరామర్శించారు.

స్కైరూట్ ఏరోస్పేస్‌..ఇది చాలా ప్రత్యేకం
India· 18 Jul 2026

స్కైరూట్ ఏరోస్పేస్‌..ఇది చాలా ప్రత్యేకం

2018లో ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, నాగ భరత్ డాకా స్థాపించిన సంస్థే ఈ స్కైరూట్ ఏరోస్పేస్‌. ప్రపంచంలోని మినీ-సాటిలైట్ మార్కెట్ కోసం వాణిజ్యపరంగా ప్రయోగ వాహనాలను డెవలప్ చేయడానికి దీన్ని మొదలుపెట్టారు. మొదట్లో ఈ సంస్థ ప్రయోగ వాహనాల టెక్నాలజీని అభివృద్ధి చేయడంపై దృష్టి పెట్టింది. ప్రయోగ ఖర్చు, ఉత్పత్తి సమయం తగ్గించే లక్ష్యంతో పనిచేసింది. ప్రస్తుతం నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1 సాటిలైట్ ఈ సంస్థ తయారు చేసిందే.

బడిలో మిగిలింది టీచరమ్మే
News· 18 Jul 2026

బడిలో మిగిలింది టీచరమ్మే

TG: యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం కడాపగండి తండా ప్రాథమిక పాఠశాలలో టీచరే విద్యార్థిగా మారింది. గతేడాది ఆ పాఠశాల మూతపడినా నేతల ఒత్తిడితో ఈ ఏడాది తెరుచుకుంది. మొదట్లో 13 మంది విద్యార్థులు వచ్చేవారు. రానురానూ ఆ సంఖ్య పూర్తిగా తగ్గిపోయి ఒక విద్యార్థి మాత్రం వస్తున్నాడు. శుక్రవారం ఒక్క విద్యార్థి ఇంటికి వెళ్లిపోవడంతో టీచర్ ఒక్కరే కూర్చున్నారు.

బీఆర్ఎస్ నేత R.S.ప్రవీణ్ కుమార్ అరెస్ట్
News· 18 Jul 2026

బీఆర్ఎస్ నేత R.S.ప్రవీణ్ కుమార్ అరెస్ట్

TG: హైదరాబాద్ నగరం సరూర్‌నగర్‌లో యువసంగ్రామ సదస్సు ఉందని చెప్తున్నా వినకుండా, పైనుండి ఆదేశాలు ఉన్నాయని పోలీసులు ఉదయాన్నే తనను అరెస్టు చేసినట్టు బీఆర్ఎస్ నేత ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇదెక్కడి న్యాయం అని ప్రశ్నించారు. మల్కాజిగిరి పోలీసులు, హైకోర్టు సభకు అనుమతి ఇచ్చినా ఇలా అరెస్ట్ చేసి ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారన్నారు. ఎన్ని కుట్రలు చేసినా సభకు వెళ్తానని, లేదా అమరణ దీక్ష చేస్తానని తన X అకౌంట్లో చెప్పారు.

నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1
India· 18 Jul 2026

నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్-1

AP: దేశంలోనే మొదటి ప్రైవేట్ రాకెట్ విక్రమ్-1 నింగిలోకి దూసుకెళ్లింది. స్కైరూట్ స్టార్టప్ తయారు చేసిన ఈ రాకెట్‌ను శ్రీహరికోటలోని అంతరిక్ష కేంద్రం ఇవాళ మధ్యాహ్నం 12.04 గంటలకు ప్రయోగించింది. విక్రమ్-1 రాకెట్ ప్రయోగం రెండు దశలు సక్సెస్ అయ్యాయి. దీంతో దేశ ఆస్ట్రానమీ రంగంలో ఓ కొత్త అధ్యాయం మొదలైందని శాస్త్రవేత్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్కైరూట్ స్టార్టప్ 2018లో భారత్ మొదలుపెట్టిన ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ సంస్థ. ఇది హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తోంది.

రూ.20 కోసం తల నరికేశాడు
Crime· 18 Jul 2026

రూ.20 కోసం తల నరికేశాడు

TG: కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ రోడ్ రైల్వేస్టేషన్ దగ్గర నిన్న దారుణం జరిగింది. పర్సనంబాల గ్రామానికి చెందిన సోమయ్య(65) అనే వృద్దుడిని తుంగెడ గ్రామానికి చెందిన నగేష్ దారుణంగా హత్య చేశాడు. రైల్వే స్టేషన్ దగ్గర నగేష్, సోమయ్య దగ్గరకొచ్చి టీ కోసం రూ.20 అడిగాడు. డబ్బులు లేవని సోమయ్య చెప్పి ముందుకు వెళ్లిపోయాడు. నగేష్ అతణ్ని వెంబడించి గొడ్డలితో తల నరికి పారిపోయాడు. పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని ఆసిఫాబాద్ హాస్పిటల్‌కు తరలించారు. నగేష్ కోసం పోలీసులు వెతుకున్నారు.

స్లీపర్ బస్సులో మంటలు..అందరూ సేఫ్
News· 18 Jul 2026

స్లీపర్ బస్సులో మంటలు..అందరూ సేఫ్

తమిళనాడు రాష్ట్రం పెరంబలూరు జిల్లాలోని చెన్నై-తిరుచ్చి హైవేపై మంగళమేడు దగ్గర్లో శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై నుంచి మదురై వెళ్తున్న ప్రైవేట్ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగాయి. మంటలు వాహనాన్ని పూర్తిగా చుట్టుముట్టక ముందే డ్రైవర్ బస్సులోని 23 మందిని కిందకు దింపాడు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. పోలీసులు ట్రాఫిక్‌ను మళ్లించి దర్యాప్తు చేస్తున్నారు.

సోనమ్ వాంగ్‌చుక్‌కు అనసూయ సపోర్ట్
Cinema· 18 Jul 2026

సోనమ్ వాంగ్‌చుక్‌కు అనసూయ సపోర్ట్

నటి అనసూయ భరద్వాజ్ ‘చలో సంసద్’ ఉద్యమానికి మద్దతు తెలుపుతూ చేసిన సోషల్ మీడియా పోస్టు వైరల్‌గా మారింది. ప్రజలు శాంతియుతంగా తమ సమస్యలు చెపుతున్నప్పుడు పాలకులు స్పందించాలని, ప్రశ్నలను స్వాగతించినప్పుడే ప్రజాస్వామ్యం బలపడుతుందని ఆమె పేర్కొన్నారు. ఒక తల్లిగా పిల్లలకు మెరిట్, నిజాయితీ, జవాబుదారీతనం ఉన్న విద్యా వ్యవస్థ అవసరమని, సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ దీక్ష ఆ దిశగా ఆలోచింపజేస్తోందని తెలిపారు. జూలై 20 నుంచి జరిగే ‘చలో సంసద్’ కార్యక్రమానికి ఇప్పటికే ప్రకాశ్ రాజ్, అభయ్ డియోల్, అనురాగ్ కశ్యప్, తదితరులు మద్దతు ప్రకటించారు.

కొండపి వద్ద బస్సు ప్రమాదం
News· 18 Jul 2026

కొండపి వద్ద బస్సు ప్రమాదం

AP: ప్రకాశం జిల్లా కొండపి దగ్గర ఆర్టీసీ పల్లెవెలుగు బస్సు ప్రమాదానికి గురైంది. కొండపి నుండి మద్దులూరు మీదుగా ఒంగోలు వెళ్తుండగా ద్వారకా సీఫుడ్స్ వద్ద ఎదురుగా వస్తున్న మరో వాహనాన్ని తప్పించబోయి బస్సు బోల్తా పడింది. ఆ టైమ్‌లో బస్సులో 60 మంది పాసింజర్స్ ఉండగా వాళ్లలో 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. వారిలో కొందరికి స్వల్పగాయాలు కాగా, కొండపి గవెర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. మలుపు వద్ద ఎక్కువ ముళ్లపొదలు ఉండటంతో ఎదురుగా వచ్చే వాహనం కనిపించలేదని స్థానికులు అంటున్నారు.

బహదూర్‌గూడలో హైటెన్షన్
TG· 18 Jul 2026

బహదూర్‌గూడలో హైటెన్షన్

TG: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ప్రతిపాదిత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు కోసం చేపట్టనున్న భూసేకరణ ఉద్రిక్తతకు దారితీసింది. భూములను అప్పగించేందుకు రైతులు నిరాకరిస్తూ గత ఆరు రోజులుగా నిరసనలు చేస్తున్నారు. స్పష్టమైన పరిహారం, పునరావాస హామీలు ప్రకటించిన తర్వాతే భూములు ఇస్తామని రైతులు స్పష్టం చేశారు. హైడ్రా బృందాలు భూసేకరణ ప్రాంతానికి చేరుకోగా, భారీగా పోలీసులు, అధికారులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రైతులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు.