Latest
12 అడుగుల ఎత్తు నుంచి పడ్డ పాప
బెంగళూరు దగ్గర్లోని చిక్కబళ్లాపుర్‌లో ఓ బట్టల షాప్ దగ్గర ఊహించని ప్రమాదం జరిగింది. దంపతులు షాపింగ్ చేస్తుండగా వాళ్ల పాప ఆడుకుంటూ పైఫ్లోర్ నుండి కిందపడిపోయింది. 12 అడుగుల ఎత్తులో నుంచి పడిపోయిన ఆ బాలిక తలకు గాయమైంది. తనను ఆస్టర్ సీఎంఐ హాస్పిటల్‌కు హాస్పిటల్‌కు తరలించారు.

అమెరికా వెళ్లే స్టూడెంట్స్‌కి బ్యాడ్ న్యూస్.. వీసా రూల్స్ చేంజ్!
అమెరికాలో చదువుకునే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్‌కి అక్కడి గవర్నమెంట్ పెద్ద షాక్ ఇచ్చింది. గతంలో F-1 వీసా ఉన్నవాళ్లు కోర్సు పూర్తయ్యే వరకు ఉండేందుకు ఛాన్స్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ రూల్ మార్చేసి, కేవలం 4 ఇయర్స్ మాత్రమే ఉండేలా టైమ్ లిమిట్ పెట్టారు. ఆ తర్వాత కూడా ఉండాలంటే మళ్లీ పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఈ కొత్త డెసిషన్ వల్ల అమెరికాలో ఉన్న దాదాపు 3.3 లక్షల మంది ఇండియన్ స్టూడెంట్స్ ఫుల్ టెన్షన్ పడుతున్నారు.

భవనం గోడ కూలి ముగ్గురు పిల్లలకి గాయాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ జిల్లాలోని మకాన్‌పూర్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ అకస్మాత్తుగా కూలిపోయింది. స్కూల్ ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తున్న గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్ కొందరు ఈ కూలిన భాగాల కింద చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు గాయపడ్డారు. పోలీసులు, రెస్క్యూ టీమ్స్ స్పాట్‌కు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. పిల్లలను బయటకు తీసి ట్రీట్మెంట్ కోసం దగ్గరలోని హాస్పిటల్‌కు తరలించారు.

హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌కు కొత్త కళ
TG: హైదరాబాద్‌లో రీడెవలప్ చేసిన హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌ను పీఎం మోదీ ఈరోజు వర్చువల్‌గా ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సుమారు రూ.26 కోట్లతో ఆధునీకరించిన ఈ స్టేషన్‌లో కొత్త ఎంట్రన్స్ భవనం ఆకట్టుకుంటోంది. దీంతోపాటు 12 మీటర్ల వెడల్పున్న ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్, ఎస్కలేటర్లు, లిఫ్టుల వంటి కొత్త సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఈ స్టేషన్ ఒక కీలకమైన రవాణా కేంద్రంగా ఉంది. ఇది ప్రతిరోజూ సుమారు 3,000 మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తోంది.

మీ పేరు ముందు ‘డాక్టర్’ తీసేయండి! సుప్రీం కోర్టు ఫుల్ ఫైర్!
గాజియాబాద్‌లో రేప్‌కు గురైన నాలుగేళ్ల చిన్నారిని చేర్చుకోవడానికి రెండు ప్రైవేట్ హాస్పిటల్స్ నో చెప్పాయి. ఆ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్‌కి తీసుకెళ్లేసరికే ఆ పాప చనిపోయింది. ఈ దారుణంపై Supreme Court తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫీజులు కట్టలేరని పేద ఫ్యామిలీని వదిలేయడం వల్లే చిన్నారి ప్రాణాలు పోయాయని కోర్టు మండిపడింది. డ్యూటీ సరిగ్గా చేయనప్పుడు పేరు ముందు ‘డాక్టర్’ అని పెట్టుకునే అర్హత లేదని ఫైర్ అయింది. నిర్లక్ష్యం వహించిన హాస్పిటల్స్, బాధిత ఫ్యామిలీకి డొనేషన్స్ ఇవ్వాలని కోర్టు ఆర్డర్ వేసింది.

తెలంగాణ ఉపాధ్యాయుడికి అరుదైన గౌరవం!
TG: టెక్నాలజీపై అవగాహన కల్పించేలా నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి చెందిన ఉపాధ్యాయుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి ‘కంప్యూటర్ పిల్లలం’ అనే బాలగేయాన్ని రాశారు. పిల్లలకు సులభంగా అర్థమయ్యే పదాలతో ఈ గేయాన్ని రూపొందించారు. ఈ గేయానికి అరుదైన గౌరవం లభించింది. మహారాష్ట్ర ప్రభుత్వం నాలుగో తరగతి తెలుగు ‘బాలభారతి’ పాఠ్యపుస్తకంలో ఈ గేయాన్ని పాఠ్యాంశంగా చేర్చింది. విద్యావేత్తలు, సాహితీవేత్తలు ఆయన్ను అభినందిస్తున్నారు.

Jio Satellite Internetకు గ్రీన్ సిగ్నల్
జియో భారీ Satellite Internet ప్రాజెక్ట్‌కు IN-SPACE నుంచి టెక్నికల్ అప్రూవల్ వచ్చింది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా 1,600 శాటిలైట్స్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఈ నెట్‌వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనేది జియో లక్ష్యం. గ్రామాలు, కొండ ప్రాంతాలు, ఫైబర్ నెట్‌వర్క్ లేని ప్రాంతాల్లో కూడా ఇంటర్నెట్ అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్ట్‌తో స్టార్లింక్‌కు గట్టి పోటీ ఇవ్వాలని జియో చూస్తోంది.
సోనమ్ వాంగ్‌చుక్‌పై అమీర్‌ఖాన్ కామెంట్స్
‘3 ఇడియట్స్’ సినిమాలో తన క్యారెక్టర్ సోనమ్ వాంగ్‌చుక్ లైఫ్ ఆధారంగా తీసింది కాదని బాలీవుడ్ యాక్టర్ ఆమిర్‌ఖాన్ తెలియచేశారు. లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన మాట్లాడుతూ సినిమా తీసే సమయంలో తనకు కానీ, సినిమా రైటర్స్ రాజు, అభిజత్‌లకు సోనమ్ గురించి అస్సలు తెలియదని అన్నారు. అది అపోహ మాత్రమేనని చెప్పారు. సోనమ్ వాంగ్‌చుక్ చేస్తున్న సోషల్ సర్వీస్‌ను తాము ఎంతో గౌరవిస్తామని, ఆయన చేస్తున్న నిరాహార దీక్షపై తనకు కంగారుగా ఉందని తెలిపారు.

మూసీ నుంచి చికాగో దాకా.. హిస్టరీ ఛేదిస్తున్న మిలింద్
24 ఏళ్ల హైదరాబాదీ కెమెరాతో చరిత్రకు జీవం పోస్తున్నాడు. అమెరికాలో MA హిస్టరీ చేస్తున్న రాహుల్ మిలింద్.. తనే స్టోరీ, కెమెరా, మ్యూజిక్, డైరెక్షన్ చేస్తూ 3 డాక్యుమెంటరీస్ తీశాడు. మూసీ చరిత్ర, 1984 సిక్కుల ఊచకోత డాక్యుమెంటరీస్ జైపూర్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ గెలిచాయ్. దక్షిణాసియా నుంచి చికాగోకు వలస వెళ్లిన వారి అనుభవాలతో తీసిన "The Shape of Belonging" జులై 18న చికాగో సౌత్ ఏషియా ఇన్ స్టిట్యూట్లో ప్రదర్శిస్తున్నారు. రామచంద్ర గుహ శిష్యుడైన రాహుల్ మిలింద్ తెలంగాణ ఉద్యమకారుడు, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ VC ఘంటా చక్రపాణి కుమారుడు.

ORRపై ఘోర ప్రమాదం
TG: మేడ్చల్ జిల్లా కీసర PS పరిధిలోని ORRపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపక్కన నిలిపి ఉన్న ట్రాలీ ఆటోను గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టడంతో ఇద్దరు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులు మెదక్ జిల్లాకు చెందిన రాములు (60), రషీద్ (40)లుగా పోలీసులు గుర్తించారు. ప్రమాదం అనంతరం వాహన డ్రైవర్ పరారయ్యాడు. సమాచారం అందుకున్న కీసర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

బండి సంజయ్ కామెంట్స్ కి చిన్మయి స్ట్రాంగ్ కౌంటర్!
మహిళల సేఫ్టీ కంటే సాంప్రదాయాలకే ఇంపార్టన్స్ ఇస్తున్నారంటూ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో ఫైర్ అయ్యారు. BJP అధికారంలోకి వస్తే బొట్టు, గాజులు తప్పనిసరి చేస్తామన్న బండి సంజయ్ కామెంట్స్ పై ఆమె స్పందించారు. దేశంలో పసిపిల్లల నుండి శవాల వరకు రేప్స్ జరుగుతున్నా పట్టించుకోకుండా, ఇలాంటి నియమాలు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. పోక్సో నిందితుడు బెయిల్‌పై వచ్చి ఆరుగురిని చంపిన ఘటనను గుర్తు చేస్తూ, మహిళలపై క్రైమ్స్ ఆపడం కంటే బొట్టు, గాజులు ముఖ్యమా అంటూ ఆమె ఘాటుగా రియాక్ట్ అయ్యారు.

గొంతునొప్పికి భూత వైద్యం.. గర్భిణి మృతి
TG: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా కుంట మండలం మారాయిగూడెం గ్రామానికి చెందిన కురసం హెంకి ఆరునెలల గర్భిణి. ఆమెకు గొంతు నొప్పి రావడంతో స్థానిక భూత వైద్యుడిని సంప్రదించింది. చికిత్స పేరుతో అతడు మహిళ గొంతును బలంగా కొరకడంతో తీవ్ర గాయమై ఇన్ఫెక్షన్ సోకింది. ముఖం, గొంతు తీవ్రంగా వాచిపోయింది. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆమెను భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ICUలో ఉంచి చికిత్స అందించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందింది.

బస్టాండ్‌లో యువతిని మర్డర్ చేసిన ప్రేమోన్మాది!
కర్ణాటకలోని మంగళూరు దగ్గర ఒక ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. బంట్వాల్ బస్టాండ్‌లో 21 ఏళ్ల లావణ్య అనే యువతిని నడిరోడ్డుపైనే కత్తితో నరికి దారుణంగా చంపేశాడు. ఆమె దూరపు బంధువైన చేతన్ అనే యువకుడు ఈ క్రైమ్‌కి పాల్పడి అక్కడి నుండి పారిపోయాడు. తన లవ్‌ను లావణ్య రిజెక్ట్ చేసిందనే కోపంతోనే చేతన్ ఈ మర్డర్ చేసినట్లు పోలీసులు డౌట్ పడుతున్నారు. నిందితుడిని పట్టుకోవడానికి స్పెషల్ పోలీస్ టీమ్స్ రంగంలోకి దిగాయి.

హామీ అమలు చేయకపోతే స్కూటీలు తీసుకెళ్లండి
TG: నిజామాబాద్‌లో నిర్వహించిన 'ఇందూర్ రణభేరి' కార్యక్రమంలో ఆర్మూర్ MLA రాకేశ్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. అధికారంలోకి వస్తే కాలేజీ విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోలేదని ఆరోపించారు. హామీ అమలు చేయకపోతే కాంగ్రెస్ నేతలకు చెందిన షోరూమ్‌ల నుంచి విద్యార్థినులు స్కూటీలు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల హక్కుల కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, అవసరమైతే చలో కొడంగల్ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

బీటెక్ విద్యార్థులకు ఊహించని గుడ్‌న్యూస్
ఇంజినీరింగ్ పూర్తి చేసినవాళ్లకి ఇండియన్ ఆర్మీ గుడ్‌న్యూస్ చెప్పింది. షార్ట్ సర్వీస్ కమిషన్ (SSC-Tech) ద్వారా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో ఎలాంటి రాత పరీక్ష ఉండదు. బీటెక్‌లో సాధించిన మార్కులను బట్టి షార్ట్‌లిస్ట్ చేసి, ఆ తర్వాత సర్వీసెస్ సెలక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. సెలెక్ట్ అయిన వాళ్లకి ట్రైనింగ్ తర్వాత లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం వస్తుంది. అలవెన్సులతో కలిపి నెలకు రూ.1.5 లక్షల వరకు జీతం ఉంటుంది.

యువ సంగ్రామ సభకు బ్రేక్
TG: హైదరాబాద్ సరూర్‌నగర్ స్టేడియంలో శనివారం నిర్వహించనున్న BRS యువ సంగ్రామ సదస్సుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడంలేదని MLA సుధీర్ రెడ్డి ఫైరయ్యారు. సదస్సు ఏర్పాట్లను MLC శంభిపూర్ రాజు, పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. 18 రోజుల క్రితమే దరఖాస్తు చేసినా ఇప్పటికీ పర్మిషన్ రాలేదన్నారు. యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందిస్తారనే భయంతో ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శించారు. కోర్టు నుంచి అనుమతి వస్తుందనే విశ్వాసం తమకుందని, ఎట్టి పరిస్థితుల్లోనూ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తామన్నారు.

మిక్స్‌డ్ వెజిటబుల్ బాత్‌తో ఆరోగ్యానికి మేలు
రోజూ ఒకే రకమైన ఫుడ్ కాకుండా బీట్‌రూట్, టమాటా, ఆలుగడ్డ, క్యారెట్, బీన్స్ వంటి కూరగాయలతో మిక్స్‌డ్ వెజిటబుల్ బాత్ తయారు చేసుకుని తింటే బాడికి అవసరమైన అనేక Nutrients అందుతాయి. బీట్‌రూట్‌లో ఐరన్, క్యారెట్‌లో విటమిన్–A, టమాటాలో యాంటీఆక్సిడెంట్లు, బీన్స్‌లో ఫైబర్, ఆలుగడ్డలో కార్బోహైడ్రేట్లు సరిపడా ఉంటాయి. ఇవన్నీ కలిపి తీసుకోవడం వల్ల డైజెషన్ సిస్టమ్ బాగుపడటంతో పాటు ఎనర్జీ కూడా వస్తుంది. టస్టీగా ఉండే ఈ వెజిటబుల్ బాత్‌ను పిల్లలు, పెద్దలు అందరూ తమ ఆహారంలో తీసుకుంటే హెల్త్ కి మంచిది.

35 ఏళ్ళ తర్వాత కలుసుకున్న తల్లీకూతుళ్లు
చైనాలో రెండేళ్ల వయసులో తప్పిపోయిన జోంగ్ ఫెంగ్లిన్ అనే అమ్మాయి 35 ఏళ్ల తర్వాత డీఎన్ఏ పరీక్షతో మళ్లీ తన కన్నతల్లిని చేరుకుంది. 1991లో మార్కెట్‌లో జనాల మధ్య తప్పిపోయిన ఆమెను ఒక బట్టల వ్యాపారి పెంచి పెద్ద చేశాడు. జోంగ్ తనపై ఉన్న గాయాల వల్ల పేరెంట్స్ వదిలేశారని అనుకుంది. కానీ ఆమె కోసం కుటుంబం వెతుకుతూనే ఉంది. 'బేబీ కమ్ హోమ్' సేవా సంస్థ ద్వారా నిజం తెలుసుకొని జులై 7న ఆమె తన తల్లిని కలుసుకుంది.

రేవంత్ రెండు ఓట్లపై చర్యలు?
TG: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు చోట్ల ఓటరుగా ఉన్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి బీఆర్ఎస్ 'SIR' సమన్వయ కమిటీ గురువారం ఫిర్యాదు చేసింది. BRS నాయకురాలు మమత, కమిటీ సభ్యులు కలసి ఆయనకు వినతిపత్రం అందచేశారు. ఎపిక్ నంబర్ టీఈఎస్0274035తో కొడంగల్, కొండారెడ్డిపల్లి/అచ్చంపేట ఓటరు నమోదుపై టైమ్ స్టాంపుతో కూడిన ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని కోరారు.

స్కూల్ బస్సును ఢీకొట్టిన రైలు
వెస్ట్ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కర్ణసుబర్ణ రైల్వే క్రాసింగ్ దగ్గర పట్టాలు దాటుతున్న ఒక స్కూల్ బస్సును వేగంగా వచ్చిన రైలు ఢీకొట్టింది. బస్సు పూర్తిగా దెబ్బతింది. లోపలున్న విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన పిల్లలను ముర్షిదాబాద్ మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కు తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో రైల్వేగేట్లు తెరిచే ఉన్నాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.

వసతుల కోసం గురుకులంలో బాలికల ధర్నా
TG: సరైన వసతులు లేవని మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం గాంధీనగర్ గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థినులు గురువారం గేట్ ముందు ధర్నాకి దిగారు. అన్నంలో పురుగులు, వెంట్రుకలు వస్తున్నాయని నెల రోజులుగా చెబుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. ఏదైనా రిపేర్ వస్తే తమ దగ్గర డబ్బులు అడుగుతారని వివరించారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షడు రూప్‌సింగ్ వారికి ధైర్యం చెప్పి, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్కతో మాట్లాడించారు. వెంటనే వసతులు కల్పిస్తామని ఆమె హామీ ఇచ్చారు. విద్యార్థినులు ధర్నా విరమించారు.