← Back to news

హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌కు కొత్త కళ

By Mahesh· 17 Jul 2026· Hyderabad
హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌కు కొత్త కళ

TG: హైదరాబాద్‌లో రీడెవలప్ చేసిన హైటెక్ సిటీ రైల్వేస్టేషన్‌ను పీఎం మోదీ ఈరోజు వర్చువల్‌గా ప్రారంభించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద సుమారు రూ.26 కోట్లతో ఆధునీకరించిన ఈ స్టేషన్‌లో కొత్త ఎంట్రన్స్ భవనం ఆకట్టుకుంటోంది. దీంతోపాటు 12 మీటర్ల వెడల్పున్న ఫుట్ ఓవర్‌బ్రిడ్జ్, ఎస్కలేటర్లు, లిఫ్టుల వంటి కొత్త సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో ఈ స్టేషన్ ఒక కీలకమైన రవాణా కేంద్రంగా ఉంది. ఇది ప్రతిరోజూ సుమారు 3,000 మంది ప్రయాణీకులకు సేవలు అందిస్తోంది.

More in News