Latest

కాలేజీల బంద్.. విద్యార్థులకు కీలక అలర్ట్
TG: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్స్, ఫీజు రియంబర్స్‌మెంట్ వెంటనే రిలీజ్ చేయాలని ABVP బంద్‌కు పిలుపునివ్వడంతో ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు మూతపడనున్నాయి. పెండింగ్‌లో ఉన్న రూ.12,000 కోట్ల ఫీజు రీయంబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. సుమారు 20 లక్షల మంది SC, ST, BC, మైనారిటీ విద్యార్థులపై ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రభావం పడుతోందని, ప్రభుత్వ వైఖరికి నిరసనగా జూనియర్ కాలేజీల నుంచి యూనివర్సిటీల వరకు బంద్ పాటించాలని ABVP పిలుపునిచ్చింది.

ప్రశ్న రావణ్ కేసులో కీలక విచారణ
AP: ప్రశ్న రావణ్ పోలీస్ కస్టడీ పిటిషన్‌పై ఇవాళ గన్నవరం న్యాయస్థానంలో కీలక విచారణ జరగనుంది. రావణ్ ఇప్పటికే ఈ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నారు. అంతకుముందు అతనిపై నమోదైన నాలుగు వేర్వేరు కేసుల్లో రావణ్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసినప్పటికీ UAPA కేసులో ఆయన జైల్లో ఉన్నారు. దేశద్రోహ వ్యాఖ్యలు, నిషేధిత మావోయిస్ట్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తున్నారని UAPA కేసులో ఆయన్ను విచారించేందుకు తమకు అప్పగించాలని గన్నవరం పోలీసులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు విధించిన రిమాండ్ గడువు ఈ నెల 18తో ముగియనుంది.

'SIR'ను మరో 10రోజులు పొడిగించాలి
AP: SIR ఇంటింటి ఓటర్ల సర్వే ప్రక్రియను మరో 10 రోజులు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు. ఎన్యూమరేషన్ గడువు పొడిగించాలని రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నుంచి, వివిధ జిల్లాల కలెక్టర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో SIR ప్రక్రియలో భాగంగా BLOలు చేపట్టిన ఇంటింటి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ మంగళవారంతో ముగియనుంది.

మార్చి 31 నాటికి పోలవరం పనులు పూర్తిచేస్తాం
APకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులు 89శాతం పనులు పూర్తి అయ్యాయని, తొలిదశ పనులన్నీ వచ్చే మార్చి 31వ తేదీ నాటికి పూర్తి చేస్తామని CM చంద్రబాబు స్పష్టంచేశారు. పోలవరం ప్రాజెక్టును ఆయన సందర్శించి మాట్లాడారు. ప్రస్తుతం 89శాతం పనులు పూర్తయ్యాయి. అనుకున్న టైమ్ ప్రకారమే పనులు జరుగుతున్నాయని, స్పిల్ వే రేడియల్ గేట్స్, కాఫర్ డ్యామ్ సహా పలు పనులు పూర్తయ్యాయన్నారు. 2027 మార్చి నాటికి మిగతా అన్ని పనులు పూర్తి చేస్తామన్నారు. తాను ఇప్పటికి 37సార్లు పోలవరం ప్రాజెక్టును సందర్శించానని, 136 సార్లు వర్చువల్‌గా సమీక్షించానని గుర్తుచేశారు.

అలా చేస్తే 50రోజుల్లోనే జలాశయాలు నిండుతాయి
TG: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలోని అన్ని జలాశయాల్లో నీటిమట్టాలు 20శాతానికి పడిపోయాయని, మేడిగడ్డ వద్ద నీటిమట్టం 92.5 మీటర్లు ఉన్నప్పుడు నిరభ్యంతరంగా నీళ్లు ఎత్తిపోయవచ్చని మాజీ మంత్రి KTR అన్నారు. కరీంనగర్ సమీపంలోని లోయర్ మానేరు డ్యామ్‌ను ఆయన సందర్శించారు. మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిళ్ల, మిడ్‌మానేరుకు రోజూ 2-3TMCల నీటిని ఎత్తిపోస్తే 50రోజుల్లో అన్ని జలాశయాలను నింపవచ్చని స్పష్టంచేశారు. మేడిగడ్డతో తమకు సంబంధం లేదని, కన్నెపల్లి పంపులను ప్రారంభించాలని మాత్రమే కోరుతున్నామన్నారు.

తెలంగాణ కోసం ఒక్కటవ్వాలి
తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా రాజకీయాలకు అతీతంగా కలిసి ముందుకు సాగాలని CM రేవంత్‌రెడ్డి MPలకు సూచించారు. పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 20నుంచి ప్రారంభం కానుండడంతో కేంద్రంలో పెండింగ్‌లో ఉన్న అంశాలపై MPలకు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఏర్పాటుచేశారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలికవసతుల అభివృద్ధికి సంబంధించి కేంద్రప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులపై పార్లమెంట్‌లో గళమెత్తాలన్నారు. అన్ని పార్టీల ఎంపీలతో కలిసి ముందుకెళ్లాలని ఎంపీల కన్వీనర్ డాక్టర్ మల్లు రవికి సూచించారు.
ఈ మహిళ సాధికారతకు సలాం !
ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ చెన్నైలో వీధులు ఊడుస్తారు. ఆమెకు నలుగురు కుమార్తెలు. వారిలో ఒకరు పైలట్, మరొకరు ఎయిర్ హోస్టెస్,మరో కుమార్తె సింగపూర్ లో నర్సు.. చివరి కుమార్తె టీచర్ గా పనిచేస్తోంది. ఇలా వీధులు ఊడ్చి కష్టపడి ఆ నలుగురిని ఆమె చదివించింది. కూతుళ్లు అంత హోదాల్లో ఉన్నా ఈమె మాత్రం తన ఉద్యోగాన్ని వదలలేదు. సొంత కాళ్లపై నిలబడాలన్న తపన, ఎవరిపైనా ఆధారపడ రాదన్న పట్టుదల ఆమెను ఇంకా చెన్నై వీధులను ఊడ్చేలా చేస్తోంది. ఇటీవల వీరంతా ఆమె 50వ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి వచ్చారు. ఈ గ్రేట్ మదర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చేతి పై ఇంజెక్షన్ చేస్తే బాడీలో ఎలా పని చేస్తుంది?
మన బాడీలో చర్మంపై ఇచ్చే ఇంజెక్షన్ లోపలకెళ్లి మన అనారోగ్యాన్ని ఎలా నయం చేస్తుందనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఏఐ పుణ్యమాని ఇలాంటి ఎక్స్ ప్లనేటరీ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అలాంటిదే ఈ వీడియో. ఒక ఇంజెక్షన్ శరీరంలోకి వెళ్లాక ఎలా పనిచేస్తుంది అన్న టాపిక్ మీద ఈ చిన్న వీడియో మీరూ చూసేయండి.

హార్ముజ్ సరుకు రవాణాపై 20% ఛార్జ్: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మకమైన 'హోర్ముజ్ జలసంధి' అమెరికా కంట్రోల్లో ఉంటుందని ప్రకటిస్తూ ఇరాన్ నౌకలపై నావికాదళ దిగ్బంధనాన్ని విధించారు. ఈ మార్గం గుండా ప్రయాణించే అన్ని కార్గో నౌకల నుండి 20% రక్షణ రుసుమును వసూలు చేస్తాం అని అనౌన్స్ చేశారు. అయితే ఇతర దేశాల నౌకల రాకపోకలకు మాత్రం ఈ జలసంధి ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని చెప్పాడు.

నాసిక్ లో ఫ్యామిలీ ఛేజింగ్ హారర్: వెంటాడిన దుండగులు
మహారాష్ట్రలోని నాసిక్‌లో దారుణం జరిగింది. తమ కుటుంబ సభ్యురాలిని లైంగికంగా వేధించడాన్ని ఓ ఫ్యామిలీ తీవ్రంగా నిరసించింది. దీంతో రెచ్చిపోయిన కొందరు దుండగులు ఆ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న కారును దాదాపు 15 కిలోమీటర్ల మేర వెంబడిం చారు. అంతటితో ఆగకుండా బాధితుల కారును అడ్డగించి, కర్రలు, ఐరన్ రాడ్ లతో తీవ్రంగా ధ్వంసం చేశారు. ఈ భయానక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

పుష్కరాలకన్నా ముందే పోలవరం పూర్తి !
ఈ ఏడాది ఆగస్టు 14 తేదీన అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముందు అనకాపల్లి వరకూ పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని తరలించనున్నట్టు సీఎం తెలియచేశారు. వచ్చే ఏడాదిలోగా విశాఖకు నీటిని తరలించే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం చేపడతామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పుష్కరాల కన్నా ముందే మార్చి 2027 నాటికల్లా పూర్తి చేస్తామని.. వర్షపు సీజన్ సహా వరద నీటి ప్రవాహాలకు అనుగుణంగా జూలైలో గ్రావిటీపై నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు.
వాడ్ని ప్రశాంతంగా ఎందుకు చనిపోనిచ్చారు? - షాబాద్ నిందితుడి సోదరుడు
షాబాద్ హత్యల కేసు నిందితుడి మృతదేహం లభ్యమైన చోట అతని సోదరుడు ఆగ్రహంతో ఆవేదనతో ఊగిపోయాడు. నరహంతకుడు.. వాడిని కాల్చేయాలి.. ఇన్నాళ్లు ఎందుకు వదిలారు? వాడికి ప్రశాంతంగా చనిపోయే అవకాశం ఎందుకిచ్చారు.. కాల్చి చంపేసి ఉండాల్సిందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. కుటుంబాన్ని హత్య చేసిన దరిద్రుడంటూ శాపనార్ధాలు పెట్టాడు. పిల్లలను అన్యాయంగా చంపాడని, ఆ పిల్లలను తానైనా పెంచుకుని ఉండే వాడినని బాధపడ్డాడు.

మళ్లీ కరోనా ! కారణాలివే !
భారత్ తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కోవిడ్ -19 కి కారణమయ్యే సార్స్ కోవిడ్ -2 వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ స్ప్రెడ్ అవుతోంది. ఇది తీవ్రమైన ఎఫెక్ట్ చూపకపోయినా ఇన్ఫెక్షన్లు పెరగడానికి అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. టీకాలనుంచి దొరికే రక్షణ కాల క్రమేణా తగ్గుతుందని, ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాలు, స్కూళ్లు, సోషల్ మీటింగ్స్ ద్వారా వైరస్ వేగంగా స్ర్పెడ్అవుతుందని వైద్యులు అంటున్నారు.

కదిలే రైలులో పూజలు.. రైల్వే శాఖ క్లారిటీ!
రైలులో పూజలు నిర్వహిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో, దీనిపై ఉత్తర రైల్వే క్లారిటీ ఇచ్చింది. ఈ మతపరమైన కార్యక్రమం సాధారణ ప్యాసింజర్ కోచ్‌లో జరగలేదని, ఐఆర్‌సిటిసి (IRCTC) ద్వారా ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న 'సలూన్ కార్' (Saloon Car) లో జరిగిందని రైల్వే శాఖ తెలిపింది. ముంబై వెళ్లే పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్‌కు అటాచ్ చేసిన ఈ విలాసవంతమైన కోచ్ కోసం ఒక ప్రైవేట్ పార్టీ రూ. 3,08,580 అడ్వాన్స్ చెల్లించి కమర్షియల్ బుకింగ్ చేసుకున్నట్లు అధికారులు వివరించారు.

బంగ్లాదేశ్‌లో రాముడి విగ్రహ నిర్వాహకుడి అరెస్ట్
బంగ్లాదేశ్‌లో అత్యంత ఎత్తైన 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదించిన హరిదాస్ చంద్ర తరణి దాస్ (తౌహిద్ ఇస్లాం) మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఎటువంటి ఆదాయ వనరులు లేకుండా రూ. 9.35 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరపడంతో సిఐడి (CID) ఈ చర్య తీసుకుంది. గతంలో తీవ్రవాద ముఠాల బెదిరింపుల వల్ల ఈ విగ్రహ పనులు ఆగిపోయాయి. ఈ అరెస్టును బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రైస్తవ ఐక్యతా కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది.

మధ్య ప్రదేశ్ లో రూ. కోట్ల విలువైన రేషన్ బియ్యం స్కాం !
మధ్యప్రదేశ్‌లో రేషన్ బియ్యాన్ని ఇథనాల్ తయారీకి మళ్లించి, తిరిగి ప్రభుత్వానికే ఎక్కువ ధరలకు అమ్మేస్తూ అధికారులు రూ.1,160 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. పేదలకు చేరాల్సిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రైవేట్ మిల్లుల ద్వారా రీ-ప్యాకేజ్ చేసి ఈ దందా నడిపించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీస్ సిట్ (SIT) నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది. ప్రస్తుతం 56 రైస్ మిల్లులు, 22 ఇథనాల్ ప్లాంట్లు నిఘా నీడలో ఉన్నాయి. రంగంలోకి దిగిన అధికారులు మిల్లుల యజమానులు, రవాణాదారులు, అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర కార్గో షిప్స్ కి టోల్ ఫీజు : ట్రంప్
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వెళ్లే కార్గో షిప్స్‌పై 20% టోల్ ఫీజు (Fee) వసూలు చేయనున్నట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేశారు. అక్కడ సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి ఈ ఫీజు హెల్ప్ అవుతుందని చెప్పారు. అమెరికా ఇకపై స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ కు గార్డియన్ లా పనిచేస్తుందని, కేవలం ఇరాన్ షిప్స్‌ను మాత్రమే స్టాప్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మిగిలిన దేశాల గ్లోబల్ ట్రేడ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ముదిరిన కాంగ్రెస్ లీడర్స్ ఫ్లెక్సీ వార్!
యాదగిరిగుట్ట మేనేజ్‌మెంట్ కమిటీ మెంబర్‌గా ఈశ్వరమ్మ యాదవ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మన్సూరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదం ముదిరింది. తన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఎలా వేస్తారంటూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, ఈశ్వరమ్మ మనవడు సురేష్ యాదవ్‌పై బూతులతో విరుచుకుపడిన ఆడియో లీకైంది. "సీఎం రేవంత్, మహేష్ గౌడ్ తర్వాత నేనే నెంబర్ 3.. రాహుల్ గాంధీకి చెప్తా" అంటూ శివచరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ ఆడియో సెన్సేషన్ తర్వాతే ఈశ్వరమ్మ వర్గీయులు శివచరణ్ ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు.

షాబాద్ కిల్లర్ రాజ్ కుమార్ షాకింగ్ నిర్ణయం!
షాబాద్ ఆరు హత్యల కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రాజ్‌కుమార్ హాస్పిటల్ పాలుపడ్డాడు. పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో, అరెస్ట్ కావడానికి ముందే అతను పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీక్రెట్‌గా అతన్ని హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు సమాచారం.
పాదయాత్రకు హరీశ్ రావు రెడీ!
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు BRS సీనియర్ లీడర్ హరీశ్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తను ప్రజల్లోకి వెళ్లనున్నట్లు అనౌన్స్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ‘బసవేశ్వర నుండి సంగమేశ్వర’ వరకు భారీ పాదయాత్ర చేపట్టబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరుపై మండిపడ్డ హరీశ్ రావు, కాంగ్రెస్ చేస్తున్న తప్పులను, వైఫల్యాలను ఈ యాత్ర ద్వారా ఎండగడతామని, ప్రజల హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.

OTT లోకి సమంత బ్లాక్‌బస్టర్ ‘మా ఇంటి బంగారం’!
₹100 కోట్ల కలెక్షన్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సమంత హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు OTT కి రెడీ అయింది. నందిని రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ థియేట్రికల్ హిట్, కేవలం నెల రోజుల్లోనే డిజిటల్ స్క్రీన్స్ పైకి వస్తోంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్ స్టార్’ లో జూలై 17 నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. గుల్షన్ దేవయ్య, గౌతమి కీలక పాత్రలు పోషించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు డబుల్ ఫన్ అండ్ ఎక్సైట్‌మెంట్‌తో త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.