Latest
ఈ మహిళ సాధికారతకు సలాం !
ఈ వీడియోలో కనిపిస్తున్న మహిళ చెన్నైలో వీధులు ఊడుస్తారు. ఆమెకు నలుగురు కుమార్తెలు. వారిలో ఒకరు పైలట్, మరొకరు ఎయిర్ హోస్టెస్,మరో కుమార్తె సింగపూర్ లో నర్సు.. చివరి కుమార్తె టీచర్ గా పనిచేస్తోంది. ఇలా వీధులు ఊడ్చి కష్టపడి ఆ నలుగురిని ఆమె చదివించింది. కూతుళ్లు అంత హోదాల్లో ఉన్నా ఈమె మాత్రం తన ఉద్యోగాన్ని వదలలేదు. సొంత కాళ్లపై నిలబడాలన్న తపన, ఎవరిపైనా ఆధారపడ రాదన్న పట్టుదల ఆమెను ఇంకా చెన్నై వీధులను ఊడ్చేలా చేస్తోంది. ఇటీవల వీరంతా ఆమె 50వ పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి వచ్చారు. ఈ గ్రేట్ మదర్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చేతి పై ఇంజెక్షన్ చేస్తే బాడీలో ఎలా పని చేస్తుంది?
మన బాడీలో చర్మంపై ఇచ్చే ఇంజెక్షన్ లోపలకెళ్లి మన అనారోగ్యాన్ని ఎలా నయం చేస్తుందనే డౌట్ చాలా మందికి ఉంటుంది. ఏఐ పుణ్యమాని ఇలాంటి ఎక్స్ ప్లనేటరీ వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి. అలాంటిదే ఈ వీడియో. ఒక ఇంజెక్షన్ శరీరంలోకి వెళ్లాక ఎలా పనిచేస్తుంది అన్న టాపిక్ మీద ఈ చిన్న వీడియో మీరూ చూసేయండి.

హార్ముజ్ సరుకు రవాణాపై 20% ఛార్జ్: ట్రంప్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై సంచలన నిర్ణయం తీసుకున్నారు. వ్యూహాత్మకమైన 'హోర్ముజ్ జలసంధి' అమెరికా కంట్రోల్లో ఉంటుందని ప్రకటిస్తూ ఇరాన్ నౌకలపై నావికాదళ దిగ్బంధనాన్ని విధించారు. ఈ మార్గం గుండా ప్రయాణించే అన్ని కార్గో నౌకల నుండి 20% రక్షణ రుసుమును వసూలు చేస్తాం అని అనౌన్స్ చేశారు. అయితే ఇతర దేశాల నౌకల రాకపోకలకు మాత్రం ఈ జలసంధి ఎల్లప్పుడూ తెరిచే ఉంటుందని చెప్పాడు.

నాసిక్ లో ఫ్యామిలీ ఛేజింగ్ హారర్: వెంటాడిన దుండగులు
మహారాష్ట్రలోని నాసిక్‌లో దారుణం జరిగింది. తమ కుటుంబ సభ్యురాలిని లైంగికంగా వేధించడాన్ని ఓ ఫ్యామిలీ తీవ్రంగా నిరసించింది. దీంతో రెచ్చిపోయిన కొందరు దుండగులు ఆ ఫ్యామిలీ ప్రయాణిస్తున్న కారును దాదాపు 15 కిలోమీటర్ల మేర వెంబడిం చారు. అంతటితో ఆగకుండా బాధితుల కారును అడ్డగించి, కర్రలు, ఐరన్ రాడ్ లతో తీవ్రంగా ధ్వంసం చేశారు. ఈ భయానక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు.

పుష్కరాలకన్నా ముందే పోలవరం పూర్తి !
ఈ ఏడాది ఆగస్టు 14 తేదీన అనకాపల్లిలో గోదావరి జలాలకు అఖండ హారతి ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ముందు అనకాపల్లి వరకూ పోలవరం ఎడమ కాలువ ద్వారా నీటిని తరలించనున్నట్టు సీఎం తెలియచేశారు. వచ్చే ఏడాదిలోగా విశాఖకు నీటిని తరలించే ప్రక్రియలో భాగంగా ఈ కార్యక్రమం చేపడతామని అన్నారు. పోలవరం ప్రాజెక్టును పుష్కరాల కన్నా ముందే మార్చి 2027 నాటికల్లా పూర్తి చేస్తామని.. వర్షపు సీజన్ సహా వరద నీటి ప్రవాహాలకు అనుగుణంగా జూలైలో గ్రావిటీపై నీటిని విడుదల చేయనున్నట్టు తెలిపారు.
వాడ్ని ప్రశాంతంగా ఎందుకు చనిపోనిచ్చారు? - షాబాద్ నిందితుడి సోదరుడు
షాబాద్ హత్యల కేసు నిందితుడి మృతదేహం లభ్యమైన చోట అతని సోదరుడు ఆగ్రహంతో ఆవేదనతో ఊగిపోయాడు. నరహంతకుడు.. వాడిని కాల్చేయాలి.. ఇన్నాళ్లు ఎందుకు వదిలారు? వాడికి ప్రశాంతంగా చనిపోయే అవకాశం ఎందుకిచ్చారు.. కాల్చి చంపేసి ఉండాల్సిందంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. కుటుంబాన్ని హత్య చేసిన దరిద్రుడంటూ శాపనార్ధాలు పెట్టాడు. పిల్లలను అన్యాయంగా చంపాడని, ఆ పిల్లలను తానైనా పెంచుకుని ఉండే వాడినని బాధపడ్డాడు.

మళ్లీ కరోనా ! కారణాలివే !
భారత్ తో పాటు పలు దేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. కోవిడ్ -19 కి కారణమయ్యే సార్స్ కోవిడ్ -2 వైరస్ తన రూపాన్ని మార్చుకుంటూ స్ప్రెడ్ అవుతోంది. ఇది తీవ్రమైన ఎఫెక్ట్ చూపకపోయినా ఇన్ఫెక్షన్లు పెరగడానికి అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. టీకాలనుంచి దొరికే రక్షణ కాల క్రమేణా తగ్గుతుందని, ఎక్కువ రద్దీ ఉండే ప్రాంతాలు, స్కూళ్లు, సోషల్ మీటింగ్స్ ద్వారా వైరస్ వేగంగా స్ర్పెడ్అవుతుందని వైద్యులు అంటున్నారు.

కదిలే రైలులో పూజలు.. రైల్వే శాఖ క్లారిటీ!
రైలులో పూజలు నిర్వహిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో, దీనిపై ఉత్తర రైల్వే క్లారిటీ ఇచ్చింది. ఈ మతపరమైన కార్యక్రమం సాధారణ ప్యాసింజర్ కోచ్‌లో జరగలేదని, ఐఆర్‌సిటిసి (IRCTC) ద్వారా ప్రైవేట్‌గా బుక్ చేసుకున్న 'సలూన్ కార్' (Saloon Car) లో జరిగిందని రైల్వే శాఖ తెలిపింది. ముంబై వెళ్లే పశ్చిమ్ ఎక్స్‌ప్రెస్‌కు అటాచ్ చేసిన ఈ విలాసవంతమైన కోచ్ కోసం ఒక ప్రైవేట్ పార్టీ రూ. 3,08,580 అడ్వాన్స్ చెల్లించి కమర్షియల్ బుకింగ్ చేసుకున్నట్లు అధికారులు వివరించారు.

బంగ్లాదేశ్‌లో రాముడి విగ్రహ నిర్వాహకుడి అరెస్ట్
బంగ్లాదేశ్‌లో అత్యంత ఎత్తైన 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ ఏర్పాటుకు ప్రతిపాదించిన హరిదాస్ చంద్ర తరణి దాస్ (తౌహిద్ ఇస్లాం) మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఎటువంటి ఆదాయ వనరులు లేకుండా రూ. 9.35 కోట్ల అనుమానాస్పద లావాదేవీలు జరపడంతో సిఐడి (CID) ఈ చర్య తీసుకుంది. గతంలో తీవ్రవాద ముఠాల బెదిరింపుల వల్ల ఈ విగ్రహ పనులు ఆగిపోయాయి. ఈ అరెస్టును బంగ్లాదేశ్ హిందూ-బౌద్ధ-క్రైస్తవ ఐక్యతా కౌన్సిల్ తీవ్రంగా ఖండించింది.

మధ్య ప్రదేశ్ లో రూ. కోట్ల విలువైన రేషన్ బియ్యం స్కాం !
మధ్యప్రదేశ్‌లో రేషన్ బియ్యాన్ని ఇథనాల్ తయారీకి మళ్లించి, తిరిగి ప్రభుత్వానికే ఎక్కువ ధరలకు అమ్మేస్తూ అధికారులు రూ.1,160 కోట్ల భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. పేదలకు చేరాల్సిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రైవేట్ మిల్లుల ద్వారా రీ-ప్యాకేజ్ చేసి ఈ దందా నడిపించారు. దీనిపై విచారణ చేపట్టిన పోలీస్ సిట్ (SIT) నెట్‌వర్క్‌ను మరింత విస్తరించింది. ప్రస్తుతం 56 రైస్ మిల్లులు, 22 ఇథనాల్ ప్లాంట్లు నిఘా నీడలో ఉన్నాయి. రంగంలోకి దిగిన అధికారులు మిల్లుల యజమానులు, రవాణాదారులు, అధికారులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర కార్గో షిప్స్ కి టోల్ ఫీజు : ట్రంప్
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ద్వారా వెళ్లే కార్గో షిప్స్‌పై 20% టోల్ ఫీజు (Fee) వసూలు చేయనున్నట్లు US ప్రెసిడెంట్ ట్రంప్ అనౌన్స్ చేశారు. అక్కడ సెక్యూరిటీని మెయింటైన్ చేయడానికి ఈ ఫీజు హెల్ప్ అవుతుందని చెప్పారు. అమెరికా ఇకపై స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ కు గార్డియన్ లా పనిచేస్తుందని, కేవలం ఇరాన్ షిప్స్‌ను మాత్రమే స్టాప్ చేస్తామని క్లారిటీ ఇచ్చారు. మిగిలిన దేశాల గ్లోబల్ ట్రేడ్‌కి ఎలాంటి ప్రాబ్లమ్ ఉండదని ట్రంప్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ముదిరిన కాంగ్రెస్ లీడర్స్ ఫ్లెక్సీ వార్!
యాదగిరిగుట్ట మేనేజ్‌మెంట్ కమిటీ మెంబర్‌గా ఈశ్వరమ్మ యాదవ్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మన్సూరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల వివాదం ముదిరింది. తన తండ్రి జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఫోటో లేకుండా ఫ్లెక్సీలు ఎలా వేస్తారంటూ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివచరణ్ రెడ్డి, ఈశ్వరమ్మ మనవడు సురేష్ యాదవ్‌పై బూతులతో విరుచుకుపడిన ఆడియో లీకైంది. "సీఎం రేవంత్, మహేష్ గౌడ్ తర్వాత నేనే నెంబర్ 3.. రాహుల్ గాంధీకి చెప్తా" అంటూ శివచరణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ ఆడియో సెన్సేషన్ తర్వాతే ఈశ్వరమ్మ వర్గీయులు శివచరణ్ ఇంటిపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు.

షాబాద్ కిల్లర్ రాజ్ కుమార్ షాకింగ్ నిర్ణయం!
షాబాద్ ఆరు హత్యల కేసులో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ రాజ్‌కుమార్ హాస్పిటల్ పాలుపడ్డాడు. పోలీసులు తనను పట్టుకుంటారనే భయంతో, అరెస్ట్ కావడానికి ముందే అతను పురుగుల మందు తాగి సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు సీక్రెట్‌గా అతన్ని హాస్పిటల్‌కు తరలించి ట్రీట్‌మెంట్ అందిస్తున్నట్లు సమాచారం.
పాదయాత్రకు హరీశ్ రావు రెడీ!
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు BRS సీనియర్ లీడర్ హరీశ్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే తను ప్రజల్లోకి వెళ్లనున్నట్లు అనౌన్స్ చేశారు. ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ‘బసవేశ్వర నుండి సంగమేశ్వర’ వరకు భారీ పాదయాత్ర చేపట్టబోతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. ప్రాజెక్టుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న తీరుపై మండిపడ్డ హరీశ్ రావు, కాంగ్రెస్ చేస్తున్న తప్పులను, వైఫల్యాలను ఈ యాత్ర ద్వారా ఎండగడతామని, ప్రజల హక్కుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని స్పష్టం చేశారు.

OTT లోకి సమంత బ్లాక్‌బస్టర్ ‘మా ఇంటి బంగారం’!
₹100 కోట్ల కలెక్షన్స్‌తో సెన్సేషన్ క్రియేట్ చేసిన సమంత హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ ‘మా ఇంటి బంగారం’ ఇప్పుడు OTT కి రెడీ అయింది. నందిని రెడ్డి డైరెక్షన్‌లో వచ్చిన ఈ థియేట్రికల్ హిట్, కేవలం నెల రోజుల్లోనే డిజిటల్ స్క్రీన్స్ పైకి వస్తోంది. ప్రముఖ OTT ప్లాట్‌ఫామ్ ‘జియో హాట్ స్టార్’ లో జూలై 17 నుండి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. గుల్షన్ దేవయ్య, గౌతమి కీలక పాత్రలు పోషించిన ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు డబుల్ ఫన్ అండ్ ఎక్సైట్‌మెంట్‌తో త్వరలోనే సీక్వెల్ కూడా రాబోతుందని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.
గుండుతో నిరసన.. AP పాలిటిక్స్‌లో ఒక్కసారిగా పెరిగిన హీట్!
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APGEF) వినూత్న రీతిలో నిరసన తెలిపింది. తమకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ APGEF ప్రెసిడెంట్ వెంకట్రామిరెడ్డితో పాటు పలువురు ఉద్యోగులు గుండు చేయించుకున్నారు. "ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు" అంటూ ప్లకార్డులు పట్టుకొని తమ నిరసనను వ్యక్తం చేశారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉద్యోగ సంఘాల నేతలు ఈ సందర్భంగా తీవ్రంగా ఆరోపించారు. ఈ గుండు నిరసన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

కేంద్రం, యూపీ ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు షాక్!
అయోధ్య రామాలయం విరాళాల చోరీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన దర్యాప్తుపై నివేదిక ఇవ్వాలని ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఆదేశించింది. CBI ఎంక్వైరీ కోరుతూ దాఖలైన పిటిషన్లపై స్పందించాలని కేంద్రం, UP ప్రభుత్వంతో పాటు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలిచ్చింది. కాగా, ఈ కేసు తదుపరి విచారణను జులై 20వ తేదీకి వాయిదా వేశారు.

టిష్యూ పేపర్లు వైట్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా?
మనం డైలీ వాడే టిష్యూ పేపర్లు మోస్ట్లీ వైట్ కలర్‌లోనే ఎందుకు ఉంటాయో తెలుసా? దీని వెనుక కొన్ని ఇంట్రెస్టింగ్ రీజన్స్ ఉన్నాయి. టిష్యూలను కలప గుజ్జుతో తయారు చేసినప్పుడు అది బ్లీచింగ్ వల్ల వైట్‌గా మారుతుంది. వీటికి ఎక్స్‌ట్రా కలర్స్ యాడ్ చేస్తే కెమికల్స్ వల్ల స్కిన్ అలర్జీలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే హెల్త్, ఎన్విరాన్మెంట్ సేఫ్టీ కోసం వీటిని వైట్‌గానే ఉంచుతారు. పైగా కలర్స్ కలపకపోవడం వల్ల తయారీ ఖర్చు తగ్గి, నీటిలో కూడా ఇవి ఈజీగా కరిగిపోతాయి.

జూనియర్ NTR పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ!
జులై 18న జూనియర్ NTR పొలిటికల్ అనౌన్స్‌మెంట్ చేయబోతున్నారంటూ వస్తున్న వార్తలపై క్లారిటీ వచ్చింది. ‘RAW NTR’ అఫీషియల్ టీమ్ దీనిపై స్పందిస్తూ అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని తేల్చి చెప్పింది. ఆ రోజు జరగబోయే #ఊరువాడ ఈవెంట్ కేవలం వారి కోర్ ఐడియా, విజన్‌ని రివీల్ చేయడానికి ప్లాన్ చేసిందే తప్ప, ఎలాంటి రాజకీయ ప్రకటనలు ఉండవని స్పష్టం చేశారు. ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవ్వద్దని, మీడియా సంస్థలు ఫేక్ న్యూస్‌ని నమ్మవద్దని తేల్చి చెప్పేశారు.

బుక్ లవర్‌కి షాక్.. 10 వేల పుస్తకాలతో ఇల్లు ఖాళీ చేసే పరిస్థితి!
న్యూయార్క్‌కు చెందిన 31 ఏళ్ల బుక్ లవర్, పరిశోధకుడు మెండెల్ ఉమినర్ తన 600 చదరపు అడుగుల స్టూడియో అపార్ట్‌మెంట్‌లో ఏకంగా 10,000 పుస్తకాలు పెట్టుకున్నాడు. వాటి బరువు భవనం భద్రతకు, అగ్నిప్రమాదానికి ముప్పుగా మారొచ్చని యజమాని హెచ్చరించాడు. దీంతో పుస్తకాల సంఖ్య తగ్గించాలి లేదా ఇల్లు ఖాళీ చేయాలని చెప్పాడు. కానీ “ప్రతి పుస్తకం నా పనికే, ఇవే నా ప్రపంచం” అంటూ ఉమినర్ ఇల్లు ఖాళీ చేశాడు. ఈ బుక్ లవర్ స్టోరీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అన్నామలై పార్టీతో పాటు మతం వదిలేశారా?
BJP తమిళనాడు లీడర్ అన్నామలై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "నేను పక్కా హిందువునే, కానీ పబ్లిక్ సర్వీస్‌లోకి వచ్చినప్పుడు నా కులాన్ని, మతాన్ని ఇంట్లోనే వదిలేస్తా" అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. పాలిటిక్స్‌లో అందరినీ సమానంగా చూడటమే తన రూట్ అని, ప్రజలందరికీ ఒకేలా సర్వీస్ చేయడమే తన మెయిన్ గోల్ అని క్లారిటీ ఇచ్చారు. గతంలో ఆయనపై మత రాజకీయాల విమర్శలు రాగా, ఈ తాజా కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.