Latest

జడ్జీలపైనే ఆర్డర్స్ వేసిన పిటిషనర్!▶
Legal· 10 Jul 2026

జడ్జీలపైనే ఆర్డర్స్ వేసిన పిటిషనర్!

అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఓ పిటిషనర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం ముందు వాదనలు ప్రారంభించిన వెంటనే, "లక్నో ACPపై FIR ఫైల్ చేయాలని నేను ఆదేశిస్తున్నా" అంటూ జడ్జీలపైనే ఆర్డర్స్ వేశాడు. దీంతో ఆశ్చర్యపోయిన జస్టిస్ విశ్వనాథన్.. "మమ్మల్ని ఆదేశిస్తున్నారా?" అని ప్రశ్నించారు. దానికి పిటిషనర్ స్పందిస్తూ "నా తరఫున చెప్పాల్సింది చెప్పాను, అంతా రికార్డులో ఉంది" అంటూ కోర్టు పేపర్లను గాల్లోకి విసిరేశాడు. సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని కోర్టు హాలు నుంచి బయటకు తీసుకెళ్లారు.

శోభన్‌బాబు సతీమణి కన్నుమూత
Cinema· 10 Jul 2026

శోభన్‌బాబు సతీమణి కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. దివంగత నటుడు శోభన్‌బాబు సతీమణి శాంతకుమారి(86) వయోభారంతో కన్నుమూశారు. చెన్నైలో ఉంటున్న ఆమె ఆరోగ్య సమస్యలతో ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరారని కుటుంబసభ్యులు తెలిపారు. అక్కడ శాంతకుమారిని పరామర్శించటానికి వచ్చిన వారితో మాట్లాడుతూ కార్డియాక్ అరెస్ట్‌కు గురై చనిపోయినట్లు వారు వివరించారు. ఆమె మరణవార్త తెలిసిన వెంటనే సినీ అభిమానులు, శోభన్‌బాబు అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. శాంతకుమారి, శోభన్‌బాబు దంపతుల వివాహం 1958 మే 15న జరిగింది.

విద్యార్థి సంఘాల ఆందోళన
TG· 10 Jul 2026

విద్యార్థి సంఘాల ఆందోళన

TG: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా KG టు PG విద్యాసంస్థల బంద్‌కు వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు పిలుపునిచ్చారు. SFI, AISFI, PDSU, AIDSO, AIFDS, AISB, AIPSU విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌లో భారీ ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యారంగంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, ప్రభుత్వ విద్యను బాగుచేస్తామని చెప్పి 23వేల ప్రభుత్వ స్కూళ్లను మూసివేయాలని నిర్ణయించడం దుర్మార్గమన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్స్‌ విడుదల కాకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు.

USFI ఆధ్వర్యంలో ప్రజాభవన్ ముట్టడి
Education· 10 Jul 2026

USFI ఆధ్వర్యంలో ప్రజాభవన్ ముట్టడి

TG: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు నేడు బంద్‌కు పిలుపునిచ్చాయి. USFI నాయకులు హైదరాబాద్‌లోని ప్రజాభవనన్‌ను ముట్టడించారు. పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్‌ను వెంటనే విడుదల చేయాలని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్దఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల సమస్యలను CM రేవంత్ రెడ్డి పట్టించుకోవటం లేదని, విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థి నేతలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.

అంగన్వాడీల మెరుపు ధర్నా.. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
AP· 10 Jul 2026

అంగన్వాడీల మెరుపు ధర్నా.. కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత

AP: దీర్ఘకాలికంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ కార్యకర్తలు మెరుపు ధర్నాకు దిగడంతో తిరుపతి కలెక్టరేట్ వద్ద టెన్షన్ వాతావరణం నెలకుంది. ESI, PF సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. CITU ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం వెంటనే అంగన్వాడీ వర్కర్లకు రూ.26 వేల కనీస వేతనం ఇవ్వాలన్నారు. అంగన్వాడీలు సుదీర్ఘకాలంగా సేవలు అందిస్తున్నా, వారి సామాజిక భద్రతను ప్రభుత్వం విస్మరిస్తోందన్నారు. వెంటనే వారి డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ప్రభుత్వం స్పందించి సానుకూల నిర్ణయం తీసుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు.

ప్రశ్న రావణ్‌పై మరో కేసు
AP· 10 Jul 2026

ప్రశ్న రావణ్‌పై మరో కేసు

AP: ఏలూరు జిల్లా నూజివీడులో ప్రముఖ యూట్యూబర్, ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్‌పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌‌పై రావణ్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని జనసేన పార్టీ నాయకులు ఫైరయ్యారు. వ్యక్తిగత దూషణలే కాకుండా, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ద్వేషాన్ని, వ్యతిరేకతను రెచ్చగొట్టేలా ఆయన కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు నూజివీడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రావణ్‌పై ఇప్పటికే ఉపా, దేశద్రోహం కేసులు నమోదైన విషయం తెలిసిందే.

CM రేవంత్ రెడ్డి కంటిపరీక్ష చేయించుకోవాలి
Politics· 10 Jul 2026

CM రేవంత్ రెడ్డి కంటిపరీక్ష చేయించుకోవాలి

TG: హైడ్రాను అడ్డం పెట్టుకుని హైదరాబాద్‌లోని నిరుపేదల ఇళ్లను రేవంత్ సర్కార్ బుల్డోజర్ల కింద నలిపేస్తోందని తెలంగాణ రక్షణ సేన(TRS) చీఫ్ కల్వకుంట్ల కవిత ఫైరయ్యారు. ట్విట్టర్‌ వేదికగా ఆమె రాష్ట్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. MIM అధినేత అసదుద్దీన్ ఒవైసీకి చెందిన విద్యాసంస్థలను కాపాడటానికి ఏకంగా కోర్టులను కూడా ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఒవైసీ విద్యాసంస్థల నిర్మాణాలు చెరువులను కబ్జా చేసి కట్టారనే విషయం స్పష్టంగా కనిపిస్తున్నా రేవంత్ రెడ్డికి మాత్రం కన్పించడం లేదన్నారు. దీన్ని బట్టి చూస్తే తక్షణమే ఆయన కంటిపరీక్ష చేయించుకోవాలని ఎద్దేవా చేశారు.

జైలు భోజనం వద్దన్న ఖైదీ.. నా వంట నేనే చేసుకుంటా!
World· 10 Jul 2026

జైలు భోజనం వద్దన్న ఖైదీ.. నా వంట నేనే చేసుకుంటా!

జైలు ఫుడ్ తినలేకపోతున్నానంటూ తిహాడ్ జైల్లోని అమెరికన్ ఖైదీ మాథ్యూ ఆరన్ వాన్‌డైక్ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. జైలు ఆహారంలో మసాలా, కారం ఎక్కువ కావడంతో 50 రోజులుగా పస్తులు ఉంటున్నానని, 14 కేజీల బరువు తగ్గానని ఆరోపించాడు. సొంతంగా వంట చేసుకునేందుకు అనుమతివ్వాలని, తనకిష్టమైన సరుకులు, ఇండక్షన్ కుక్కర్ సమకూర్చాలని కోరాడు. టెర్రర్ ఆరోపణలతో మార్చిలో అరెస్టయిన మాథ్యూ పిటిషన్‌పై స్పందించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ జులై 21కి వాయిదా పడింది.

అఖిల్‌కు సమంత ఆల్ ది బెస్ట్.. 'లెనిన్' బ్లాక్‌బస్టర్ టాక్!
Cinema· 10 Jul 2026

అఖిల్‌కు సమంత ఆల్ ది బెస్ట్.. 'లెనిన్' బ్లాక్‌బస్టర్ టాక్!

మూడేళ్ల గ్యాప్ తర్వాత హీరో అఖిల్ 'లెనిన్' సినిమాతో థియేటర్లలోకి వచ్చారు. మురళీకిశోర్ అబ్బూరు డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీ పాజిటివ్ టాక్‌ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో సమంత 'లెనిన్' ట్రైలర్‌ను షేర్ చేస్తూ టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఇప్పటికే సినిమాకు బ్లాక్‌బస్టర్ టాక్ వినిపిస్తోందని పోస్ట్ పెట్టారు. మరోవైపు, సమంత లేటెస్ట్ హిట్ 'మా ఇంటి బంగారం' మూవీపై అఖిల్ స్పందిస్తూ.. ఆమె పవర్‌ఫుల్ యాక్షన్ సీన్స్ అద్భుతంగా చేశారంటూ ప్రశంసించారు.

వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు!
Politics· 10 Jul 2026

వరుసగా రెండో రోజు పెరిగిన బంగారం ధరలు!

భారత్‌లో బంగారం ధరలు ఈరోజు కూడా స్వల్పంగా పెరిగాయి. అయితే మునుపటి రికార్డులతో పోలిస్తే రేట్లు ఇంకా తక్కువగానే ఉన్నాయని మార్కెట్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.380 పెరిగి రూ.1,44,820కి చేరింది. అలాగే, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.350 వరకు పెరిగి ప్రస్తుతం రూ.1,32,750కు చేరుకుంది.

నటుడు ధర్మ మహేష్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
Cinema· 10 Jul 2026

నటుడు ధర్మ మహేష్ ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

TG: హైదరాబాద్‌లోని ఫిల్మ్‌నగర్‌లో గురువారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. కొంతమంది యువకులు కారులో అతివేగంగా ఫిల్మ్‌నగర్ రోడ్డుపై ప్రయాణిస్తున్నారు. ఓవర్ స్పీడ్‌తో వచ్చిన కారు మలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనున్న డివైడర్‌ను దాటి నేరుగా నటుడు ధర్మ మహేష్ ఇంటి కాంపౌండ్ గోడను, గేటును ఢీకొట్టి లోపలికి దూసుకెళ్లింది. భారీ శబ్దం రావడంతో నటుడు ధర్మ కుటుంబసభ్యులు, స్థానికులు బయటకు పరుగులు తీశారు. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఘటనపై నటుడు ధర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారులో ఉన్న యువకులు మద్యం మత్తులో ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు.

దుల్కర్-పూజా మూవీకి క్లాసిక్ టైటిల్
Entertainment· 10 Jul 2026

దుల్కర్-పూజా మూవీకి క్లాసిక్ టైటిల్

దుల్కర్ సల్మాన్ మరియు పూజా హెగ్డే జంటగా నటిస్తున్న కొత్త సినిమాకు క్లాసిక్ టైటిల్ ఖరారు చేశారు. ఈ ప్రేమకథ చిత్రానికి శ్రీకారం చుట్టిన క్రేజీ స్టార్స్ సంతోషం వ్యక్తం చేశారు. టైటిల్ వివరాలు త్వరలో అధికారికంగా ప్రకటించనున్నారు.

ప్రశ్నిస్తే కేసులా?.. CPM రాష్ట్ర కార్యదర్శి ఫైర్▶
Politics· 10 Jul 2026

ప్రశ్నిస్తే కేసులా?.. CPM రాష్ట్ర కార్యదర్శి ఫైర్

AP: ప్రశ్న రావణ్‌పై పెట్టిన UAPA, దేశద్రోహం కేసులను వెంటనే ఎత్తి వేయాలని CPM రాష్ట్ర కార్యదర్శి V.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులపై విమర్శలను రాజకీయంగా ఎదుర్కోవాలి తప్ప, క్రిమినల్ కేసులు పెట్టడం సరికాదని ఆయన ఫైరయ్యారు. ప్రశ్నిస్తే ఉగ్రవాదులుగా ముద్రించడం అప్రజాస్వామికమని, రావణ్‌పై పెట్టిన ఈ అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని అన్నారు. APలో సోషల్ మీడియా పోస్టులకే 1,500కిపైగా కేసులు నమోదు చేసి, 1,300 మందికి పైగా అరెస్టు చేశారని ఆరోపించారు.

ప్రశ్న రావణ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలి
AP· 10 Jul 2026

ప్రశ్న రావణ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలి

AP: ప్రముఖ యూట్యూబర్, ప్రశ్న రావణ్ నిర్వహిస్తున్న 'ప్రశ్న' యూట్యూబ్ ఛానల్‌పై చర్యలు తీసుకోవాలని మెటా సంస్థకు పోలీసులు లేఖ రాశారు. రావణ్ తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాదాస్పద కంటెంట్ ప్రసారం చేస్తూ ప్రతినెల సుమారు రూ.1.50 లక్షల ఆదాయం పొందుతున్నట్లు పోలీసులు ఆరోపించారు. వివాదాస్పద వీడియోలను తొలగించాలని, ఛానల్‌ను నిలిపివేయాలని పోలీసులు మెటా సంస్థను కోరారు. స్పందించిన మెటా, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వీడియోలను తొలగిస్తామని, అయితే మొత్తం ఛానల్‌ను పూర్తిగా నిలిపివేయడం తమ పరిధిలో లేదని స్పష్టం చేసినట్లు సమాచారం.

స్కూళ్ల బంద్‌..  విద్యార్థి నేతల అరెస్ట్
TG· 10 Jul 2026

స్కూళ్ల బంద్‌.. విద్యార్థి నేతల అరెస్ట్

TG: రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బంద్ కొనసాగుతుంది. విద్యావ్యవస్థలో నెలకొన్న సమస్యలను పరిష్కారించాలని వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్రవ్యాప్త పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ స్కూళ్ల సంఖ్యను తగ్గించే ఆలోచనను వెనక్కి తీసుకోవాలని, విద్యాశాఖకు మంత్రిని కేటాయించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ బంద్ నిర్వహిస్తున్నారు. పలు జిల్లాలోని విద్యార్థి సంఘాల నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదిలాబాద్‌లో వామపక్ష విద్యార్థి సంఘాల నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆటో డ్రైవర్ దారుణం.. మహిళపై అత్యాచారం
Crime· 10 Jul 2026

ఆటో డ్రైవర్ దారుణం.. మహిళపై అత్యాచారం

TG: ఆటో ఎక్కిన మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారానికి పాల్పడిన ఘటన మేడ్చల్ జిల్లా పోచారం ఐటీకారిడార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఉప్పల్‌లోని భరత్‌నగర్ వద్ద ప్యాసింజర్ ఆటో ఎక్కిన మహిళ ఘట్‌కేసర్ ప్రాంతంలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లాలని డ్రైవర్‌ను కోరింది. ఆమెను ORR సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి కూల్ డ్రింక్‌లో మత్తుపదార్థం కలిపి తాగించాడు. స్పృహ కోల్పోయిన తర్వాత అత్యాచారానికి పాల్పడి ఫోన్, నగదు లాక్కుని పరార్ అయ్యాడు. మహిళ స్పృహలోకి వచ్చిన తర్వాత PSలో ఫిర్యాదు చేసింది. సాంకేతిక ఆధారాలు, CCTV ఫుటేజ్ పరిశీలించి 24గంటల్లో నిందితుడిని అరెస్ట్ చేశారు.

RTC బస్సు ఎత్తుకెళ్లిన మందుబాబు
TG· 10 Jul 2026

RTC బస్సు ఎత్తుకెళ్లిన మందుబాబు

TG: మద్యం మత్తులో ఓ వ్యక్తి RTC బస్సును ఉడాయించిన సంఘటన జనగాంలో చోటు చేసుకుంది. పాలకుర్తి మండలం చెన్నూరుకు చెందిన జిట్టబోయిన వెంకన్న ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. కుటుంబకలహాల కారణంగా ఇంట్లో నుంచి జనగాంకు వచ్చాడు. రాత్రి 11గంటలకు ట్రిప్ ముగించుకొని వచ్చిన RTC బస్సును డ్రైవర్ జనగాం బస్టాండ్‌ ఆవరణలోని పార్కింగ్ చేసి ఇంటికి వెళ్లాడు. మద్యంమత్తులో ఉన్న వెంకన్న తెల్లవారుజామున బస్సులోని టూల్‌బాక్స్‌పై తాళం కనిపించడంతో బస్సును స్టార్ట్ చేశాడు. దేవరుప్పుల మండలం సింగరాజుపల్లి టోల్‌గేట్ వద్ద సిమెంట్ దిమ్మెను ఢీకొట్టాడు. టోల్‌గేట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.

చోరీ చేసి ఇంటికి నిప్పంటించారు
AP· 10 Jul 2026

చోరీ చేసి ఇంటికి నిప్పంటించారు

AP: ఇంట్లో చోరీ చేసిన దుండగులు అనుమానం రాకుండా ఉండేందుకు ఆ ఇంటికి నిప్పంటించారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో రైల్వే మహిళా ఉద్యోగి ఉమాదేవి భర్త మరణించడం, పిల్లలు చదువుల కోసం వేరే ఊరిలో ఉండటంతో ఒంటరిగా ఉంటోంది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డ దొంగలు 25తులాల బంగారు నగలు, 50తులాల వెండి, రూ.20వేల నగదును ఎత్తుకెళ్లారు. అంతటితో ఆగకుండా ఇంటికి నిప్పుపెట్టారు. మంటలు చెలరేగి పెద్దఎత్తున వ్యాపించాయి. ఇంట్లోని దుస్తులు, బీరువాలోని డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు, ఫ్రిడ్జ్, రెండు టీవీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

ప్రభుత్వ స్కూల్‌లో రోబో పాఠాలు
Education· 10 Jul 2026

ప్రభుత్వ స్కూల్‌లో రోబో పాఠాలు

TG: రంగారెడ్డి జిల్లా జన్వాడ ZPHS పాఠశాలను దత్తత తీసుకుని దానిని ఒక మోడల్ స్కూల్‌గా తీర్చిదిద్దేందుకు HYDలోని ప్రముఖ ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ ముందుకు వచ్చింది. తెలంగాణ విద్యాశాఖతో ఇండస్ ఇంటర్నేషనల్ స్కూల్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 750మంది విద్యార్థులు ఉన్న జన్వాడ ZPHSను మోడల్ స్కూల్‌గా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. మౌలికవసతులతోపాటు విద్యా ప్రమాణాలను పెంచేందుకు ఇండస్ స్కూల్ ముగ్గురు ఉపాధ్యాయులను నియమించింది. అంతేకాకుండా, త్వరలోనే మూడు హ్యూమనాయిడ్ రోబోలను ప్రవేశపెట్టనున్నారు.

కొండకోనలు దాటినా కాపాడలేకపోయారు
AP· 10 Jul 2026

కొండకోనలు దాటినా కాపాడలేకపోయారు

AP: పోలవరం జిల్లా కూనవరం మండలం కారుమానుకొండకు చెందిన సమ్మక్క ప్రియ(18) పాముకాటుకి గురైంది. కుటుంబసభ్యులు ఆమెను డోలీ ద్వారా కూటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు, ఆ తర్వాత చింతూరుకు తరలించారు. అనంతరం భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల సూచన మేరకు మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించినట్లు యువతి తండ్రి లక్ష్మణ్‌రెడ్డి తెలిపారు. అక్కడ అడ్మిట్‌ కూడా చేసుకోకుండా వెనక్కి పంపేశారని ఆయన వాపోయారు. అనంతరం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్‌కు తీసుకెళ్తే డాక్టర్స్ పట్టించుకోలేదన్నారు. అర్ధరాత్రి గిలగిలా కొట్టుకుంటూ తన కుమార్తె చనిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు.

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ? ముహూర్తం జులై 18?
Politics· 10 Jul 2026

జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ? ముహూర్తం జులై 18?

సీనియర్ ఎన్టీఆర్ వారసుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నారా? అవుననే కథనాలు జోరందుకున్నాయి. తమిళనాడులో సీఎం విజయ్ తరహాలోనే ముందు సామాజిక సేవా కార్యక్రమాలతో ప్రారంభించి ఏడాది పాటు అభిమాన సంఘాలను వ్యవస్థీకృతం చేసుకుని ఆపై జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తారంటూ జమీన్ రైతు అనే పత్రిక ఒక సెన్సేషనల్ న్యూస్ ప్రచురించింది. జులై 18న దీనికి శుభ ముహూర్తంగా నిర్ణయించారని ఆ ప్రతిక రాసింది. బీజేపి అగ్రనేతలు జూనియర్ ను వెనుకనుంచి ప్రోత్సహిస్తున్నా రనేది ఆ ప్రతిక కథనం.