ప్రశ్న రావణ్‌పై మరో కేసు

AP: ఏలూరు జిల్లా నూజివీడులో ప్రముఖ యూట్యూబర్, ప్రశ్న రావణ్ అలియాస్ జోసెఫ్‌పై మరో కేసు నమోదైంది. డిప్యూటీ CM పవన్ కల్యాణ్‌పై రావణ్ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని జనసేన పార్టీ నాయకులు ఫైరయ్యారు. వ్యక్తిగత దూషణలే కాకుండా, కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర ద్వేషాన్ని, వ్యతిరేకతను రెచ్చగొట్టేలా ఆయన కుట్రపూరితంగా వ్యవహరించారని ఆరోపించారు. వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జనసేన నాయకులు నూజివీడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రావణ్‌పై ఇప్పటికే ఉపా, దేశద్రోహం కేసులు నమోదైన విషయం తెలిసిందే.



