Latest

సుప్రీం కోర్టులో షాకింగ్ ఘటనః  సీజే పై మాటల దాడి !
India· 10 Jul 2026

సుప్రీం కోర్టులో షాకింగ్ ఘటనః సీజే పై మాటల దాడి !

సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక కేసు విచారణ కలకలం రేపింది.. ప్రబల్ ప్రతాప్ అనే పిటిషనర్ బెంచ్ ముందు తనను తాను 'సార్వభౌముడు'గా ప్రకటించుకుం టూ,జడ్జిలను 'జుడీషియల్ సర్వెంట్స్' అని అడ్రస్ చేశాడు. లక్నో ఏఎస్పీపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆర్డర్ వేశాడు. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్‌ను దుర్భాషలాడుతూ కోర్టులో పేపర్లు గాల్లోకి విసిరేశాడు. సెక్యూరిటీ అతడిని బయటకు లాక్కెళ్లారు. అయితే, ఆ వ్యక్తి తీవ్ర మానసిక ఆందోళన, నిరాశలో ఉన్నాడని గ్రహించిన బెంచ్.. అతడిపై ఎలాంటి కోర్టు ధిక్కార (Contempt) చర్యలు తీసుకోరాదని డిసైడ్ అయింది.

BJP పార్టీ లైన్ పై ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్!▶
Politics· 10 Jul 2026

BJP పార్టీ లైన్ పై ఈటల రాజేందర్ షాకింగ్ కామెంట్స్!

TG: "BJP వాళ్లు దేశం ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్ అంటారు. కానీ నాకు మాత్రం నా తెలంగాణే ఫస్ట్, పార్టీ నెక్స్ట్, పర్సనల్ లాస్ట్" అంటూ BJP MP ఈటల రాజేందర్ సంచలన కామెంట్స్ చేశారు. ఇలా రివర్స్‌లో సొంత పార్టీ లైన్‌కు భిన్నంగా ఈటల చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.

నా లైఫ్‌లోనే మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్: CM విజయ్▶
Politics· 10 Jul 2026

నా లైఫ్‌లోనే మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్: CM విజయ్

కరూర్ తొక్కిసలాటలో 41 మంది చనిపోవడం నా లైఫ్‌లోనే మోస్ట్ హార్ట్ బ్రేకింగ్ మూమెంట్ అంటూ తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ఎమోషనల్ అయ్యారు. క్రౌడ్ కంట్రోల్ తప్పిందని పోలీసులు ముందే చెప్తే ఈవెంట్ క్యాన్సిల్ చేసుకునేవాళ్లమని, ఈ విషయంలో DMK గవర్నమెంట్‌పై, పోలీసులపై ఆయన ఫైర్ అయ్యారు. కాగా, ఈ ప్రమాదంలో చనిపోయిన 32 మంది ఫ్యామిలీ మెంబర్స్‌కు విజయ్ గవర్నమెంట్ జాబ్ లెటర్స్ అందజేశారు.

భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే? నో గవర్నమెంట్ జాబ్!
Politics· 10 Jul 2026

భార్య ఉండగా ఇంకో పెళ్లి చేసుకుంటే? నో గవర్నమెంట్ జాబ్!

ఒకటి కంటే ఎక్కువ పెళ్లిళ్లు చేసుకునే వాళ్లకు అస్సాం గవర్నమెంట్ గట్టి షాక్ ఇచ్చింది. ఇకపై అలా పెళ్లిళ్లు చేసుకుంటే గవర్నమెంట్ ఇచ్చే ఎలాంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బెనిఫిట్స్ రావని బడ్జెట్‌లో అనౌన్స్ చేసింది. అంతేకాదు, ఆల్రెడీ గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్నా సరే తీసేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఒకవేళ భార్య బతికుండగా విడాకులు తీసుకోకుండా ఇంకో పెళ్లి చేసుకుంటే ఏకంగా 7 ఏళ్లు జైలు శిక్ష పడేలా కొత్త రూల్స్ తెచ్చారు.

అఖిల్ ‘లెనిన్’ బ్లాక్‌బస్టర్.. నాగచైతన్య రియాక్షన్!
Cinema· 10 Jul 2026

అఖిల్ ‘లెనిన్’ బ్లాక్‌బస్టర్.. నాగచైతన్య రియాక్షన్!

అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ టాక్‌తో నడుస్తుంది. ఈ మూవీపై వస్తున్న పాజిటివ్ రెస్పాన్స్ అండ్ Word of mouth చూసి అన్నయ్య నాగచైతన్య సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. "నీ హార్డ్ వర్క్‌కి తగిన రిజల్ట్ వచ్చింది నాన్న.. ముఖ్యంగా నీ Standout performance చూసి చాలా హ్యాపీగా ఉంది" అంటూ అఖిల్‌ను మెచ్చుకున్నారు. అలాగే ఎంటైర్ టీమ్‌కి నాగచైతన్య కంగ్రాట్స్ చెప్పారు.

కన్నీళ్లు పెట్టుకున్న CM విజయ్!▶
News· 10 Jul 2026

కన్నీళ్లు పెట్టుకున్న CM విజయ్!

కరూర్ ఘటనలో చనిపోయిన వారి కుటుంబాలకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ గవర్నమెంట్ జాబ్ అపాయింట్‌మెంట్ ఆర్డర్స్ అందజేశారు. అయితే, బాధితులకు స్వయంగా ఈ ఉద్యోగ పత్రాలు అందిస్తున్న సమయంలోనే CM విజయ్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ లీడర్ అంతలా ఎమోషనల్ అవ్వడం చూసి విజయ్ అభిమానులు కూడా కంటతడి పెడుతున్నారు.

నాగార్జునను హగ్ చేసుకుని ఏడ్చేసిన అఖిల్!▶
Cinema· 10 Jul 2026

నాగార్జునను హగ్ చేసుకుని ఏడ్చేసిన అఖిల్!

అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ మూవీ 'లెనిన్' బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ సక్సెస్ సాధించింది. ఎన్నాళ్లో ఎదురుచూస్తున్న ఈ భారీ విజయం దక్కడంతో అఖిల్ ఎమోషనల్ అయ్యారు. ఆనందభాష్పాలతో తన తండ్రి, కింగ్ నాగార్జునను గట్టిగా కౌగిలించుకున్నారు. కొడుకు సాధించిన ఈ సక్సెస్ చూసి నాగార్జున కూడా ఎంతో గర్వపడ్డారు. తండ్రీకొడుకుల మధ్య జరిగిన ఈ ఎమోషనల్ మూమెంట్‌కు సంబంధించిన పిక్స్, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

గ్రామాల్లోకి 900 పాములు
World· 10 Jul 2026

గ్రామాల్లోకి 900 పాములు

మనకు కోళ్ల ఫారాలు ఉన్నట్లు చైనాలో స్నేక్ ఫామ్స్ ఉంటాయ్. చైనా గ్వాంగ్జీ ఏరియాలో భారీ వరదల వల్ల స్నేక్ ఫామ్స్ నుంచి 900 విష సర్పాలు తప్పించుకున్నాయి. దగ్గర్లోని పొలాలు, గ్రామాల్లోకి వెళ్లిపోయాయి. పాము కాటుతో ఒక మహిళ చనిపోయారు. ఈ పాముల్ని పట్టుకోవడానికి అధికారులు స్పెషల్ టీమ్స్ వేశాయి. ఎవరు పాముకాటుకు గురైనా తక్షణ వైద్యం అందించేందుకు ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

వైభవ్ పైన ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు
Sports· 10 Jul 2026

వైభవ్ పైన ధోనీ ఆసక్తికర వ్యాఖ్యలు

వరుస ఫెయిల్యూర్స్ తో ఒత్తిడిలో ఉన్న వైభవ్ సూర్యవంశీకి ధోనీ తాజా కామెంట్స్ గొప్ప భరోసా ఇస్తాయ్. స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్ కుమార్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వైభవ్, నేను ఒకసారి అనుకోకుండా ఒకరినొకరు దాటుకుంటూ వెళ్లాం. మాట్లాడుకునే అవకాశం కూడా రాలేదు. వైభవ్ సూర్యవంశీకి చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంది. ప్రపంచమంతా అతని ఆటను గమనిస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో రాణించగల అద్భుతమైన నైపుణ్యం ఆ కుర్రాడిలో ఉంది అని ధోనీ పొగిడారు.

తల్లిదండ్రుల బాగోగులు చూడకపోతే ఆస్తులు కట్!
Legal· 10 Jul 2026

తల్లిదండ్రుల బాగోగులు చూడకపోతే ఆస్తులు కట్!

ముసలితనంలో తమను బాగా చూసుకుంటారనే నమ్మకంతో ఆస్తిని పిల్లల పేరిట రాసే పేరెంట్స్‌కు బాంబే హైకోర్టు బిగ్ సపోర్ట్ ఇచ్చింది. ఒకవేళ ఆస్తి తీసుకున్నాక పిల్లలు తల్లిదండ్రుల బాగోగులు పట్టించుకోకపోతే, ఆ ఆస్తిని మళ్లీ వెనక్కి తీసుకునే రైట్ పేరెంట్స్‌కు ఉంటుందని కోర్టు తీర్పు చెప్పింది. తల్లిదండ్రులు రిచ్ అయినప్పటికీ ఈ రూల్ వర్తిస్తుంది. సీనియర్ సిటిజన్స్ చట్టం ప్రకారం ఈ బదిలీని రద్దు చేసే పవర్ ట్రిబ్యునల్‌కు ఉంటుందని స్పష్టం చేసింది.

రాముడి సాక్షిగా.. CM రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!▶
Politics· 10 Jul 2026

రాముడి సాక్షిగా.. CM రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్!

వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై CM రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. 2029 మే నెలలో జరగబోయే ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లు గెలుస్తుందని భద్రాద్రి రాముడిపై ప్రమాణం చేసి చెప్పారు. డెలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) తర్వాత తెలంగాణలో పార్లమెంట్ సీట్లు 17 నుండి 26 కి, అలాగే అసెంబ్లీ సీట్లు 119 నుండి 182 కి పెరుగుతాయని, అందులో మెజారిటీ సీట్లు కాంగ్రెస్ దక్కించుకుంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

CM విజయ్ పైకి దూసుకొచ్చాడు▶
Viral· 10 Jul 2026

CM విజయ్ పైకి దూసుకొచ్చాడు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కరూర్ పర్యటనలో భద్రతా లోపం బయటపడింది. ఆయన కాన్వాయ్ పైకి ఓ వ్యక్తి అకస్మాత్తుగా దూసుకొచ్చాడు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆ ప్రాంతం కాసేపు ఉద్రిక్తతంగా మారింది. పోలీసులు ఆ వ్యక్తిని విచారిస్తున్నారు. ప్రజా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి భద్రతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

APలో 4 కరోనా కేసులు.. ఒకరు మృతి!
AP· 10 Jul 2026

APలో 4 కరోనా కేసులు.. ఒకరు మృతి!

APలో మళ్లీ కరోనా కలకలం. కడప జిల్లాలో 4 కోవిడ్ కేసులు నమోదవగా, ఒకరు చనిపోయారు. మరో వ్యక్తి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. మిగిలిన ముగ్గురు హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మృతుడికి డయాబెటిస్, కిడ్నీ సమస్యలు వంటి కోమార్బిడిటీలు ఉన్నాయి. లక్షణాల ఆధారంగా ఒమిక్రాన్ వేరియంట్ అనుమానిస్తున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలను NIV పుణేకు పంపగా, జిల్లా వ్యాప్తంగా నిఘాను అధికారులు పెంచారు.

రాముడి విరాళాలపై AAP ఉద్యమం
TG· 10 Jul 2026

రాముడి విరాళాలపై AAP ఉద్యమం

రామ మందిర విరాళాల వివాదంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ డిమాండ్ చేశారు. ఈ అంశంపైన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ సంతకాల సేకరణ ప్రచారాన్ని ప్రకటించారు. ఈ ప్రచారం ఆదివారం ఢిల్లీలోని రోహిణిలో సుందరాకాండ పారాయణంతో మొదలౌతుంది.

HIVకి ఎండ్ కార్డ్? వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్!
Technology· 10 Jul 2026

HIVకి ఎండ్ కార్డ్? వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్!

HIV నివారణకి ఒక కొత్త వ్యాక్సిన్ రెడీ అవుతోంది. సైంటిస్టులు జంతువులపై చేసిన ప్రయోగాల్లో సూపర్ రిజల్ట్స్ వచ్చాయి. ఈ వ్యాక్సిన్ మన బాడీలో వైరస్‌తో పోరాడే పవర్‌ఫుల్ యాంటీబాడీలను తయారు చేస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ప్రఖ్యాత 'నేచర్' జర్నల్‌లో కూడా పబ్లిష్ అయ్యాయి. జంతువులపై ప్రయోగాలు సక్సెస్ అవ్వడంతో, నెక్స్ట్ మనుషులపై కూడా క్లినికల్ ట్రయల్స్ స్టార్ట్ చేయబోతున్నారు. ఎయిడ్స్ నివారణలో ఇదో పెద్ద గుడ్ న్యూస్.

'పిల్ల జమిందార్' డైరెక్టర్‌పై కేసు!
Politics· 10 Jul 2026

'పిల్ల జమిందార్' డైరెక్టర్‌పై కేసు!

టాలీవుడ్ దర్శకుడు గుడ్లూరి అశోక్ బాబుపై సైబరాబాద్ EOWలో కేసు నమోదైంది. ఓ యువకుడిని హీరోగా పరిచయం చేస్తానంటూ అతని తల్లిదండ్రుల నుంచి రూ.3.5 కోట్లు వసూలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. డబ్బులు తీసుకున్నా హీరోగా ఛాన్స్ ఇవ్వకపోగా, ఆ అమౌంట్ కూడా తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ భారీ ఫ్రాడ్‌పై కేసు ఫైల్ చేసిన పోలీసులు.. నిర్మాత విజయలక్ష్మి, డైరెక్టర్ అశోక్ బాబులను ప్రస్తుతం విచారిస్తున్నారు.

ఆ 41 మందికీ మెమోరియల్-CM విజయ్
General· 10 Jul 2026

ఆ 41 మందికీ మెమోరియల్-CM విజయ్

కరూర్ తొక్కిసలాట ఘటన తర్వాత తమిళనాడు CM హోదాలో విజయ్ తొలిసారి ఆ ప్రాంతంలో పర్యటించారు. 41 మంది ప్రాణాలుపోతే DMK ఆ ఘటనను పొలిటికల్ మైలేజ్ కోసం వాడుకున్నారని విమర్శించారు. పోలీసులు వెంటనే రెస్పాండ్ అవ్వకపోవడం వల్లే ప్రాణనష్టం జరిగింది అన్నారు. తన పార్టీ TVK తరఫున బాధితులకు ఒక మొమోరియల్ (స్మారక చిహ్నం) నిర్మిస్తామని సీఎం ప్రకటించారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా నిరోధించేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం అని హామీ ఇచ్చారు.

మటన్ కోసం పెళ్లిలో తన్నుకున్నారు 🤯
General· 10 Jul 2026

మటన్ కోసం పెళ్లిలో తన్నుకున్నారు 🤯

బీహార్: సహర్సా జిల్లాలో జరిగిన ఓ పెళ్లి వేడుకలో మటన్ వడ్డిస్తాం అని చెప్పి చికెన్ వడ్డించారని వరుడి బంధువులు నిలదీశారు. ఈ మెనూ మార్పుపై మొదలైన వాగ్వాదం ఏకంగా దాడుల దాకా వెళ్లింది. ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్లను ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనతో పెళ్లి వేడుక కాసేపు ఆగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని కంట్రోల్ చేశారు.

ఘోర ప్రమాదం.. స్కూటీపై వెళ్తున్న యువతి 😭
General· 10 Jul 2026

ఘోర ప్రమాదం.. స్కూటీపై వెళ్తున్న యువతి 😭

హైదరాబాద్ఛ గచ్చిబౌలి ప్రాంతంలో వాటర్ ట్యాంకర్ ఢీకొని యాక్టివాపై వెళ్తున్న యువతి అక్కడికక్కడే మృతి చెందింది. యువతి తల, ఇతర శరీర భాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలు దగ్గర్లో ఉన్న హాస్టల్లో ఉంటూ ప్రైవేటు జాబ్ చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ప్రమాదం తర్వాత వాటర్ ట్యాంకర్ డ్రైవర్ పారిపోయాడు. అతనిపై కేసు పెట్టారు. డ్రైవర్ కోసం వెతుకుతున్నాం అని పోలీసులు చెప్పారు.

రియల్ లైఫ్ బాహుబలి!▶
Viral· 10 Jul 2026

రియల్ లైఫ్ బాహుబలి!

పశ్చిమ బెంగాల్ బారక్‌పూర్‌లో జరిగిన ఒక షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక కార్మికుడు ఏకంగా 190 కిలోల బరువుండే బుల్లెట్ బైక్‌ను తన తలపై ఎత్తుకుని, నిచ్చెనపై నడుస్తూ బస్సు పైకప్పు పైకి చేర్చాడు. అతని అసాధారణ బలం, మైండ్ బ్లోయింగ్ బ్యాలెన్స్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. రియల్ లైఫ్ బాహుబలి అంటూ కామెంట్స్ చేస్తూ ఈ వైరల్ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు.

తమిళనాడు CM విజయ్ బిగ్ స్టెప్!▶
Politics· 10 Jul 2026

తమిళనాడు CM విజయ్ బిగ్ స్టెప్!

తమిళనాడు CM విజయ్ కరూర్‌లో పర్యటించి, TVK సభ తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 32 మంది కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆ తొక్కిసలాట ఘటన తన జీవితంలోనే అత్యంత బాధాకరమైనదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోజు పోలీసులు ఓన్లీ డ్రామా ఆడారని మండిపడ్డారు. DMK ప్రభుత్వం రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసిందంటూ విజయ్ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.