Latest

బాక్స్ ఆఫీస్ రూల్స్ బ్రేక్ చేస్తున్న హీరోయిన్లు
Cinema· 10 Jul 2026

బాక్స్ ఆఫీస్ రూల్స్ బ్రేక్ చేస్తున్న హీరోయిన్లు

ఒకప్పుడు ఓపెనింగ్ కలెక్షన్స్ హీరోలపైనే ఆధారపడేవి. ఇప్పుడు ఆ ట్రెండ్ మారుతోందని సమంత చెప్పింది. అరుంధతి (78 కోట్లు) తో దారి చూపిన అనుష్క తర్వాత రుద్రమ దేవి (₹82 కోట్లు), భాగమతి (₹67 కోట్లు), మహానటి ( రూ.86 కోట్లు) ఓ బేబీ (₹45 కోట్లు)లాంటి మహిళా ప్రధాన చిత్రాలు సత్తా చాటాయి. నిర్మాతలు నీలిమ గుణ, శ్యామ్ ప్రసాద్ రెడ్డి, దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. బలమైన కథలుంటే హీరోయిన్ సినిమాలకూ ప్రేక్షకులు భారీగా ఆదరిస్తారని అన్నారు.

మెగా టూరిజం హబ్‌గా పోలవరం
AP· 10 Jul 2026

మెగా టూరిజం హబ్‌గా పోలవరం

AP: పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే, ECRF డ్యామ్ (Earth cum Rock Fill Dam) సుందరీకరణ డిజైన్లు తుది రూపానికి వచ్చాయి. జపాన్‌కు చెందిన నిప్పాన్‌ కోయి ఆర్కిటెక్చర్‌ సంస్థ ఈ డిజైన్లను రూపొందించింది. ఈ డిజైన్లపై సచివాలయంలో మంత్రి నిమ్మల రామానాయుడు సంస్థ ప్రతినిధులతో సమీక్షించారు. ఈ ప్రాజెక్టు పరిధిలోని 10,000 ఎకరాల్లో టూరిజం హబ్‌ కోసం ఇటీవల లైడార్‌ సర్వే కూడా చేశారు. పోలవరం నుంచి పాపికొండలు మీదుగా భద్రాచలం వరకూ టూరిజం హబ్‌గా మార్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గోదావరి విశిష్టత చాటేలా మ్యూజియం, వాటర్‌ స్పోర్ట్స్‌, టెంపుల్‌ టూరిజం, పార్క్‌ల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

అమెరికాలో తెలుగు మహిళ హత్య .. షాకింగ్ ట్విస్ట్
Crime· 10 Jul 2026

అమెరికాలో తెలుగు మహిళ హత్య .. షాకింగ్ ట్విస్ట్

AP: అమెరికాలో గత 8నెలల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విజయవాడకు చెందిన రజిత సబ్బినేని కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. రజితను ఆమె భర్త అవినాశ్‌ నార్నే హత్య చేసినట్లు అమెరికా పోలీసులు గుర్తించారు. పెళ్లైన 4నెలలకే ఆమెను దారుణంగా చంపినట్టు విచారణలో నిర్ధారణ అయింది. ఆమెకు శ్వాస ఆడకుండా అతడు గొంతు నులిమినట్టు పోస్టుమార్టం నివేదికలో తేలింది. మరో మహిళతో వివాహేతర సంబంధం కారణంగానే హత్య చేసినట్లు తెలిపారు. దీనిని ఆత్మహత్యగా చిత్రీకరించాలని ఆయన ప్రయత్నించినట్లు తెలిపారు. నిందితుడు అవినాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

భూములకు పూర్తి భద్రత.. రాజముద్రతో పాస్‌బుక్స్
AP· 10 Jul 2026

భూములకు పూర్తి భద్రత.. రాజముద్రతో పాస్‌బుక్స్

AP: భవిష్యత్‌లో ప్రజల ఆస్తులను ఎవరూ ఆక్రమించకుండా, ప్రజల ఆస్తిపై ప్రజలకే సర్వహక్కులు ఉండేలా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలను అందజేస్తున్నట్లు CM చంద్రబాబు పేర్కొన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లెలో నిర్వహించిన ‘మీ భూమి - మీ హక్కు’ గ్రామసభలో ఆయన మాట్లాడారు. రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. గత పాలకులు భూమి పత్రాలపైనా, సర్వే రాళ్లపైనా తమ ఫొటోలు ముద్రించుకున్నారని ఫైరయ్యారు. ఆ ఫొటోల పిచ్చిని తొలగించేలా కట్టుదిట్టమైన రాజముద్రతో పాస్ పుస్తకాలను రైతులకు అందజేస్తున్నట్లు CM స్పష్టం చేశారు.

ఓటర్లకు అలర్ట్..  ఇంకో 5 రోజులు మాత్రమే
TG· 10 Jul 2026

ఓటర్లకు అలర్ట్.. ఇంకో 5 రోజులు మాత్రమే

TG: ఓటరు జాబితాలో తప్పులను సరిచేయడం, డూప్లికేట్ ఓట్లను తొలగించేందుకు ఎన్నికల కమిషన్ SIR ప్రక్రియను చేపట్టిన విషయం తెలిసిందే. ఓటర్లు వారి వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను వెనక్కి ఇవ్వడానికి కేవలం 5రోజులే సమయముంది. తెలంగాణలో మొత్తం 4,16,27,694 మంది ఓటర్లకు గానూ గురువారం సాయంత్రానికల్లా 4,15,41,753 (99.79%) మందికి ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. చాలామంది ఓటర్లకు ఇప్పటికీ ఎన్యూమరేషన్ పత్రాలే అందలేదు. కొన్నిచోట్ల BLOలకు కాల్ చేసినా స్పందించట్లేదనే ఆరోపణలున్నాయి.

కార్పొరేటర్ చేతిలో చెంపదెబ్బ తిన్న లేడీ డాక్టర్ రాజీనామా !▶
India· 9 Jul 2026

కార్పొరేటర్ చేతిలో చెంపదెబ్బ తిన్న లేడీ డాక్టర్ రాజీనామా !

థానేలోని ఒక మున్సిపల్ ఆస్పత్రిలో శివసేన కార్పొరేటర్ చేతిలో చెంపదెబ్బ తిన్న ఒక మహిళా డాక్టర్ తన పదవికి రాజీనామా చేశారు. అంతకుముందు ఆమెతో పాటు ఉన్న తోటి డాక్టర్ అక్కడి వాతావరణానికి భయపడి ఉద్యోగం వదిలేశారు.ఈ ఘటన జరిగినప్పుడు ఆ కార్పొరేటర్ డాక్టర్‌ను దూషించడమే కాకుండా దాడికి పాల్పడ్డారు. దీనిపై ఆసుపత్రి సిబ్బంది తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో తమకు రక్షణ కరువైందని, విపరీతమైన భయాందోళనలు నెలకొన్నాయని వివరిస్తూ మహిళా డాక్టర్ తన రాజీనామా లేఖను సమర్పించారు. ఈ ఘటన స్థానికంగా వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.

TG బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మృతి
TG· 9 Jul 2026

TG బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మృతి

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దాసరి మూర్తి (65) గురువారం సాయంత్రం నిజామాబాద్ జిల్లా మెండోరా మండల కేంద్రంలోని ఆయన స్వగృహంలో గుండెపోటుతో మృతి చెందారు. బీసీ సంక్షేమం కోసం నిరంతరం శ్రమించే నాయకుడు హఠాన్మరణంతో బీసీ సంఘాల నాయకులు, మిత్రులు శ్రేయోభిలాషులు,బంధువులు కన్నీరు మున్నిరవు తున్నారు.దాసరి మూర్తి ఆకస్మికంగా గుండెపోటుతో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. అంత్యక్రియలను ఆయన స్వగ్రామంలో శుక్రవారం ఉదయం నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు,బంధువులు తెలిపారు.

చైనా షూ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: 28 మంది మృతి▶
World· 9 Jul 2026

చైనా షూ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం: 28 మంది మృతి

చైనాలోని జిన్జయాంగ్ నగరంలోని ఒక షూ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.ఈ ఘటనలో ఇప్పటి వరకూ 28 మంది చనిపోయినట్లు స్టేట్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం ఎక్కువగా ఉండొచ్చని అధ్యక్షుడు జిన్ పింగ్ అన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. అగ్నికీలల్లో వందల సంఖ్యలో కార్మికులు చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది.

నాగ్ 100కి టబు విలన్.. 28 ఏళ్ల తర్వాత రీయూనియన్!
Cinema· 9 Jul 2026

నాగ్ 100కి టబు విలన్.. 28 ఏళ్ల తర్వాత రీయూనియన్!

నటుడు నాగార్జున ల్యాండ్‌మార్క్ 100వ సినిమా 'కింగ్100'పై హైప్ పెరుగుతోంది. దర్శకుడు రా కార్తిక్ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో టబు మెయిన్ విలన్‌గా నటించనున్నట్లు టాక్. దీంతో నాగ్-టబు జోడీ 28 ఏళ్ల తర్వాత మళ్లీ ఒకే స్క్రీన్‌పై కనిపించనుంది. వీరిద్దరూ చివరిసారిగా 'ఆవిడా మా ఆవిడే'లో కలిసి నటించారు. అంతకుముందు 'నిన్నే పెళ్లాడతా'తో బ్లాక్‌బస్టర్ అందుకోగా, 'సిసింద్రీ'లో టబు స్పెషల్ క్యామియో కూడా చేశారు.

జెన్ జీ టెకీలలో జాబ్స్ పై తగ్గుతున్న ఆసక్తి !
Jobs· 9 Jul 2026

జెన్ జీ టెకీలలో జాబ్స్ పై తగ్గుతున్న ఆసక్తి !

కార్పొరేట్ ఇండియాలో ఉద్యోగుల పని తీరుకు సంబంధించి 'ఎఫర్ట్ రిసెషన్' అనే కొత్త ట్రెండ్ మొదలైంది.'గ్రేట్ ప్లేస్ టు వర్క్ ఇండియా' తాజా నివేదిక ప్రకారం దాదాపు 63 శాతం ఇండియన్ కంపెనీల ఉద్యోగులు తమ జాబ్ పరిధి దాటి అడుగు ముందుకు వేయడం లేదు.ఐటీ, ప్రొఫెషనల్ సర్వీసెస్, రియల్ ఎస్టేట్ రంగాలలో ఈ మార్పు స్పష్టం గా కనిపిస్తోంది. 2023 నుండి వర్క్‌ఫోర్స్‌లో జెన్ జీ ఉద్యోగుల సంఖ్య 13% నుండి 26%కి రెట్టింపు అయింది. ఈ తరం యువత జాబ్ సేఫ్టీ కంటే ఫ్లెక్సి బిలిటీ, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తు న్నారు.ఏఐ వాడకం పెరగడం వల్ల వర్క్ ప్రెషర్, డెడ్ లైన్లు ఎక్కువగా ఉన్నాయని ఉద్యోగులు భావిస్తున్నారు.

వరదల్లో కొట్టుకొచ్చిన కోబ్రాలు.. చైనాలో పాముల కలకలం!▶
World· 9 Jul 2026

వరదల్లో కొట్టుకొచ్చిన కోబ్రాలు.. చైనాలో పాముల కలకలం!

చైనాలోని గ్వాంగ్జీ రీజియన్‌లో భారీ వరదల కారణంగా పాముల పెంపక కేంద్రాల నుండి సుమారు 900 కి పైగా పాములు బయటకు తప్పించుకున్నాయి.వరద నీటిలో కొట్టుకొచ్చిన ఈ పాములలో కోబ్రాల వంటి అత్యంత విషపూరితమైన జాతులు కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఓ మహిళను పాము కరవడంతో ఆసుపత్రికి తరలించే లోపే ఆలస్యమై ఆమె మరణించింది. మరెంతో మంది ఈ పాముల కాటుకు గురయ్యారు. ఈ ప్రాంతం చైనాలోనే అతిపెద్ద కమర్షియల్ స్నేక్ ఫార్మింగ్ హబ్ కావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తప్పించుకున్న పాములను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

POK లో టెన్షన్-38 డిమాండ్లు,48 గంటల డెడ్ లైన్
World· 9 Jul 2026

POK లో టెన్షన్-38 డిమాండ్లు,48 గంటల డెడ్ లైన్

PoK లో మరోసారి ఉద్రిక్తతలు రేగాయి. 'జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ' (JAAC) తమ 38 డిమాండ్ల చార్టర్‌ను పరిష్కరించాలంటూ ఇస్లామాబాద్ ప్రభుత్వానికి 48 గంటల అల్టిమేటం జారీ చేసింది. లేదంటే భారీ నిరసనలు చేపడతామని హెచ్చరించింది. ఈనెల 27న జరగబోయే ప్రాంతీయ ఎన్నికల్లో, పాకిస్తాన్‌లో స్థిరపడిన కాశ్మీరీ శరణార్థుల కోసం కేటాయించిన 12 అసెంబ్లీ సీట్లను రద్దు చేయాలని JAAC డిమాండ్ చేస్తోంది. ఈ సీట్ల వల్ల PoK రాజకీయాల్లో ఇస్లామాబాద్ జోక్యం ఎక్కువవుతోందని వారి ఆరోపణ. దీనితో పాటు విద్యుత్ ధరలు తగ్గించాలని, పిండి వంటి నిత్యావసరాలపై సబ్సిడీలు పెంచాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

అంత్యక్రియలరోజే ఖమేనీ శిథిల నివాసం వీడియో విడుదల !▶
World· 9 Jul 2026

అంత్యక్రియలరోజే ఖమేనీ శిథిల నివాసం వీడియో విడుదల !

ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ నివాసం ఎలా ధ్వంసమైందో చూపిస్తూ ఇరాన్ అధికారిక మీడియా తొలిసారి ఒక వీడియోను విడుదల చేసింది.  ఈ ఏడాది ఫిబ్రవరి 28న యూఎస్-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఖమేనీతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పో యారు. ఆ దాడుల్లో టెహ్రాన్‌లోని ఆయన కాంపౌండ్ ఏ స్థాయిలో దెబ్బతిన్నదో ఈ 35 సెకన్ల వీడియోలో కనిపి స్తోంది. ఖమేనీ ముఖ్యసమావేశాలు నిర్వహించే 'ఇమామ్ ఖొమేని హుస్సేనియా' హాల్ మొత్తం కూలి పోయి, శిథిలాలుగా మారిన దృశ్యాలు ఉన్నాయి. ఆయన అంత్యక్రియలు జరిగిన రోజే ఈ వీడియోను ఇరాన్ రిలీజ్ చేయడం విశేషం.

ఖమేనీ డెడ్ బాడీకి ఫైటర్ జెట్ ఎస్కార్టులు▶
World· 9 Jul 2026

ఖమేనీ డెడ్ బాడీకి ఫైటర్ జెట్ ఎస్కార్టులు

ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియలు ఆయన స్వస్థలం మషాద్‌లో ముగిశాయి. ఆయన శవపేటికను మోసుకెళ్లే విమానానికి ఫైటర్ జెట్‌లు ఎస్కార్ట్‌గా నిలిచాయి. ఫిబ్రవరి 28న యూఎస్-ఇజ్రాయెల్ దాడుల్లో చనిపోయిన ఆయన కుటుంబ సభ్యుల శవపేటికలను కూడా పక్కనే ఉంచారు. ఇరాన్, ఇరాక్‌లలో ఆరు రోజుల పాటు ఈ సంతాప క్రియలు జరిగాయి. ఇమామ్ రెజా దర్గాలో ఖమేనీని ఖననం చేశారు. మరోవైపు యూఎస్, ఇరాన్ మధ్య దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.

BRS అకౌంట్లలో అవినీతి డబ్బులు..  కవిత సంచలన వ్యాఖ్యలు!▶
Politics· 9 Jul 2026

BRS అకౌంట్లలో అవినీతి డబ్బులు.. కవిత సంచలన వ్యాఖ్యలు!

TRS చీఫ్ కల్వకుంట్ల కవిత చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. BRS పార్టీ బ్యాంకు అకౌంట్లలో ఉన్న ₹1,400 కోట్లు, ఆంధ్రా కాంట్రాక్టర్ల నుండి క్విడ్ ప్రో క్వో ద్వారా వచ్చిన అవినీతి డబ్బేనని ఆమె ప్రశ్నించారు. ఆ మొత్తాన్ని తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ఒక్కో ఫ్యామిలీకి ₹1 కోటి చొప్పున వెంటనే పంచేయాలని కవిత డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఈ పొలిటికల్ మ్యాటర్ సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండు అవుతోంది.

అంతరిక్షం నుండి సేఫ్‌గా భూమికి.. ఇస్రో ఖాతాలో మరో మైలురాయి!▶
Technology· 9 Jul 2026

అంతరిక్షం నుండి సేఫ్‌గా భూమికి.. ఇస్రో ఖాతాలో మరో మైలురాయి!

ఇండియా ఫస్ట్ టైం మనుషులను అంతరిక్షంలోకి పంపే 'గగన్‌యాన్' ప్రాజెక్ట్‌లో ఇస్రో మరో బిగ్ సక్సెస్ కొట్టింది. స్పేస్ లోపలికి వెళ్లిన వ్యోమగాములు మళ్లీ భూమికి సేఫ్‌గా తిరిగి రావడం కోసం ఒక స్పెషల్ పారాచూట్ సిస్టమ్‌ను సైంటిస్టులు రెడీ చేశారు. దీన్ని 2.5 కిలోమీటర్ల ఎత్తు నుండి కిందకు వదిలి టెస్ట్ చేయగా, చాలా సురక్షితంగా ల్యాండ్ అయింది. అప్‌కమింగ్ గగన్‌యాన్ మిషన్‌కు ఈ పారాచూట్ టెస్ట్ సక్సెస్ అవ్వడం చాలా కీలకం అని ఇస్రో చెప్పింది.

పెద్దాయన ఆత్మాభిమానం!▶
Motivational· 9 Jul 2026

పెద్దాయన ఆత్మాభిమానం!

Kolkata: బద్ధకంతో బతికేసే ఈ జనరేషన్‌కి కనువిప్పు కలిగించే హార్ట్ టచింగ్ స్టోరీ ఇది. కోల్‌కతాకు చెందిన రవీంద్రనాథ్ అనే 80 ఏళ్ల పెద్దాయనకు పిల్లలు లేరు. అనారోగ్యంతో బాధపడుతున్న భార్య సంధ్యను కాపాడుకునేందుకు, ఆయన ఈ ఏజ్‌లోనూ రోజూ మార్నింగ్ 6 AM నుండి నైట్ 10 PM వరకు టాక్సీ నడుపుతూ కష్టపడుతున్నారు. ఎవరిపైనా డిపెండ్ అవ్వకుండా, ఆత్మాభిమానంతో ఆయన పడుతున్న కష్టం చూసి నెటిజన్లు సెల్యూట్ కొడుతున్నారు. ప్రస్తుతం ఈయన స్టోరీ సోషల్ media లో తెగ వైరల్ అవుతోంది.

సామాన్యుడికి షాక్!
Politics· 9 Jul 2026

సామాన్యుడికి షాక్!

సామాన్యుడికి కిచెన్ బడ్జెట్ భారంగా మారింది. జూన్ నెలలో హోమ్-కుకింగ్ కాస్ట్స్ భారీగా పెరిగాయి. ముఖ్యంగా టమోటా ధరలు 31%, LPG అండ్ కుకింగ్ ఆయిల్ రేట్లు 10% చొప్పున పెరగడం వల్లే ఈ భారం పడింది. దీంతో లాస్ట్ ఇయర్ తో పోలిస్తే జూన్‌లో వెజ్ థాలీ కాస్ట్ 5%, నాన్-వెజ్ థాలీ కాస్ట్ 6% పెరిగాయి. పొటాటో ధరలు 14% తగ్గడం ఒక్కటే కాస్త రిలీఫ్ ఇవ్వగా, రాబోయే రోజుల్లో పప్పులు, ఉల్లిపాయల రేట్లు కూడా పెరిగే ఛాన్స్ ఉంది.

పులిని కాపాడిన ఏనుగు.. వీడియో వైరల్!▶
Motivational· 9 Jul 2026

పులిని కాపాడిన ఏనుగు.. వీడియో వైరల్!

ఇండోనేషియాలోని సుమత్రా ఐలాండ్‌లో ఒక అరుదైన ఎమోషనల్ సీన్ కనిపించింది. అక్కడ వచ్చిన వరదలు వల్ల ఒక పులి నీటి ప్రవాహంలో చిక్కుకుపోయింది. అయితే, అక్కడే ఉన్న ఒక సుమత్రా ఏనుగు ఆ పులిని రక్షించడానికి ట్రై చేస్తూ కనిపించింది. జంతువుల్లోని కరుణను చూపించే ఈ హార్ట్ టచింగ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మనుషుల లాగే జంతువులకు కూడా ఒకరికొకరు హెల్ప్ చేసుకునే స్ఫూర్తి ఉంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

హాస్టల్‌లో గదిలో విషాదం.. నలుగురిని కాటేసిన పాము!
News· 9 Jul 2026

హాస్టల్‌లో గదిలో విషాదం.. నలుగురిని కాటేసిన పాము!

జార్ఖండ్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ గర్ల్స్ హాస్టల్‌లో సాడ్ ఇన్సిడెంట్ జరిగింది. రాత్రి 11 గంటల టైంలో హాస్టల్ రూమ్‌లోకి ఓ విషపూరిత కట్లపాము దూరి, నిద్రిస్తున్న నలుగురు అమ్మాయిలను కాటేసింది. ఈ ఘటనలో 13 ఏళ్ల స్టూడెంట్ చనిపోగా, మరో ముగ్గురి హెల్త్ కండిషన్ సీరియస్‌గా ఉంది. స్కూల్ మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యం వల్లే ఈ ఇన్సిడెంట్ జరిగిందని, బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని స్టూడెంట్స్ పేరెంట్స్ హాస్పిటల్ దగ్గర ఆందోళన చేస్తూ డిమాండ్ చేస్తున్నారు.

తాటిచెట్టుకు మెట్లు ఎప్పుడైనా చూశారా !
Technology· 9 Jul 2026

తాటిచెట్టుకు మెట్లు ఎప్పుడైనా చూశారా !

తమిళనాడులోని తూత్తుకూడిలో ఒక క్రేజీ ఐడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కడ ఒక వ్యక్తి తన ఇంటి నుండి డైరెక్ట్‌గా ఎక్కేలా పక్కనే ఉన్న ఒక తాటిచెట్టుకు ఏకంగా మెట్లు కట్టేశాడు. అందుకు దాదాపు రూ. 60 వేల వరకు ఖర్చు పెట్టాడు. ప్రస్తుతం ఆ రూట్‌లో వెళ్లేవాళ్లంతా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. కల్లు అమ్మడం ద్వారా తనకు మంచి ఇన్‌కమ్ వస్తోందని ఆయన చెప్పారు..