← Back to news

వరదల్లో కొట్టుకొచ్చిన కోబ్రాలు.. చైనాలో పాముల కలకలం!

By DS· 9 Jul 2026· guangji -china

చైనాలోని గ్వాంగ్జీ రీజియన్‌లో భారీ వరదల కారణంగా పాముల పెంపక కేంద్రాల నుండి సుమారు 900 కి పైగా పాములు బయటకు తప్పించుకున్నాయి.వరద నీటిలో కొట్టుకొచ్చిన ఈ పాములలో కోబ్రాల వంటి అత్యంత విషపూరితమైన జాతులు కూడా ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, ఓ మహిళను పాము కరవడంతో ఆసుపత్రికి తరలించే లోపే ఆలస్యమై ఆమె మరణించింది. మరెంతో మంది ఈ పాముల కాటుకు గురయ్యారు. ఈ ప్రాంతం చైనాలోనే అతిపెద్ద కమర్షియల్ స్నేక్ ఫార్మింగ్ హబ్ కావడంతో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. తప్పించుకున్న పాములను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

More in World