Latest

కడియం శ్రీహరికి కొండా సురేఖ ఓపెన్ ఛాలెంజ్!
TG: MLA కడియం శ్రీహరిపై మంత్రి కొండా సురేఖ ఘాటుగా ఫైర్ అయ్యారు. ఆయన 40 ఏళ్లు పాలిటిక్స్‌లో ఉండి, ఇప్పుడు నార్మల్ MLA పదవిలో ఇమడలేకపోతున్నారని, దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలని, లేదంటే పాలిటిక్స్‌కి రిజైన్ చేసి ఇంట్లో ఉండాలని కామెంట్స్ చేశారు. కడియం శ్రీహరికి అంత నిజాయితీ ఉంటే, MLA పదవికి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్ నుండి గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. ఈ ఇష్యూపై ఆల్రెడీ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశానని, 14న మీనాక్షి నటరాజన్‌కు కూడా కంప్లైంట్ చేస్తానని కొండా సురేఖ చెప్పారు.

బండి భగీరథ్‌కు హైకోర్టులో బిగ్ రిలీఫ్!
TG: POCSO కేసులో అరెస్ట్ అయిన బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఒక లక్ష రూపాయల ష్యూరిటీతో పాటు, కోర్టు పెట్టిన కొన్ని కండిషన్స్‌తో ఈ బెయిల్ ఇచ్చారు. అయితే, ఈ కేసు ట్రయల్ ప్రాసెస్‌కి అడ్డుపడకూడదని హైకోర్టు క్లియర్‌గా చెప్పింది. అలాగే, ఈ కేసుకు సంబంధించిన సాక్షులను ఎలాంటి పరిస్థితుల్లోనూ ఇన్‌ఫ్లుయెన్స్ చేయకూడదని బండి భగీరథ్‌ను కోర్టు స్ట్రిక్ట్‌గా ఆర్డర్ చేసింది.
ప్రశ్న రావణ్ పై చంద్రబాబు షాకింగ్ కామెంట్స్!
AP పాలిటిక్స్‌లో రావణ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. రీసెంట్‌గా ఒక పబ్లిక్ మీటింగ్‌లో రావణ అనే వ్యక్తి పురాణాలను కించపరిచేలా కామెంట్స్ చేశాడని, దీని వెనుక YSRCP హ్యాండ్ ఉందని CM చంద్రబాబు ఆరోపించారు. YSRCPనే అతనికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తోందని చెప్పారు. దీంతో ఈ ఇష్యూ కాస్తా ఇరు పార్టీల మధ్య పెద్ద పొలిటికల్ వార్‌గా మారింది.
మనవడి కోసం పూరీలు చేసిన CM రేవంత్ రెడ్డి!
TG: CM రేవంత్ రెడ్డి, సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ చేశారు. "తాతా.. నువ్వు పూరీలు చేస్తేనే తింటా" అని మనవడు అడగడంతో, ఆయన స్వయంగా మనవడి కోసం పూరీలు చేశారు. చేతిలో పిండి ముద్దతో, నవ్వుతూ గుండ్రంగా లేని పూరీలు చేస్తున్న ఆ అపురూప క్షణాలను రేవంత్ రెడ్డి ట్విట్టర్‌లో పంచుకున్నారు. నిరంతరం ప్రజా జీవితంలో బిజీగా ఉండే తనకు, మనవడితో గడిపిన ఈ కొన్ని క్షణాలు మధుర జ్ఞాపకాలని ఆయన రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

మరోసారి ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్
AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం మరోసారి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సీహెచ్ అగ్రహారం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, గాలింపు చర్యలను మరింత విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గతనెల 6వ తేదీన చిన్నారి మిస్సైన విషయం తెలిసిందే.
బహిరంగ సభలో మహిళపై CM చంద్రబాబు సీరియస్!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్న బహిరంగ సభలో తీవ్ర కలకలం రేగింది. తన సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఒక మహిళ సభలోనే నిరసన తెలపగా. దీంతో ఆగ్రహానికి గురైన CM, "ఏయ్, వినమ్మా, విను.. విను.. ఆ అమ్మాయిని ఆ పక్కన ఉండమను, కొత్తగా నేర్చుకున్నరు ఈ కల్చర్" అంటూ మైక్‌లోనే సీరియస్ అయ్యారు. అక్కడ పది మంది కోసం ఇలాంటి డ్రామాలు చేయడం కరెక్ట్ కాదని, తానే స్వయంగా మాట్లాడతానని చెబుతూ.. అక్కడ ఉన్న పోలీసులను అలర్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్
TG: ప్రపంచంలో బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ ఉందని CM రేవంత్ రెడ్డి అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా సీతారాంపూర్‌లో ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ యూనిట్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉందని CM స్పష్టం చేశారు. HYDను కూడా కాలుష్య సమస్య వేధిస్తోందని చెప్పారు. మూసీని ప్రక్షాళన చేస్తామన్నారు. పరిశ్రమలను ORR అవతలకు తరలించి అక్కడే పరిశ్రమలకు భూములు కేటాయిస్తామన్నారు. దీంతో ORR, RRR మధ్య పారిశ్రామికవాడలు ఏర్పాటు కానున్నాయన్నారు.
మంత్రి బినామీ భూకబ్జాలు బయటపెట్టిన CPI నారాయణ!
ఆంధ్రప్రదేశ్‌లో భూకబ్జాల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. తిరుపతి సమీపంలోని అవిలాల, పరిసర ప్రాంతాల్లో విలువైన భూములు కబ్జాకు గురవుతున్నాయని CPI నేత నారాయణ ఆరోపించారు. గతంలో ఓ RDO కొనుగోలు చేసిన భూమిని సైతం, తమదేనంటూ టీడీపీ లీడర్స్ లాక్కుంటున్నారని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రమేయం లేకుండా ఇది జరగదని, ఆయన బినామీ అయిన దొనేపూడి శివనాగప్రసాద్ పేరుతోనే ఈ ల్యాండ్ రిజిస్ట్రేషన్ జరిగిందని నారాయణ సంచలన కామెంట్స్ చేశారు.
దూసుకొస్తున్న ట్రైన్.. క్షణంలో ప్రాణాలు కాపాడిన రియల్ హీరో!
తమిళనాడులోని అరసూరులో, గేట్‌కీపర్ సందీప్ చాహర్ సమయస్ఫూర్తి ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడింది. ఒకవైపు ట్రైన్ ఫుల్ స్పీడ్‌తో దూసుకొస్తుండగా.. అదే సమయంలో ఒక వ్యక్తి మద్యం మత్తులో, ఏమాత్రం గమనించకుండా ట్రాక్స్ పైకి వచ్చాడు. ప్రమాదాన్ని ఊహించిన సందీప్, క్షణం కూడా ఆలస్యం చేయకుండా ట్రాక్‌పైకి దూసుకెళ్లి.. చివరి క్షణంలో ఆ వ్యక్తిని పక్కకు లాగేసి ప్రాణాలు కాపాడాడు. ఈ రియల్ లైఫ్ హీరో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కళాశాలకు తాళం వేసి ధర్నా
TG: నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని PG కాలేజ్ విద్యార్థి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్ మార్క్ పోలోనియస్‌ను వెంటనే విధుల నుంచి తొలగించాలని విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కళాశాలకు తాళం వేసి ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. రోడ్డుపై వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. TC కోసం కాలేజ్‌కు వచ్చిన విద్యార్థిపై ప్రిన్సిపల్ అనుచితంగా ప్రవర్తించడంతో ప్రతిఘటించి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

హెచ్-1బీ వీసాలపై ట్రంప్ గవర్నమెంట్ బిగ్ డెసిషన్!
అమెరికాలో హెచ్-1బీ వీసాల దుర్వినియోగంపై, ట్రంప్ గవర్నమెంట్ భారీ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. కొన్ని పెద్ద కంపెనీలు, మధ్యవర్తులు ఈ వీసా వ్యవస్థను వాడుకుంటూ.. తక్కువ జీతాలకే విదేశీయులను తెచ్చి, అమెరికన్ల ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నారని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మండిపడ్డారు. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే దక్కాలని స్పష్టం చేసిన ఆయన, మోసాలకు పాల్పడే వారిని వదిలేది లేదని హెచ్చరించారు. ఈ దర్యాప్తులో భాగంగా ఇప్పటికే కొందరికి నోటీసులు కూడా వెళ్లాయి.

YSRCP మాజీ MLA అరెస్ట్!
AP: YSRCP సీనియర్ లీడర్, రాప్తాడు మాజీ MLA తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని, అనంతపురంలోని శ్రీనగర్ కాలనీలో పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. ఒక ల్యాండ్ డిస్ప్యూట్ మరియు వ్యక్తి సూసైడ్ కేసుకు సంబంధించి, పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఆన్సర్స్ ఇవ్వడానికి ఆయన వెళ్తుండగా ఈ అరెస్ట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్‌తో అనంతపురంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ పెరిగింది.

అయోధ్య కేసులో బిగ్ ట్విస్ట్.. CCTVలో దొరికిపోయిన నిందితులు!
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో కీలక నిందితుడు అవినాష్ శుక్లాను పోలీసులు గుర్తించారు. క్యాష్ విరాళాలను లెక్కించేందుకు కేవలం రూ.15 వేల జీతంతో చేరిన ఇతను, దాదాపు 70 సార్లు దొంగతనానికి పాల్పడ్డాడు. ఇతనికి అన్‌కల్ప్ మిశ్ర, లవ్‌కుష్ మిశ్ర, కరుణేష్ పాండేలు సహకరించినట్లు SIT అధికారులు సీసీటీవీ ద్వారా కనుగొన్నారు. భక్తుల నుండి మనీ కలెక్ట్ చేయడానికి వీరు Fake Receipts కూడా క్రియేట్ చేసినట్లు అంగీకరించారు.

కొండా సురేఖ Vs కడియం శ్రీహరి
తెలంగాణ మినిస్టర్ కొండా సురేఖ TPCC ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్‌ను కలిశారు. తన పరిధిలోని దేవాదాయ శాఖ అధికారులతో, MLA కడియం శ్రీహరి తనకు తెలియకుండా రివ్యూ మీటింగ్ పెట్టడంపై ఆమె సీరియస్ అయ్యారు. ప్రోటోకాల్ ఉల్లంఘించిన ఆయనపై యాక్షన్ తీసుకోవాలని కోరారు. అయితే, వీరిద్దరి మధ్య ఉన్న ఈ వివాదాన్ని త్వరలోనే సాల్వ్ చేస్తామని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.

గురుకులంలో ఫుడ్ పాయిజన్
TG: నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూరులోని ట్రైబల్ వెల్ఫేర్ బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. ఉదయం కిచిడి తిన్నవారిలో 26మంది విద్యార్థులు వాంతులు, కడుపునొప్పితో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే గురుకుల సిబ్బంది స్టూడెంట్స్‌ను చికిత్స నిమిత్తం అచ్చంపేట గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు. కాగా, గురుకులంలో సిబ్బంది తాగునీరు సరిగ్గా ఇవ్వడం లేదని విద్యార్థుల ఆవేదన వ్యక్తం చేశారు.

నీళ్ల కోసం రోడ్డెక్కిన స్టూడెంట్స్
TG: నీటి సమస్య పరిష్కరించాలని యూనివర్సిటీ స్టూడెంట్స్ రోడ్డెక్కారు. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లిలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీ (TU)లో నీటి సమస్యను పరిష్కరించాలని విద్యార్థినులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. సమస్యపై యూనివర్సిటీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

తాగి స్కూల్ వ్యాన్ డ్రైవింగ్.. జస్ట్ మిస్
TG: పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలంలో ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్‌కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. మండలంలోని మంగపేట గ్రామం నుంచి సుమారు 40మంది విద్యార్థులతో పెగడపల్లిలోని సన్‌షైన్ స్కూల్‌కు బయలుదేరిన స్కూల్ వ్యాన్, మంగపేట ఎల్లమ్మ గుడి సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపు తప్పింది. వ్యాన్ రోడ్డు పక్కనే ఉన్న సిమెంటు గద్దెను ఢీకొట్టి అంతటితో ఆగకుండా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. డ్రైవర్ అతిగా మద్యం సేవించి వాహనం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు ఫైరయ్యారు. డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.
సోనమ్ వాంగ్‌చుక్ పిలుపు!
ఎడ్యుకేషన్ మినిస్టర్ రిజైన్ చేయాలని డిమాండ్ చేస్తూ, సూసైడ్ చేసుకున్న 20 మంది స్టూడెంట్స్ జస్టిస్ కోసం సోనమ్ వాంగ్‌చుక్ గత 12 రోజులుగా జంతర్ మంతర్ దగ్గర హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. ఇందులో భాగంగా జూలై 20న అందరినీ ఢిల్లీ రావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్లమెంట్ మాన్‌సూన్ సెషన్స్ స్టార్ట్ అయ్యే ఆరోజున, అందరం కలిసి పార్లమెంట్‌కి పీస్‌ఫుల్ మార్చ్ చేద్దామని, MPని కలిసి పర్మనెంట్ సొల్యూషన్ అడుగుదామని ట్వీట్ చేశారు.

అనంతపురంలో హైటెన్షన్
AP: అనంతపురంలో TDP MLA ఎంఎస్ రాజు, YSRCP మాజీ MLA తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డిలు సవాళ్లు, ప్రతి సవాళ్లు చేసుకోవడంతో టెన్షన్ వాతావరణం నెలకుంది. తనపై చేసిన ఆరోపణలను నిరూపించాలని ఎంఎస్ రాజు సవాల్ చేయగా, ఆరోపణలు నిరూపించకపోవడంతో ప్రకాశ్ రెడ్డి ఇంటిని ముట్టడిస్తామని ప్రకటించారు. తన నివాసానికి TDP శ్రేణులు వస్తే రాళ్లతో దాడి చేసేందుకు ప్రకాశ్ రెడ్డి కంకరను సిద్ధం చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు అప్రమత్తమై కంకరను తొలగించారు. ఇరువర్గాల కార్యకర్తలు రోడ్డుపైకి చేరుకోవడంతో వారి ఇళ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈరోజు గోల్డ్ రేట్ చూశారా!
గత రెండ్రోజులుగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్ ఈరోజు కొంచెం పెరిగింది. హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ప్రైస్ రూ.1,43,240 కి చేరగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,31,300 గా ఉంది. మార్కెట్‌లో రేట్లు ఎప్పటికప్పుడు చేంజ్ అవుతుంటాయి కాబట్టి, షాపింగ్ కి వెళ్లేముందు ఒకసారి లైవ్ రేట్స్ చెక్ చేసుకోవడం బెటర్.

తహసీల్దార్ ఆఫీస్‌లో క్షుద్రపూజలు కలకలం
TG: జగిత్యాల జిల్లా రాయికల్ తహసీల్దార్ కార్యాలయ ఉద్యోగులు, GPOలు తరచు వాహన ప్రమాదాలకు గురవుతున్నారు. బదిలీపై వచ్చి కార్యాలయంలో అడుగుపెట్టగానే ఒకరి తర్వాత ఒకరుగా ఐదుగురు GPOలు ప్రమాదాల బారిన పడ్డారు. దీంతో రెవెన్యూ అధికారులకు భయం పట్టుకుంది. విషయం బయటకు పొక్కకుండా CC కెమెరాలను ఆఫ్ చేయించారు. కార్యాలయం ఎదుట క్షుద్రపూజలు చేయించారు. గుంత తవ్వి గొర్రెను బలి ఇచ్చినట్లు ఆనవాళ్లు కనిపించడం కలకలం రేపింది. మల్లాపూర్ మండలం VV రావుపేటలోని గంగ వద్ద విందు భోజనాలు కూడా చేసినట్లు సమాచారం.