← Back to news

మరోసారి ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్

By DK· 9 Jul 2026· కాకినాడ జిల్లా
మరోసారి ముమ్మరంగా సెర్చ్ ఆపరేషన్

AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం మరోసారి ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ సీహెచ్ అగ్రహారం గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, గాలింపు చర్యలను మరింత విస్తృతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. గతనెల 6వ తేదీన చిన్నారి మిస్సైన విషయం తెలిసిందే.

More in AP