Latest

సినిమా రేంజ్‌లో నవ వధువు కిడ్నాప్
Crime· 9 Jul 2026

సినిమా రేంజ్‌లో నవ వధువు కిడ్నాప్

TG: కులాంతర వివాహం చేసుకున్న ఓ నవ వధువును ఆమె కుటుంబసభ్యులే కిడ్నాప్ చేసిన ఘటన కలకలం రేపింది. మెదక్ జిల్లా ఎల్లాపూర్ గ్రామానికి చెందిన ప్రణయ్, ఓ యువతిని ప్రేమించి ఈ నెల 6న కులాంతర వివాహం చేసుకున్నాడు. ఆ పెళ్లి వధువు కుటుంబసభ్యులకు ఇష్టం లేదు. దీంతో వారంతా తమ అమ్మాయిని ఎలాగైనా కిడ్నాప్ చేసి ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేశారు. వరుడు ప్రణయ్ ఇంటికి నాలుగు కార్లలో సైలెంట్‌గా వచ్చి చుట్టుముట్టారు. బలవంతంగా ఇంట్లోకి చొరబడి యువతిని తమవెంట లాక్కెళ్లారు. ఈ క్రమంలో అడ్డొచ్చిన ప్రణయ్, అతడి కుటుంబసభ్యులను సైతం కార్లలో ఎత్తుకెళ్లారు.

బాస్‌లపై కేసు పెట్టేందుకు ఉద్యోగులకు అస్త్రంగా AI
Technology· 9 Jul 2026

బాస్‌లపై కేసు పెట్టేందుకు ఉద్యోగులకు అస్త్రంగా AI

ఇటీవల ఉద్యోగులు తమ బాస్‌లు లేదా కంపెనీలపై లీగల్ కేసులు పెట్టడానికి AI టూల్స్‌ను విరివిగా వాడుతున్నారు. లాయర్ల ఖర్చు లేకుండానే AI సాయంతో కార్మికులు తమ హక్కులను తెలుసుకుంటూ, లీగల్ ఫిర్యాదులను స్వయంగా డ్రాఫ్ట్ చేసుకుంటున్నారు. కంపెనీ డేటాను విశ్లేషించి అన్యాయమైన తొలగింపులను నిరూపిస్తున్నారు. దీనివల్ల బ్రిటన్, ఆస్ట్రేలియా కోర్టుల్లో కేసుల వరద పెరుగుతోంది. అయితే, కొన్నిసార్లు AI తప్పుడు సమాచారం (Hallucinations) ఇవ్వడం వల్ల ఉద్యోగులు నష్టపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది.

భూ కంపాలను  ప్రిడిక్ట్ చేయడంలో AI  ఫెయిల్?
Technology· 9 Jul 2026

భూ కంపాలను ప్రిడిక్ట్ చేయడంలో AI ఫెయిల్?

క్యాన్సర్ గుర్తించడం నుంచి సైక్లోన్ అంచనాల వరకూ AI అదరగొడుతోంది. కానీ భూకంపాల విషయంలో మాత్రం ఇంకా ఫెయిల్ అవుతోంది. కారణం? రికార్డులు కేవలం 150 ఏళ్లవే, పెద్ద భూకంపాలు వందల నుంచి వేల ఏళ్లకు ఒకసారి మాత్రమే వస్తాయి. ఒకే ఫాల్ట్‌పై డేటా చాలా తక్కువగా ఉండటంతో AIకి ప్యాటర్న్స్ అర్థం కావడం లేదు. అందుకే ఇప్పటికీ ఖచ్చితమైన భూకంప అంచనా అసాధ్యం అంటున్నారు శాస్త్రవేత్తలు. కాబట్టి ఎర్లీ వార్నింగ్ సిస్టమ్స్, భూకంప నిరోధక భవనాలు, కఠిన బిల్డింగ్ కోడ్స్, ప్రజల అవగాహన, వేగవంతమైన ఎమర్జెన్సీ రెస్పాన్స్‌నే ప్రాణాలను కాపాడే బెస్ట్ డిఫెన్స్‌గా నిపుణులు చెబుతున్నారు.

ఓవర్ స్పీడ్‌తో మహిళలపై దూసుకెళ్లిన బొలెరో
Crime· 9 Jul 2026

ఓవర్ స్పీడ్‌తో మహిళలపై దూసుకెళ్లిన బొలెరో

TG: రంగారెడ్డి జిల్లాలో శంషాబాద్ పరిధిలోని సాతంరాయి వద్ద బస్టాప్‌లో బస్సు కోసం వేచి చూస్తున్న మహిళలపైకి ఓవర్ స్పీడ్‌తో వచ్చిన బొలెరో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో సుమ, సువర్ణ అనే ఇద్దరు మహిళలు తీవ్ర గాయాలతో స్పాట్‌లోనే చనిపోయారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. శంషాబాద్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డెడ్‌బాడీలను పోస్ట్‌మార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అధికారులు నిర్లక్ష్యం వీడి వెంటనే ఇక్కడ జీబ్రా క్రాసింగ్, స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేయాలని స్థానికులు ఆందోళన చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రియాక్షన్ వీడియోల రచ్చ.. సోషల్ మీడియా కొత్త డ్రామా!
Entertainment· 9 Jul 2026

రియాక్షన్ వీడియోల రచ్చ.. సోషల్ మీడియా కొత్త డ్రామా!

ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌ల్లో Reaction Videos బూమ్‌తో కొత్త "Reaction Economy" క్రేజ్‌లో ఉంది. ఒక వీడియోపై మరో వీడియో చేస్తూ వ్యూస్, ఫాలోవర్లు, ఆదాయం పెంచుకుంటున్నారు. కానీ సరదా కామెంట్లు క్రమంగా విమర్శలు, ట్రోలింగ్, పబ్లిక్ షేమింగ్‌గా మారుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంటెంట్ క్రియేటర్లు అసలు వీడియో కంటే రియాక్షన్‌కే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండటంతో ఆన్‌లైన్ చర్చలు హెల్తీ డిబేట్ నుంచి హేట్ కల్చర్ వైపు వెళ్తున్నాయని విశ్లేషకుల అభిప్రాయం. సోషల్ మీడియాలో రియాక్ట్ చేసే ముందు ఫ్యాక్ట్స్ చెక్ చేయడం, బాధ్యతగా స్పందించడం ఇప్పుడెంతో అవసరం.

వాట్సాప్‌లో పరిచయం.. నమ్మించి లక్షల్లో మోసం
Crime· 9 Jul 2026

వాట్సాప్‌లో పరిచయం.. నమ్మించి లక్షల్లో మోసం

TG: హైదరాబాద్‌లోని జగద్గిరిగుట్టకు చెందిన సురేందర్‌రెడ్డికి ఎప్రిల్ నెలలో ఓ వాట్సాప్‌ గ్రూప్‌లో గీతాంజలి, శుభమ్‌, అమిత్‌ పేర్లతో ముగ్గురు పరిచయం అయ్యారు. ఆన్‌లైన్‌ ట్రేడింగ్‌ చేస్తే భారీ లాభాలు వస్తాయని నమ్మించి ఒక ‘APK ఫైల్‌’ను పంపించారు. దానిపై క్లిక్‌ చేయించి ట్రేడింగ్‌ ఖాతాలు తెరిపించారు. బాధితుడు దశలవారీగా ట్రేడింగ్‌ ఖాతాల్లో రూ.8.55 లక్షలు జమచేశాడు. మే నెలలో జమచేసిన డబ్బును సురేందర్‌ విత్ డ్రా చేసేందుకు ప్రయత్నించగా, ఇంకా ఎక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టాలని వారు డిమాండ్ చేశారు. దీంతో సురేందర్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

AIతో ఔషధ పరిశోధనలకు కొత్త ఊపు
Education· 9 Jul 2026

AIతో ఔషధ పరిశోధనలకు కొత్త ఊపు

TG: భారతదేశ ప్రాచీన సాంప్రదాయ వైద్య విజ్ఞానాన్ని, కృత్రిమ మేధస్సుతో అనుసంధానించడం ద్వారా మానవాళికి ఉపయోగపడే అద్భుతమైన ఔషధాలను కనుగొనవచ్చని శాతవాహన యూనివర్సిటీ VC ఉమేష్ కుమార్ పేర్కొన్నారు. కరీంనగర్‌లోని SU పరిధిలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్ ఆధ్వర్యంలో "సహజ సిద్ధ ఔషధాల ఆవిష్కరణలో AI పాత్ర" అనే అంశంపై సదస్సు నిర్వహించారు. పరిశోధనల్లో ఇలాంటి నూతన సాంకేతికతలను విద్యార్థులు అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు. సహజ సిద్ధమైన మూలికా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలంటే శాస్త్రీయమైన డేటా, పరిశోధనలు ఎంతో అవసరమన్నారు.

గంగూలీ బయో పిక్ దాదా ఫస్ట్ లుక్  పై నెటిజన్ల ట్రోల్స్ !
Sports· 9 Jul 2026

గంగూలీ బయో పిక్ దాదా ఫస్ట్ లుక్ పై నెటిజన్ల ట్రోల్స్ !

సౌరవ్ గంగూలీ బయోపిక్ 'దాదా': రాజ్‌కుమార్ రావు ఫస్ట్ లుక్‌పై నెటిజన్ల ట్రోల్స్! మాజీ ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ బయోపిక్ ‘దాదా’ నుంచి హీరో రాజ్‌కుమార్ రావు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదలైంది. లార్డ్స్ స్టేడియంలో గంగూలీ జెర్సీ విప్పిన ఐకానిక్ మూమెంట్‌ను ఇందులో రీక్రియేట్ చేశారు. అయితే, ఈ పోస్టర్ నెటిజన్లను అస్సలు ఆకట్టుకోలేదు. ఇది చాలా వరస్ట్‌గా ఉందంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. "దీనికంటే ChatGPT ఇంకా మంచి పోస్టర్ డిజైన్ చేసేది", "ఇది ఒక డిజాస్టర్ VFX" అంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.

డెంటల్ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్
AP· 9 Jul 2026

డెంటల్ కాలేజ్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్

AP: కడప ప్రభుత్వ దంత వైద్య కళాశాల లేడీస్ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయి 27మంది దంత వైద్య విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. హాస్టల్‌లో దోశ తిన్న వారు తీవ్ర అస్వస్థకు గురవడంతో చికిత్స కోసం కడప రిమ్స్ హాస్పిటల్‌కు తరలించినట్లు డెంటల్ కాలేజ్ ప్రిన్సిపల్ యుగంధర్ తెలిపారు. ప్రస్తుతం స్టూడెంట్స్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు. ఫుడ్ పాయిజన్‌పై జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆరా తీశారు. వారికి సరైన వైద్య సేవలు అందించాలని సూచించారు. ఘటనపై ఆమె నివేదిక కోరారు.

నిధులు లేక పల్లెల్లో అభివృద్ధికి బ్రేక్
TG· 9 Jul 2026

నిధులు లేక పల్లెల్లో అభివృద్ధికి బ్రేక్

TG: రాష్ట్రంలో కొత్త పాలకమండళ్లు ఏర్పడి ఆరునెలలు దాటినా గ్రామ పంచాయతీల్లో సమస్యలు పట్టి పీడిస్తూనే ఉన్నాయి. గత పాలకవర్గాల కాలానికి సంబంధించి సుమారు రూ.500 కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు ఇంకా రాకపోవడం, 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదల కాకపోవడంతో పాలన కష్టంగా మారింది. నిధుల కొరతతో అత్యవసరమైన పనులూ చేపట్టలేని పరిస్థితి నెలకుంది. ప్రజారోగ్యానికి గతంలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, సర్పంచులు సొంత నిధుల నుంచి ఖర్చు చేసినా పంచాయతీ కార్యదర్శులకు ఇప్పటివరకు బిల్లులు చెల్లించలేదు. దీంతో పల్లెల్లో పారిశుద్ధ్యం పడకేసింది.

TC కోసం ప్రిన్సిపల్ షాకింగ్ డిమాండ్
Crime· 9 Jul 2026

TC కోసం ప్రిన్సిపల్ షాకింగ్ డిమాండ్

TG: స్టూడెంట్స్‌కు విద్యాబుద్దులు నేర్పి ఆదర్శంగా ఉండాల్సిన ప్రిన్సిపల్‌ కొన్నాళ్లుగా తన వికృత చేష్టలతో ఓ స్టూడెంట్‌ని వేధిస్తున్నాడు. నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌ PG కాలేజ్ ప్రిన్సిపల్‌ మార్క్‌ పోలోనియస్‌ తన ఇంటికొచ్చి శారీరకంగా కలిస్తేనే TC ఇస్తానంటూ విద్యార్థికి చెప్పాడు. ఈసారి ఎలాగైనా మార్క్‌ దారుణాలను బయటపెట్టాలని ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్‌తో కలిసి ప్రిన్సిపల్‌ ఇంటికి వెళ్లాడు. స్నేహితులను బయటే ఉంచి తానొక్కడే లోపలికి వెళ్లాడు. మార్క్‌ అనైతిక చేష్టలను అతడి ఫ్రెండ్స్ వీడియో తీశారు. వెంటనే ఆ బాధితుడు నేరుగా పోలీస్‌‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

అసైన్డ్ భూములకు అక్రమ పట్టాలు.. అధికారిణిపై వేటు
Crime· 9 Jul 2026

అసైన్డ్ భూములకు అక్రమ పట్టాలు.. అధికారిణిపై వేటు

TG: ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లొసుగులను ఆసరగా చేసుకుని ప్రభుత్వ భూములను అధికారులు ప్రైవేట్ వ్యక్తులకు పట్టా చేసిన కుంభకోణాలు ఇంకా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. సిద్దిపేట జిల్లా కుకునూరుపల్లి మండలంలోని పలు గ్రామాల్లో 448 ఎకరాల అసైన్డ్‌ భూములను పట్టా చేసినట్లు సిట్ విచారణలో తేలింది. తహసీల్దార్‌ దండు సుజాత కనీసం క్రాస్‌చెక్‌ చేసుకోకుండా, ఎలాంటి సపోర్టింగ్‌ డాక్యుమెంట్లు లేకుండా పట్టామార్పిడి చేసినట్లు గుర్తించారు. దీంతో తహసీల్దార్‌ను సస్పెండ్‌ చేస్తూ జిల్లా కలెక్టర్‌ కె.హైమావతి ఉత్తర్వులు జారీ చేశారు.

పేదల బియ్యం కాజేసి.. బ్లాక్ మార్కెట్‌లో అమ్మేశాడు
TG· 9 Jul 2026

పేదల బియ్యం కాజేసి.. బ్లాక్ మార్కెట్‌లో అమ్మేశాడు

TG: పెద్దపల్లి జిల్లాలోని కట్నేపల్లిలో సౌభాగ్యలక్ష్మి ఇండస్ట్రీస్‌, సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్‌ పేర్ల మీద రైస్ మిల్లర్ మారుతి ప్రభుత్వం నుంచి ధాన్యం తీసుకున్నాడు. 7,625 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయకుండా బ్లాక్ మార్కెట్లో అమ్ముకున్నాడు. అలాగే పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసే PDS బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి పెద్దఎత్తున ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.132 కోట్ల విలువైన బియ్యం కాజేసినట్లు లెక్క తేలింది. అతడిపై PD యాక్ట్‌ నమోదు చేశారు. పోలీసులు మారుతిని అరెస్టు చేసి చర్లపల్లి జైలుకు తరలించారు.

విద్యార్థులకు AP ప్రభుత్వం గుడ్‌న్యూస్
Education· 9 Jul 2026

విద్యార్థులకు AP ప్రభుత్వం గుడ్‌న్యూస్

AP ప్రభుత్వం గురుకులాల విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వారికి డైట్ ఛార్జీలను 10% పెంచుతూ డిసిషన్ తీసుకుంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం నుంచి ఇది అమల్లోకి రానుంది. పెరిగిన ధరల దృష్ట్యా డైట్ ఛార్జీల పెంపుపై ఇటీవల CM చంద్రబాబు అధికారుల నుంచి నివేదిక కోరారు. వారి ప్రతిపాదనల్ని పరిశీలించి సచివాలయంలో సంక్షేమ శాఖలపై నిర్వహించిన సమీక్ష సందర్భంగా ఈ పెంపుపై నిర్ణయం తీసుకున్నారు. తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని సంక్షేమ విభాగాల్లోని 6.52 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది.

ఏపీలో  కారుణ్య మరణాలకు  లైన్ క్లియర్ !
AP· 8 Jul 2026

ఏపీలో కారుణ్య మరణాలకు లైన్ క్లియర్ !

సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్రంలో కారుణ్య మరణాలకు (ప్యాసివ్ యుథనేషియా) సంబంధించిన మార్గదర్శకాలకు వైద్య ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ఆమోదం తెలిపారు. తాజా నిబంధనలతో ఇకపై వైద్యులు, రోగుల కుటుంబ సభ్యులు తీసుకునే నిర్ణయాలకు చట్టబద్ధత లభించనుంది. కోలుకునే అవకాశం లేక, చివరి దశలో ఉండి తీవ్ర నరకం అనుభవిస్తున్న రోగులకు మరియు వారి కుటుంబాలకు ఈ తాజా మార్గదర్శకాలు పెద్ద ఊరటనివ్వనున్నాయి.

గంగూలీ బయోపిక్ పై త్వరలోనే అనౌన్స్ మెంట్ !
Sports· 8 Jul 2026

గంగూలీ బయోపిక్ పై త్వరలోనే అనౌన్స్ మెంట్ !

సౌరవ్ గంగూలీ జీవితకథ ఆధారంగా తెరకెక్కనున్న బయోపిక్‌పై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని లవ్ ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫస్ట్ లుక్ లేదా టీజర్ విడుదల కాలేదు. గంగూలీ పాత్రలో బాలీవుడ్ స్టార్ ఆయుష్మాన్ ఖురానా నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, చిత్ర యూనిట్ ఇంకా ధృవీకరించలేదు. త్వరలోనే నటీనటులు, ఫస్ట్ లుక్ వివరాలను మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేస్తారు.

నటి కలర్స్ స్వాతి రెండో పెళ్లి !
Cinema· 8 Jul 2026

నటి కలర్స్ స్వాతి రెండో పెళ్లి !

తెలుగు నటి 'కలర్స్' స్వాతి (స్వాతి రెడ్డి) దర్శకుడు శ్రీకాంత్ నాగోతిని ఇవాళ రెండవ వివాహం చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య సైలెంట్‌గా ఈ పెళ్లి జరిగినట్లుగా తెలుస్తోంది. స్వాతి గతంలో శ్రీకాంత్ నాగోతి దర్శకత్వంలో వచ్చిన 'మంత్ ఆఫ్ మధు' అనే సినిమాలో నటించారు. ఆ పరిచయంతోనే వీరిద్దరి మధ్య సఖ్యత పెరిగింది. ఇరు కుటుంబాలు అంగీకరించి వీరికి పెళ్లి జరిపించారు. స్వాతి మొదట్లో వికాస్ వాసు అనే పైలట్ ను పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. విడాకులు తీసుకున్నారు.

ఇరాన్ పై ఈ రాత్రికి గట్టి దాడి- ట్రంప్
World· 8 Jul 2026

ఇరాన్ పై ఈ రాత్రికి గట్టి దాడి- ట్రంప్

అమెరికా మిలిటరీ స్థావనాలపై ఇరాన్ దాడులు చేయడంతో, ఇరు దేశాల మధ్య కుదిరిన తాత్కాలిక ఒప్పందం ముగిసిపోయిందని యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. నాటో (NATO) సదస్సులో ఆయన మాట్లాడుతూ, "ఇరాన్ చాలా దారుణంగా ప్రవర్తిస్తోంది. నిన్న రాత్రే వారిపై గట్టి దెబ్బ కొట్టాం, ఈ రాత్రి కూడా అంతకంటే గట్టిగా బుద్ధి చెబుతాం" అని హెచ్చరించారు. ఇరాన్ అణ్వాయుధాలు సాధించకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని, అవసరమైతే వారి మరిన్ని నౌకలను, విద్యుత్, నీటి వనరులను దెబ్బతీస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.చమురు ఎగుమతులు జరిగే ఖర్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారు.

బండి భగీరథ్ POCSO కేసు అప్డేట్!
Legal· 8 Jul 2026

బండి భగీరథ్ POCSO కేసు అప్డేట్!

TG: POCSO కేసు నిందితుడు బండి భగీరథ్ బెయిల్ పిటిషన్‌పై రేపు హైకోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ కేసులో ఇదివరకే రెండు వైపులా వాదనలు విన్న కోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. రీసెంట్‌గా ఎగ్జామ్స్ రాసేందుకు వారం రోజుల పాటు తాత్కాలిక బెయిల్ పొందిన భగీరథ్, పరీక్షలు కంప్లీట్ చేశాడు. ఇప్పుడు రెగ్యులర్ బెయిల్ కోసం హైకోర్టులో పిటిషన్ వేయగా.. రేపు కోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

ఈ లేడీ ఫార్మర్ ఆఫర్ మామూలుగా లేదుగా!▶
Jobs· 8 Jul 2026

ఈ లేడీ ఫార్మర్ ఆఫర్ మామూలుగా లేదుగా!

ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లికి చెందిన ఒక ఉమెన్ ఫార్మర్ తన టమాటో గార్డెన్‌లో జాబ్స్ కోసం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ జాబ్స్ కి శాలరీ నెలకు రూ. 12,000 ఇస్తారు. వర్క్ టైమింగ్స్ ఉదయం 6 నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉంటాయి. మార్నింగ్ టీ, మధ్యాహ్నం కూల్ డ్రింక్ ఫ్రీగా ఇస్తారు. గార్డెన్‌లోని వెజిటబుల్స్, మ్యాంగోస్ కూడా ఫ్రీగా తీసుకెళ్లవచ్చు. మొక్కలు పాడవకుండా ఉండటానికి ఫస్ట్ వన్ మంత్ ట్రైనింగ్ కూడా ఇస్తామని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాంటాక్ట్ అవ్వండి అంటూ ఆ వీడియోలో చెప్పారు.

తలుపు చెక్కే వర్షంలో ఆ గర్భిణికి పడవ అయింది!▶
Viral· 8 Jul 2026

తలుపు చెక్కే వర్షంలో ఆ గర్భిణికి పడవ అయింది!

మహారాష్ట్ర పాల్‌ఘర్‌లో భారీ వర్షాల వల్ల రాకపోకలు పూర్తిగా ఆగిపోయాయి. ఆ టైమ్‌లో ఒక ప్రెగ్నెంట్ ఉమెన్‌కు డెలివరీ పెయిన్స్ వచ్చాయి. వరదల వల్ల అంబులెన్స్ వచ్చే ఛాన్స్ లేకపోవడంతో లోకల్స్ వెంటనే రెస్పాండ్ అయ్యారు. ఒక తలుపు చెక్కపై ఆమెను పడుకోబెట్టి, ఛాతీ లోతు నీళ్లలో మోసుకుంటూ హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. వాళ్ల సాహసం వల్ల ఆమెకు పండంటి మగబిడ్డ పుట్టాడు. ఇప్పుడు మదర్, బేబీ ఇద్దరూ సేఫ్‌గా ఉన్నారు. ఈ లోకల్స్ చేసిన హెల్ప్‌కు అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు.