Latest

బంగారం కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్!
ఇంటర్నేషనల్ రీజన్స్ వల్ల దేశీయంగా బంగారం ధరలు భారీగా తగ్గాయి. ఈరోజు ఉదయం 10 గంటల టైమ్‌కి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,360 తగ్గి రూ.1,45,260 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ ప్రైస్ రూ.1,250 తగ్గి రూ.1,33,150 గా ఉంది. మార్కెట్ లో ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి కాబట్టి, షాపింగ్ ప్లాన్ చేసుకునే ముందు ఒకసారి లైవ్ రేట్స్ చెక్ చేసుకోండి.

విశాఖ తీరంలో టెన్షన... 48గంటలు గడిచినా ఆచూకీ లేదు
AP: విశాఖ తీరం నుంచి చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని విశాఖ రేంజ్ DIG గోపీనాథ్ జెట్టి తెలిపారు. మత్య్సకారులు 4వ తేదీ రాత్రి సమయంలో గల్లంతైన విషయం తెలిసిందే. 48గంటలు గడిచినా ఆచూకీ తెలియకపోవడంతో వారి కుటుంబసభ్యుల్లో ఆందోళన మొదలైంది. అదేరోజు కర్రి చిన్నా అనే మత్య్సకారుడిని చైనా షిప్ వాళ్లు సురక్షితంగా రక్షించారని చెప్పారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నామన్నారు. 4 షిప్పులు, 2 హెలికాప్టర్లతో రిస్య్కూ ఆపరేషన్ కొనసాగుతుందని DIG స్పష్టం చేశారు.

అక్రమాస్తుల కేసులో DSPకి షాక్
TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన DSP భీమ్‌రెడ్డికి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. రూ.300 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న ACB అధికారులు, కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం భీమ్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఆయన తన పలుకుబడిని ఉపయోగించి అరెస్ట్ నుంచి తప్పంచుకుంటున్నారని, ACB అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

అక్రమాస్తుల కేసులో DSPకి రిమాండ్
TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన DSP భీమ్‌రెడ్డికి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నాలుగు రోజుల క్రితం భీమ్‌రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలు, ప్రాంతాల్లో ACB అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సుమారు రూ.300 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను గుర్తించారు. దీంతో ఆయన్ను ACB అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం భీమ్‌రెడ్డికి 14రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

భారీ భూస్కామ్.. బోర్డు తీసేసి రియల్టర్ దందా
TG: రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూర్‌లోని 40 ఎకరాలకుపైగా ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో కొంత భూమిని గతంలో ప్రభుత్వం పేదలకు అసైన్ చేసింది. నిబంధనల ప్రకారం అసైన్డ్ భూమిని అమ్మడం, కొనడం నేరం. అయితే అసైనీల వద్ద ఉండాల్సిన భూమిలో 12 ఎకరాలు ఇటీవల ఓ రియల్టర్ చేతుల్లోకి వెళ్లింది. ఇక్కడ ప్రభుత్వ భూమి అనే పెద్ద నోటీసు బోర్డు కూడా ఉండేది. ఇటీవల బోర్డు తీసేసి పట్టా భూమిగా మార్చేశారు. రూ.200 కోట్ల విలువైన భారీ భూకుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. దీనిపై సుమోటోగా కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి తెలిపారు.

ధరణి పోర్టల్‌లో బిగ్ స్కామ్
TG: ధరణి పోర్టల్ ద్వారా భూ యజమానులకు తెలియకుండానే భూములు ఇతరుల పేర్లపైకి మారడం కలకలం సృష్టిస్తోంది. ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని జరిగిన భూదోపిడీపై సిట్ తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో దాదాపు 10వేల ఎకరాలకు పైగా భూముల యాజమాన్య హక్కులను మార్చేసినట్లు ఇప్పటికే గుర్తించగా, ఈ అక్రమం వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారుల కోసం సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇప్పటికే పలువురిని గుర్తించి నోటీసులు జారీ చేశారు.

ధరణి స్కామ్‌లో అధికారులకు నోటీసులు
TG: ధరణి పోర్టల్‌లోని సాంకేతిక లొసుగులను ఆసరాగా చేసుకుని జరిగిన అక్రమాలపై సిట్ తనిఖీలను ముమ్మరం చేసింది. రాష్ట్రంలో దాదాపు 10 వేల ఎకరాలకు పైగా భూముల యాజమాన్య హక్కులను మార్చేసినట్లు ఇప్పటికే గుర్తించగా, ఈ అక్రమాల వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ఈ నేపథ్యంలోనే పైలట్ ప్రాతిపదికన సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో జరిగిన భూలావాదేవీలపై ప్రభుత్వం ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించింది. సంగారెడ్డి, సిద్దిపేట, మేడ్చల్, రంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో ఇప్పటికే పలువురిని గుర్తించి నోటీసులు జారీచేశారు.

ప్రమాదకర స్థాయిలో నీటినిల్వలు.. APకి కరువు ముప్పు
AP: నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకినా.. వర్షాలు లేకపోవడంతో ఆందోళన మొదలైంది. గ్లోబల్ వార్మింగ్, ఎల్‌నినో ప్రభావంతో భూగర్భజలాలు పడిపోవడమే కాక.. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరాయి. శ్రీశైలం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 215.810 TMCలు కాగా.. ప్రస్తుతం 42.213 TMCలే ఉన్నాయి. నిరుడు వరదలు పోటెత్తడంతో ఇదే సమయానికి దాదాపు 50 వేల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితే లేదు. 3.95 లక్షల ఎకరాలకు సాగునీరు, వందల గ్రామాలకు తాగునీరు అందించే తుంగభద్ర డ్యాం నీటి ప్రవాహం లేక వెలవెల బోతుంది.

APకి మరో మెగా సోలార్ ప్రాజెక్ట్
AP: రాష్ట్రంలో మరో భారీ సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. NTPC అనుబంధ సంస్థ NTPCREL (ఎన్‌టీపీసీ రెన్యువబుల్ ఎనర్జీ లిమిటెడ్) ఈ సోలార్ ప్రాజెక్ట్‌ను అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనుంది. 1200 మెగావాట్ల సామర్థ్యంతో డి.హీరేహల్ మండలంలోని కనేకల్, రాయదుర్గం గ్రామాల పరిధిలో ప్రాజెక్టు స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ ప్రాజెక్ట్ దేశంలో NTPC నిర్మించే నాలుగో భారీ ప్రాజెక్టు. ఇప్పటికే రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో సోలార్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసింది.

తిరుపతి కొండను కాలినడకన ఎక్కిన 116 ఏళ్ల బామ్మ !
తిరుమల అలిపిరి మెట్లను కాలి నడకన ఓ 116 ఏళ్ల బామ్మ ఎక్కడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తిరుపతికి చెందిన నవనీతమ్మ అనే 116 ఏళ్ల వృ ద్ధురాలు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం కాలినడకన మెట్లెక్కి కొండపైకి చేరుకుంది. వృద్థురాలి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో టీటీడీ బోర్డు ఛైర్మన్ ఆమె గురించి ఆరా తీశారు. ఆమె తమిళనాడుకు చెందిన మహిళ అని తిరుపతిలో బంధువుల దగ్గర ఉంటోందని తెలిసింది. ఆమె భక్తికి, ఓపికకు ఆశ్చర్యపోయిన టీటీడీ బోర్డు ఛైర్మన్ ఆమెకు, ఆమె కుటుంబానికి సోమవారం విఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు.

అఖిల్ అక్కినేనికి నాగ అఖిల్ అని ఫ్యాన్స్ కొత్త పేరు !
అక్కినేని అఖిల్ కు తిరుపతి ఫ్యాన్స్ కొత్త పేరు పెట్టారు. మొన్నటి వరకూ అయ్యగారే నెంబర్ వన్ అంటూ అఖిల్ ను అభిమానులు కామెంట్ చేస్తూండేవారు. ఈకామెంట్లు అప్పట్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. ఇవాళ తిరుపతిలో జరిగిన లెనిన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఓ ఫ్యాన్ అఖిల్ కు నాగ అఖిల్ అని పేరు పెట్టారు. ఈ పేరుతో నాగేశ్వరరావు, అన్నపూర్ణమ్మ, నాగార్జున, అమల, పేర్లను చూసుకోవచ్చు. ఇక నుంచి ప్రతీ మూవీ డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అని అభిమానులు సంబర పడుతున్నారు.

ఆత్మీయులకు తియ్యని పలకరింపు ఓ చాక్లెట్ బైట్
చాక్లెట్ అంటే కేవలం స్వీట్ కాదు... అదో అద్భుతం! దీని శాస్త్రీయ నామం 'దేవతల ఆహారం'. క్రీస్తుపూర్వం 2,000 ఏళ్ల నాడే మాయన్, అజ్టెక్ ప్రజలు దీని గింజలతో ఘాటైన, చేదైన ‘రాయల్ డ్రింక్’ తయారుచేసుకునేవారు. ఆ తర్వాత 1502లో కొలంబస్ కంటిపడ్డ ఈ నల్లటి గింజలు, 1828 నాటి పారిశ్రామిక విప్లవంతో మనం ఇప్పుడు తినే తియ్యటి చాక్లెట్‌గా రూపాంతరం చెందాయి. మన దేశంలోకి ఇది బ్రిటిష్ వారి కాలంలో తమిళనాడు ద్వారా అడుగుపెట్టింది. అందుకే ఏటా జూలై 7న ప్రపంచమంతా దీని క్రేజ్‌ను సెలబ్రేట్ చేసుకుంటుంది! సో మీ కిష్టమైన వారికి నోరూరించే చాక్లెట్స్ ఇచ్చేయండి..

ఐస్ తో క్రేజీ ఫుడ్ వెరైటీస్..నోరూరించే ఫ్లేవర్స్
ఎండలో చల్లదనం కోసం మాత్రమే కాదు.. ఇప్పుడు ఫైన్ డైనింగ్ ప్రపంచంలో ఐస్ ప్రత్యేక పదార్థంగా మారుతోంది. చెఫ్‌లు ఐస్‌ను రుచి, టెక్స్చర్, ప్రెజెంటేషన్, డైనింగ్ అనుభవాన్ని మెరుగుపరచేందుకు వినియోగిస్తున్నారు. రోజా, పూలు, పండ్లు వంటి ఫ్లేవర్లతో ప్రత్యేక ఐస్ క్యూబ్స్ తయారు చేస్తున్నారు. కర్రీ ఆకులు–కొబ్బరి ఐస్‌క్రీమ్, వాటర్ చెస్ట్‌నట్ డెజర్ట్స్ వంటి వినూత్న వంటకాలతో సంప్రదాయ రుచులకు ఆధునిక టచ్ ఇస్తూ, ప్రతి ముద్దను ప్రత్యేక అనుభూతిగా మార్చుతున్నారు.
ఇండోనేషియాలో ప్రధానికి అపూర్వ స్వాగతం
మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఇండోనేషియా చేరుకున్నారు. ఆయన విమానం ఇండోనేషియా వైమానిక పరిధిలోకి ప్రవేశించగానే, ఆ దేశ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఎఫ్-16, సుఖోయ్-30 యుద్ధ విమానాలు ఆయనకు ఘనస్వాగతం పలికాయి. ఆ ఫైటర్ జెట్స్ మోదీ విమానానికి ఇరువైపులా రక్షణగా (ఎస్కార్ట్‌గా) ఫార్మేషన్‌లో ఎగురుతూ జకార్తా వరకు తోడుగా వచ్చాయి. ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన వ్యూహాత్మక, రక్షణ సంబంధాలకు నిదర్శనంగా నిలిచిన ఈ అద్భుతమైన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

AI లెర్నింగ్ కోసం స్టూడెంట్లవుతున్న సీఈఓలు
టెక్నాలజీ మారుతున్న వేగాన్ని అందుకోవడానికి దశాబ్దాల అనుభవం ఉన్న టాప్ కంపెనీల సీఈఓలు, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు మళ్లీ స్టూడెంట్స్‌గా మారుతున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై అవగాహన పెంచుకోవడానికి వారు గ్లోబల్ బిజినెస్ స్కూల్స్‌లో చేరుతున్నారు. కోట్లాది రూపాయల AI పెట్టుబడులపై సరైన నిర్ణయాలు తీసుకోవడానికి, డేటా ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ సవాళ్లను అధిగమించడానికి ఈ కోర్సులు వీరికి సహాయపడుతున్నాయి. కంపెనీలను భవిష్యత్తుకు సిద్ధం చేయడమే లక్ష్యంగా ఈ సరికొత్త ట్రెండ్ నడుస్తోంది.

లెనిన్ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గళం ?
బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఉరకలేస్తున్న అక్కినేని అఖిల్ ని టాలీవుడ్ స్టార్స్ కూడా సై అంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. లేటెస్ట్ మూవీ , రూరల్ యాక్షన్ డ్రామా లెనిన్ లో క్యారెక్టర్స్ ని పరిచయం చేయడానికి జూనియర్ ఎన్టీఆర్ ఈ మూవీలో భాగమయ్యారు. తన పవర్ ఫుల్ వాయిస్ తో ఆయన ఇంట్రడక్షన్ అదిరిపోయే రేంజ్ లో ఉందని టాక్. జూనియర్ వాయిస్ మూవీకి అదనపు ఆకర్షణ. ఇప్పటికే చెర్రీ, మహేష్ బాబు, నానీ లాంటి స్టార్స్ అఖిల్ కి సపోర్ట్ లో సోషల్ మీడియాలో ఎంకరేజ్ చేస్తున్నారు.

గేమింగ్ సంస్థ X box నుంచి భారీగా లే ఆఫ్ లు
మైక్రోసాఫ్ట్‌కు చెందిన ప్రముఖ గేమింగ్ సంస్థ ఎక్స్‌బాక్స్ (Xbox), తన మొత్తం సిబ్బందిలో 20 శాతం మందిని ( 3,200 మందిని) ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎక్స్‌బాక్స్ సీఈఓ ఆశా శర్మ ఉద్యోగులకు ఒక ఈమెయిల్ పంపారు.ప్రస్తుతం సంస్థ ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పెట్టిన పెట్టుబడిపై భారీగా నష్టాలు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. సంస్థను మళ్లీ లాభాల బాట పట్టించడానికి మేనేజ్‌మెంట్ లేయర్లను తగ్గించడం, వెండార్ ఖర్చులను 50% కోత పెట్టడం వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పలేదని తెలిపారు

రావణ్ ది మావోయిస్టు భావజాలం- పోలీసులు
యూట్యూబర్ రావణ్ నిషేధిత మావోయిస్టు భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్నారని గన్నవరం పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో తెలిపారు. యువతను రెచ్చగొట్లేలా ప్రసంగాలు చేస్తున్నారని అందులో ప్రస్తావించారు. రావణ్ ఫోన్ లో మావోయిస్టు భావజాలం ఉందని, మావోయిస్టు హిడ్మాను ప్రశంసిస్తూ స్పీచ్ లు కూడా ఇచ్చారని గన్నవరం పోలీసుల రిమాండ్ రిపోర్ట్ వెల్లడించింది. దేశ ఐక్యత, సమగ్రతలను దెబ్బ తీసేలా ప్రవర్తిస్తున్నారని ఉపా చట్టం సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి.
మనుషులపై హ్యూమనాయిడ్ రోబో దాడి !
ఇటీవల చైనా, జపాన్‌లలో రోబోల దాడులు పెరుగుతుండగా, తాజాగా ఇండోనేషియాలో ఓ వింత ఘటన వెలుగుచూసింది. అక్కడ ఓ హ్యూమనాయిడ్ రోబో ఒక్కసారిగా మనుషులపై విరుచుకుపడింది. ప్రొఫెషనల్ ఫైటర్‌లా కిక్స్ ఇస్తూ కొందరిని గాయపరిచింది. అయితే, దాడి తర్వాత అది బ్రూస్ లీ తరహాలో ఇచ్చిన ఫైటింగ్ పోజు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.
గుజరాత్ లో పశువుల కాపరిపై సింహం దాడి !
గుజరాత్‌లోని భావ్‌నగర్ జిల్లాలో ఒక సింహం పశువుల కాపరిపై దాడి చేసిన భయంకరమైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆవులకు మేత వేస్తుండగా అకస్మాత్తుగా సింహం అతనిపై పంజా విసిరి, దాదాపు 30 నిమిషాల పాటు వదలకుండా కింద పడేసి పట్టుకుంది. గ్రామస్థులు ఎంత అరిచినా, సింహం అతని చేతిని నోటితో, కాలును పంజాతో గట్టిగా పట్టి ఉంచింది. తీవ్ర గాయాలైన ఆ వ్యక్తిని ఎట్టకేలకు రక్షించి ఆసుపత్రికి తరలించారు.

మైక్రోసాఫ్ట్ లో 4,800 మంది ఉద్యోగుల తొలగింపు
మైక్రోసాఫ్ట్ సంస్థ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపునకు తెరలేపింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాంకేతికతను విస్తృతంగా వాడుతుండటంతో, కంపెనీలో దాదాపు 4,800 మంది ఉద్యోగులను తీసివేయాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ విభాగాలపై దీని ప్రభావం పడనుంది. టెక్ రంగంలో AI హవా పెరుగుతుండటంతో వ్యయాలను తగ్గించుకోవడానికి, వ్యాపార ప్రాధాన్యతలను మార్చుకోవడానికే మైక్రోసాఫ్ట్ ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ లేఆఫ్స్ టెక్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.