← Back to news

అక్రమాస్తుల కేసులో DSPకి షాక్

By డీకే· 7 Jul 2026
అక్రమాస్తుల కేసులో DSPకి షాక్

TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన DSP భీమ్‌రెడ్డికి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. రూ.300 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. దీంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్న ACB అధికారులు, కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం భీమ్‌రెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. అయితే ఆయన తన పలుకుబడిని ఉపయోగించి అరెస్ట్ నుంచి తప్పంచుకుంటున్నారని, ACB అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తడంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు.

More in TG