← Back to news

అక్రమాస్తుల కేసులో DSPకి రిమాండ్

By DK· 7 Jul 2026
అక్రమాస్తుల కేసులో  DSPకి రిమాండ్

TG: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన DSP భీమ్‌రెడ్డికి కోర్టు 14రోజుల రిమాండ్ విధించింది. నాలుగు రోజుల క్రితం భీమ్‌రెడ్డికి చెందిన నివాసాలు, కార్యాలయాలు, ప్రాంతాల్లో ACB అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. సుమారు రూ.300 కోట్లకు పైగా విలువైన అక్రమాస్తులను గుర్తించారు. దీంతో ఆయన్ను ACB అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. న్యాయస్థానం భీమ్‌రెడ్డికి 14రోజుల పాటు రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించారు.

More in TG