Latest

SIR  పేరుతో ఓట్ల తొలగింపునకు BJP కుట్ర
Politics· 3 Jul 2026

SIR పేరుతో ఓట్ల తొలగింపునకు BJP కుట్ర

AP: ‘SIR’ పేరుతో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్‌ ప్రక్రియ వల్ల అర్హులైన లక్షలాది మంది ఓటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న సర్‌ ఓటర్ల ప్రక్రియ కోసం ఫారాలు కూడా పూర్తి చేయలేని BLOలను నియమించడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ పాదయాత్రలు నిర్వహిస్తుందని తెలిపారు.

దోచుకుని బావిలో తోసేశాడు.. 21గంటలు బావిలోనే
Local· 3 Jul 2026

దోచుకుని బావిలో తోసేశాడు.. 21గంటలు బావిలోనే

TG: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌ కిసాన్‌నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మి కూలి పని చేసుకుంటూ జీవిస్తుంది. స్థానిక లేబర్ అడ్డా వద్ద ఓ వ్యక్తి కూలి పని ఉందని ఆమెతో ఒప్పందం చేసుకున్నాడు. మార్గమధ్యలో ఆమెను బెదిరించి బంగారు ఆభరణాలు, రూ.4వేలు లాక్కుని వ్యవసాయ బావిలోకి తోసేశాడు. ఆమె బావిలో ఉన్న తాడును పట్టుకోగా, గమనించిన ఆగంతకుడు ఆ తాడును కూడా కోసేసి వెళ్లిపోయాడు. ఆమె ఈత కొడుతూ మోటారుకున్న పైప్‌ను పట్టుకుని రాత్రంతా ఉండిపోయారు. 21గంటలపాటు బావిలో ఉన్న ఆమెను తెల్లవారుజామున బావి యజమానికి కేకలు వినిపించగా మహిళను బయటకు తీశాడు.

పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం
AP· 3 Jul 2026

పెళ్లి వేడుకలో తీవ్ర విషాదం

AP: ఆనందోత్సాహాల మధ్య జరగాల్సిన పెళ్లి వేడుక విషాదంగా మారింది. మార్కాపురం జిల్లా గిద్దలూరులోని నల్లబండ బజార్‌కు చెందిన ఆవుల వీరక్కకు, కంభంకు చెందిన పాములేటితో శుక్రవారం వివాహం జరగాల్సి ఉంది. వినాయకుడి ఆలయం వద్ద పెళ్లికూతురితో కొబ్బరికాయ కొట్టించి పూజలు నిర్వహించేందుకు పెళ్లి బృందం ఆగింది. అదే సమయంలో లారీ అదుపుతప్పి ఆటోతోపాటు అక్కడున్న వారిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో అలకనంద(19), అంకాలు(20), నగేష్(17), చిన్నారి నాగేశ్వరి మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. పెళ్లికూతురు వీరక్కతోపాటు మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.

సవాల్‌కు సవాల్.. హైదరాబాద్‌లో రాజకీయ రచ్చ
Politics· 3 Jul 2026

సవాల్‌కు సవాల్.. హైదరాబాద్‌లో రాజకీయ రచ్చ

TG: గురుకుల విద్యాసంస్థల టెండర్లలో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్, BRS పార్టీల మధ్య మొదలైన సవాళ్ల రాజకీయం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ కేంద్రంగా తారస్థాయికి చేరింది. BRS సవాల్‌ను స్వీకరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ గన్‌పార్క్ వద్దకు వచ్చారు. మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు, RS ప్రవీణ్‌కుమార్ తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు బయల్దేరగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి పొన్నం ప్రకటించారు. KTR తెలంగాణ భవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ వేసి చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.

ACB రైడ్స్‌లో బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం
TG· 3 Jul 2026

ACB రైడ్స్‌లో బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం

TG: తెలంగాణ పోలీస్‌ కంప్యూటర్‌ సర్వీసెస్‌ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్‌రెడ్డి ACBకి చిక్కాడు. ఆయన తన సర్వీసు కాలంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ACB అధికారులు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేసి ఆయనపై కేసు నమోదు చేశారు. భీమ్‌రెడ్డి నివాసంతోపాటు బంధువులు, స్నేహితులు, బినామీల నివాసాలపై సోదాలు చేపట్టారు. సుమారు రూ.300 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ACB అధికారులు గుర్తించారు.

కేంద్రం కొత్త స్కీమ్‌పై తెలంగాణ క్యాబినెట్ ఫైర్
TG· 3 Jul 2026

కేంద్రం కొత్త స్కీమ్‌పై తెలంగాణ క్యాబినెట్ ఫైర్

TG: రాష్ట్రాలను సంప్రదించకుండానే కేంద్రం తెచ్చిన VB G రాంజీ చట్టంలో పలు నిబంధనలపై క్యాబినెట్ నిరసన తెలిపినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంపై ఆర్థిక భారం మోపేలా, ఏకపక్షంగా VB G రాంజీని అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం రాజ్యాంగ, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు భిన్నంగా, ప్రజలు, కూలీల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఉపాధి హామీ పథకం పేరును మార్చి VB G రాంజీ పేరిట కొత్త పథకాన్ని తీసుకొచ్చిందని ఫైరయ్యారు. కొత్త చట్టంలోని నిబంధనలపై సుప్రీంకోర్టుకు వెళ్తామని మంత్రి స్పష్టం చేశారు.

హీట్ వేవ్ కి ఉపశమనం ఈ మోడ్రన్ టెక్నాలజీ▶
Technology· 2 Jul 2026

హీట్ వేవ్ కి ఉపశమనం ఈ మోడ్రన్ టెక్నాలజీ

మీరు చూస్తున్న ఈ వర్షం కృత్రిమ వర్షం కాదు.. భగ భగ మండుతున్న ఎండలనుంచి తట్టుకోడానికి, గ్లోబల్ వార్మింగ్ తగ్గించడానికి చైనా తరహా లేటెస్ట్ టెక్నాలజీ. ప్రపంచ వ్యాప్తంగా భరించలేనంత హీట్ వేవ్ కొనసాగుతున్నందువల్ల నగరాలు, బహుళ అంతస్థుల్లో ఉన్న ప్రజలు వేడిని తట్టుకోడానికి అగ్ర దేశాల్లో అమల్లోకి వస్తున్న ఆధునిక పద్ధతులు.. తక్షణ ఉపశమనానికీ, కొంత వేడి తగ్గడానికి ఇది బెటర్ ఐడియానే. కానీ నీరు చిమ్మడానికి అసలు నీళ్లుండాలికదా... తాగునీటికే కరువవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఏర్పాట్లు మనకు సాధ్యమేనా?

క్యాప్ జెమినీ క్యాంపస్  డేకేర్ లో ఆయాల అరాచకం
News· 2 Jul 2026

క్యాప్ జెమినీ క్యాంపస్ డేకేర్ లో ఆయాల అరాచకం

బెంగళూరులోని క్యాప్‌జెమినీ క్యాంపస్‌లోని డేకేర్ కేంద్రంలో మూడేళ్ల చిన్నారులపై అమానుష వేధింపుల ఘటన కలకలం రేపింది. ఏడుస్తున్న చిన్నారులను వాషింగ్ మెషీన్‌లో కూర్చోబెట్టడం, టాయిలెట్ జెట్‌తో నీరు చిమ్మడం, బాత్రూమ్‌లో బంధించడం వంటి దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఘటనపై ఐదుగురు ఆయాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. డేకేర్ కేంద్రాన్ని క్యాప్‌జెమినీ తాత్కాలికంగా మూసివేసి, అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపింది.

ముంబైలో కుండపోత- 3 రోజుల్లో ముగ్గురి బలి▶
News· 2 Jul 2026

ముంబైలో కుండపోత- 3 రోజుల్లో ముగ్గురి బలి

గత మూడు రోజులుగా ముంబై వ్యాప్తంగా కురుస్తున్న అకాల భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. చండీవలిలో తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడి వృద్ధుడు, చెంబూర్‌లో పాఠశాల బస్సుపై చెట్టు కూలి విద్యార్థి, వాకేశ్వర్‌లో భవనం బాల్కనీ కూలి ఒకరు మృతి చెందారు. పలు ప్రాంతాల్లో 200 మిమీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రైలు, రోడ్డు రవాణా పూర్తిగా స్తంభించింది. వాతావరణ శాఖ ముంబైకి 'రెడ్ అలర్ట్' జారీ చేసింది.

యువశక్తిలో  మనమే ఫస్ట్.. కానీ తర్వాతేంటి?
News· 2 Jul 2026

యువశక్తిలో మనమే ఫస్ట్.. కానీ తర్వాతేంటి?

భారతదేశానికి ఉన్న అతిపెద్ద బలం 'డెమోగ్రాఫిక్ డివిడెండ్' (యువశక్తి). అయితే, ఈ అదృష్టం జీవితకాలం ఉండదు, మనకు కేవలం మరో 15 ఏళ్ల సమయం మాత్రమే మిగిలి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు! ప్రస్తుతం భారత్‌లో యువత, శ్రామిక శక్తి (Working-age population) ఎక్కువగా ఉండటం వల్ల ఆర్థికంగా దూసుకుపోయే క్రేజీ అవకాశం ఉంది. కానీ, రాబోయే 15 ఏళ్లలో దేశ జనాభా నెమ్మదిగా ఓల్డేజ్ (Ageing) వైపు అడుగులు వేయడం స్టార్ట్ అవుతుంది. ఈ లోపే మన యువతకు సరైన నైపుణ్యాలు (Skills), నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించకపోతే.. చైనా తరహాలోనే మనం కూడా 'ధనవంతులం అవ్వకముందే ముసలివాళ్లం' అయిపోయే ప్రమాదం ఉంది.

వారణాసి పై జక్కన్న క్రేజీ అప్డేట్!
Cinema· 2 Jul 2026

వారణాసి పై జక్కన్న క్రేజీ అప్డేట్!

చిత్ర పరిశ్రమలో మోస్ట్ ఎవైటెడ్ కాంబినేషన్ అయిన ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల సినిమాపై ఒక క్రేజీ అప్‌డేట్ బయటకు వచ్చింది. ప్యారిస్‌లో జరిగిన ఒక ఇంటర్నేషనల్ ఈవెంట్‌లో జక్కన్న స్వయంగా ఈ సినిమా స్టేటస్‌ను రివీల్ చేస్తూ, షూటింగ్ కేవలం 80 రోజులు మాత్రమే బాకీ ఉందని ప్రకటించారు! సినిమాలోని హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు, భారీ షెడ్యూల్స్ అన్నీ ఇప్పటికే కంప్లీట్ అయిపోయాయని, కేవలం టాకీ పార్ట్ మాత్రమే మిగిలి ఉందని ఆయన క్లారిటీ ఇచ్చారు. దాంతో ఈ మోస్ట్ పవర్‌ఫుల్ టైమ్-ట్రావెల్ అడ్వెంచర్ మూవీ అంచనాలు ఒక్కసారిగా ఆకాశాన్ని తాకాయి.

ఇండియన్ ఐటీ సెక్టర్ లో  భారీ నష్టాలు
Politics· 2 Jul 2026

ఇండియన్ ఐటీ సెక్టర్ లో భారీ నష్టాలు

ఒక కొత్త నివేదిక ప్రకారం, భారతదేశంలోని టాప్ 10 ఐటీ కంపెనీలు తమ గరిష్ట విలువల నుండి దాదాపు ₹19.28 లక్షల కోట్ల మార్కెట్ విలువను కోల్పోయాయి. జెనరేటివ్ ఏఐ (GenAI) వల్ల సాంప్రదాయ ఐటీ సేవలకు ముప్పు వాటిల్లుతుందనే భయాలు, బలహీనమైన అంతర్జాతీయ డిమాండ్ కారణంగా ఇన్వెస్టర్లు ఐటీ షేర్లను భారీగా అమ్మేశారు. కేవలం టిసిఎస్ (TCS) కంపెనీయే తన 2024 గరిష్టం నుండి 55% పడిపోయి, సుమారు ₹9 లక్షల కోట్లు నష్టపోయింది.

తెలంగాణ పోలీస్ శాఖ బిగ్ యాక్షన్!
Politics· 2 Jul 2026

తెలంగాణ పోలీస్ శాఖ బిగ్ యాక్షన్!

తెలంగాణ పోలీస్ శాఖ సెక్యూరిటీ రివ్యూలో భాగంగా షాకింగ్ డెసిషన్ తీసుకుంది. 20 మంది మాజీ DGPలతో పాటు ప్రస్తుతం కీలక పోస్టుల్లో ఉన్న ఇంటెలిజెన్స్ చీఫ్, హైదరాబాద్ CP లాంటి ఉన్నతాధికారుల బుల్లెట్ ప్రూఫ్ వెహికల్స్, ఎస్కార్ట్‌లను పూర్తిగా తొలగించింది. కేవలం పోలీస్ అధికారులకే కాకుండా. రాష్ట్రంలోని పలువురు పొలిటికల్ లీడర్ల గన్‌మెన్ల సంఖ్యను కూడా భారీగా తగ్గించి కేవలం 'వన్ ప్లస్ వన్' కే పరిమితం చేసింది.

కస్టడీలోనే ప్రశ్న రావణ్ నిరాహారదీక్ష!
Politics· 2 Jul 2026

కస్టడీలోనే ప్రశ్న రావణ్ నిరాహారదీక్ష!

పోలీస్ కస్టడీలో ఉన్న ప్రశ్న రావణ్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఆయన కస్టడీలోనే అమరణ నిరాహార దీక్ష ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పోలీస్ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. అయితే ప్రశ్న రావణ్ ఎందుకు దీక్షకు దిగారు? అసలు అక్కడ ఏం జరిగింది? అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

ఇళయరాజా పాటలు బ్యాన్!
Cinema· 2 Jul 2026

ఇళయరాజా పాటలు బ్యాన్!

మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. 1976 నుండి వచ్చిన 134 సినిమాల పాటలను ఇకపై ఎక్కడా ప్లే చేయకుండా ఇళయరాజాపై కోర్టు తాత్కాలికంగా స్టే విధించింది. ఆ సినిమాల పాటల పూర్తి కాపీరైట్స్ అన్నీ ప్రొడ్యూసర్స్ కే చెందుతాయని, ఇళయరాజాకు కాదని కోర్టు స్పష్టం చేసింది. 'సరిగమ ఇండియా' కంపెనీ వేసిన కేసు వల్లే కోర్టు ఈ సంచలన తీర్పు ఇచ్చింది. దీంతో ఆ 134 సినిమాల సాంగ్స్ వివాదంలో పడ్డాయి.

టీచర్స్ కి గుడ్ న్యూస్!
News· 2 Jul 2026

టీచర్స్ కి గుడ్ న్యూస్!

తెలంగాణ ప్రభుత్వం స్కూల్స్ అండ్ కాలేజ్ స్టాఫ్‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో పిల్లలతో పాటు ఇకపై ఉపాధ్యాయ సిబ్బందికీ బ్రేక్‌ఫాస్ట్, మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలని నిశ్చయించింది. ఈ మేరకు తెలంగాణ క్యాబినెట్ కీలక ఆమోదం తెలిపింది. కాగా, గత నెలలోనే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 430 ప్రభుత్వ కాలేజీల్లో మధ్యాహ్న భోజన పథకం సక్సెస్‌ఫుల్‌గా అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

జననాయగన్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే !
Cinema· 2 Jul 2026

జననాయగన్ మూవీ రిలీజ్ ఎప్పుడంటే !

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలపతి విజయ్ చివరి చిత్రం 'జననాయగన్' (Thalapathy 69) విడుదలకు సిద్ధమవుతోంది. సెన్సార్ వివాదాల వల్ల ఆలస్యమైన ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌కు తాజాగా సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. హెచ్. వినోద్ దర్శకత్వంలో, అనిరుధ్ సంగీతంలో రూపొందిన ఈ చిత్రం జూలై (2026) చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రపంచవ్యాప్తంగా ఐదు భాషల్లో విడుదలయ్యే అవకాశం ఉంది.

బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ రిటైర్మెంట్ ప్రకటన!
Cinema· 2 Jul 2026

బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ రిటైర్మెంట్ ప్రకటన!

బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు మహేష్ భట్ (77) చిత్ర దర్శకత్వానికి శాశ్వతంగా గుడ్ బై చెప్పారు. తన సుదీర్ఘ కెరీర్‌లో 'అర్థ్', 'సారాంశ్', 'సడక్', 'జఖ్మ్' వంటి 47 క్లాసిక్ చిత్రాలను ఆయన తెరకెక్కించారు. ఇకపై తాను సినిమాలకు దర్శకత్వం వహించబోనని స్పష్టం చేస్తూ, ప్రస్తుతం చిత్ర నిర్మాణ రంగం మరియు నాటకరంగం (థియేటర్) పైనే దృష్టి పెడతానని భట్ ప్రకటించారు.

తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ రెడీ టు లాంచ్
Technology· 2 Jul 2026

తొలి ప్రైవేట్ ఆర్బిటాల్ రాకెట్ రెడీ టు లాంచ్

హైదరాబాద్ స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ తమ 'విక్రమ్-1' రాకెట్ తొలి ఆర్బిటల్ ప్రయోగానికి సిద్ధమైంది. దీనికి ‘మిషన్ ఆగమన్’ అని పేరు పెట్టారు. జూలై 12 - ఆగస్టు 4, 2026 మధ్య శ్రీహరికోట (ISRO) నుండి దీనిని ప్రయోగిస్తారు. పూర్తిగా కార్బన్ బాడీ, 3D-ప్రింటెడ్ ఇంజన్లతో తయారైన ఈ రాకెట్, 350 కేజీల చిన్న ఉపగ్రహాలను అంతరిక్షంలోకి చేరవేయగలదు. ఇది భారతదేశపు మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ప్రయోగం.

బైక్ రైడర్స్‌కు అలర్ట్!▶
Viral· 2 Jul 2026

బైక్ రైడర్స్‌కు అలర్ట్!

గుజరాత్‌లోని జునాగఢ్‌లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వర్షాల వల్ల రోడ్లపై ఎక్కడ గుంతలు ఉన్నాయో అస్సలు కనిపించవు కాబట్టి వాహనదారులు ఎప్పుడూ ఫుల్ ఫేస్ హెల్మెట్ ధరించాలి. బైక్ నడిపేటప్పుడు రోడ్డుపైనే పూర్తిగా దృష్టి పెట్టి చాలా జాగ్రత్తగా ప్రయాణించాలి. వర్షం పడేటప్పుడు హెల్మెట్ గ్లాస్ క్లియర్ గా ఉంచుకోవడం, స్పీడ్ కంట్రోల్ లో పెట్టుకోవడం వల్ల ప్రమాదాల నుండి సేఫ్ గా ఉండొచ్చు. వర్షాకాలం ముగిసేవరకు రోడ్లపై ఈ జాగ్రత్తలు తప్పనిసరి.

ఆక్రమణల నుంచి వికారాబాద్ అటవీ భూములకు రక్షణ !
News· 2 Jul 2026

ఆక్రమణల నుంచి వికారాబాద్ అటవీ భూములకు రక్షణ !

వికారాబాద్ జిల్లా పరిగి పరిధిలో ఆక్రమణకు గురైన అటవీ భూములను అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఇక్కడ దాదాపు 200 ఎకరాల దట్టమైన అడవి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. ఇప్పటివరకు 80 ఆక్రమణ ఉదంతాలను కనుగొని, 20 కేసులు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న స్థలాలను నేవీ రాడార్ (VLF) ప్రాజెక్టు పరిహార అటవీకరణ కోసం ఉపయోగించ నున్నారు. కొత్త డీఎఫ్ఓ విశాల్ బాతులా నియామకంతో ఈ చర్యలు మరింత వేగవంతమయ్యాయి.