SIR పేరుతో ఓట్ల తొలగింపునకు BJP కుట్ర

AP: ‘SIR’ పేరుతో బీజేపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు అనుకూలమైన ఓట్లు తొలగించేందుకు కుట్రలు చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆరోపించారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సర్ ప్రక్రియ వల్ల అర్హులైన లక్షలాది మంది ఓటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న సర్ ఓటర్ల ప్రక్రియ కోసం ఫారాలు కూడా పూర్తి చేయలేని BLOలను నియమించడం దారుణమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకిస్తూ ఆగస్టు 6 నుంచి 15 వరకు సీపీఐ పాదయాత్రలు నిర్వహిస్తుందని తెలిపారు.