దోచుకుని బావిలో తోసేశాడు.. 21గంటలు బావిలోనే

TG: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ కిసాన్‌నగర్‌కు చెందిన గంగాధర లక్ష్మి కూలి పని చేసుకుంటూ జీవిస్తుంది. స్థానిక లేబర్ అడ్డా వద్ద ఓ వ్యక్తి కూలి పని ఉందని ఆమెతో ఒప్పందం చేసుకున్నాడు. మార్గమధ్యలో ఆమెను బెదిరించి బంగారు ఆభరణాలు, రూ.4వేలు లాక్కుని వ్యవసాయ బావిలోకి తోసేశాడు. ఆమె బావిలో ఉన్న తాడును పట్టుకోగా, గమనించిన ఆగంతకుడు ఆ తాడును కూడా కోసేసి వెళ్లిపోయాడు. ఆమె ఈత కొడుతూ మోటారుకున్న పైప్‌ను పట్టుకుని రాత్రంతా ఉండిపోయారు. 21గంటలపాటు బావిలో ఉన్న ఆమెను తెల్లవారుజామున బావి యజమానికి కేకలు వినిపించగా మహిళను బయటకు తీశాడు.



