సవాల్‌కు సవాల్.. హైదరాబాద్‌లో రాజకీయ రచ్చ

TG: గురుకుల విద్యాసంస్థల టెండర్లలో అవినీతి ఆరోపణలపై కాంగ్రెస్, BRS పార్టీల మధ్య మొదలైన సవాళ్ల రాజకీయం హైదరాబాద్‌లోని గన్‌పార్క్ కేంద్రంగా తారస్థాయికి చేరింది. BRS సవాల్‌ను స్వీకరించిన మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్, అజారుద్దీన్ గన్‌పార్క్ వద్దకు వచ్చారు. మరోవైపు మాజీ మంత్రి హరీశ్ రావు, RS ప్రవీణ్‌కుమార్ తెలంగాణ భవన్ నుంచి గన్‌పార్క్‌కు బయల్దేరగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తానని మంత్రి పొన్నం ప్రకటించారు. KTR తెలంగాణ భవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ వేసి చర్చకు రావాలంటూ సవాల్ విసిరారు.