ACB రైడ్స్‌లో బయటపడ్డ కోట్ల సామ్రాజ్యం

TG: తెలంగాణ పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా విధులు నిర్వహిస్తున్న సంకిరెడ్డి భీమ్‌రెడ్డి ACBకి చిక్కాడు. ఆయన తన సర్వీసు కాలంలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టారనే పక్కా సమాచారంతో ACB అధికారులు ఏకకాలంలో 16 చోట్ల సోదాలు చేసి ఆయనపై కేసు నమోదు చేశారు. భీమ్‌రెడ్డి నివాసంతోపాటు బంధువులు, స్నేహితులు, బినామీల నివాసాలపై సోదాలు చేపట్టారు. సుమారు రూ.300 కోట్లకుపైగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ACB అధికారులు గుర్తించారు.



