Latest

మూడు పెళ్లిళ్ల ట్రాప్.. రైల్వే ఉద్యోగి సూసైడ్
AP: తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతానికి చెందిన రవి రైల్వే ఉద్యోగి. మహిళా సంఘం నాయకురాలిగా చలామణి అవుతున్న ఉషారాణి మ్యాట్రిమోని సైట్ ద్వారా రవికి పరిచయమైంది. మాయమాటలతో రవిని ట్రాప్ చేసి మూడేళ్లుగా అతనితో సహజీవనం సాగించింది. రవి రైల్వే రికార్డులో, అతని రూ.1కోటి ఇన్సూరెన్స్ పాలసీకి నామినిగా పెట్టాలని ఆమె ఒత్తిడి చేసింది. రవి రేణిగుంట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమెకు మూడు పెళ్లిళ్లు అయినట్లు గుర్తించారు. మహిళా సంఘం, CPI నాయకులతో మాట్లాడి రాజీ చేసుకోవాలని పోలీసులు రవికి చెప్పినట్లు సమాచారం. తనకు న్యాయం జరగలేదని రవి సూసైడ్ చేసుకున్నాడు.

హీరో జయం రవి చుట్టూ మరో వివాదం.. వర్కర్లను కట్టేసి టార్చర్?
కోలీవుడ్ స్టార్ జయం రవి మరో పెద్ద కాంట్రవర్సీలో చిక్కుకున్నారు. ఇంట్లో దొంగతనం జరిగిందనే అనుమానంతో తన దగ్గర పనిచేసే ఇద్దరు మహిళలను, ఒక అబ్బాయిని రవి కట్టేసినట్లు ఎలిగేషన్స్ వచ్చాయి. ఇంట్లోనే వాళ్లను బంధించడంతో. ఒక మహిళా వర్కర్ భర్త పోలీసులకు కంప్లైంట్ చేశాడు. రంగంలోకి దిగిన నీలాంగరై పోలీసులు రవి ఇంటికి వెళ్లి వాళ్లను రెస్క్యూ చేశారు. దొంగతనం జరిగితే లీగల్‌గా కంప్లైంట్ ఇవ్వాలి కానీ, ఇలా కట్టేయడం కరెక్ట్ కాదని పోలీసులు యాక్టర్‌కి వార్నింగ్ ఇచ్చారు.

భారతీయురాలిగానే చనిపోవాలని ఉంది
AP: బాపట్ల జిల్లా చినగంజాం మండలం చింతగుంపలకు చెందిన కొండ్రుగుంట మహాలక్ష్మమ్మ, నాగభూషణం దంపతుల కుమారుడు బుచ్చయ్యచౌదరి అమెరికాలో డాక్టర్‌గా స్థిరపడ్డారు. మహాలక్ష్మమ్మకు 2000 సంవత్సరంలో అమెరికా పౌరసత్వం లభించింది. ఆమె తన సొంతూరులోనే భారత పౌరురాలిగా తుదిశ్వాస విడవాలని కోరిక ఉంది. అమెరికా పౌరసత్వం వదులుకున్న ఆమె, భారత పౌరసత్వం కోసం ఆన్‌లైన్ ద్వారా గవర్నమెంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఆమె దరఖాస్తు బాపట్ల జిల్లా కలెక్టర్ దగ్గరకు చేరింది. అమెరికా నుంచి క్లియరెన్స్ రాగానే భారత పౌరురాలిగా హోదా దక్కుతుందని కలెక్టర్ తెలిపారు.

రామ్ చరణ్ పై PM మోదీ ప్రశంసలు.. ట్విట్టర్‌లో చిరంజీవి ప్రౌడ్ పోస్ట్!
రామ్ చరణ్, PM మోదీల ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఒక నేషనల్ ఈవెంట్‌లో మోదీ చరణ్‌ను “న్యూ ఏజ్ మెగాస్టార్” అని సంబోధించారు. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్‌లో స్పందిస్తూ. “పుత్రోత్సాహం తండ్రికి కొడుకు పుట్టినప్పుడు కలగదు, జనాలు పొగిడినప్పుడే కలుగుతుంది” అనే సుమతీ శతక పద్యాన్ని గుర్తు చేసుకున్నారు. ఇంత పెద్ద ప్రతిష్ఠాత్మక వేదికపై చరణ్‌కు దక్కిన రెస్పెక్ట్, గౌరవం చూసి ఒక తండ్రిగా చాలా ప్రౌడ్‌గా ఉందంటూ చిరు ట్వీట్ చేశారు.

HYD ప్రయాణికులకు గుడ్‌న్యూస్
TG: కాలుష్య రహిత మహానగరమే లక్ష్యంగా TGSRTC మరో కీలక అడుగు వేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి మరో 37 అత్యాధునిక ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నట్లు తెలిపింది. ఇప్పటికే కూకట్‌పల్లి డిపో పరిధిలో ప్రారంభించిన 23 ఎలక్ట్రిక్ బస్సులు ఐదు వేర్వేరు మార్గాల్లో విజయవంతంగా నడుస్తూ ప్రయాణికుల నుంచి విశేష ఆదరణ పొందుతుంది. అధికారులు ఈ ఎలక్ట్రిక్ బస్సుల నెట్‌వర్క్‌ను నగరం నలువైపులా విస్తరిస్తున్నారు. తాజాగా 37 బస్సులు తోడైతే నగరంలో కాలుష్య నివారణకు మరింత తోడ్పాటు లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

విజయశాంతి రేర్ రికార్డ్.. ఇండస్ట్రీలోకి వచ్చి 45 ఏళ్ళు!
తెలుగు సినిమా 'లేడీ అమితాబ్' విజయశాంతి హీరోయిన్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి నేటితో 45 ఏళ్లు పూర్తయింది. సూపర్ స్టార్ కృష్ణ ‘కిలాడి కృష్ణుడు’తో కెరీర్ స్టార్ట్ చేసిన ఆమె, రీసెంట్‌గా కృష్ణ కొడుకు మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు 200 పైగా సినిమాల్లో నటించారు. టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘నేటి భారతం’, ‘ప్రతిఘటన’ చిత్రాలు ఆమెను విప్లవాత్మక నటిగా నిలబెట్టాయి. ‘కర్తవ్యం’ సినిమాకు నేషనల్ అవార్డ్ అందుకున్న విజయశాంతి, ‘ఒసేయ్ రాములమ్మ’తో రికార్డ్ క్రియేట్ చేశారు. గ్లామర్, యాక్షన్ చిత్రాలతో హీరోలతో సమానంగా మాస్ ఫాలోయింగ్, హైయెస్ట్ రెమ్యునరేషన్ అందుకున్న ఏకైక భారతీయ నటిగా ఆమె చరిత్ర సృష్టించారు.
CI నాగరాజుపై ‘సిట్’ షాకింగ్ రిపోర్ట్!
విజయవాడ గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో ‘సిట్’ అధికారులు షాకింగ్ విషయాలు బయటపెట్టారు. సాయికృష్ణను పోలీస్ స్టేషన్ లాకప్‌లోనే కొట్టి చంపేశారని CI నాగరాజుపై ఇచ్చిన అఫీషియల్ రిపోర్టులో రాశారు. ఆ తర్వాత బాడీని, CCTV ఫుటేజ్‌ను కూడా మాయం చేసినట్లు కోర్టుకు చెప్పారు. అరెస్ట్ అయిన CI నాగరాజును పోలీసులు భారీ బందోబస్తుతో విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్‌కు మెడికల్ చెకప్ కోసం తీసుకెళ్లారు. ఈ టెస్టులు అయిపోయాక ఆయన్ను జడ్జి ముందు ప్రెజెంట్ చేసి, జైలుకు షిఫ్ట్ చేయనున్నారు.
స్టూడెంట్స్‌తో CM విజయ్ రేర్ గ్రూప్ ఫోటో!
తమిళనాడులో పదో తరగతి, ఇంటర్ లో టాప్ మార్కులు సాధించిన స్టూడెంట్స్‌ను సన్మానించేందుకు ఒక గ్రాండ్ ఈవెంట్ జరిగింది. ఈ ప్రోగ్రామ్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన CM విజయ్ స్టూడెంట్స్ ను అప్రిషియేట్ చేశారు. ఈ సందర్భంగా ఆడిటోరియంలో కూర్చున్న స్టూడెంట్స్ అందరి మధ్యలో కూర్చొని విజయ్ ఒక మెమరబుల్ గ్రూప్ ఫోటో దిగారు. ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది.

అస్థిరతకు అమెరికానే కారణం: ఇరాన్
ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపుల వల్లే ప్రాంతీయ అస్థిరత ఏర్పడుతోందన్న అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి ఇస్మాయిల్ బఘాయీ ఖండించారు. అమెరికా సైనికవాదం, జోక్యం చేసుకునే విధానం, ఇజ్రాయెల్‌కు మద్దతు ఇవ్వడమే మధ్యప్రాచ్యంలో శాంతికి ప్రధాన అడ్డంకులని ఆయన అన్నారు.
ఇందిరా భవన్‌లో యాక్షన్ లోకి దిగిన మంత్రి పొన్నం ప్రభాకర్!
గాంధీ భవన్‌లోని ఇందిరా భవన్‌లో జరిగిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ప్రజల నుంచి స్వయంగా వినతిపత్రాలు తీసుకొని, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా భూ సమస్యలు, డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఉద్యోగాలకు సంబంధించిన కంప్లైంట్స్‌పై అధికారులతో వెంటనే ఫోన్‌లో మాట్లాడి, సాల్వ్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. ప్రజల ప్రాబ్లమ్స్‌కి ఇన్స్టంట్‌గా రెస్పాండ్ అవుతూ సొల్యూషన్స్ చూపించారు.

తుని చిన్నారి మిస్సింగ్ కేసుపై హైకోర్ట్ సీరియస్
AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసుపై హైకోర్ట్ సీరియస్ అయింది. పాప ఆచూకీ కనుగొనేందుకు తీసుకున్న చర్యల వివరాలు, ప్రస్తుత దర్యాప్తు పరిస్థితిపై సమగ్ర స్థాయి నివేదిక ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. మిస్సైన పిల్లల విషయంలో సుప్రీంకోర్టు నిర్దేశించిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను పాటించారా లేదా తెలపాలని కోరింది. చిన్నారి ఆచూకీ కనుగొనడంలో పోలీసులు విఫలమయ్యారని లాయర్ శ్రీకాంత్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్ట్ ఈ ఆదేశాలను జారీ చేసింది.
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల క్యూట్ వైరల్ వీడియో!
మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్‌ల క్యూట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ సూపర్ హిట్ 'పెద్ది' మూవీ సక్సెస్ మీట్‌లో చరణ్‌ను చూపిస్తూ.. "న్యూ ఏజ్ మెగాస్టార్ అయిన నా కొడుకును ముందుంచి, నేను వెనక ఉండడమే కరెక్ట్" అంటూ చిరు పుత్రోత్సాహాన్ని ఎంజాయ్ చేశారు. 'చరణ్-జీవి' అంటూ మురిసిపోయారు. తండ్రీకొడుకుల ఈ అద్భుతమైన క్యూట్ మూమెంట్‌ని చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. CI నాగరాజుపై సిట్ సీరియస్
AP: విజయవాడ సాయికృష్ణ మిస్సింగ్ కేసులో అరెస్టైన CI నాగరాజును సిట్ సుదీర్ఘంగా విచారిస్తోంది. అధికారులు సాయికృష్ణ అదృశ్యంపై ప్రశ్నల వర్షం కురిపించారు. CI నాగరాజు నోరు మెదపకపోవడం, సమాధానాలు దాటవేస్తుండటంతో ఈ కేసు మరింత మిస్టరీగా మారింది. సీఐ నుంచి ఎలాంటి సమాధానం రాకపోవడం, సాయికృష్ణ ఆచూకీ దొరకకపోవడం, CC ఫుటేజ్ మాయమవ్వడం వంటి పరిణామాలు ఇది లాకప్‌డెత్ అన్న అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. నాగరాజును నేడు కోర్టులో ప్రవేశపెట్టనుండడంతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

రూ.158 కోట్ల భారీ రైస్‌మిల్ కుంభకోణం గుట్టురట్టు
TG: కరీంనగర్ కట్టరాంపూర్ భగత్‌నగర్‌కు చెందిన సౌభాగ్య లక్ష్మి రైస్ ఇండస్ట్రీస్ మేనేజర్ బండారి మారుతి, పార్ట్‌నర్ అంజయ్య వీరిద్దరూ పౌరసరపరాల జిల్లా మేనేజర్ ముప్పిడి శ్రీకాంత్‌తో CMR ధాన్యం ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. ప్రభుత్వానికి 2023 సంవత్సరంలో ఇవ్వాల్సిన 3116.360 మెట్రిక్ టన్నులు, 2024లో 2119.125 మెట్రిక్ టన్నుల బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉంది. తప్పించుకు తిరుగుతున్న ఇద్దరిని సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అక్రమ విక్రయాలకు పాల్పడి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ.158కోట్ల ప్రభుత్వ సొమ్మును పక్కదారి పట్టించినట్లు పోలీసులు నిర్ధారించారు.

పెద్దపులి సంచారం.. భయం భయం
AP: ఏలూరు జిల్లాలో సంచరిస్తున్న పెద్దపులి బుట్టాయగూడెం మండలంలోకి రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నిమ్మలగూడెం శివారు పాలకుంట చెరువు వద్ద పులి దాడిలో 2ఆవులు మృతి చెందాయి. అటవీ ప్రాంతాల్లో ఎవరూ ఒంటరిగా తిరగవద్దని అటవీ అధికారుల సూచించారు. పులికి అమర్చిన రేడియో కాలర్‌తో కదలికలను సిబ్బంది పరిశీలిస్తున్నారు. పులిని పట్టుకునేందుకు మత్తుమందు, బోన్లు సిద్ధం చేశారు. సమీప అటవీ ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.

YCP నేతపై హత్యాయత్నం.. తాడిపత్రిలో ఉద్రిక్తత
AP: అనంతపురం జిల్లా తాడిపత్రి PS దగ్గర YCP నేత గంగులకుంట కేశవరెడ్డిపై కొంతమంది దాడి చేశారు. ఈ దాడిలో ఆయనకు తీవ్రగాయాలు అవడంతో స్థానికులు హాస్పిటల్‌కు తరలించగా ఆస్పత్రి వద్ద కూడా కేశవరెడ్డిపై దాడి జరిగింది. ఈ క్రమంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి, JC ప్రభాకర్ రెడ్డి వర్గీయులు పరస్పరం దాడులు చేసుకున్నారు. దీంతో ఓ స్పార్పియో వాహనం, ఆస్పత్రి అద్దాలు ధ్వంసమయ్యాయి. తాడిపత్రిలో JC, కేతిరెడ్డి వర్గాల మధ్య చాలా కాలంగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.

హత్య చేసి ఆపై అంత్యక్రియల్లో పాల్గొని
TG: మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన వృద్ధురాలు దోమకొండ సాయవ్వ ఈనెల 17న అనారోగ్యంతో మృతి చెందిందని అంత్యక్రియలు చేశారు. ఆమె మెడపై గాయం కనిపించడం, బంగారం కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సాయవ్వ రెండో కుమార్తె లక్ష్మి పెద్ద కుమారుడు విశాల్‌పై అనుమానం రాగా, అతడిని విచారించారు. అతడు హత్య చేసినట్లు అంగీకరించాడు. విశాల్, తన ఫ్రెండ్ ప్రశాంత్‌తో కలిసి సాయవ్వకు గొంతు నులిపి హత్య చేశారు. బంగారు ఉంగరం, చెవికమ్మలు, రూ.7,000 తీసుకొని హైదరాబాద్ పారిపోయారు. తర్వాత అమ్మమ్మ అంత్యక్రియల్లోనూ పాల్గొన్నట్లు CI సైదా తెలిపారు.

మత్తు ఇంజెక్షన్ తీసుకుని డాక్టర్ మృతి
TG: APలోని విశాఖపట్నానికి చెందిన మొహ్మద్ ఇమాయతుల్లా, అతని కుమారుడు ఖాసిం (27) HYD పాతబస్తీలోని యాకుత్‌పురాలో నివాసముంటున్నారు. డాక్టర్ ఖాసీం మల్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో నైట్ డ్యూటీ చేస్తున్నాడు. రాత్రి విశ్రాంతికని ఆసుపత్రిలోని తన గదిలోకెళ్లి గడియపెట్టుకున్నాడు. ఖాసీం ఎంతసేపటికీ బయటకు రావడం లేదని ఆసుపత్రి సిబ్బంది తలుపులు విరగ్గొట్టారు. అప్పటికే ఆయన మృతి చెంది ఉన్నట్లు గుర్తించారు. తనకు నిద్ర పట్టడం లేదని ఖాసిం చెప్పేవారని ఆయన తండ్రి పోలీసులకు తెలిపారు. నిద్ర కోసం మాత్రలతోపాటు మత్తు ఇంజెక్షన్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.

నలుగురు దారుణ హత్య... వీడని మిస్టరీ
TG: నల్గొండ పట్టణంలోని సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో నలుగురు కుటుంబసభ్యులు దారుణ హత్య మిస్టరీ వీడడం లేదు. నాలుగు హత్యలు ప్లాన్ ప్రకారమే జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. నలుగురి హత్యలకు సంబంధించి ఇద్దరు లేదా ముగ్గురు వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. తండ్రి సుల్తాన్‌కు ఆరు కత్తిపోట్లు, కుమారుడు ముజామ్మిల్‌కు 12, హసీనాకు 8, కూతురు అప్సర్ శరీరంపై తొమ్మిది కత్తిపోట్లు ఉన్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. కానీ హత్యలకు గల కారణాలు మాత్రం తెలియరాలేదు. ఘటనకు సంబంధించిన ఆనవాళ్లు సేకరించడం పోలీసులకు సవాల్‌గా మారింది.

ఉద్యమానికి సిద్ధం కావాలి: AP JAC
AP: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు జాప్యం లేకుండా మధ్యంతర భృతి ప్రకటించాలని, 12వ PRC కమిషనర్‌ను నియమించాలని AP JAC ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. విజయవాడలో ప్రభుత్వ ఉద్యోగుల JAC, అనుబంధ ఉద్యోగ సంఘాల రాష్ట్ర, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్ DAలను విడుదల చేయాలని, 11వ PRC ఎరియర్స్ తదితర ఆర్థికపరమైన సమస్యలు, పెండింగ్ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమానికి సన్నద్ధం కావాలని AP JAC పిలుపునిచ్చింది.

యువరైతు ఆత్మహత్యాయత్నం
AP: చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో బొమ్మవారిపల్లి విలేజ్‌కు చెందిన యువరైతు లోకేశ్ నాయుడు నాలుగురోజుల క్రితం మామిడి లోడ్‌తో జైన్ మామిడి గుజ్జు పరిశ్రమకు చేరుకున్నాడు. వరుసలో ఉన్నప్పటికీ ఇప్పటివరకు సీరియల్ నంబర్ ఇవ్వలేదు. కానీ అర్ధరాత్రి వేళ సిఫారసులతో వచ్చిన వాహనాలను వరుసగా ఫ్యాక్టరీలోకి వెళ్తుండటంతో ప్రశ్నించగా, అక్కడి సిబ్బంది, దళారులు ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ దురుసుగా ప్రవర్తించారు. కుంగిపోయిన లోకేశ్ ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అక్కడున్న రైతులు అడ్డుకున్నారు.