← Back to news

బస్తీ దవాఖానాల్లో కార్పొరేట్‌ వైద్యం

By డీకే· 24 Jun 2026· Andhrajyothy· హైదరాబాద్‌
బస్తీ దవాఖానాల్లో కార్పొరేట్‌ వైద్యం

హైదరాబాద్‌‌లోని పేదలకు ఖరీదైన వైద్యం ఇక ఉచితం కానుంది. నేషనల్‌ అర్బన్‌ హెల్త్‌ మిషన్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను పాలీ క్లినిక్‌లుగా మారుస్తూ ఈ డిసెషన్ తీసుకుంది. వీటికి ‘ఆరోగ్య దీపిక పాలీ క్లినిక్‌’ అనే పేరు పెట్టింది. త్వరలోనే వీటిని ప్రారంభించేందుకు వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం అన్ని ఏర్పాట్లు చేసింది. వీటిలో ఉస్మానియా, గాంధీ వంటి ప్రతిష్ఠాత్మక వైద్య కళాశాలల నిపుణులతో బస్తీల్లోనే సేవలందించనున్నారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నాణ్యమైన, ఉచిత వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ సరికొత్త ప్రణాళికను సిద్ధం చేసింది.

బస్తీ దవాఖానాల్లో కార్పొరేట్‌ వైద్యం

More in TG