Latest

డిప్యూటీ CM ఇక ప్రతిరోజూ సాయంత్రం అందుబాటులో!
ప్రజాప్రతినిధుల కోసం తెలంగాణ డిప్యూటీ CM భట్టి విక్రమార్క ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఆయన MLAల అందరికీ పర్సనల్‌గా లెటర్స్ రాశారు. ఇకపై ప్రతిరోజూ సాయంత్రం 4:30 గంటల నుండి 5:30 గంటల వరకు ఒక గంట పాటు సెక్రటేరియట్ (సచివాలయం) లేదా ప్రజా భవన్‌లో అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. నియోజకవర్గాల ఇష్యూస్, ప్రజల సమస్యలపై చర్చించేందుకు లీడర్స్‌కు స్పెషల్ టైమ్ కేటాయించడం ఇప్పుడు పాలిటిక్స్‌లో గుడ్ సైన్‌గా మారింది.
రోడ్డెక్కిన మాజీ CM మమతా బెనర్జీ!
వెస్ట్ బెంగాల్ మాజీ CM మమతా బెనర్జీ మళ్లీ జనం మధ్యకు వచ్చారు. ధర్మతలాలో స్ట్రీట్ వెండర్స్ (రోడ్డు పక్కన వ్యాపారాలు చేసుకునేవారు) నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె స్వయంగా పాల్గొన్నారు. వారితో కలిసి రోడ్డుపై నడుస్తూ నిరసనలో భాగమయ్యారు. మమతా బెనర్జీతో పాటు పలువురు TMC కీలక నేతలు కూడా ఈ ప్రొటెస్ట్‌లో పాల్గొని స్ట్రీట్ వెండర్స్‌కు మద్దతు ప్రకటించారు. మమత బెనర్జీ మళ్ళీ ఇప్పుడు రోడ్డు ఎక్కడం బెంగాల్ రాజకీయాల్లో ఈ పరిణామం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
ప్రయాణికుడిపై చెప్పుతో దాడి చేసిన అధికారిణి!
గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో ఒక షాకింగ్ ఘటన జరిగింది. ఒక ప్యాసింజర్‌తో వాగ్వాదానికి దిగిన రైల్వే కమర్షియల్ అధికారిణి కె. జ్యోతి, తీవ్ర ఆగ్రహంతో ఆ ప్రయాణికుడిపై చెప్పుతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రైల్వే శాఖ సీరియస్‌గా రియాక్ట్ అయింది. ఆమెను తక్షణమే సస్పెండ్ చేస్తూ దక్షిణ తీర రైల్వే ప్రధాన కమర్షియల్ కంట్రోలర్ ఆర్డర్స్ జారీ చేశారు.
ఉద్యోగ భద్రత కోసం విజయవాడలో మెడికల్ స్టాఫ్ రోడ్డెక్కారు!
విజయవాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ (GGH)లో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే కాంట్రాక్ట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తున్నా తమకు సరైన సెక్యూరిటీ లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనతో ఆసుపత్రి ప్రాంగణంలో కాస్త ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
తమిళనాడులో ఇక నుండి ఫ్లెక్సీలు, కటౌట్లు పెడితే యాక్షన్ తప్పదు!
రాజకీయాల్లో మార్పు అంటే ఇదేనంటూ తమిళనాడు CM విజయ్ ట్రెండ్ సెట్ చేశారు. పబ్లిక్ ప్లేసెస్‌లో ఎలాంటి పోస్టర్లు, ఫ్లెక్స్ బోర్డులు, భారీ కటౌట్లు పెట్టకూడదంటూ ఆయన స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొచ్చారు. ఒకవేళ ఈ రూల్‌ను ఉల్లంఘిస్తే, సొంత పార్టీ కార్యకర్తలైనా సరే వారిపై కఠినమైన డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటామని గట్టి వార్నింగ్ ఇచ్చారు. పబ్లిక్‌కి ఇబ్బంది కలగకుండా విజయ్ తీసుకున్న ఈ డెసిషన్‌పై ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రశంసలు కురుస్తున్నాయి.

చెట్ల నరుకుతుండగా కరెంట్ షాక్.. స్పాట్‌డెడ్!
హైదరాబాద్ అల్వాల్‌లోని MES కాలనీలో ఘోర ప్రమాదం జరిగింది. చెట్ల కొమ్మలు నరుకుతుండగా కరెంట్ తీగలు తగిలి సూర్యనారాయణ అనే వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కరెంట్ సప్లై ఆపకుండానే చెట్లు నరకాలని చెప్పడంతోనే ఈ ప్రమాదం జరిగిందని, ఇది ముమ్మాటికీ విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమేనని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరణించిన సూర్యనారాయణకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఈ ఘటనతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

భారత్‌కు అమెరికా బిగ్ షాక్!
ప్రధాని మోదీ, అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ భేటీకి ముందే ఒక సంచలన నిజం వెలుగులోకి వచ్చింది. 'US Indo-Pacific Command' పేరులోని "ఇండో" అనే పదాన్ని అమెరికా తొలగించింది. దీన్ని మళ్లీ పాత పేరు అయిన "US Pacific Command"గా మారుస్తూ నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా, తమ అఫీషియల్ మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ ను పాకిస్థాన్ భూభాగంగా చూపించడం ఇప్పుడు పెద్ద వివాదానికి దారితీసింది. ఈ రెండు దేశాల కీలక మీటింగ్‌కు ముందే ఇలాంటి డెవలప్‌మెంట్స్ జరగడం అంతర్జాతీయంగా హాట్ టాపిక్‌గా మారింది.

APలో భారీ వర్షాలు.. 5 జిల్లాలకు రెడ్ అలర్ట్!
APలోని పలు జిల్లాల్లో మరో మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ MD ప్రఖర్ జైన్ హెచ్చరించారు. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. అలాగే ఈస్ట్ గోదావరి, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. వర్షం పడేటప్పుడు ఎవరూ చెట్ల కింద, కరెంట్ స్తంభాల దగ్గర నిలబడొద్దని, ఉరుములు వచ్చేటప్పుడు బయట తిరగొద్దని అధికారులు సూచించారు.

ఇండియాలో టెలిగ్రామ్ బ్యాన్.. ఢిల్లీ హైకోర్టుకు వెళ్లిన కంపెనీ!
నీట్ (NEET) రీ-ఎగ్జామ్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై ఈ నెల 22 వరకు టెంపరరీ బ్యాన్ విధించింది. ఈ నెల 21న నీట్ రీ-ఎగ్జామ్ జరగనుండటంతో, ఎలాంటి పేపర్ లీకేజీలు, మాల్‌ప్రాక్టీస్ జరగకుండా ఉండేందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ బ్యాన్‌ను సవాల్ చేస్తూ టెలిగ్రామ్ కంపెనీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కేంద్రం విధించిన టెంపరరీ బ్యాన్‌పై స్టే ఇవ్వాలని కోరుతూ కోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. ఈ హైకోర్టు డ్రామా ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

తల్లీకూతుళ్లపైకి దూసుకెళ్లిన కారు!
ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఒక షాకింగ్ యాక్సిడెంట్ జరిగింది. ఒక అపార్ట్‌మెంట్ బేస్‌మెంట్ పార్కింగ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ క్రితికా శర్మ తన ఐదేళ్ల కూతురు ఆర్యతో కలిసి కారులోంచి సామాన్లు తీస్తుండగా. ఒక కారు వేగంగా వచ్చి వాళ్లపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చిన్నారి ఆర్య స్వల్ప గాయాలతో బయటపడగా, క్రితికాకు తీవ్ర గాయాలవ్వడంతో ఐసీయూ (ICU)లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ఘోరం జరిగిందని పోలీసులు కేసు బుక్ చేశారు. ఈ భయానక దృశ్యాలు సిసిటివి (CCTV)లో రికార్డ్ అవ్వగా, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రణ్‌వీర్ సింగ్‌పై బ్యాన్ వెనక్కి..
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ 'డాన్ 3' సినిమా నుండి తప్పుకున్నాక, FWICE యూనియన్ ఆయనపై విధించిన ఇన్‌ఫార్మల్ బ్యాన్‌ను వెనక్కి తీసుకుంది. ఈ ఇష్యూతో ఫిల్మ్ యూనియన్లకు ఇండస్ట్రీలో ఎంత ఇన్‌ఫ్లుయెన్స్ ఉన్నా, లీగల్ పవర్స్ మాత్రం చాలా లిమిటెడ్‌గా ఉంటాయని తేలింది. ఈ యూనియన్లు ప్రైవేట్ ట్రేడ్ గ్రూప్స్ మాత్రమే కానీ, ప్రభుత్వ సంస్థలు కావు. అందుకే ఎవరినీ లీగల్‌గా పని చేయకుండా ఆపలేవు. ఒకవేళ బ్యాన్ లాంటివి విధిస్తే, అది ఒకరి బ్రతుకుదెరువును దెబ్బతీయడమే అవుతుందని, కోర్టులో సవాల్ చేయొచ్చని లీగల్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

మిగతా ఫోన్ల కంటే డిఫరెంట్.. స్క్రీన్ సైజ్ చూస్తే షాక్ అవ్వాల్సిందే!
మోటోరోలా కంపెనీ మార్కెట్‌లోకి 'రేజర్ ఫోల్డ్' (Motorola Razr Fold) పేరుతో సరికొత్త ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకొచ్చింది. మిగతా బ్రాండ్స్ లాగా ఫోన్‌ను స్లిమ్‌గా చేయడంపై కాకుండా. ఈ ఫోన్‌లో పవర్‌ఫుల్ ఫీచర్స్ ఇవ్వడంపై ఫోకస్ పెట్టారు. ఇందులో ఏకంగా 6,000mAh బిగ్ బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, మరియు లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 5 ప్రొసెసర్‌ను వాడారు. ఫోన్ ఓపెన్ చేస్తే 8.8 ఇంచుల పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ 50MP కెమెరా ఉంది. దీని స్టార్టింగ్ ప్రైస్ ₹1,49,999 గా ఉంది.

AP హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో 529 జాబ్స్!
ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. నేషనల్ హెల్త్ మిషన్ (NHM) కింద కాంట్రాక్ట్ బేసిస్‌పై 529 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇందులో 419 స్టాఫ్ నర్స్, 24 ఫార్మసిస్ట్, 86 మల్టీ రీహాబిలిటేషన్ వర్కర్ పోస్టులు ఉన్నాయి. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా కేవలం మెరిట్ బేసిస్‌పైనే సెలెక్షన్ ఉంటుంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 30, 2026 లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. శాలరీ ₹23,393 నుండి ₹27,675 వరకు ఉంటుంది.

హైదరాబాద్ హాస్పిటల్‌కి AP CM చంద్రబాబు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ (AIG) హాస్పిటల్‌కు రానున్నారు. ప్రతి సంవత్సరం ఆయన రెగ్యులర్‌గా చేయించుకునే హెల్త్ చెకప్‌లో భాగంగానే ఈరోజు హాస్పిటల్‌కి వస్తున్నట్లు అధికారులు తెలిపారు. CM రాక సందర్భంగా హాస్పిటల్ దగ్గర పోలీసులు భారీగా సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు. ఈ రొటీన్ మెడికల్ టెస్ట్‌లు పూర్తయిన తర్వాత ఆయన మళ్లీ APకి తిరిగి వెళ్లనున్నారు.

కూల్‌గా ఉండటం ఎలా? సైకాలజిస్టులు చెప్తున్న 5 బెస్ట్ టిప్స్ ఇవే!
ఈ రోజుల్లో ట్రాఫిక్ జామ్ అయినా, వర్క్ లేట్ అయినా, చిన్న చిన్న వాటికే చాలామందికి వెంటనే కోపం వచ్చేస్తుంటుంది. అయితే కొన్ని సింపుల్ స్ట్రాటజీలతో పేషెన్స్ పెంచుకోవచ్చని సైకాలజిస్టులు చెప్తున్నారు. 1. కోపం వచ్చినప్పుడు ప్రశాంతంగా డీప్ బ్రీత్ తీసుకోవాలి. 2. ఆ సిట్యుయేషన్ గురించి ఆలోచించకుండా మైండ్ డైవర్ట్ చేసుకోవడం. 3. ప్రెజెంట్ మూమెంట్‌లో బ్రతకడం నేర్చుకోవాలి. 4. పీస్ఫుల్ గా మెడిటేషన్ చేయడం. 5. ఇతరులతో క్యాజువల్‌గా మాట్లాడటం వల్ల కూడా మూడ్ సెట్ అవుతుంది. లైఫ్‌లో సక్సెస్ అవ్వడానికి ఓపిక చాలా ఇంపార్టెంట్.

గ్యాస్ లీక్ ఘటనలో కాలిన గాయాలతో యువతి మృతి
AP: బీఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం ఈదరాడకు చెందిన చుట్టుగుళ్ల చంద్రప్రియ(23) ఈ నెల 14న ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ లీకైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబసభ్యులు రాజోలు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అమలాపురంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న చంద్రప్రియ బుధవారం మృతి చెందింది. యువతి మృతితో కుటుంబసభ్యులు, బంధువులు విషాదంలో మునిగిపోయారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

అభిమాని చిరుకోరిక తీర్చిన పవన్ కళ్యాణ్
TG: హన్మకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన నిరంజన్(17) జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్‌ని కలవాలని చెప్పడంతో పవన్ కల్యాణ్ బుధవారం స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతన్ని దగ్గరకు తీసుకుని పరామర్శించారు. తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యఖర్చుల నిమిత్తం లక్ష ఆర్ధికసాయం అందజేశారు. తల్లిదండ్రులు వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ హాస్పిటల్ క్యాంటిన్‌లో పని చేసేవారమని చెప్పగా, క్యాంటిన్ పెట్టిస్తానని పవన్ హామీ ఇచ్చారు.
యూరియా కోసం రైతుల పడిగాపులు
TG: కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరెల్ తండా దగ్గర యూరియా కోసం క్యూలైన్‌లో చెప్పులు పెట్టి రైతులు గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. యాప్ ద్వారా యూరియా బుక్ అయినప్పటికీ ఎరువు అందక వారంతా ఆందోళన పడుతున్నారు. యూరియా లోడు వస్తుందని అధికారులు చెప్పడంతో సొసైటీ దగ్గరే ఎదురుచూస్తున్నారు.

ప్రాణం తీసిన కుర్ కురే ప్యాకెట్‌లోని బొమ్మ
AP: కుర్ కురే ప్యాకెట్లో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మ ఓ చిన్నారి ప్రాణం తీసింది. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని కోట గ్రామానికి చెందిన సాదియా, అల్తాఫ్ దంపతులకు ఫర్హాన్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఐదేళ్ల ఫర్హాన్ కుర్ కురే ప్యాకెట్లో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటున్నాడు. తెలిసీ తెలియక ఆ బొమ్మను మింగాడు. అది గొంతులో అడ్డంగా పడి ఊపిరాడక ఇబ్బందులు పడ్డాడు. కుటుంబసభ్యులు గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఫర్హాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

కవర్‌ను తొలగిస్తుండగా కరెంట్ షాక్.. డ్రైవర్ స్పాట్‌డెడ్
TG: నారాయణపేట్ జిల్లా గద్వాల్ మున్సిపాలిటీలోని దౌదర్పల్లి 7వ వార్డు ఇందిరమ్మ కాలనీకి చెందిన కుర్వ వెంకటేష్ లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం గద్వాల్ నుంచి మక్తల్‌కు మసాలా ప్యాకెట్ల లోడ్‌తో వచ్చిన లారీపై కప్పిన ప్లాస్టిక్ కవర్‌ను తొలగిస్తుండగా కిందకు వేలాడుతున్న కరెంట్ వైర్లు తగిలాయి. కరెంట్ షాక్‌కు గురై వెంకటేష్(25) స్పాట్‌లో ప్రాణాలు కోల్పోయాడు. మృతుడికి భార్యతో పాటు నాలుగేళ్ల కుమార్తె ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

స్మార్ట్‌ఫోన్ యూజర్లకు అలర్ట్!
స్మార్ట్‌ఫోన్ల స్క్రీన్లపై మనం చేసే ఒకే ఒక్క తప్పు ట్యాప్ (Tap) వల్ల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. పొరపాటున ఎవరికో వెళ్లాల్సిన మెసేజ్ మరొకరికి వెళ్లడం, పొరపాటున పేమెంట్లు జరిగిపోవడం లాంటివి చాలామందికి ఎక్స్‌పీరియన్స్ అయ్యే ఉంటాయి. యాప్స్ అన్నీ చాలా ఈజీగా యూజ్ చేసేలా డిజైన్ చేయడం వల్లే యూజర్లు ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్నారు. బ్రెయిన్ కంటే థంబ్ (బొటనవేలు) ఫాస్ట్‌గా రెస్పాండ్ అవ్వడమే దీనికి రీజన్. అందుకే ఆన్‌లైన్‌లో సేఫ్‌గా ఉండటానికి ఒక్కోసారి అలర్ట్ పాప్-అప్స్ లాంటివి హెల్ప్ అవుతాయంటున్నారు.