Latest
10 మందిపై పోక్సో కేసు నమోదు
TG: భద్రాద్రికొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపల్లి మండలంలోని ఓ ఇంట్లో మైనర్ బాలుడు, బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో గమనించిన గ్రామస్థులు వారిని పట్టుకున్నారు. సదరు బాలుడిని గ్రామస్థులంతా కలిసి ఒక చెట్టుకు కట్టేసి తీవ్రంగా కొట్టారు. బాలుడు, అతనితో పాటు ఉన్న మరికొందరు కలిసి తన కూతురితో అసభ్యంగా ప్రవర్తించారంటూ బాలిక తల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు విచారణ చేపట్టారు. బాలికపై అసభ్యంగా ప్రవర్తించడంతో పదిమంది నిందితులపై పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
చిన్నారి జ్ఞానేశ్వరి ఇంటి వద్ద జ్యోతిష్యుడు హల్‌చల్
AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సై 12రోజులు దాటినా ఆచూకీ దొరకలేదు. గురువారం తెలంగాణకు చెందిన ఓ జ్యోతిష్యుడు జ్ఞానేశ్వరి ఇంటి వద్ద హల్‌చల్ చేశాడు. తాను జ్ఞానిని అని చెప్పుకుంటూ, పాప భూదేవి వద్ద ఉందని, అర్ధరాత్రి పూజలు చేస్తే తిరిగి వస్తుందని హంగామా సృష్టించాడు. చిన్నారిది కారణజన్మ అని, ఏ అడవి జంతువులు ఎత్తుకుపోలేదని, రాత్రి ఒంటి గంటకు కచ్చితంగా తోటలో ప్రత్యక్షమవుతుందని చెప్పాడు. తాను చెప్పినట్లు పూజలు చేస్తేనే పాప వస్తుందంటూ ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టాడు.

బాసర ట్రిపుల్ ITలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
TG: నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ITలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటన మరోసారి తీవ్ర కలకలం రేపింది. PUC ఫస్టియర్ విద్యార్థిని అస్మితా బేగం హాస్టల్ భవనంపై నుంచి దూకింది. తీవ్ర గాయాలైన ఆమెను హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థిని సంగారెడ్డి జిల్లా మానూరు మండలం రాయిపల్లి గ్రామానికి చెందిన అస్మితా బేగంగా పోలీసులు గుర్తించారు. ఆమె ప్రస్తుతం బాసర ట్రిపుల్ ITలో PUC మొదటి సంవత్సరం చదువుతోంది. అస్మితా ఎవరితోనూ మాట్లాడకుండా తీవ్ర మానసిక ఆందోళనతో ఉన్నట్లు తోటి స్నేహితులు తెలిపారు.

కృష్ణలంక ఘటనపై ప్రభుత్వం సీరియస్
విజయవాడ కృష్ణలంక సాయికృష్ణ మిస్సింగ్ వ్యవహారం APలో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నెలరోజుల క్రితం సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత నుంచి అతను కనిపించకుండా పోయారు. సాయికృష్ణ గురించి పోలీసులు ఇప్పటి వరకూ ఎలాంటి విషయాలు బయటకు చెప్పలేదు. జూన్ 29లోపు సాయికృష్ణను తమ ఎదుట హాజరుపరచాలన్న హైకోర్టు ఆదేశాలతో ఏం జరగనుందనేది ఆసక్తికరంగా మారింది. ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. సాయికృష్ణ మిస్సింగ్ మిస్టరీని ఛేదించి నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

హైదరాబాద్ కు త్వరలోనే వంద కోట్ల ప్రాజెక్టు
హైదరాబాద్ లో త్వరలోనే వంద కోట్ల పెట్టు బడితో ఇండస్ట్రీ రీసెర్చ్ టెక్నాలజీ , ఇన్నోవేషన్ పార్కు ఏర్పాటు అవుతోంది. హైదరాబాద్ బిట్స్ పిలానీ శాఖ, యాక్సిస్ బ్యాంకు కలిపి ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. ఈ మేరకు ఈ రెండు సంస్థలు ఎంఓయు కుదుర్చుకున్నాయి. ఇండస్ట్రీ రీసెర్చ్, టెక్నాలజీ ఇన్నోవేషన్ను అభివృద్ది చేయడమే ఈ ఒప్పందం అసలు ఉద్దేశం.

కోతుల కొట్లాటలో మహిళ మృతి
TG: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని కమలాపూర్ రోడ్డు ఇందిరమ్మ కాలనీలో కొనపర్తి సత్యనారాయణ, పద్మ(55) దంపతులు నివాసం ఉంటున్నారు. పద్మ బుధవారం సాయంత్రం ఇంటి ముందు కూర్చొని మరో మహిళతో మాట్లాడుతున్నారు. అదే సమయంలో ఆ ఇంటిపై రెండు కోతులు తీవ్రంగా కొట్లాడుకోసాగాయి. రేకులు గాలికి ఎగిరిపోకుండా బరువు కోసం పెట్టిన సిమెంట్ ఇటుక కింద కూర్చున్న పద్మ తలపై పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. భర్త సత్యనారాయణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.మహేష్ తెలిపారు.

ప్రపంచ బ్యాంకుకు ఉండవల్లి రైతుల ఫిర్యాదు
AP: రాజధాని అమరావతి పరిధిలోని ఉండవల్లి రైతులు తమ భూముల విలువ నిర్ధారణలో జరుగుతున్న అన్యాయంపై గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామ రైతులు ప్రపంచ బ్యాంక్‌కు ఫిర్యాదు చేశారు. భూముల విలువకు సంబంధించి పరిహారం ఇచ్చేటప్పుడు భూముల విలువను తక్కువగా చూపుతూ, అప్పులు తెచ్చుకునేటప్పుడు మాత్రం ఎకరాకు రూ. కోట్లలో చూపిస్తున్నారని రైతులు అందులో పేర్కొన్నారు. దీన్ని పరిశీలించిన వరల్డ్ బ్యాంకు అధికారి ఒలీవర్ CRDAకు లేఖ పంపారు. ఉండవల్లి గ్రామంలో భూముల విలువ నిర్ధారణ, రక్షణ నిబంధనల ఉల్లంఘనలపై కొత్త ఫిర్యాదు వచ్చిందని దీనిపై పరిశీలించాలని లేఖలో పేర్కొన్నారు.

జీ7 సమ్మిట్ లో మోడీకి ట్రంప్ సర్ ప్రైజింగ్ ప్రామిస్
మోడీ అధికారంలో ఉండగా ఇండియాపై ఎవరైనా దాడి చేస్తే అమెరికా భారత్ కు అండగా నిలుస్తుందని యూఎస్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ అన్నారు. ఫ్రాన్స్ లో జరుగుతున్న జీ7 సమ్మిట్ లో నేతలిద్దరూ సమావేశమయ్యారు.2025 మే ఆపరేషన్ సింధూర్ తర్వాత మోడీ, ట్రంప్ ఫేస్ టు ఫేస్ కలవడం ఇదే తొలిసారి. మోడీ అధికారంలో ఉన్నంత వరకూ తమ సహాయం కొనసాగుతుందని ట్రంప్ అన్నారు.

ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు
ఇంటర్మీడియట్ ఫస్టియర్, సెకండియర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు AP ఇంటర్మీడియట్ విద్యామండలి సర్వం సిద్ధం చేసింది. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను అధికారికంగా విడుదల చేయనున్నట్లు ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామని ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా వెల్లడించారు. విద్యార్థులు తమ హాల్ టికెట్ నంబర్ సహాయంతో మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించారు.

సాక్ష్యాలు తారుమారు చేసేందుకు యత్నం.. చివరికీ
హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నివసించే దంపతులకు మూడున్నర ఏళ్ల కుమార్తె ఉంది. ఆమెను 2019 జూన్ 12 నుంచి స్థానికంగా ఓ ప్లేస్కూల్‌కు పంపించారు. పాఠశాలలో కరాటే కోచ్‌గా పనిచేసే కిరణ్‌సాయి(24) పాపపై అత్యాచారం చేశాడు. విషయాన్ని అమ్మమ్మకు పాప చెప్పింది. ఆమె పోలీసులకు చెప్పడంతో నిందితుడిని అరెస్టు చేశారు. ప్లేస్కూల్ ప్రిన్సిపల్ దీపిక సాక్ష్యాలను తారుమారు చేసేందుకు యత్నించారు. కేసును విచారించిన రాజేంద్రనగర్ పోక్సో కోర్టు నిందితుడు కిరణ్‌సాయికి 20ఏళ్ల జైలుశిక్ష, ప్రిన్సిపల్‌కు మూడేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

సీఎం విజయ్ పై సమంత ఎమోషనల్ పోస్ట్ !
టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుత్ ప్రభు బుధవారం చెన్నైలో తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమాలను వదిలి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టి, సీఎం పీఠాన్ని అధిష్టించిన విజయ్‌కు ఆమె తన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ భేటీకి సంబంధించిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంటూ, విజయ్‌లోని లీడర్‌షిప్ క్వాలిటీస్‌ను ప్రశంసిస్తూ ఎమోషనల్ నోట్ రాశారు. విజయ్ ఏదో గొప్ప కార్యాన్ని సాధించడానికే పుట్టారంటూ ప్రశంసించారు.

నేటి నుంచి తెలంగాణ వన మహోత్సవం
TG : రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది 16.06 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యం పెట్టుకుంది. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 13,242 ప్రభుత్వ నర్సరీల్లో వివిధ రకాల మొక్కలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచారు. రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ మొక్కలు నాటే కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, పర్యావరణాన్ని కాపాడటంలో తమ వంతు బాధ్యతను నెరవేర్చాలని CM రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని గుర్రంగూడ ఎకోపార్క్‌లో సీఎం 'నాగలింగం' మొక్కను నాటి "వనమహోత్సవం 2026" కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

43 మంది డాక్టర్లు డిస్మిస్
AP: విధుల్లో నిర్లక్ష్యం వహించిన 43 మంది డాక్టర్లను ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేస్తూ AP వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. నాలుగేళ్లుగా 118 మంది వైద్యులు విధులకు దూరంగా ఉంటున్నారని గుర్తించారు. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులకు సైతం రిప్లై ఇవ్వలేదు. అనధికారికంగా వైద్యులు దూరంగా ఉండటాన్ని వైద్యారోగ్య శాఖ సీరియస్ తీసుకుంది. ఇప్పటికే రాజీనామా చేసిన 34 మందిలో 15 మందికి ఆమోదం తెలిపింది. మరో 34 మంది వైద్యులు తమ పదవులకు రాజీనామా చేశారు.

అలా చేయకపోతే HCA వృద్ధి చెందదు: అజహరుద్దీన్
TG: ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 'TG20 లీగ్'పై మంత్రి అజహరుద్దీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం HCAలో చాలా సమస్యలు ఉన్నాయని అన్నారు. గ్రూపు రాజకీయాలు, అంతర్గత విభేదాలు క్రికెట్ అభివృద్ధికి అడ్డంకిగా మారాయని కామెంట్ చేశారు. HCAలో ఉన్న లొసుగులు, సమస్యలను పూర్తిగా పరిష్కరించనంత కాలం.. హైదరాబాద్ క్రికెట్ ఏమాత్రం వృద్ధి చెందదని, ఇక్కడి నుంచి కొత్తగా ప్రతిభావంతులు ముందుకు రాలేరని అన్నారు.

చిన్నారి కుటుంబానికి అండగా ఉంటాం: హోంమంత్రి
AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కుటుంబాన్ని AP హోంమంత్రి అనిత పరామర్శించారు. కుటుంబసభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. చిన్నారి అదృశ్యం దర్యాప్తు పురోగతిని జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌తో మాట్లాడి తెలుసుకున్నారు. 11 రోజులుగా చేపట్టిన గాలింపు చర్యలను మంత్రికి SP వివరించారు. అనంతరం బాలిక అదృశ్యమైన ప్రదేశానికి అనిత వెళ్లి పరిశీలించారు. అడవి జంతువులు వచ్చే అవకాశముందా? అని ఆరా తీశారు. అటవీశాఖ అధికారులు కెమెరాలు, డ్రోన్ల ద్వారా పరిశీలిస్తున్నారని పోలీసులు మంత్రికి వివరించారు.

ప్రజల సందర్శన కోసం రుషికొండ
గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పదంగా నిర్మించిన రుషికొండ భవన సముదాయాన్ని (ప్యాలెస్)పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో అంతర్జాతీయ స్థాయి లగ్జరీ రిసార్ట్‌గా మార్చాలని, ప్రజల సందర్శనార్థం వినియోగించాలని ప్రాథమిక నిర్ణయించినట్లు మంత్రివర్గ ఉపసంఘం వెల్లడించింది. సుమారు రూ. 450 కోట్ల ప్రజాధనంతో, నిబంధనలను ఉల్లంఘించి నిర్మించిన ఈ రాజప్రాసాదాన్ని కూల్చివేయకుండా, ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేలా 'హాస్పిటాలిటీ' రంగానికి కేటాయించడమే సముచితమైన మార్గమని కమిటీ అభిప్రాయపడింది.

ఉస్మానియా యూనివర్సిటీకి ISO గుర్తింపు
TG: ఉస్మానియా యూనివర్సిటీ(OU) సరికొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే మరే ఇతర విశ్వవిద్యాలయానికి సాధ్యం కాని రీతిలో ఒకేసారి నాలుగు వేర్వేరు విభాగాల్లో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ద్వారా అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ (ISO) గుర్తింపు సాధించింది. హైదరాబాద్‌లోని యూనివర్సిటీ క్యాంపస్‌లో బుధవారం జరిగిన కార్యక్రమంలో, దక్షిణ ప్రాంత BIS డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సందీప్ కుమార్ కనోజియా చేతుల మీదుగా OU వైస్ ఛాన్సలర్ కుమార్ ఈ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ధ్రువపత్రాలను అందుకున్నారు.

ఐదు రూపాయల కోసం తల్లిని చంపేశాడు !
చత్తిస్ గఢ్ లో ఓ యువకుడు ఐదు రూపాయల కోసం తల్లిని చంపేశాడు. గుట్కాకు బానిస అయిన అతగాడు తల్లిని ఐదు రూపాయలిమ్మని వత్తిడి చేశాడు. ఆమె ఇవ్వక పోవడంతో ఆమెను ఏకంగా హత్య చేశాడు. లఖన్ మాలి అనే ఆ యువకుడు తల్లి తిహ్రిన్ మాలి భోజనం వడ్డిస్తుందగా ఆమెను ఐదు రూపాయలు ఇవ్వమని వేధించాడు. ఆమె లేవని చెప్పడంతో కోపం పట్టలేక ఆమెను తీవ్రంగా కొట్టాడు. తప్పించుకుని పారిపోతున్న ఆమె తలపై రాయితో బలంగా కొట్టాడు. ఆమె మరణించడంతో పోలీసులు కేసు నమోదు చేసి లఖన్ ఆలీని అరెస్టు చేశారు.

జర్నలిస్టు విప్లవశ్రీకి పెరుగుతున్న మద్దతు
హైదరాబాద్ లో కాక్రోచెస్ ప్రొటెస్ట్ కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్టు విప్లవ శ్రీని ట్రోల్ చేసిన వారికి వ్యతిరేకంగా అనేక మంది జర్నలిస్టులు ముందుకొచ్చారు. విప్లవ శ్రీకి తమ మద్దతు తెలియ చేశారు. విధి నిర్వహణ కోసం వెళ్లేవారిని అలా అపహాస్యం చేస్తూ , ట్రోల్ చేసే వారిని కఠినంగా శిక్షించాలనే డిమాండ్ పెరుగుతోంది. జర్నలిస్టు తులసీ చందు కూడా విప్లవ శ్రీకి మద్దతు పలికారు.

ఒకే కార్లో ఇద్దరు మాజీ భార్యలు, ప్రెజెంట్ గర్ల్ ఫ్రెండ్ తో ఆమిర్ ఖాన్!
బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. విడాకులు అయినా తన ఇద్దరు మాజీ భార్యలు రీనా దత్తా, కిరణ్ రావులతో ఫ్రెండ్లీగా ఉండే ఆమిర్. తాజాగా వాళ్లతో కలిసి ఒకే కార్లో కనిపించారు. విశేషం ఏంటంటే, వెనుక సీట్లో ఇద్దరు ఎక్స్-వైఫ్స్‌తో పాటు ఆయన ప్రెజెంట్ గర్ల్‌ఫ్రెండ్ గౌరీ స్ప్రాట్ కూడా ఉంది. ఇది చూసిన నెటిజన్లు "ఇంతటి లైఫ్ బ్యాలెన్సింగ్ ఒక్క ఆమిర్ ఖాన్‌కే సాధ్యం" అంటూ క్రేజీగా కామెంట్స్ చేస్తున్నారు.
G7 సమ్మిట్‌లో మోదీ-మెలోని!
ఫ్రాన్స్‌లోని ఎవియాన్-లెస్-బైన్స్ వేదికగా జరుగుతున్న G7 సమ్మిట్‌లో భారత్ PM నరేంద్ర మోదీ, ఇటలీ PM జార్జియా మెలోనిల ఇంటరాక్షన్ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. వరల్డ్ లీడర్స్ అంతా గ్రూప్ ఫొటో కోసం సిద్దమవుతున్న టైమ్‌లో వీరిద్దరూ ఒకరినొకరు నవ్వుతూ పలకరించుకున్నారు. గతంలో మోదీ ఆమెకు 'మెలోడీ' చాక్లెట్లు గిఫ్ట్‌గా ఇవ్వడం, ఆ వీడియోకి మిలియన్ల కొద్దీ వ్యూస్ రావడం తెలిసిందే. ఇప్పుడు తాజా సమ్మిట్‌లో వీరిద్దరి ఫ్రెండ్‌షిప్ చూసి నెటిజన్లు 'Melodi' ట్రెండ్‌ను మళ్లీ గుర్తు చేస్తున్నారు.