← Back to news

అభిమాని చిరుకోరిక తీర్చిన పవన్ కళ్యాణ్

By DK· 17 Jun 2026· హన్మకొండ
అభిమాని చిరుకోరిక తీర్చిన పవన్ కళ్యాణ్

TG: హన్మకొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన నిరంజన్(17) జన్యుపరమైన వ్యాధితో పోరాడుతున్నాడు. తన చివరి కోరికగా పవన్ కళ్యాణ్‌ని కలవాలని చెప్పడంతో పవన్ కల్యాణ్ బుధవారం స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లారు. అతన్ని దగ్గరకు తీసుకుని పరామర్శించారు. తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యఖర్చుల నిమిత్తం లక్ష ఆర్ధికసాయం అందజేశారు. తల్లిదండ్రులు వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ హాస్పిటల్‌ క్యాంటిన్‌లో పని చేసేవారమని చెప్పగా, క్యాంటిన్ పెట్టిస్తానని పవన్ హామీ ఇచ్చారు.

More in TG