Latest
11 రోజులైనా దొరకని చిన్నారి జాను.. చెరువులో వెతుకుతున్న NDRF టీమ్స్!
11 రోజులైనా దొరకని చిన్నారి జాను ఆచూకీ! కాకినాడ జిల్లా తుని మండలం అగ్రహారం దగ్గర 11 రోజుల క్రితం అడవిలోకి వెళ్లి తప్పిపోయిన రెండేళ్ల చిన్నారి జాను కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కంటిన్యూ అవుతోంది. పోలీసులు, ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఇప్పటికే అడవిని జల్లెడ పట్టగా. తాజాగా గ్రామ సమీపంలోని ఒక చెరువులో NDRF టీమ్స్ రంగంలోకి దిగి గాలింపు చేపట్టాయి. అసలు ఆ చిన్నారి ఏమైందో తెలియక పేరెంట్స్ కన్నీరుమున్నీరవుతున్నారు. ఇప్పుడు ఈ మిస్సింగ్ కేస్ పెద్ద మిస్టరీగా మారింది.
హన్మకొండలో పవన్ కల్యాణ్
AP డిప్యూటీ CM పవన్ కల్యాణ్ హన్మకొండకు చేరుకున్నారు. హనుమాన్‌నగర్‌కు చెందిన బాలుడు నిరంజన్(17) తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. తన చివరి కోరిక అభిమాన నటుడైన పవన్ కల్యాణ్‌ను కలవడమేనని చెప్పడంతో బాలుడిని చూసేందుకు పవన్ వారి ఇంటికి వెళ్లారు. చాలా కాలంగా కాళ్లు పనిచేయక బాలుడు బాధపడుతున్నాడు. నరాల సంబంధిత వ్యాధి కారణంగా నిరంజన్ కాళ్లు పనిచేయడం లేదు. విషయం తెలుసుకున్న పవన్ కల్యాణ్ నిరంజన్‌ను పరామర్శించారు. బాలుడి తల్లిదండ్రులతో మాట్లాడి అతని ఆరోగ్య సమస్యలు, చికిత్స వివరాలు తెలుసుకున్నారు.

ఒక తల్లి విజయం!
సంగారెడ్డి జిల్లా, పటాన్‌చెరులో ఒక షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది. గర్భంలో ఉన్నప్పుడే పాపను ₹5 లక్షలకు అమ్మేలా ఒక ముఠా నిరుపేద తల్లి, భర్తతో అగ్రిమెంట్ చేసుకుంది. తీరా డెలివరీ అయ్యాక, పాపను ఇవ్వడానికి ఆ తల్లి ఒప్పుకోలేదు. దీంతో ఫ్యామిలీ మెంబర్స్ ఆమెను టార్చర్ చేయడంతో, ఆ మెైనర్ తల్లి ధైర్యంగా 100 కి కాల్ చేసి పోలీసుల హెల్ప్ తీసుకుంది. పోలీసులు వచ్చి బిడ్డను తల్లికి అప్పగించారు. కానీ, ముఠాపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఈ చైల్డ్ స్మగ్లింగ్ గ్యాంగ్ పై యాక్షన్ తీసుకోవాలని లోకల్స్ డిమాండ్ చేస్తున్నారు.

ఎమర్జెన్సీ వార్డులో అగ్ని ప్రమాదం
AP: విజయవాడలోని రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో బుధవారం తెల్లవారుజామున ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్‌లోని ఎమర్జెన్సీ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అలెర్ట్ అయి వార్డులో ఉన్న పిల్లలను వెంటనే మరో వార్డులోకి తరలించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, ఆస్పత్రి సిబ్బంది, యాజమాన్యం నుంచి వివరాలు సేకరించారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉంటాయని ప్రాథమికంగా అంచనా వేశారు.

గోల్డ్ కొనేవారికి గుడ్ న్యూస్!
అంతర్జాతీయ కారణాల వల్ల హైదరాబాద్, విజయవాడల్లో బంగారం, వెండి ధరలు తగ్గాయి. లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర ₹1,51,100 కి చేరింది. అలాగే 22 క్యారెట్ ఆర్నమెంటల్ బంగారం ధర ₹1,38,500 గా ఉంది. ఇక వెండి ధర కిలోకు ₹2,650 వరకు తగ్గి, ప్రస్తుతం ₹2,75,000 వద్ద ఉంది. అయితే మార్కెట్‌లో రేట్లు ఎప్పుడూ చేంజ్ అవుతుంటాయి కాబట్టి, కొనేముందు ఒకసారి లైవ్ ప్రైస్ చెక్ చేసుకోండి.

రాష్ట్రంలోనే తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ప్రారంభం
TG: రాష్ట్రంలోనే తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్(TPS)ను CM రేవంత్ రెడ్డి ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలో పాఠశాల భవనాన్ని ప్రారంభించి, TPS పైలాన్‌ను ఆవిష్కరించారు. పాఠశాలలో 'అల్పాహార పథకాన్ని' ప్రారంభించిన సీఎం, విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద మొదటి విడతలో నాలుగు స్కూళ్లలో ప్రారంభించింది. రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాలతో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలు ఇందులో ఉన్నాయి.

విధుల్లొ అలసత్వం.. అధికారులపై సస్పెన్షన్ వేటు
AP: పారిశుధ్య నిర్వహణ పనుల్లో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు MPDOలను సస్పెండ్ చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణ తేజ ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట MPDO ఏవీ మురళీకృష్ణ, తడ MPDO డీ.శేఖర్ నాయక్‌లను సస్పెండ్ చేశారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకమైన 'స్వచ్ఛ రథాల' ఏర్పాటు, వాటి నిర్వహణలో వీరు అలసత్వం ప్రదర్శించినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయడంలో అధికారులు విఫలమయ్యారని కమిషనర్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

పానీపూరి తిన్న చిన్నారులకు అస్వస్థత
TG: రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం KCRనగర్ కాలనీలో గప్‌చుప్ తిన్న పలువురు చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వెంటనే వారిని జిల్లా గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. పానీపూరి తిన్న చిన్నారులకు వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. వెంటనే తల్లిదండ్రులు చిన్నారులను మొదటగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తర్వాత ప్రైవేట్ హాస్పిటల్స్‌కు తరలించారు. ప్రస్తుతం చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు.

ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం
TG: హైదరాబాద్ కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన తీవ్ర కలకలం రేపింది. BDS (బ్యాచిలర్ ఆఫ్ డెంటల్ సర్జరీ) మొదటి సంవత్సరం విద్యార్థులను ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ర్యాగింగ్ చేశారని కేసు నమోదైంది. ఉస్మానియా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సంజీవ్ సింగ్ యాదవ్ ఫిర్యాదుతో 12మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్‌పై సుల్తాన్ బజార్ పోలీసులు కేసు నమోదు చేశారు. ర్యాగింగ్ చేసిన 12 మంది విద్యార్థులను ప్రిన్సిపల్ సస్పెండ్ చేశారు.

వచ్చే ఎన్నికల్లో నేను పోటి చేయను: జగ్గారెడ్డి
TG: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నేను పోటి చేయనని TPCC కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో నియోజకవర్గ స్థాయి BLAల శిక్షణా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కొందరు నేతలు నేనే పోటీ చేస్తారని భావిస్తున్నారని, గతంలో పేర్కొన్న విధంగా నిర్మలారెడ్డి పోటీ చేస్తారని ఆయన తెలిపారు. ఈ నిర్ణయంలో మార్పు ఉండదన్నారు. నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఓటరు ప్రత్యేక సవరణ తేలికగా తీసుకోవద్దని సూచించారు.

ఏకంగా ATMనే ఎత్తుకెళ్లారు
AP: అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రంలో బుధవారం తెల్లవారుజామున దుండగులు ATMను ధ్వంసం చేసి ఎత్తుకెళ్లారు. బుక్కరాయసముద్రంలోని తాడిపత్రి ప్రధాన రహదారిపై ఉన్న SBI ATM గది అద్దాలను పగులగొట్టి, ATM మెషిన్‌తో పాటు అందులో ఉన్న బ్యాటరీలను అపహరించారు. ATM వంద మీటర్ల దూరంలోనే పోలీస్‌స్టేషన్ ఉన్నప్పటికీ ఘటన జరగడం సంచలనంగా మారింది. DSP శ్రీనివాసులు, CI సుబ్బరాయుడు, SI రాంప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్ సాయంతో తనిఖీలు చేపట్టి, పరిసర ప్రాంతాల్లోని CC కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.

రైతు భరోసా నిధుల విడుదల
TG: తెలంగాణలో వానాకాలం సీజన్‌కు గానూ రైతుభరోసా నిధుల విడుదలకు CM రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపారు. రైతు భరోసా పథకం నిధుల విడుదలకు తక్షణమే సన్నాహాలు చేయాలని వ్యవసాయ, ఆర్థిక శాఖల ఉన్నతాధికారులను CM ఆదేశించారు. ఈ పథకం కింద ఎకరానికి రూ.6వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1.50 కోట్ల ఎకరాల సాగు భూమికి గానూ మొత్తం రూ.9 వేల కోట్లను విడుదల చేయాలని వ్యవసాయ శాఖ ప్రతిపాదించగా, సీఎం దానికి సానుకూలంగా స్పందిస్తూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ నెల 26న తొలి విడతగా 73 లక్షల మంది రైతులకు నిధులు జమ కానున్నాయి.

చిన్నారి మిస్సింగ్ కేసులో బొమ్మలతో వినూత్న ప్రయోగం
AP: కాకినాడ జిల్లా తుని మండలం CH అగ్రహారంలో మిస్సైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి ఆచూకీ ఇంకా దొరకలేదు. పాప చివరిగా కనిపించకుండా పోయిన తోట, కొండ ప్రాంతంలో అడవి జంతువుల సంచారం ఉందేమోనన్న అనుమానంతో చిన్నారి ఆకారం పోలిన రెండు చిన్న బొమ్మలను ఇనుప కంచెకు అమర్చి, వాటిపై మాంసాహారాన్ని ఉంచారు. గత 11 రోజులుగా NDRF, SDRF, హనుమాన్ టీమ్, అటవీశాఖ, పోలీసు బృందాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గతంలో థర్మల్ డ్రోన్లు, నైట్ ట్రాప్ కెమెరాలతో జల్లెడ పట్టినప్పటికీ ఆచూకీ లభించకపోవడంతో బొమ్మల ప్రయోగాన్ని చేపట్టారు.

మద్యం మత్తులో పూజారి హల్‌చల్
TG: మేడ్చల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ శివాలయ పూజారి మద్యం మత్తులో హల్‌చల్ చేశాడు. పూజారి మద్యం సేవించి ఆలయ పరిసరాల్లో అసభ్యంగా ప్రవర్తిస్తూ భక్తులకు, స్థానికులకు ఇబ్బందులు కలిగించాడు. పూజారి ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పూజారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆలయ పవిత్రతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తించిన పూజారిపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరారు.

ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డు: ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్!
స్పేస్‌ఎక్స్ (SpaceX) సంస్థ తన ఐపీఓ (IPO) ద్వారా రికార్డు స్థాయిలో $75 బిలియన్లను సేకరించిన తర్వాత, ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా మొదటి ట్రిలియనీర్‌గా అవతరించారు. అంతేకాదు, ఆయన సంపద నిరంతరాయంగా పెరుగుతూనే ఉంది. మస్క్ ఒకే రోజు సంపాదించిన లాభం: సుమారు $165 బిలియన్లు ($164.8 బిలియన్లు). ఇది కేవలం ఒకే ఒక్క ట్రేడింగ్ రోజులో ఆయన సంపదలో వచ్చిన 14.71% ఎదుగుదల. ముఖేష్ అంబానీ మొత్తం నికర ఆస్తి విలువ ప్రస్తుతం $89.7 బిలియన్లుగా ఉంది. ఇది ఎలన్ మస్క్ ఒకరోజు సంపాదించే మొత్తంతో సమానం.

ట్రంప్ రోడ్డును ప్రారంభించనున్న CM రేవంత్ రెడ్డి
TG: హైదరాబాద్‌లోని ఒక రోడ్డుకు ట్రంప్ పేరును పెట్టనున్నారు. తెలంగాణ, అమెరికాల మధ్య పెరుగుతున్న సంబంధాలకు గుర్తుగా ఒక రోడ్డుకు ట్రంప్ పేరును పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌లోని అమెరికన్ కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు పెట్టనున్నారు. జూలై 4వ తేదీన అమెరికా స్వాతంత్య్ర దినోత్సవం ఉండగా, ఈ నెల 23వ తేదీన ఐటీ కారిడార్‌లో ఉన్న డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ రోడ్డును CM రేవంత్ రెడ్డి అధికారికంగా ప్రారంభించనున్నారు.

ఉద్ధవ్ శివసేనలో తిరుగుబాటు? ఎంపీల ఫోన్లు స్విచ్చాఫ్
మహారాష్ట్ర రాజకీయంలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (UBT) పార్టీలో తీవ్ర అసమ్మతి చెలరేగినట్లు తెలుస్తోంది. ఆ పార్టీకి చెందిన కొందరు లోక్‌సభ ఎంపీల ఫోన్లు స్విచ్ఛాఫ్ రావడం, వారు అందుబాటులో లేకపోవడంతో అధికార ఏకనాథ్ షిండే వర్గంలోకి మారతారనే ఊహాగానాలు పెరిగాయి. ముఖ్యంగా ఎంపీ సంజయ్ దేశ్‌ముఖ్, కేంద్ర మంత్రి ప్రతాప్రావు జాదవ్‌ను కలవడం కలకలం రేపింది. అయితే పార్టీలో ఎలాంటి చీలిక లేదని, ఎంపీలంతా ఉద్ధవ్ వెంటే ఉన్నారని సంజయ్ రౌత్ స్పష్టం చేశారు.

హైడ్రా అధికారులు సూపర్ కాప్స్ ఏం కాదు: హైకోర్ట్
TG: చట్ట పరిధిని అతిక్రమించి వ్యవహరించడానికి హైడ్రా అధికారులు ప్రభుత్వ యంత్రాంగంలో సూపర్ కాప్స్ ఏమీ కారని తెలంగాణ హైకోర్టు పైర్ అయింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోతుకుంటలోని ఓ ప్రైవేట్ ఆస్తిలో ఇకపై జోక్యం చేసుకోబోమని హైడ్రా స్టాండింగ్ కౌన్సిల్ హైకోర్టుకు లిఖితపూర్వక హామీ ఇచ్చింది. ఆ సంస్థ కమిషనర్ ఏవీ.రంగనాథ్‌పై దాఖలైన రెండు కోర్టు ధిక్కరణ వ్యాజ్యాలను హైకోర్టు మూసివేస్తూ పైవిధంగా తీర్పునిచ్చింది. తాము ఇతరుల కంటే ఒక క్లాస్ అపార్ట్ అని హైడ్రా భావిస్తున్నట్లు కనిపిస్తోందని, కానీ వారు కూడా ప్రభుత్వ వ్యవస్థలో భాగమేనన్న విషయాన్ని మర్చిపోకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

విశాఖ టెకీ అనుమానాస్పద మృతి
AP: భర్తతో కలిసి ఉత్తరాఖండ్ టూర్‌కు వెళ్లిన విశాఖపట్నానికి చెందిన ఓ మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అనుమానాస్పదంగా మరణించారు. భర్తతో కలిసి టూర్‌కు వెళ్లిన పి.రాధా గాయత్రి (27) ముస్సోరిలోని ఓ హోటల్ రూమ్‌లో మరణించినట్లు పోలీసులు గుర్తించారు. ముక్కు నుంచి రక్తం రావడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విశాఖలోని చినముషిడివాడకు చెందిన గాయత్రికి శ్రీచరణ్‌తో గతేడాది నవంబర్ 8న మ్యారేజ్ జరిగింది. ఇద్దరూ గురుగ్రామ్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు.

వీరాభిమాని కోసం వరంగల్‌కు రానున్న పవన్ కల్యాణ్
TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం వరంగల్ జిల్లాలో తన వీరాభిమాని నిరంజన్‌ను పరామర్శించనున్నారు. ఉదయం 7:30 గంటలకు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో వరంగల్‌కు బయలుదేరుతారు. ఉదయం 9:45 గంటల నుంచి 10:30 గంటల వరకు నిరంజన్ నివాసంలోనే పవన్ గడుపుతారు. తన అభిమానిని, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పనున్నారు. పరామర్శ కార్యక్రమం ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ వరంగల్ నుంచి తిరిగి హైదరాబాద్‌కు వెళ్తారు.

పాముకాటుతో నాలుగేళ్ల చిన్నారి మృతి
TG: జనగాం జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన ఒగ్గు మహేష్ తన కుటుంబసభ్యులతో రాత్రి ఇంటి ఆవరణలో నిద్రిస్తున్నాడు. చిన్నారి మధుస్మిత(4) ను పాము కాటేసింది. వెంటనే పాపను తల్లిదండ్రులు జనగాం, ఆ తర్వాత హైదరాబాద్‌లోని ఆసుపత్రులకు తరలించగా మృతి చెందింది. ఆడుతూ, పాడుతూ మంచిగా చదువుకుంటూ ఉన్న పాప చనిపోవడంతో ఒగ్గు మహేష్ తీవ్ర దుఃఖానికి లోనయ్యాడు. చిన్నారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.