← Back to news

ప్రాణం తీసిన కుర్ కురే ప్యాకెట్‌లోని బొమ్మ

By DK· 17 Jun 2026· Hmtvlive· అనంతపురం జిల్లా
ప్రాణం తీసిన కుర్ కురే ప్యాకెట్‌లోని బొమ్మ

AP: కుర్ కురే ప్యాకెట్లో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మ ఓ చిన్నారి ప్రాణం తీసింది. అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని కోట గ్రామానికి చెందిన సాదియా, అల్తాఫ్ దంపతులకు ఫర్హాన్ అనే ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడు. ఐదేళ్ల ఫర్హాన్ కుర్ కురే ప్యాకెట్లో వచ్చిన ప్లాస్టిక్ బొమ్మలతో ఆడుకుంటున్నాడు. తెలిసీ తెలియక ఆ బొమ్మను మింగాడు. అది గొంతులో అడ్డంగా పడి ఊపిరాడక ఇబ్బందులు పడ్డాడు. కుటుంబసభ్యులు గుత్తి గవర్నమెంట్ హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఫర్హాన్ చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

More in AP