Latest

నవీపేట్‌ మండలంలో దొంగల బీభత్సం
Crime· 16 Jun 2026

నవీపేట్‌ మండలంలో దొంగల బీభత్సం

TG: నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని కోస్లీలో వ్యవసాయ బోరు బావుల వద్ద కేబుల్ వైర్లను దొంగలు చోరీ చేశారు. రాత్రి వేళలో దొంగలు కోస్లీ గ్రామ శివారులోని సుమారు 20వ్యవసాయ బోరు బావుల వద్ద ప్యానెల్ బాక్స్‌లను ధ్వంసం చేసి కేబుల్ వైర్లను దొంగిలించారు. కోస్లీ గ్రామంతోపాటు ఫకిరాబాద్ తదితర ప్రాంతాల్లో పేకాట రాయుళ్ల ఆగడాలు అధికమవ్వడంతో చోరీలు జరుగుతునయని రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు రూ.3లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

జనసేనలో చేరికల కోఆర్డినేషన్‌కు 14 మందితో కమిటీ
Politics· 16 Jun 2026

జనసేనలో చేరికల కోఆర్డినేషన్‌కు 14 మందితో కమిటీ

AP: జనసేన పార్టీలో చేరికల సమన్వయానికి జాయినింగ్స్ కమిటీని నియమించినట్లు పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పారు. పార్టీలో చేరేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్న ఇతర పార్టీల నేతలు, విద్యావంతులు, సామాజికవేత్తలను పార్టీలోకి ఆహ్వానించేందుకు ప్రత్యేకంగా ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 14 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీ చేరికలను కోఆర్డినేట్ చేస్తుందన్నారు.

కొడుకు జాబ్ పోయిందని ఫ్యామిలీ సూసైడ్!
Crime· 16 Jun 2026

కొడుకు జాబ్ పోయిందని ఫ్యామిలీ సూసైడ్!

నెల్లూరు జిల్లా దువ్వూరులో రిటైర్డ్ టీచర్ మధుసూదన్ రావు, భార్య రత్నావళి, దత్తపుత్రుడు సాయి సుకీత్ ఒకే ఇంట్లో శవాలై కనిపించారు. తిరుపతిలో జాబ్ చేస్తున్న కొడుక్కి కంపెనీ వాళ్లు శాలరీ ఇవ్వకుండా, పర్ఫార్మెన్స్ బాలేదని సర్టిఫికెట్స్ ఇచ్చి పంపేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన తల్లిదండ్రులు.. తాము లేకపోతే అమాయకుడైన కొడుకు బతకలేడని భావించి, అందరూ కలిసి సూసైడ్ చేసుకున్నారు. చనిపోయే ముందు రాసిన లెటర్ లో.. అంత్యక్రియల ఖర్చులకి డబ్బులు పంపిస్తూ, ఆస్తులను బంధువులకి, రెడ్ క్రాస్ సొసైటీకి ఇవ్వాలని కోరారు.

CM విజయ్‌ని కలిసిన హీరో విశాల్!
Politics· 16 Jun 2026

CM విజయ్‌ని కలిసిన హీరో విశాల్!

తమిళనాడు CM విజయ్‌ని హీరో విశాల్ మర్యాదపూర్వకంగా కలిశారు. కాలేజ్ రోజుల నుండి విజయ్‌ని తాను 'డార్లింగ్' అని పిలుస్తానని, CM అయినా ఆయన అస్సలు మారలేదని ట్వీట్ చేశారు. అంతేకాదు, CM కోసం బొకేలు, శాలువాలు కొనకుండా, ఆ మనీతో విజయ్ పేరు మీద ముగ్గురు పేద ఆడపిల్లల చదువుకి హెల్ప్ చేసినట్లు విశాల్ ట్విట్టర్‌లో షేర్ చేశారు.

ఏనుగుల సంచారం .. రైతులకు తీవ్ర నష్టం
Local· 16 Jun 2026

ఏనుగుల సంచారం .. రైతులకు తీవ్ర నష్టం

AP: మన్యం జిల్లా మక్కువ మండలంలో ఏనుగుల సంచారం కలకలం రేపింది. సిబిల్లి పెద్దవలస, కాముడువలస గ్రామాల్లో ఏనుగులు గుంపులు గుంపులుగా సంచరిస్తూ.. రైతులు, స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. జూన్ 13న సాలూరు నుంచి ఒడిశాకు వెళ్లిన ఏనుగులు.. మళ్లీ ఒడిశా నుంచి సాలూరుకు చేరాయి. కాముడువలసలో పామాయిల్ తోటలను, తోటలో ఉంచిన మోటార్లను ఏనుగులు ధ్వంసం చేశాయి. తాము కోలుకోలేని విధంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

'సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి'
Jobs· 16 Jun 2026

'సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలి'

TG: వివిధ నేషనల్ ఎగ్జామ్స్, ఉద్యోగ పరీక్షలు ఉన్న తేదీల్లో సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు, అభ్యర్థులు ఎలా ప్రిపేర్ అవుతారని, రెండు పరీక్షలు ఒకేరోజు ఎలా రాస్తారని వర్సిటీ అధికారులను స్టూడింట్స్ ప్రశ్నిస్తున్నారు. OU న్యాయశాస్త్ర విభాగానికి చెందిన 3, 4, 5, 6వ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ ఎగ్జామ్స్ ఈ నెల 18 నుంచి మొదలు కానున్నాయి. జూన్ 21వ తేదీన UGC నెట్ పరీక్షతో పాటు, సివిల్ జడ్జ్ మెయిన్స్, హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ పరీక్షలు ఉన్నాయి. ఆయా పరీక్షలు జిల్లా కేంద్రాల్లో ఉండగా.. అక్కడ ఆ పరీక్షలు రాసి, మళ్ళీ హైదరాబాద్‌కు ఎప్పుడు చేరుకొని సెమిస్టర్ పరీక్షలు రాస్తారని పైరయ్యారు.

అభిజీత్ దీప్కేపై ఎటాక్.. గట్టిగా రియాక్ట్ అయిన కేజ్రీవాల్!
Politics· 16 Jun 2026

అభిజీత్ దీప్కేపై ఎటాక్.. గట్టిగా రియాక్ట్ అయిన కేజ్రీవాల్!

CJP ఫౌండర్ అభిజీత్ దీప్కేపై జరిగిన దాడిని ఢిల్లీ మాజీ CM అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా ఖండించారు. ఎవరితోనైనా అభిప్రాయ భేదాలు ఉంటే ఉండొచ్చు కానీ, అలాగని దాడి చేసే హక్కు ఎవరికీ లేదని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఎటాక్ చేసింది ఏ పార్టీ వాళ్లో అందరికీ తెలుసని, అందుకే వాళ్లపై ఎలాంటి యాక్షన్ తీసుకోరంటూ కేజ్రీవాల్ గట్టిగా రియాక్ట్ అయ్యారు.

కారులో నుంచి తోసేసి 14లక్షలతో పరారైన దోపిడి ముఠా
Crime· 16 Jun 2026

కారులో నుంచి తోసేసి 14లక్షలతో పరారైన దోపిడి ముఠా

AP: తిరుపతి జిల్లా తడ మండలం వెల్లూరుపాడు విలేజ్‌కు చెందిన రవిచంద్రారెడ్డికి రూపాయికి మూడు రూపాయలు ఇస్తామంటూ ఓ ముఠా సభ్యులు నమ్మించారు. నగదుతో వెళ్తున్న రవి చంద్రారెడ్డిని ముఠా సభ్యులు ఏర్పేడు మేర్లపాక వద్ద కారులో ఎక్కించుకుని రూ.14 లక్షల నగదును లాక్కొని, ఆర్ మల్లవరం వద్ద కారు నుంచి తోసేసి పరారయ్యారు. రవిచంద్రారెడ్డి ఏర్పేడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏర్పేడు పోలీసులు చిల్లకూరుకు చెందిన శ్రీనివాసులను, జీవకోనకు చెందిన గుణశేఖర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నగదుతో పరారైన లక్ష్మీప్రియ, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.

ఫిట్నెస్ లేని వాహనాలపై కేసులు నమోదు
Local· 16 Jun 2026

ఫిట్నెస్ లేని వాహనాలపై కేసులు నమోదు

TG: కరీంనగర్ పట్టణంలో స్కూల్ పిల్లలను తీసుకెళ్లే మినీ బస్సులు, ఆటోలు, టాటా ఏసీ వాహనాలను పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నగరంలోని బస్టాండ్ ఏరియా, కమాన్ చౌరస్తా, ఎన్టీఆర్ బొమ్మ, నాకా చౌరస్తా, మంచిర్యాల చౌరస్తా, గీతా భవన్, కోర్టు ఏరియాలలో ముమ్మరంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాలకు ఫిట్నెస్ లేకున్నా, డ్రైవర్లకు లైసెన్స్ లేకున్నా, ఓవర్ లోడ్ తో పిల్లలను తరలిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేసి స్టేషన్‌కు తరలించారు. ఫిట్నెస్ లేని వాహనాలను రోడ్లపై నడపకూడదని అలా చేస్తే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చారు.

భారీగా తగ్గిన బంగారం ధరలు!
Politics· 16 Jun 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు!

ఇరాన్-అమెరికా మధ్య యుద్దం ముగియడంతో, దేశంలో బంగారం ధరలు కాస్త దిగివచ్చాయి. జూన్ 16 (మంగళవారం) హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ సిటీస్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ₹160 తగ్గి ₹1,51,370 కి చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర ₹150 తగ్గి ₹1,38,750 పలుకుతోంది. మార్కెట్‌లో రేట్లు ఎప్పుడు ఎలా చేంజ్ అవుతాయో తెలియదు కాబట్టి, కొనే ముందు ఒకసారి ప్రైస్ చెక్ చేసుకోండి.

సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ACB సోదాలు
Crime· 16 Jun 2026

సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ACB సోదాలు

TG: ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే పక్కా సమాచారంతో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇంట్లో ACB అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. HYDలోని నరహరి నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ఆఫీసులు, బంధువుల ఇళ్లలో ACB బృందాలు ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నాయి. దాదాపు 10 ప్రాంతాలలో ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో కీలకమైన భూమి పత్రాలు, బ్యాంక్ ఖాతాల వివరాలు, నగదు, బంగారు ఆభరణాలకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఈ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

పది రోజులైనా వీడని చిన్నారి మిస్టరీ
AP· 16 Jun 2026

పది రోజులైనా వీడని చిన్నారి మిస్టరీ

AP: కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారానికి చెందిన జ్ఞానేశ్వరి మిస్సై పదిరోజులైనా ఆచూకీ లేదు. పోలీసులకు సవాల్‌గా మారిన ఘటనపై ప్రభుత్వం దృష్టిసారించింది. చిన్నారి అదృశ్యమైన తోట, కొండ ప్రాంతాన్ని అటవీ, పోలీసు, NDRF, ఇతర బలగాలు జల్లెడ పడుతూనే ఉన్నాయి. ఇక్కడ జంతువులు తిరుగుతున్న ఆనవాళ్లు లేవు. మరోవైపు CC కెమెరాలు, ఫోన్ కాల్స్, ఇతర సాంకేతికత ద్వారా దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. దర్యాప్తుపై జిల్లా SP బిందుమాధవ్ సమీక్షించారు. తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు సేకరించి వారికి ధైర్యం చెప్పారు.

మోసాల దేశగురువు.. పోలీసులకు చెప్పడంతో పరార్
Crime· 16 Jun 2026

మోసాల దేశగురువు.. పోలీసులకు చెప్పడంతో పరార్

TG: రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి, వేములవాడ మండలాల్లోని పలు గ్రామాల్లో దేశగురువు సంచరించాడు. చందుర్తి మండలం నర్సింగాపూర్‌ గ్రామంలోని ఓ సంఘ భవనంలో ఆశ్రయం తీసుకున్నాడు. గుర్రం మీద స్వారీ చేసుకుంటూ ఇళ్ల వద్దకు వెళ్లిన ఆ గురువు ప్రవర్తన చూసి గ్రామస్థులు కంగుతిన్నారు. మహిళలను చూసి అసభ్యకరంగా సైగలు చేసేవాడని వారు తెలిపారు. ఆయన అనుచరులు మాయమాటలు చెప్పి గ్రామస్థుల నుంచి డబ్బులు వసూలు చేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దేశగురువు పరారయ్యాడు.

ఆ రోజు స్కూళ్లకు హాలిడే
Entertainment· 16 Jun 2026

ఆ రోజు స్కూళ్లకు హాలిడే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ నెల 26వ తేదీన స్కూళ్లకు హాలిడే ఉండనుంది. రాష్ట్ర ప్రభుత్వం మొహర్రం సెలవును ఈ నెల 26వ తేదీకి మార్చింది. ముందుగా ప్రకటించిన సాధారణ సెలవుల జాబితాలో జూన్ 25న ప్రభుత్వ హాలిడే ఉంది. అయితే మొహర్రం 26న జరగనుందని వక్స్ బోర్డు సీఈవో కూటమి సర్కార్‌కు సమాచారం ఇచ్చారు. అలర్ట్ అయిన ప్రభుత్వం సెలవును మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 26న ఏపీలో స్కూల్స్‌కు హాలిడే ఉండనుంది. అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఇతర ప్రైవేట్ సంస్థలకు కూడా హాలిడేను 26కి మార్చుతూ జీవో కూడా విడుదల చేశారు.

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థించను: మహేశ్‌కుమార్‌
Politics· 16 Jun 2026

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను సమర్థించను: మహేశ్‌కుమార్‌

AICC రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్‌ రాజ్యసభ నామినేషన్‌ తిరస్కరణపై కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌గా పరిగణిస్తుందని TPCC అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ అన్నారు. ఓ టీవీ చానల్‌తో ఆయన మాట్లాడుతూ.. ఆమెపై ఉన్న కేసు విషయాన్ని ఎవరో ఒకరు లీక్‌ చేసి ఉండొచ్చని అన్నారు. దీనిపై విచారణ జరుగుతుందని చెప్పారు. తనను కూడా పిలిచి విచారణ జరిపారని వెల్లడించారు. ఇటీవలి బెంగళూరులో రేవంత్‌ చేసిన ‘హిట్లర్‌’ వ్యాఖ్యలపై మహేశ్‌కుమార్‌ స్పందించారు. హిట్లర్‌ స్ఫూర్తి అంటూ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తాను ఏకీభవించను అని స్పష్టం చేశారు. అది రేవంత్‌ వ్యక్తిగత అభిప్రాయమని స్పష్టంచేశారు.

బోడుప్పల్‌‌లో చైన్ స్నాచింగ్
Crime· 16 Jun 2026

బోడుప్పల్‌‌లో చైన్ స్నాచింగ్

TG: హైదరాబాద్ బోడుప్పల్‌‌లోని ఈస్ట్ బాలాజీ హిల్స్‌ కాలనీకి చెందిన వృద్ధురాలు నర్ర అరుణ మార్నింగ్ వాక్‌కు వెళ్లింది. నార్త్ బాలాజీ హిల్స్ కాలనీలోని సాకుబు నిలయం సమీపంలో వెనుక నుంచి బైక్‌‌పై వచ్చిన చైన్ స్నాచర్ ఆమె మెడలోని పుస్తెలతాడును లాక్కెళ్లాడు. వృద్ధురాలి మెడకు స్వల్ప గాయమైంది. చోరీకి గురైన బంగారు మంగళసూత్రం సుమారు 4.5 తులాలు ఉంటుందని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మేడిపల్లి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

IRC సదస్సు వేళ తెలంగాణకు ఘోర అవమానం
Crime· 16 Jun 2026

IRC సదస్సు వేళ తెలంగాణకు ఘోర అవమానం

R & Bశాఖ ENC మోహన్ నాయక్.. అధికారాన్ని అడ్డం పెట్టుకుని వందల కోట్ల అక్రమాస్తులు కూడబెట్టినట్టు ACB సోదాల్లో తేలింది. దేశంలో కీలకమైన 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్(IRC) వార్షిక సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుంది. సదస్సుకు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతోపాటు దేశంలోని అన్నిరాష్ట్రాల మంత్రులు హాజరుకానున్నారు. సదస్సును IRC ఛైర్మన్ హోదాలో, ENC, TG RDC ఎండీగా మోహన్ నాయక్ ముందుండి నడిపించాల్సి ఉంది. సొంత రాష్ట్రంలో సదస్సు నిర్వహించి తెలంగాణ సత్తా చాటాల్సింది పోయి, ఆయనే అవినీతి కేసులో జైలుపాలు కావడం రాష్ట్ర్రానికి తీవ్ర తలవంపులు తెచ్చింది.

అప్పుడు గర్వంగా భావించారు, 7 నెలలు గడవకముందే
TG· 16 Jun 2026

అప్పుడు గర్వంగా భావించారు, 7 నెలలు గడవకముందే

TG: రోడ్లు, భవనాల శాఖ ENC జే.మోహన్ నాయక్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ACBకి చిక్కి జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. అయితే గతేడాది నవంబర్‌లో భువనేశ్వర్ వేదికగా జరిగిన ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (IRC) కౌన్సిల్ సమావేశంలో మోహన్ నాయక్‌ను దేశంలోనే ప్రతిష్టాత్మకమైన IRC అధ్యక్ష పదవికి ఎంపిక చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రానికే గర్వకారణంగా భావించారు. కానీ, సరిగ్గా 7 నెలలు గడవకముందే ఆయన అవినీతి బాగోతం బయట పడడంతో తెలంగాణ ప్రతిష్టను బజారున పడేశాడనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ట్రంప్ ఇమేజ్ ఘోరంగా పడగొట్టిన ఇరాన్
World· 16 Jun 2026

ట్రంప్ ఇమేజ్ ఘోరంగా పడగొట్టిన ఇరాన్

ఇరాన్ అణ్వస్త్రాలు, క్షిపణి ప్రోగ్రామ్స్‌ను ఆపడమే లక్ష్యంగా ఇరాన్ తో యుద్ధం మొదలు పెట్టిన ట్రంప్.. వాటిపై ఏ హామీలు లేకుండానే ఇరాన్ వార్ ముగించాడు. ఇరాన్ పై చేయి సాధించింది. యుద్ధం వల్ల అమెరికాలో చమురు సహా అన్ని ధరలు పెరిగాయ్. ఫలితంగా ట్రంప్ పాపులారిటీ 60% తగ్గింది. ఇరాన్ క్షిపణి నిల్వలు, యురేనియం ప్రయోగాలపైన గతంలో లాగా ఇప్పుడు ట్రంప్ అభ్యంతరం చెప్పట్లేదు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినా, ఆ దేశం హర్మూజ్ జలసంధిపై క్లియర్ కట్ పట్టు నిలుపుకుంది. ఈ డీల్‌తో భారత్‌కు కొనే ముడి చమురు ధర తగ్గి, మార్కెట్లు బలపడతాయి.

మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్‌ఫ్లాప్: KTR
Politics· 16 Jun 2026

మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్‌ఫ్లాప్: KTR

71సార్లు ఢిల్లీకి వెళ్లిన CM రేవంత్ రెడ్డి మోడీని మెప్పించి మెట్రో ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం సీఎం చేతకానితనానికి నిదర్శనమని BRS వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ KTR ఫైరయ్యారు. UP, అహ్మదాబాద్‌, వైజాగ్‌ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు రెండో దశ మెట్రోరైలు ఎందుకు తీసుకురాలేకపోయారో సీఎం ప్రజలకు సమాధానం చెప్పాలని KTR డిమాండ్‌ చేశారు. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్‌ఫ్లాప్‌ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు రేవంత్‌రెడ్డి వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు.

ఇరాన్-అమెరికా యుద్ధం ముగిసింది
World· 16 Jun 2026

ఇరాన్-అమెరికా యుద్ధం ముగిసింది

ఎట్టకేలకు అమెరికా, ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. జూన్ 19న స్విట్జర్లాండ్‌లో రెండు దేశాలు దీనిపై సంతకాలు చేయనున్నాయి. ఈ డీల్‌తో రెండు వైపులా మిలిటరీ యాక్షన్స్ ఆగిపోతాయి. కీలకమైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) ఓపెన్ అవుతుంది. ఎలాంటి టోల్ లేకుండానే నౌకల ప్రయాణానికి హార్ముజ్ రూట్ క్లియర్ అవుతుంది. గ్లోబల్ ఆయిల్ మార్కెట్లకు, స్టాక్ మార్కెట్లకు ఇది పెద్ద రిలీఫ్. ఈ 60 రోజుల ఒప్పందంలో అణు అంశాలు, ఆంక్షల ఎత్తివేతపై చర్చలు జరుగుతాయి. మరి మన పెట్రోల్ ధరలు తగ్గుతాయా?